UG Admissions in IISC | ఐఐఎస్సీలో యూజీ ప్రవేశాలు
సైన్స్ రిసెర్చ్ లో దేశంలోనే నంబర్ వన్‌గా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో నిలిచిన సంస్థ ఐఐఎస్సీ. అంతేకాకుండా
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కొన్నేండ్లుగా టాప్‌లో నిలుస్తున్న విద్యాసంస్థ. యూజీ, పీజీ, రిసెర్చ్
ప్రోగ్రామ్‌లను అందించడంలో ఐఐటీలతో పోటీపడుతున్న సంస్థ. పరిశోధనలకు పేరుగాంచిన ఈ సంస్థలో అండర్
గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ సంస్థ అందించే యూజీ కోర్సులు,
ఎంపిక తదితర వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..
ఐఐఎస్సీ
# బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ని జంషెడ్జీ టాటా ప్రారంభించారు. ఈ సంస్థను ఆయన మానస పుత్రికగా పిలుస్తారు. 19వ శతాబ్దం చివరలో ప్రముఖ విద్యావేత్త బుర్జోర్జీ పాదుషా నేతృత్వంలో ఈ సంస్థ ఏర్పాటుకు కమిటీని వేశారు. 1909, మే 27న 371 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించారు. మొదట్లో జనరల్ అండ్ అప్లయిడ్ కెమిస్ట్రీ, ఎలక్టికల్ టెక్నాలజీ విభాగాలతో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం 40కి పైగా విభాగాలతో ఆరు ప్రధాన సబ్జెక్టుల్లో పలు ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.
#ఈ సంస్థ అందిస్తున్న ప్రధాన సబ్జెక్టులు బయాలజికల్, కెమికల్, ఎలక్టికల్, ఇంటర్‌డిసిప్లినరీ రిసెర్చ్, మెకాని కల్, ఫిజికల్, మ్యాథమెటికల్ సైన్సెస్‌కు సంబంధించిన ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది. ప్రస్తుతం బెంగళూరుతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మరో క్యాంపస్ ను కూడా ఏర్పాటు చేశారు.
ముఖ్యతేదీలు
– దరఖాస్తు: ఆన్లైన్లో
– ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500.
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు రూ.250/-
– చివరితేదీ: మే 31
– వెబ్సైట్: https://iisc.ac.in
ఎవరు అర్హులు?
– ఈ కోర్సు చేయడానికి 2021లో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులైనవారు లేదా ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు అర్హులు. ఏ ఇతర సబ్జెక్టులతోనైనా, ప్రధాన సబ్జెక్టులుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో ఇంటర్ ఉత్తీర్ణులు కూడా ఈ కోర్సు చేయడానికి అర్హులు.
యూజీ కోర్సులు
– బీఎస్సీ (రిసెర్చ్ ప్రోగ్రామ్)
నోట్: ఈ సంస్థ యూజీతో పాటు ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎంటెక్/ఎండిజైన్, ఎం.మేనేజ్మెంట్, పీహెచ్డీ తదితర కోర్సులను కూడా అందిస్తుంది.
– బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్). ఇది నాలుగేండ్ల కాలవ్యవధిగల కోర్సు. ఈ కోర్సును 2011 నుంచి ప్రారంభించారు. 8 సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సులో విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్‌ను చదవాలి. నాలుగో సంవత్సరం విద్యార్థుల మార్కులు, ఆసక్తి ఆధారంగా స్పెషలైజేషన్ సబ్జెక్టును ఇస్తారు. బీఎస్సీ రిసెర్చ్తోపాటు మరో ఏడాది అంటే ఐదో ఏడాది చదివితే మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
ఎంపిక విధానం
– కేవీపీవై-2020- స్ట్రీమ్ ఎస్ఏ, కేవీపీవై-2021, స్ట్రీమ్ ఎస్ఎక్స్, కేవీపీవై-2021, స్ట్రీమ్ ఎస్బీ లేదా ఐఐటీ జేఈఈ మెయిన్-2022, జేఈఈ అడ్వాన్స్డ్ 2022, నీట్-యూజీ 2022లో అర్హత సాధించిన వారు అర్హులు. పైన పేర్కొన్న ఎంట్రన్స్ టెస్టుల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?