Sophistication | హుందాతనం ఉట్టిపడేలా..
మహిళలకు ప్రత్యేకం
అబ్బ! చూడటానికి ఎంత హుందాగా ఉన్నావురా! మురళిని అభినందించింది చెల్లెలు స్వాతి. గంధం కలర్ ఫుల్‌హ్యాండ్స్ షర్ట్. డార్క్బ్రౌన్ ప్యాంట్, టక్ చేసుకొని, టై కట్టుకున్న మురళి చెల్లెలికి థ్యాంక్స్ చెప్పాడు. డార్క్ లెదర్షూ ధరించి బైక్‌పై ఇంటర్వ్యూకి బయలుదేరాడు మురళి. శ్రావ్యా! ఈ క్రెడిట్ నీకు దక్కుతుంది. నిన్నటి దాకా జీన్స్, టీషర్టుల్లో పక్కా మాస్‌గా కనిపించిన అన్నయ్యని ఒక్కరోజులో ప్రొఫెషనల్ లుక్స్‌తో అదరగొట్టేలా చేశావు అన్నయ్యకి టాటా చెప్పి ఇంట్లోకి వస్తూ శ్రావ్యని అభినందించింది స్వాతి. చిరునవ్వుతో తలపంకించింది శ్రావ్య. శ్రావ్యక్కా! నేను ఫైనలియర్ ఇప్పుడు, నాకు కొన్ని సూచనలియ్యవా, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి తప్పకుండా స్వాతి! అంటే ఇప్పుడు లేడీస్ స్పెషల్ ప్రారంభించాలన్న మాట ఆమె మాటలకు నవ్వేసింది స్వాతి. స్వాతి! ఒక హెచ్ఆర్ మేనేజర్‌గా నేను ఎంతోమందిని క్యాంపస్‌లోనూ, ఆఫ్‌క్యాంపస్‌లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. నేను గమనించింది ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు ఎలా తయారుకావాలో తెలియదు. అంటే ఎలా మేకప్ చేసుకోవాలో తెలియదు స్వాతి ఆసక్తిగా వింటున్నది. టీవీలో ఏదో సినిమా పాట వినిపిస్తున్నది. అదిరేటి డ్రస్సు మీరేస్తే, బెదిరేటి లుక్కు మేమిస్తే దడ మీకు దడ సందర్భోచితంగా వచ్చిన ఆ పాటకు శ్రావ్య, స్వాతి ఇద్దరూ నవ్వేశారు. పార్టీ మేకప్‌కి-ఇంటర్వ్యూ మేకప్‌కి చాలాతేడా ఉంది. పార్టీకెళ్లేటప్పుడు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు వీలైనంత రిచ్‌గా, ఐశ్వర్యం ఉట్టిపడేలా కనిపించే ప్రయత్నం చేస్తాం. ధగధగమని మెరిసే నగలూ, చమక్కుమని మెరిసి మురిపించే గాగ్రాచోళీలు ఇవన్నీ పార్టీకి సరిపోతాయి. ఇంటర్వ్యూకి వేసుకోకూడదు. మరైతే సాదాసీదాగా వెళ్లాలంటావా! సినిమా భాషలో చెప్పాలంటే డీగ్లామరైజ్డ్గా వెళ్లాలా? బుంగమూతి పెట్టి నిరాశగా అడిగింది స్వాతి. నో! నో! నీవు పొరబడుతున్నావు. మేకప్ ద్వారా మన గురించి మనం చక్కటి ఇమేజ్‌ని కలిగించవచ్చు ఎదుటివారి మనస్సులో. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మనల్ని చూడగానే ఎదుటివారు కింది అభిప్రాయాలు ఏర్పర్చుకోవాలి.
-ఈ అమ్మాయి చాలా తెలివైనది.
-ఆఫీస్ పని చాలా చక్కగా చేయగలదు.
-పనిలో తను చాలా ఎఫిషియంట్
-తనకు చక్కటి నాయకత్వ లక్షణాలున్నాయి.
-తన హుందాతనం ద్వారా సాటి ఉద్యోగుల మధ్య మంచి వాతావరణం నెలకొల్పగలదు.
-ఆఫీస్‌లో మంచి క్రియశీలక, సకారాత్మక యోగ్యమైన వాతావరణం ఈమె ద్వారా ఖాయం.
అప్పియరెన్స్ ద్వారా ఇలాంటి బలమైన సంకేతాలు అందించగలం. ఇప్పుడున్న వ్యక్తిత్వ వికాస సాహిత్యంలోగానీ, ట్రయినర్లుగానీ, వెబ్‌సైట్లలోగానీ పాశ్చాత్య దేశాల అవసరాలకనుగుణంగా అమ్మాయిల డ్రస్ గురించి ఓ నాలుగు సూచనలు అందించి చేతులు దులుపేసుకుంటున్నారు. స్కర్ట్, టాప్ అంటూ వాళ్ల ధోరణిలో చెప్పుకుపోవడం వల్ల మన అవసరాలకనుగుణంగా మనకు సమాచారం లేదు. అమ్మాయిలకు ఫార్మల్ వేర్ అనగానే ప్యాంట్, షర్ట్, కోట్ అనే పాశ్చాత్య ఆలోచనల్ని పక్కన పెడదాం. మన భారతీయ అవసరాలకనుగుణంగా ఆలోచిద్దాం.
-మీకు అలవాటుంటే చక్కగా చీరకట్టుకోవచ్చు. మరీ ఎబ్బెట్టుగా లేకుంటే మీ శరీరం సహకరిస్తే చీర కట్టుకోవచ్చు.
-కాకపోతే ఎంట్రీ లెవల్ జాబ్స్‌కి చీరతో కాకుండా చుడీదార్‌తో వెళితే తప్పేంకాదు, ఫ్రెషర్స్ మొదటిసారి జాబ్కెళుతున్న అమ్మాయిలకు చూడీదార్ బాగుంటుంది. చీర మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది.
-లంగా-ఓణీ, గాగ్రా-చోళీలు, జీన్స్-టీషర్ట్ వద్దు. స్కర్ట్లు, మిడ్డీలు హాఫ్ ప్యాంట్లు అసలే వద్దు.
-హుందాతనం ఉట్టిపడేలా లేత రంగుల్లో కాటన్ చుడీదార్లు చక్కటి చున్నీ శోభనిస్తాయి.
-మంచి కాటన్ టాప్స్ మోకాళ్ల దాకా ఉండేవి ధరించి, క్వాలిటీ గల లెగ్గింగ్స్ ధరించవచ్చు.
-స్లీవ్‌లెస్ టాప్స్ ధరించవద్దు.
-డీప్‌నెక్ టాప్స్ కూడా అవాయిడ్ చేయండి. రౌండ్‌నెక్ టాప్స్ శోభనిస్తాయి.
ఎలాంటి ఆభరణాలు ధరించాలి?
-ఏదో జువెలర్స్ కంపెనీ అడ్వర్టయిజ్మెంట్లో మోడల్లాగా నగలు భారీగా ధరించాల్సిన సమయం కాదిది. వీలైనంత సింపుల్‌గా నగలు ధరించండి.
-రెండు చెవులకు సింపుల్‌గా చిన్న కమ్మ/స్టడ్స్ చాలు. వేలాడే రింగులు వద్దు.
-మెడలో ఒక పల్చని గోల్డ్ చెయిన్ చాలు. మరీ పొడవు ఎక్కువ లేకుండా మెడ చుట్టూ ఉండేలా చూసుకోండి. ఒక చిన్న డాలర్ ఉంచుకోవచ్చు. పొడవైన చెయిన్ ఏకాగ్రనుని భంగపరుస్తుంది.
-కుడి చేతికి పల్చటి బంగారు గాజు వేసుకోవచ్చు. ఎడమ చేతికి వాచి చాలు. వాచి కూడా చిన్న డయల్, లెదర్ స్ట్రాప్‌తో ఉండేలా చూసుకోండి.
-మీరు వివాహితులైన పక్షాన కుడి చేతికి ఒక సింపుల్‌గా ఉండే వెడ్డింగ్రింగ్ వేసుకోవచ్చు.
-పాదాలకు మువ్వలు అందమే కానీ, ఘల్లుఘల్లు అనే మువ్వలు వద్దు. నిశ్శబ్దమైన ఏసీ చాంబర్స్‌లో మీ గాజుల గలగలలు, ఘల్లుమనే ధ్వని మిగతా వారి ఏకాగ్రతను భంగం కలిగిస్తాయి.
-హైహీల్స్ వాడకండి. టకటకమనే చప్పుడు చేసే మడమలున్న చెప్పులు వాడకండి.
-ఘాటైన ఫర్ఫ్యూమ్స్ వాడకండి.
-చేతిగోళ్లు, కాలిగోళ్లు ట్రిమ్ చేసుకోండి. నెయిల్ పెయింట్స్, నెయిల్ పాలిష్‌లు తీసేయండి. పారదర్శకమైన పాలిష్‌ని గోళ్లకు మెరుపుకు వాడచ్చు.
-రెగ్యులర్‌గా వాడే అలవాటున్న వారు లేతరంగు లిపిస్టిక్ వాడోచ్చు. అదే పనిగా లిపిస్టిక్ అద్దుకొని వెళ్లాల్సిన అవసరం లేదు.
-హెయిర్ డైయింగ్ పేరుతో రకరకాల రంగుల్లో చేయించుకొని తిప్పలు పడవద్దు. సింపుల్‌గా క్లిప్ పెట్టుకొని చిన్న జుట్టుతో హుందాగా వెళ్లవచ్చు. నుదుటిపై పడుతూ చిరాకు కలగకుండా బంధించి ఉంచండి. ఈ సూచనలు పాటించి విజయం సాధించండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?