What is another name for semantic gentleness | అర్థ సౌమ్యతకి మరో పేరు ఏమిటి?
ప్రత్యేకం
అర్థ విపరిణామం
1. కాలానికి అనుగుణంగా పరిసరాల్లో, వ్యక్తిలో, వ్యక్తిత్వంలో మార్పు రావడం సహజం. అదేవిధంగా పదాల్లో వచ్చే మార్పునే ‘అర్థ విపరిణామం’ అంటారు.
2. భాష ప్రధానంగా రెండు భాగాలు
ఎ) శబ్దం బి) అర్థ్ధం
శబ్దం- అర్థంలో మార్పు రాదు కానీ శబ్దంలో మార్పు వస్తుంది.
అర్థం- శబ్దంలో మార్పు రాదు కానీ అర్థంలో మార్పు వస్తుంది. ఇదే అర్థ విపరిణామం.
3. ప్రపంచంలోని పదాల్లో కలిగే మార్పుల గురించి తెలిపిన వారు మైఖేల్ బ్రెయిల్. ఈయన రాసిన గ్రంథం ‘లా సెమాంటిక్’. ఇది అర్థ విపరిణామంలో మొదటి గ్రంథం.
4. మైఖేల్ బ్రెయిల్ విధానాన్ని అనుసరిస్తూ తెలుగు భాషలో మార్పులను తెలిపిన వారు ‘ఆచార్య జి.ఎం. రెడ్డి’. ఈయన రాసిన గ్రంథం ‘ది స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్’.
– ఈ గ్రంథం తెలుగులో అర్థివిపరిణామానికి తొలి గ్రంథం.
అర్థ విపరిణామం రకాలు
1) అర్థ వ్యాకోచం 2) అర్థ సంకోచం
3) అర్థ సౌమ్యత 4) అర్థ గ్రామ్యత
5) సభ్యోక్తి 6) మృదూక్తి
7) అలంకారిక ప్రయోగం
8) వస్తు పరిణామం 9) లక్ష్యార్థ సిద్ధి
10) జననిరుక్తి
అర్థ వ్యాకోచం: పరిమితార్థం నుంచి విస్తృత అర్థంలోకి రావడాన్ని అర్థవ్యాకోచం అంటారు.
ఉదాహరణ –
– ‘అష్టెశ్వర్యాలు’ కలిగిన ‘ధర్మరాజు’ తన కుమార్తెకు ‘స్వయంవరం’ ఏర్పాటు చేశాడు.
– ఇది విన్న ‘మహారాజు’ చెవికి ‘కమ్మ’ని ధరించి, ‘చెంబు’లో ‘గంగ’ను తీసుకొని బయలుదేరాడు.
– ‘భీముడు’ ‘గ్లాసు’లో ‘నూనె’ ‘తైలం’ తీసుకొని బయలుదేరాడు.
– ‘అవధాని’, ‘నారదుడు’ ఖాళీగా వెళ్తున్నారు.
– ‘రాక్షసులు’ ‘అష్టకష్టాలు’ పడి చేరుకున్నారు.
ఉదాహరణ పదాలు
-అష్టెశ్వర్యాలు, ధర్మరాజు, స్వయంవరం, మహారాజు, కమ్మ, చెంబు, గంగ, భీముడు, గ్లాసు, నూనె, తైలం, అవధాని, నారదుడు, రాక్షసులు, అష్టకష్టాలు.
అర్థ సంకోచం
– విస్తృత అర్థం నుంచి పరిమిత అర్థంలోకి రావడాన్ని అర్థ సంకోచం అంటారు.
ఉదాహరణ
– సాహెబు తాను కూడా వెళ్లాలి అనుకున్నాడు.
-కానీ ఇంటి పెద్ద తల్లి సంవత్సరికం (శ్రార్థం ) ఉండటంతో ఆరాధ్యుడైన మత గురువును కలిశాడు.
-తల్లికి చీర, కోకను పెట్టి గురువునకు సంభావనగా నెయ్యి, మధుపర్కాలు ఇచ్చి తద్దినం పూర్తి చేశాడు.
– ఇంట్లో ఉద్యోగానికని చాడీ చెప్పి మార్కుల పత్రమును సంధుగను తీసుకొని మృగం మీద ఎక్కి వ్యవసాయ భూముల మీదుగా వెళ్తున్నాడు.
అర్థ సౌమ్యత : అర్థ సౌమ్యతకి మరోపేరు
అర్థోత్కర్ష.
– ప్రాచీన కాలంలో ఒక పదం నిందార్థంలో ఉండి, నేటి కాలంలో గౌరవాన్ని పొందే పదాలు.
ఉదాహరణ
– వైతాళికున్ని అదృష్టం వరించింది.
– దాంతో అతని అంతస్తు పెరిగింది.
-సభికులు మర్యాదతో ముహూర్తం పెట్టారు.
ఉదాహరణ పదాలు
-వైతాళికుడు l అదృష్టం
– అంతస్తు l సభికులు
– ముహూర్తం l మర్యాద
అర్థ గ్రామ్యత
– ప్రాచీన కాలంలో ఒక పదం గౌరవార్థంతో ఉండి, నేటి కాలంలో నిందార్థంతో ఉపయోగించే పదాలు.
ఉదాహరణ
– కళాకారుడు సాహెబు తన కర్మ గ్రహచారం బాగోలేదని సభలో జరిగిన అవమానంతో తన మీద తనకే కంపు, అసహ్యం వేసి ఛాందసుడైపోయాడు.
-మొండివాడైన సాహెబు యువరాణిని ముండ, శనిగ్రహం, సాని, విధవ, సన్యాసి అని వ్యంగ్యంగా తిట్టి తన గౌరవం పూజ్యం కాదని స్వాహా అంటూ కైంకర్యం పొందాడు.
ఉదాహరణ పదాలు
– కళాకారుడు l కంపు
– కర్మ l గ్రహచారం
– అసహ్యం l ఛాందసుడు
– మొండిఘటమైన l ముండ
– శనిగ్రహం l సాని
– విధవ l సన్యాసి
– వ్యంగ్యం l పూజ్యం
– స్వాహా l కైంకర్యం
సభ్యోక్తి
-సభలో కాని, సమావేశాల్లో కాని మాట్లాడే మాటలు నూతన పదబంధ కల్పన చేసి మాట్లాడితే వాటిని సభ్యోక్తి అంటారు.
ఉదాహరణ
– చనిపోయాడు: స్వర్గస్థులయ్యారు, అమరులయ్యారు, కీర్తిశేషులయ్యారు, శాశ్వత నిద్రలో ఉన్నారు, నూకలు చెల్లాయి.
– కడుపుతో ఉంది: ఆమె వట్టి మనిషికాదు, ఆమె గర్భిణి, అమ్మ కాబోతుంది,
నీళ్లోసుకుంది.
– కులాల పేర్లు
మాల, మాదిగ= హరిజనులు
ఎస్టీ = గిరిజనులు
మంగళి= నాయీ బ్రాహ్మణులు
చాకలి= రజకులు
గొల్ల= యాదవులు
మృదూక్తి – మనస్సుకి కఠినమైన భావనే అయినప్పటికీ ఎదుటివారికి చెప్పే సందర్భంలో సున్నితంగా, మృదువుగా చెప్తే అది మృదూక్తి.
ఉదాహరణ
-నల్లపూసల దండ విరిగిపోయింది
– దీపం కొండెక్కింది
-కుండలు నిండుకున్నాయి
అలంకారిక ప్రయోగం
– ఉపమానాన్ని తెచ్చి చెప్పే వాక్యాలు అలంకారిక ప్రయోగం
ఉదాహరణ
– ఆమె నడక హంసనడక
-వాడు మన్మథుడు
వస్తు పరిణామం
– ఒక వస్తువు ఆకారంలో, నిర్మాణంలో మార్పులు ఉన్నా ఒకే పేరుతో వాటన్నింటినీ వ్యవహరించడాన్ని వస్తుపరిణామం అంటారు.
ఉదాహరణ
– వాస్తవం- బండి = ఎద్దులతో నడిచేది
మార్పు- ద్విచక్ర వాహనం, రైలు, బస్సు మొదలైనవి
– వాస్తవం- ఆయుధం – కత్తి, గధ, విల్లు
మార్పు – గొడ్డలి, కొడవలి, ఏకే 47 తుపాకీ, అణుబాంబు మొదలైనవి
-వాస్తవం – గృహం- తాటి ఆకులతో నిర్మించినవి
– మార్పు- పెంకులతో, రేకులతో, సిమెంటు వంటి వాటితో నిర్మించేవి.
లక్ష్యార్థసిద్ధి
– ఒక పదానికి రెండు అర్థాలు ఉండి ఏదో ఒకటి ప్రసిద్ధమైతే అది లక్ష్యార్థిసిద్ధి.
ఉదాహరణ
ముష్టి- పిడికిలి (ప్రసిద్ధి)
– బిక్షం
దాహం- దహించేది (ప్రసిద్ధి)
– దప్పిక
సూది- వైద్యులు ఉపయోగించేది (ప్రసిద్ధి)
బట్టలు కుట్టేవారు ఉపయోగించేది
జననిరుక్తి/లోకనిరుక్తి
-తెలియని పద స్థానంలో తెలిసిన పదం చేర్చి పలకడంతో ఆ పదం అలాగే స్థిరపడటాన్ని జననిరుక్తి లేదా లోకనిరుక్తి అంటారు.
ఉదాహరణ
– చందమాన్ – చందమామ
-మక్కజొన్న – మొక్కజొన్న
– ఆరంజ్యోతి – అరుంధతి
-ఆకాషరామన్ – ఆకాశరామన్న
– చక్కెరకేళి – చెక్కరకేళి
ఉదాహరణ పదాలు
-సాహెబు -పెద్ద
– సంవత్సరికం – శ్రార్థం
-ఆరాధ్యుడైన – చీర
– కోక – సంభావన
-నెయ్యి – మధుపర్కాలు
– తద్దినం – ఉద్యోగానికి
– చాడీ – పత్రం
– సంధుగ – మృగం
– వ్యవసాయ
ఉదాహరణ ప్రశ్న
జతపరచండి
1) అర్థగ్రామ్యత (డి) ఎ) ముహూర్తం
2) అర్థసంకోచం (ఇ) బి) రాక్షసులు
3) అర్థసౌమ్యత (ఎ) సి) అరుంధతి
4) లక్ష్యార్థసిద్ధి (ఎఫ్) డి) కర్మ
5) లోకనిరుక్తి (సి) ఇ) ఉద్యోగం
6) అర్థవ్యాకోచం (బి) ఎఫ్) దాహం
శివశంకర్
తెలుగు సీనియర్ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?