Watershed | జలావరణం
భూ ఉపరితలంపై విశాలమైన ఉప్పునీటి సముద్ర ప్రాంతాలే మహాసముద్రాలు. భూ ఉపరితలంపై ఐదు మహా సముద్రాలు ఉన్నాయి.
1. పసిఫిక్ 2. అట్లాంటిక్
3. హింధష్త్ర 4. అంటార్కిటిక్ 5. ఆర్కిటిక్
మహా సముద్రాలవల్ల ఉపయోగాలు
-వర్షాలు కురవడానికి సముద్రాలే ముఖ్య కారణం
-సముద్రాలు చేపలు, ఇతర సముద్ర సంబంధ ఆహార పదార్థాలకు నిలయాలు.
-సముద్రపు నీటి ద్వారా ఉప్పును తయారు చేస్తారు.
-అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే సహజమార్గాలు.
సముద్ర చలనాలు
1. తరంగాలు: సముద్ర ఉపరితలపు నీటిమట్టం హెచ్చుతగ్గులను తరంగాలు అంటారు. సముద్ర ఉపరితలంపై వీచే సున్నితమైన గాలులవల్ల తరంగాలు ఏర్పడుతాయి. ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి.
2. ప్రవాహాలు: సముద్రజలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాలు సముద్ర ఉపరితలంపై ఒక నిర్దిష్ట దిక్కుకు నిరంతరం ప్రవహిస్తుంటాయి. వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు.
ఈ సముద్ర ప్రవాహాలు రెండు రకాలు
ఎ. ఉష్ణ ప్రవాహాలు – ఇవి భూమధ్య రేఖా ప్రాంతం నుంచి ధృవాలవైపు ప్రవహిస్తాయి.
బి. శీతల ప్రవాహాలు – ఇవి ధృవాలవైపు నుంచి భూమధ్య రేఖా ప్రాంతాల వైపు ప్రవహిస్తాయి.
ఈ సముద్ర ప్రవాహాలు ప్రధానంగా ప్రపంచ పవనాలు, సముద్రజల ఉష్ణోగ్రత, లవణీయతవల్ల ఏర్పడ్డాయి.
3. పోటుపాటులు: సముద్రంలో ప్రతిదినం నీటిమట్టం పెరగడాన్ని, తగ్గడాన్ని పోటుపాటులు అంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు పర్వవేలా తరంగాలు, మరికొన్ని గంటలపాటు లఘువేలా తరంగాలు వస్తుంటాయి. ఇవి ప్రతిరోజు ఒకే ఎత్తులో ఉండవు.
-పర్వవేలా తరంగాలు- ఇవి వచ్చినప్పుడు సముద్ర తీరం నుంచి కొంతముందుకు నీరు వస్తుంది.
-లఘువేలా తరంగాలు- ఇవి వచ్చినప్పుడు సముద్రతీరం నుంచి నీరు కొంతలోపలికి పోతుంది.
-పోటుపాటులు చేపలు పట్టడానికి అనుకూలం.
-సముద్రపు అంతర్ నిర్మాణం నాలుగు భాగాలుగా విభజించారు.
-సముద్రపు అడుగు: సముద్రపు అడుగు భాగం భూమి ఉపరితలం లాగే ఉంటుంది. ఇది కొండలు, పర్వతాలు, పీఠభూములు, అగాథాలతో ఉంటుంది. మహాసముద్రాల్లో ఎక్కువ భాగం, సముద్ర మట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్ల లోతు ఉంటుంది.
భూమిపై గల నీటి లభ్యత
1. భూమిపై నీటి విస్తరణ
1. ఉప్పునీరు (సముద్రం) 97 శాతం 2. మంచినీరు 3 శాతం
భూ ఉపరితలంపై మంచినీటి విస్తరణ:
1. చెరువులు 87 శాతం
2. చిత్తడి నేలలు 11 శాతం
3. నదులు 2 శాతం
మంచినీటి విస్తరణ
-మంచుదిబ్బలు- హిమానీ నదాలు – 68.7 శాతం
-భూగర్భ జలాలు- 30.1 శాతం
-ఉపరితలపు నీరు- 0.3 శాతం
-ఇతరులు- 0.9 శాతం
-విశాలమైన సముద్ర ప్రాంతాలే మహా సముద్రాలు. మహా సముద్రాలను సాధారణంగా ఖండాల ద్వారా విభజన చెందిన పెద్ద పెద్ద జలభాగాలు అంటారు.
-గ్రహాలన్నింటిలో నీటిని కలిగి ఉన్న ఒకే ఒక గ్రహం భూమి
-భూమిపై జలభాగం 71 శాతం ఉంటే, తాగడానికి పనికి వచ్చే నీరు కేవలం 3 శాతమే.
-మంచినీటిలో ఎక్కువ భాగం ధ్రువాల వద్ద మంచు దిబ్బలు-హిమానీ నదాల రూపంలో 68.7 శాతం ఉంది.
-భూ ఉపరితలంలో 0.3 శాతం మాత్రమే మంచినీటి చెరువులు, చిత్తడి నేలలు, నదుల రూపంలో విస్తరించి ఉంది.
-భూ ఉపరితంలో మంచినీటి విస్తరణలో ఎక్కువ భాగం చెరువుల కింద (87 శాతం) విస్తరించి ఉంది.
-సముద్రంపై వీచే గాలుల వల్ల ఏర్పడే సముద్ర కదలికలనే తరంగాలు అంటారు.
-సముద్ర ప్రవాహాలు ప్రధానంగా వేటివల్ల ఏర్పడుతాయి? (డి)
ఎ) ప్రవాహ పవనాలు
బి) లవణీయత వ్యత్యాసాలు
సి) సముద్రజల ఉష్ణోగ్రత డి) పైవన్నీ
పారా అంటే చేపల్లో ఒక రకమైనది
-సముద్ర అడుగు భాగాన భూ ఉపరితలంపై ఉన్నట్లే వివిధ భూస్వరూపాలు, పర్వతాలు, కొండలు, పీఠభూమి, మైదానాలు, అగాథాలు విస్తరించి ఉంటాయి.
-అగాథాలు అంటే అత్యంత లోతైన మహా సముద్రాల అడుగు ప్రాంతాలు
-పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత లోతైన అగాథం – మేరియానా అగాథం
-అట్లాంటిక్ మహాసముద్రంలోని అత్యంత లోతైన అగాథం – ప్యూటోరికా అగాథం
-హిందూ మహాసముద్రంలోని అత్యంత లోతైన అగాథం – సుందా అగాథం
-అంటార్కిటికా మహాసముద్రాన్ని దక్షిణ మహా సముద్రంగా పిలుస్తారు.
-పసిఫిక్ మహాసముద్రం- ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలతో కలిసి ఉంటుంది.
-ఉత్తరఅమెరికా, దక్షిణఅమెరికా, యూరప్, ఆఫ్రికా ఖండాలు అట్లాంటిక్ మహాసముద్రంతో తీరాన్ని కలిగి ఉన్నాయి.
-అంటార్కిటికా మహాసముద్రం దక్షిణ ధృవాన్ని ఆవరించి ఉంది.
-అరేబియా సముద్రం, బంగాళాఖాతాలు హిందూ మహాసముద్రంలోని భాగాలే
-తమిళనాడులోని ఏ ప్రాంతం సముద్రాలతో తీరాన్ని లిగి ఉంది- కన్యాకుమారి
-అన్నివైపులా నీరు ఉండి మధ్యలో భూభాగముంటే దాన్ని ద్వీపం అంటారు. ఉదా: గ్రీన్లాండ్, శ్రీలంక
-మూడువైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. ఉదా: భారతదేశం, సౌదీ అరేబియా
-పసిఫిక్ మహాసముద్రం డెల్టా/త్రిభుజాకారంలో ఉంటుంది.
-అట్లాంటిక్ మహాసముద్రం S ఆకారం
-హిందూ మహాసముద్రం M ఆకారం
-అంటార్కిటికా, ఆర్కిటిక్ మహా సముద్రాలు 0 ఆకారం కలిగి ఉన్నాయి.
మత్స్యకారుల గ్రామం భావనపాడు
-ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలో శ్రీకాకుళం జిల్లాలో గల మత్స్యకారుల గ్రామం భావనపాడులో ప్రజలు చేపలు పట్టుకొని జీవిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా మరపడవలపై, కర్ర తెప్పలపై చేపల వేటకు వెళ్తారు. వీరికి పట్టడమే కాకుండా వ్యవసాయం, పశువుల పెంపకం కూడా ప్రధాన వృత్తులు. ఈ గ్రామం తీరంలో ఉండటంతో 8-10 అడుగుల లోతులో బావినీరు వస్తుంది. అయితే నీరు ఉప్పగా ఉంటుంది. వంశధార నదీ కాలువ నుంచి ఈ గ్రామ పొలాలకు సాగునీరు లభిస్తుంది. ఈ గ్రామ ప్రజలు ఎక్కువగా గంగమ్మను, గౌరీని, శివుడిని పూజిస్తారు. వీరి ప్రధాన పండుగ గౌరీపూర్ణిమ. థర్మకోల్ పెట్టెల్లో చేపలతో పాటు ఐస్ ముక్కలను ఉంచుతారు. తర్వాత వీటిని దూర ప్రాంతాలకు తరలిస్తారు. అలా చేయడంవల్ల చేపలు చెడిపోవు.
-భావనపాడు గ్రామ ప్రధాన వృత్తులు చేపలవేట, వ్యవసాయం, పశుపోషణ, కోళ్ల పెంపకం.
-మత్స్యకారులందరూ జమచేసిన పైకం ఉమ్మడి సొత్తు. దాన్ని పండుగలప్పుడు ఖర్చు చేస్తారు. దీన్ని సాధారణ నిధి అంటారు.
-ఒకసారి చేపల వేటకు వెళ్లి రావడానికి డీజిల్, కూలి, ఇతర ఖర్చులకు రూ.5000 అవుతుంది.
-సముద్రాలు వివిధ రకాల ఖనిజాలకు, వివిధ రకాల చేపలకు నిధి. చేపలు పట్టడానికి అనువైన సముద్ర చలనం పోటుపాటులు.
-తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వేలాది చెరువులను తవ్వించినవారు? – కాకతీయులు, విజయనగర రాజులు, నాయకులు
-వంశధార నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? – శ్రీకాకుళం
-మత్స్యకారుని టూల్కిట్: వలల మరమ్మతులకు ప్రతి మత్స్యకారుడి వద్ద ఉండే నూలు కర్రలు, నూలు కండె, కర్రబద్దె వంటి పరికరాలతో ఉండే సంచి.
-బేరకతైలు: మత్స్యకారుల భార్యలు చేపలను తట్టల్లో నింపుకొని సమీప పట్టణాలు లేదా గ్రామాల్లో అమ్ముతారు. వీరిని బేరకతైలు అంటారు.
మత్స్యకారులను మధ్యవర్తుల నుంచి రక్షించడమెలా?
-బ్యాంకులు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇవ్వాలి.
-వీరి కోసం సహకార సంఘాలను స్థాపించాలి.
-మత్స్యకారులు డబ్బును పొదుపుగా ఖర్చుపెట్టుకోవాలి.
-చిన్న మొత్తాల పొదుపు సంస్థలో సభ్యులుగా చేరి డబ్బును పొదుపు చేయాలి.
-మద్యపానం వంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా ఉండాలి.
మరపడవ కర్రతెప్ప
దీంట్లో 20 మంది దాకా చేపల వేటకు వెళ్తారు దీనిపై ఇద్దరు లేక ముగ్గురు వేటకు వెళ్తారు
ఇంధనశక్తితో నడుస్తుంది తెడ్డుతో శ్రమశక్తిని ఉపయోగించి నడుపుతాం.
15-20 కి.మీల దూరం సముద్రంలో వేటకు వెళ్తారు సముద్రంలో ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తారు
పట్టిన చేపలను దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు సమీప పట్టణాలకు చేపలను అమ్ముతారు
సముద్రంలో ఎక్కువ దూరం వెళ్తారు కాబట్టి ఎక్కువ ప్రమాదం తక్కువ దూరం వెళ్తారు కాబట్టి తక్కువ ప్రమాదం
జలభాగం ఉపయోగాలు
సముద్రం చేపలు లభిస్తాయి, ఉప్పు లభిస్తుంది, రవాణా మార్గాలు
చెరువు తాగునీరు, చేపలు లభిస్తాయి.
బావి తాగునీరు
నది తాగునీరు, చేపలు, వ్యవసాయానికి సాగునీరు
సరస్సు చేపలు, తాగునీరు
కుంట పశువుల దాహార్తిని తీరుస్తుంది
కాలువ వ్యవసాయానికి నీరు
దోరువు నారుమడులకు నీరు చల్లడానికి ఉపయోగిస్తాయి.
(కోస్తా తీరంలో ఇసుక ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?