Glossary words | పారిభాషిక పదాలు
1. సంజ్ఞ 2. ఆగమం
3. ఆదేశం 4. గ్రామ్యం
5. దేశ్యం 6. అన్య దేశ్యం
7. కరణం 8. సంప్రధానం
9. ఉపధ 10. ఉత్తమం
11. ఉపోత్తమం 12. తపరకరణం
13. శబ్ద పల్లవం 14. ఉపసర్గ
15. వరాగమం 16. వర్ణాదేశం
17. వర్ణవ్యత్యయం 18. ఔపవిభక్తులు
19. ద్విత్వం 20. సంయుక్త
21. సంశ్లేషం 22. నిత్యం
23. నిషేధం 24. వైకల్పికం
25. అన్యవిధము 26. విభాష
27. కళ 28. ద్రుతం
29. ద్రుత ప్రాకృతికం 30. లడాదులు
31. ఉత్తమపురుష 32. మధ్యమపురుష
33. ప్రథమ పురుష 34. ద్విత్వకల్పం
35. క్తార్థం 36. శత్రర్థం 37. ఛేదర్థం 38. అప్యర్థం 39. భావార్థం 40. ధాతజవిశేషణం 41. తత్సమం 42. తద్భవం
సంజ్ఞ – శాసా్త్రలు, ఆ శాసా్త్రలు ఉద్దేశించిన అర్థాలను తెలిపేది సంజ్ఞ
ఆగమం – ఒక పదంలోని వర్ణాలన్నీ ఒకే రకంగా ఉండి అందులోకి మరో వర్ణం అదనంగా వస్తే దాన్ని ఆగమం అంటారు.
ఉదాహరణ
– కోలాటం – కోలాట‘క’ం
-చింపిజుట్టు – చింపి‘రి’జుట్టు
– మనుమ + ఆలు = మనుమ‘రా’లు
– (రురాగమం) (గ్ +ఆ= ఆగమం)
– రురాగమ, దుగాగమ, యడాగమ, టుగాగమ సంధి.
ఆదేశం – (శత్రువు)
– ఒక పదంలో ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం వస్తే ఆదేశం అంటారు.
ఉదాహరణ
-వాడు + కొట్టె = వాడుగొట్టె
కొ= క్ +ఒ, గొ= గ్ +ఒ
– ‘గ్ ’ ఆదేశ వర్ణం
– ‘క్ ’ కు బదులుగా ‘గ్ ’ వచ్చి చేరింది.
గ్రామ్యం
– లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యం
– లక్షణ అంటే శాస్త్రం
ఉదాహరణ
-వచ్చిండు, చూసిండు, పోయిండు
దేశ్యం
– త్రిలింగ దేశ్య వ్యవహార నామంబు దేశ్యము
– త్రిలింగ దేశ్యాలు మూడు
1) శ్రీశైలం (కర్నూలు)
2) ద్రాక్షారామం (తూర్పు గోదావరి)
3) కాళేశ్వరం (కరీంనగర్ )
– ఈ మూడు ప్రసిద్ధ పుణ్యక్ష్యేత్రాల పరిసరాల్లో వ్యవహరించే భాష దేశ్యం
అన్య దేశ్యం
-ఇతర భాషల నుంచి వచ్చి మన భాషలో చేరిన పదాలే అన్య దేశ్యాలు.
– తెలంగాణ ప్రాంతంలోని భాషపై ఉర్దూ ప్రభావం ఉంది.
కరణం
-ఫలసాధనలో ఎక్కువ ఉపయోగపడేది కరణం.
ఉదాహరణ
-విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో మొసలి తలను ఖండించెను.
-సుదర్శన చక్రం – కరణం
సంప్రధానం
– త్యాగోద్దేశ్యంబు సంప్రధానంబు
– పరవస్తు చిన్నయసూరి
ఉదాహరణ
– రాముని కొరకు జనకుడు కన్యను ఇచ్చెను.
– ‘రాముని’
ఉపధ – తుది వర్ణానికి ముందు ఉన్న వర్ణం
ఉదాహరణ
– కవిత (క్ +అ+వ్ +ఇ+త్ +అ)
– ఇ= ఉత్తమం (అచ్చురూపం), త్ = ఉపధ
(హల్లురూపం),అ= ఉపోత్తమం (అచ్చురూపం)
-దేశము (ద్ +ఏ+శ్ +అ+మ్ +ఉ)
– అ= ఉత్తమం(అచ్చురూపం), మ్ = ఉపధ
(హల్లురూపం), ఉ= ఉపోత్తమం
(అచ్చురూపం)
ఉత్తమం
– ఉపధకు ముందున్న అచ్చురూపం
ఉదాహరణ
– స్నేహ – స్+న్ +ఏ+హ్ +అ
ఉపోత్తమం – తుది వర్ణం (అచ్చురూపం)
తపరకరణం
– అత్తు + ఇత్తు + ఉత్తు
– అకారం + ఇకారం + ఉకారం
– అత్వ + ఇత్వ + ఉత్వ
– అ ఇ ఉ
తపరకరణాలు హ్రస్వాలను చూపిస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?