What does casteism mean | కులతత్వం అంటే అర్థం ఏమిటి?
సోషియాలజీ
1. హెర్బర్ట్ రిస్లే భారతదేశ జనాభాను ఏడు స్థూల జాతి సమూహాలుగా వర్గీకరించాడు. ఈ వర్గీకరణలో ఆయన ఉపయోగించని పదం ఏది? (సివిల్స్-1994)
1) నీగ్రిటో 2) మంగోలాయిడ్
3) సైథో-ద్రావిడ 4) ఇండో-ఆర్యన్
2. సోరోరేట్ (భార్యా భగినీ న్యాయం) నిర్వచనానికి సంబంధించి కిందివాటిలో సరైనది ఏది? (సివిల్స్-1993)
1) చనిపోయిన భార్య సోదరిని వివాహం చేసుకొనే ఆచారం
2) చనిపోయిన భర్త సోదరుడిని వివాహం చేసుకొనే ఆచారం
3) సోదరి కుమార్తెను వివాహం చేసుకొనే ఆచారం
4) మేనమామ కుమార్తెను వివాహం చేసుకొనే ఆచారం
3. కుల స్తరీకరణ వ్యవస్థ కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? (సివిల్స్-1997)
1) పునర్జన్మ 2) చాతుర్వర్ణ వ్యవస్థ
3) వర్ణాశ్రమ వ్యవస్థ 4) సెక్ట్
4. కులతత్వం అంటే అర్థం ఏమిటి? (సివిల్స్-1993)
1) స్వీయ కులం పట్ల పక్షపాతం
2) సొంత కులం పట్ల పక్షపాతం-ఇతర కులాల పట్ల విరోధం
3) ప్రతికులం పట్ల పక్షపాతం
4) కొన్ని కులాల పట్ల పక్షపాతం
5. కింది భావన, నిర్వచనాల్లో సరికానిది? (సివిల్స్-1998)
1) బహిర్‌వివాహం: అదే సముదాయం నుంచి సహచరిని ఎంచుకోవాలనే నియమం
2) బంధువు: రక్తసంబంధం లేదా వివాహం ద్వారా సంబంధం ఉన్న వ్యక్తి
3) అంతర్వివాహం: తన గోత్రం కాని వారిని వివాహం చేసుకోవాలనే నియమం
4) పితృస్వామిక కుటుంబం: తమ తండ్రి వంశానికి చెందిన వ్యక్తులున్న కుటుంబం
6. సరైన వాటిని జతపర్చండి? (సివిల్స్-1993)
ఎ) ఖాసి 1) జాతి
బి) సిక్కు 2) వర్ణం
సి) క్షత్రియ 3) తెగ
డి) నీగ్రో 4) మతం
ఎ బి సి డి
1) 4 1 3 2
2) 1 4 2 3
3) 4 3 2 1
4) 3 4 2 1
7. ముస్లిం వివాహంలో వరుడు వధువుకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏమంటారు? (సివిల్స్-1997)
1) తలాఖ్ 2) మెహర్ 3) ఖుల 4) దహేజ్
8. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అనేది ఒక? (సివిల్స్-2002)
1) ఒక ఒప్పందం 2) పవిత్రబంధం
3) బంధం 4) లాంఛనం
9. దేశంలో నిర్ణీత మైనారిటీ సముదాయాల పరిణామాలకు సంబంధించిన సరైన అవరోహణ క్రమాన్ని గుర్తించండి? (సివిల్స్-1998)
1) ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు
2) ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు
3) ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు
4) క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు
10. గిరిజనుల మధ్య ఆర్థిక సంబంధాలు ఎక్కువగా దేనిపై ఆధారపడి ఉంటాయి? (సివిల్స్-2001)
1) షెల్ ద్రవ్యం 2) జాజ్‌మానీ వ్యవస్థ
3) వస్తు మార్పిడి, వినిమయం 4) రాతి ద్రవ్యం
11. దేశంలోని ముస్లింల్లో విద్యా సంస్కరణల ఉద్యమాలను ప్రారంభించింది ఎవరు? (సివిల్స్-1998)
1) సర్ అహ్మద్ ఖాన్
2) సర్ డబ్ల్యూ డబ్ల్యూ హంటర్స్
3) షా వలీ ఉలా 4) జాకీర్ హుస్సేన్
12. కింది స్టేట్మెంట్లల్లో స్త్రీవాద ఉద్యమ వాదనలను వివరించేది ఏది? (సివిల్స్-1996)
1) మహిళలు, పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు
2) స్త్రీ, పురుష అసమానత పితృస్వామ్యంలోనే పాదుకొని ఉంది
3) స్త్రీ పురుష అసమానతలకు పురుషులే కారణం
4) భాగస్వామ్య పేరెంట్, స్త్రీ, పురుష అసమ్మతిని పెంచుతుంది
13. కిందివాటిలో దేనికి వ్యతిరేకంగా గుజరాత్‌లోని ఖేదా ఉద్యమం (1919) ప్రాథమిక లక్ష్యంగా ఉండేది? (సివిల్స్-2003)
1) పన్నులు 2) అకస్మాత్తుగా ధరల పెరుగుదల
3) వడ్డీ వ్యాపార వర్గం 4) వేతనం లేని వెట్టి చాకిరి
14. అటవీ అధికారులు, కాంట్రాక్టర్లు చెట్లను నరకడానికి వచ్చినప్పుడు 1974లో గర్వాల్‌లో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో చెట్లను నరకడాన్ని నివారించడానికి మహిళలు వాటిని కౌగిలించుకొన్నారు. ఈ ఉద్యమం పేరేమిటి? (సివిల్స్-2001)
1) చిప్కో ఉద్యమం 2) పర్యావరణ ఉద్యమం
3) గర్వాల్ ఉద్యమం 4) తే బాగ్ ఉద్యమం
15. కింది వాటిలో సరైన జతను గుర్తించండి? (సివిల్స్-2001)
ఎ) దళిత ఉద్యమం 1) శ్రీనారాయణ గురు
బి) నక్సలైట్ ఉద్యమం 2) ఎస్ఎల్ బహుగుణ
సి) చిప్కో ఉద్యమం 3) చారుమజుందార్
డి) ఎస్ఎన్డీపీ ఉద్యమం 4) బీఆర్ అంబేద్కర్
5) స్వామి సహానంద్
ఎ బి సి డి
1) 5 2 3 1
2) 4 1 2 5
3) 4 3 2 1
4) 1 3 4 5
16. సరైన జతను గుర్తించండి? (సివిల్స్-2002)
నాయకులు సంస్థలు
ఎ) మహాత్మాగాంధీ 1) అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య
బి) శ్రీనారాయణ గురు 2) హరిజన్ సేవక్ సంఘ్
సి) బీఆర్ అంబేద్కర్ 3) ఎస్ఎన్డీపీ యోగం
డి) జ్యోతిరావ్ ఫూలే 4) డీఎంకే
5) సత్యశోధక్ సమాజ్
ఎ బి సి డి
1) 2 5 1 3
2) 1 3 4 5
3) 1 5 4 3
4) 2 3 1 5
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?