Child Development & Pedagogy | శిశువికాసం & పెడగాజీ ప్రాక్టీస్ బిట్స్
పోటీ పరీక్షల ప్రత్యేకం
1. శ్రీను చేతిరాత బాగుంటుంది. గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంది. అతని సహోధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది?
1) వ్యక్తంతర్గత వైయక్తిక భేదం
2) వ్యక్తంతర వైయక్తిక భేదం
3) వ్యక్తంతర్గత, వ్యక్తంతర వైయక్తిక భేదాలు
4) జోక్యసహిత వైయక్తిక భేదం
2. కార్తీక్, శ్రీరామ్, గౌతమ్ అనే విద్యార్థులు కంప్యూటర్ అభ్యసిస్తున్నారు. ఒకరు కంప్యూటర్లో మెలకువలు తెలుసుకొని ముందుకు సాగుతుంటే రెండో వ్యక్తి వెనకబడ్డాడు. అతనిలో లోపించిన సామర్థ్యం?
1) సహజ సామర్థ్యం 2) పోటీ సామర్థ్యం
3) ప్రజ్ఞ 4) సృజనాత్మకత
3. అనిల్ అనే విద్యార్థి ఆటపాటల్లో, మార్కుల్లో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం?
1) అంతర్ వ్యక్తిగత
2) వ్యక్తి అంతరభేదాలు
3) వైయక్తిక భేదం
4) జన్యుపరమైన భేదం
4. కింది వాటిలో ప్రజ్ఞ లక్షణం కానిది ఏది?
1) ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. ప్రజ్ఞాపాటవాల్లో వ్యక్తిగత భేదాలుంటాయి
2) లైంగికపరంగా ప్రజ్ఞకు భేదం ఉండదు. జాతి, మత, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు
3) ప్రజ్ఞ మాపనం చేసే ప్రక్రియ, దీన్ని కొలవచ్చు
4) ప్రజ్ఞాభివృద్ధి చనిపోయేంత వరకు జరుగుతుంది
5. రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిగిలిన జీవితాన్ని ఎక్కువగా ప్రశాంతతను కోరుకొని జంతువులు, మొక్కలను ప్రేమించే స్వభావం కలిగి ఉండటం. హోవర్డ్ గార్డెనర్ ప్రకారం?
1) పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ
2) ప్రాదేశిక ప్రజ్ఞ
3) సహజ ప్రజ్ఞ
4) శారీరకగతి – సంవేదన ప్రజ్ఞ
6. వెయిన్ లియోన్ పెయిన్కు సంబంధించి సరైనది ఏది?
1) ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాన్ని ప్రచురించారు
2) ఉద్వేగాత్మక ప్రజ్ఞపై పరిశోధనలు చేశారు
3) ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు
4) why it can matter more than IQ Emotional Intelligence అనే గ్రంథాన్ని రచించారు
7. 10 ఏళ్ల పిల్లవాడు 13 ఏళ్ల పిల్లవాడికి ఉండాల్సిన సామర్థ్యాన్ని చూపించాడు. అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత?
1) 120 2) 110 3) 100 4) 130
8. కింది వాటిలో సరికానిది ఏది?
1) గణేష్ గణితంలో ఎక్కువ ప్రతిభ, ఆంగ్లంలో తక్కువ ప్రతిభ చూపించటం వ్యక్తంతర్గత భేదం
2) రజని ఆడగలదు, పాడగలదు కాని ఆమె అందరికంటే చాలా పొడగరి అంతర్ వ్యక్తిగత భేదం
3) ఒకే వ్యక్తి వివిధ అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించటాన్ని అంతర్ వ్యక్తిగత భేదం
4) ఒక వ్యక్తికి మరొక వ్కక్తికి మధ్య భౌతిక, మానసిక భేదాలను అంతర్వ్యక్తిగత భేదాలు అంటారు
9. శ్రీరామ్ ప్రజ్ఞాలబ్ధి 115. కింది వాటిలో తను ఏ వర్గానికి చెందుతాడు?
1) సగటు ప్రజ్ఞావంతుడు
2) సగటు కంటే ఎక్కువ
3) సగటు కంటే తక్కువ
4) ఉన్నత ప్రజ్ఞావంతుడు
10. కింది వాటిలో శాబ్ధిక పరీక్ష కానిది?
1) ఆర్మీ ఆల్ఫా పరీక్ష
2) ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష
3) వెష్లెర్ శాబ్ధిక పరీక్షలు
4) ఆర్మీబీటా పరీక్ష
11. 16 ఏళ్ల విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 100 అయితే అతని మానసిక వయసు ఎంత?
1) 15 ఏళ్లు 2) 13 ఏళ్లు
3) 10 ఏళ్లు 4) 16 ఏళ్లు
12. కింది వాటిలో సరికాని జత ఏది?
1) బకారక సిద్ధాంతం- థార్న్డైక్
2) ఏకకారక సిద్ధాంతం – బీనె
3) సామూహిక కారక సిద్ధాంతం – స్పియర్మన్
4) స్వరూప నమూనా సిద్ధాంతం – గిల్ఫర్డ్
13. కింది వాటిని జతపరచండి.
1) Dictionary of Psychology ఎ) ఎబ్బింగ్హాస్
2) On Memory బి) చాప్లిన్
3) Father of Animal Intelligence సి) జాన్ డ్యూయి
4) Democracy & Education డి) థార్న్డైక్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
14. ఒక వ్యక్తి లెక్కల్లో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్లోనూ, సాంఘికశాస్త్రంలోనూ, చిత్రకళ, సంగీతం మరేదైనా రంగంలో కూడా అంతే ప్రావీణ్యతను కనబరుస్తాడని గుర్తించిన మనోవిజ్ఞానవేత్త ఎవరు?
1) బీనె 2) టెర్మన్
3) స్పియర్మన్ 4) విలియం స్టెర్న్
15. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం సరైన ఆరోహణ క్రమం?
1) తీవ్రమైన బుద్ధిమాంద్యత, అత్యధిక బుద్ధిమాంద్యత, కొద్దిపాటి బుద్ధిమాంద్యత, స్వల్ప బుద్ధిమాంద్యత
2) స్వల్ప బుద్ధిమాంద్యత, కొద్దిపాటి బుద్ధిమాంద్యత, అత్యధిక బుద్ధిమాంద్యత, తీవ్రమైన బుద్ధిమాంద్యత
3) స్వల్ప బుద్ధిమాంద్యత, కొద్దిపాటి బుద్ధిమాంద్యత, తీవ్రమైన బుద్ధిమాంద్యత, అత్యధిక బుద్ధిమాంద్యత
4) అత్యధిక బుద్ధిమాంద్యత, తీవ్రమైన బుద్ధిమాంద్యత, కొద్దిపాటి బుద్ధిమాంద్యత, స్వల్ప బుద్ధిమాంద్యత
Answers
1) 3 2) 1 3) 2 4) 4 5) 3 6) 3 7) 4 8) 3 9) 2 10) 4 11) 4 12) 3 13)1 14) 1 15)1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?