Command Area Development Program | కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగాం
దేశంలో నీటిపారుదల వ్యవస్థ సామర్థ్యం పెంపొందింపజేసి సమర్థవంతమైన నీటి నిర్వహణ, సమన్వయ పద్ధతి ద్వారా సాగుభూమిని వ్యవసాయ ఉత్పత్తి, వినియోగం కోసం కేంద్రప్రభుత్వం 1974 లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించింది.
-ఇది దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం కోసం భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులపై ఏకీకృ త, సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన పథకం.
-దీన్ని 5వ పంచవర్ష ప్రణాళిక (1974-80)లో భాగంగా చేపట్టారు.
-నీటిపారుదల ప్రాజెక్టుల కమిషన్ ఆదేశాలను క్రమపద్ధతిలో అభివృద్ధి పర్చి నీటిపారుదల సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోవడం దీని ముఖ్యోద్దేశం.
-1972లో ఇరిగేషన్ కమిషన్ తన సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, తదనంతరం మంత్రుల కమిటీ సూచనల మేరకు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
-మొదట్లో 60 భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను సీఏడీ ప్రోగ్రాం కిందకు తెచ్చారు.
-నీటిపారుదల వ్యవస్థలో లోపాలు, నీటి సరఫరా ఆటంకాలను సరిదిద్దుట, ప్రధాన కాలువలు, కొండ ల నుంచి చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నీరు చేర్చ డం, మిగులు నీటిని చానెళ్ల ద్వారా బయటకు పంప టం, మధ్యతరహా కాల్వలకు పొడగించడం వంటివి చేపట్టడం.
-పునరేకీకరణలో భాగంగా ఫీడర్ కాలువలు, భూమి లెవలింగ్, సరిహద్దులు, కమతాల ఏకీకరణ తగిన పంట నమూనాలను పరిచయం చేయడం.
-2004 నుంచి పునర్వ్యవస్థీకరించి సమగ్రంగా రైతులకు ఉపయోగకరంగా చేయడానికి కమాండ్ ఏరి యా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంగా మార్పుచేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?