Goal of socialization | సామాజీకరణ అంతిమ లక్ష్యం ?
1.కింది వాటిలో వ్యక్తి సామాజీకరణకు అధికంగా తోడ్పడే సమూహం ఏది?
1) అంతర సమూహం 2) రాజకీయ పార్టీ
3) మీడియా
4)ప్రాథమిక సమూహం
2. సామాజిక నిర్మితి అనే భావనను ప్రవేశపెట్టినది?
1) స్పెన్సర్ 2) డర్ఖ్హైమ్
3) మెలనోవ్స్కీ 4) లింటన్
3.సామాజీకరణ అంతిమ లక్ష్యం?
1) ప్రజ్ఞను పంచడం
2) సంస్కృతిని పంచడం
3) వ్యక్తిత్వ రూపకల్పన 4) శారీరక అభివృద్ధి
4.పూర్వధాన సాంఘీకరణం గురించి తెలిపినదెవరు?
1) రాబిన్సన్ 2) మెర్పన్ 3) మీడ్ 4) బెకన్
5.సామాజీకరణం రెండు విధాలుగా జరుగుతుంది. అవి ఐడెంటిఫికేషన్, రిప్రెషన్ అన్నదెవరు?
1) కూలే 2) ఫ్రాయిడ్ 3) ఎరిక్సన్ 4) మీడ్
6.బింబ వ్యక్తిత్వం అంటే?
1) మిథ్యా వ్యక్తిత్వం
2) మార్పులకు లోనయ్యే వ్యక్తిత్వం
3) ఇతరుల దృష్టిలో వ్యక్తిత్వం
4) బాల్యదశలోని వ్యక్తిత్వం
7.ఫ్రాయిడ్ Id అనేది జీహెచ్ మీడ్ ఏ భావనతో సమానం?
1) నేను 2) నన్ను
3) సిగ్నిఫికెంట్ అదర్స్ 4) జనరలైజ్డ్ అదర్స్
8.సిగ్నిఫికెంట్ అదర్స్, జనరలైజ్డ్ అదర్స్ అనే భావన ఏ ప్రక్రియకు సంబంధించినది?
1) సామాజీకరణ ప్రక్రియ 2) అభ్యసన ప్రక్రియ
3) సామాజిక ప్రక్రియ 4) సాంస్కృతిక ప్రక్రియ
9. జీహెచ్ మీడ్ నన్ను అనే భావన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ భావనతో పోల్చవచ్చు?
1) Id 2) Ego
3) Super Ego 4) Consiousness
10. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. ఆచార వ్యవహారాలు అలవర్చుకోవడమే సామాజీకరణ 1. వెస్లీ
బి. సమాజ జీవనానికి అవసరమైన సూత్రాలను అభ్యసించడమే సామాజీకరణ 2. మెకైవర్
సి. సమూహ ప్రమాణాలను నేర్పేదే సామాజీకరణ 3. ఆగ్బర్న్
డి. సాంస్కృతిక జగత్తుకు పరిచయం చేయడమే సామాజీకరణ 4. కింబల్ యంగ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
11. సముదాయం అనే భావనకు సంబంధించని అంశం?
1) భౌగోళికత 2) సహధర్మం 3) మేము అనే భావన 4) మేము, మీరు అనే భావన
12. ఇతరుల దృష్టికోణంలో వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవడం అనే భావనను తెలిపినది ఎవరు?
1) ఫ్రాయిడ్ 2) మీడ్ 3) కూలే 4) హబ్స్
13. కూలే సిద్ధాంతం ప్రకారం దర్పణం లాగా పనిచేసేది?
1) సమాజం 2) ఊహలు
3) నమ్మకాలు 4) గత అనుభవాలు
14. మానవ సమాజానికి, జంతు సమాజానికి మధ్య భేదాన్ని తెల్పండి?
1) Organization 2) Reproduction
3) Communication 4) Culture
15. సమూహ ప్రమాణాలను సామాజీకరణం నేర్పుతుందని తెలిపినవారు?
1) కింబల్ యంగ్ 2) ఆగ్బర్న్
3) మెకైవర్ 4) వెస్లీ
16. కింది వాటిలో సామాజీకరణలో కీలకపాత్ర వహించేది ఎవరు?
1) తల్లి 2) క్లోజ్ ఫ్రెండ్స్
3) జీవిత భాగస్వామి 4) ఉపాధ్యాయుడు
17. సామాజీకరణకు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి?
ఎ. వైయక్తికరణకు అవకాశం లేనిది
బి. వైయక్తికరణకు అవకాశం ఉంది
సి. పరిమితులు లేనిది
డి. పరిమితులున్నది
1) బి, డి 2) ఎ, సి 3) బి, సి 4) ఎ, డి
18. సమాజంలో వ్యక్తి సర్దుబాటులో కీలక పాత్ర వహించేది?
1) విద్య 2) సంస్కృతి
3) మానసిక సామర్థ్యాలు 4) సామాజీకరణ
19. భాష అభ్యసనంలో కీలకపాత్ర వహించే సామాజీకరణం?
1) ప్రాథమిక సామాజీకరణ
2) గౌణ సామాజీకరణ
3) అభివృద్ధి సామాజీకరణ
4) ముందస్తు సామాజీకరణ
20. సామాజీకరణ నాలుగు రూపాల్లో ఉంటుందని తెలిపినది?
1) మీడ్ 2) కూలే
3) ఇయాన్ రాబర్ట్సన్ 4) డర్ఖ్హైమ్
21. కింది వాటిలో ఇయాన్ రాబర్ట్సన్ తెలుపని సామాజీకరణ ఏది?
ఎ. పూర్వాధాన సామాజీకరణం బి. లింగభేద సామాజీకరణం
సి. చేతన సామాజీకరణం డి. అభివృద్ధి సామాజీకరణం
1) బి, సి 2) ఎ, డి
3) బి, డి 4) ఎ, బి, సి
22. కాబోయే పెండ్లికూతురు వంటలు నేర్చుకోవడం అనేది?
1) అభివృద్ధి సామాజీకరణ
2) ముందస్తు సామాజీకరణ
3) పునర్ సాంఘీకరణ
4) అచేతన సామాజీకరణ
23. సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యవసాయ వృత్తిలోకి రావాలనుకుంటాడు. అలాంటప్పుడు అతడు ఏ రకమైన సామాజీకరణకు గురికావాల్సి ఉంటుంది?
1) రీసోషలైజేషన్
2) రాయీస్ సోషలైజేషన్
3) ప్రొఫెషనల్ సోషలైజేషన్
4) రూరల్ సోషలైజేషన్
24. సమవయస్సు సంస్కృతి అనేది సామాజీకరణలో కీలకపాత్ర వహిస్తుందని తెలిపినదెవరు?
1) లింటన్ 2) ఆగ్బర్న్
3) డేవిడ్ రిస్మన్ 4) మీడ్
25. పరిశీలన ప్రక్రియలోని దశల సరైన జతను గుర్తించండి?
1) ప్రేరణ-> ధారణ-> ఆర్జించే ప్రక్రియ-> నిష్పాదనం
2) ఆర్జించే ప్రక్రియ-> ధారణ-> నిష్పాదనం-> ప్రేరణ
3) ఆర్జించే ప్రక్రియ-> ప్రేరణ-> ధారణ-> నిష్పాదనం
4) ప్రేరణ-> ఆర్జించే ప్రక్రియ-> ధారణ-> నిష్పాదనం
26. నమూనా అభ్యసనాన్ని మొదటగా తెలిపినదెవరు?
1) బండూరా 2) మిల్లర్, డిలార్డ్
3) రిస్మన్ 4) మెక్డోగల్
27. కింది వాటిలో సామాజీకరణ పద్ధతి కానిది?
1) మోటివేషన్ 2) పనిష్మెంట్
3) మోడలింగ్ 4) ఇమాజినేషన్
28. సామాజీకరణంలోని ఉపక్రియ కానిదేది?
1) అంతర్గతీకరణం 2) బహిర్గతీకరణం
3) ప్రతీకాత్మక చర్య 4) తాదాత్మీకరణం
29. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనే స్థితి కౌమార దశలో ఉంటుందని తెలిపినదెవరు?
1) మీడ్ 2) ఫ్రాయిడ్
3) కూలే 4) ఎరిక్సన్
30. ఎరిక్సన్ ప్రకారం మనోసాంఘిక వికాసం ఎన్ని దశల్లో జరుగుతుంది?
1) 6 2) 7 3) 8 4) 9
31. కింది వాటిని సరిగా జతపర్చండి.
ఎ. ఎడిపస్ కాంప్లెక్స్ 1. బెకర్
బి. నేను-నన్ను 2. జార్జ్, హేమన్స్
సి. యాంత్రిక ప్రవర్తనాత్మకం 3. జీహెచ్ మీడ్
డి. బాహ్యాశ్రయ ప్రతీకాత్మకత 4. సిగ్మండ్ ఫ్రాయిడ్
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3 4) ఎ-3, బి-4, సి-2, డి-1
32. మనిషిని సహజాత ప్రవర్తన నుంచి సామాజిక ప్రవర్తనవైపు నడిపించేది?
1) విద్య 2) అనుభవం
3) సామాజీకరణ 4) పైవన్నీ
33. The Unadjusted Girl గ్రంథ రచయిత?
1) థామస్ 2) సోర్కిన్
3) స్పెన్సర్ 4) వాట్సన్
34. సన్నివేశ నిర్వచన సిద్ధాంతం దేనికి సంబంధించినది?
1) మూర్తిమత్వం 2) సామాజీకరణ
3) అభ్యసన 4) ప్రజ్ఞ
35. సన్నివేష నిర్వచన సిద్ధాంతం తెలిపినదెవరు?
1) థామస్ 2) హబ్స్
3) రూసో 4) మెక్డోగల్
36. వ్యాఖ్య: సామాజీకరణ అనే భావన అభివృద్ధి లేదా వికాసంలో పరిసరాలు కీలకపాత్ర వహిస్తాయనే భావాన్ని అంతర్లీనంగా కలిగి ఉంటుంది.
వివరణ: సామాజీకరణ అనే ప్రక్రియవల్ల వ్యక్తుల్లో సరైన ఉద్వేగ, సామాజిక ప్రవర్తనకు తోడ్పడుతుందని భావించవచ్చు.
1) వ్యాఖ్య, వివరణ రెండూ సరైనవే
2) వ్యాఖ్య సరైనదే కానీ వివరణ సరైనదికాదు
3) వ్యాఖ్య, వివరణ రెండూ సరైనవే, వివరణ వ్యాఖ్యకు సరైన కొనసాగింపు
4) వ్యాఖ్య, వివరణ రెండూ సరైనవే కానీ రెండింటి మధ్య తార్కిక సంబంధం లేదు
37. ఆత్మ, సమాజం కవల పిల్లలు అని తెలిపినదెవరు?
1) కూలే 2) మీడ్
3) ఫ్రాయిడ్ 4) సోర్కిన్
38. కూలే ఆత్మదర్పణ భావన సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించాడు?
1) సోషల్ ఆర్గనైజేషన్
2) హ్యూమన్ నేచర్ అండ్ సోషల్ ఆర్డర్
3) గ్రూప్ మైండ్
4) సోషల్ స్ట్రక్చర్
39. పాత్రలు మారినప్పుడు ఏ సామాజీకరణకు గురవుతారు?
ఎ. రీ సోషలైజేషన్ బి. రివర్స్ సోషలైజేషన్
సి. ప్రైమరి సోషలైజేషన్ డి. డీ సోషలైజేషన్
1) ఎ, డి 2) ఎ, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
40. కింది వాటిని సరిగా జతపర్చండి.
1. ఎస్సై పరీక్ష కోసం అభ్యర్థి వ్యాయామం చేయడం ఎ. ఫార్మల్ సోషలైజేషన్
2. తల్లిదండ్రులు తమ సంతానం నుంచి నూతన విషయాలు నేర్చుకోవడం బి. జండర్ సోషలైజేషన్
3. ఆడపిల్లలు వంటలు నేర్చుకోవడం సి. రివర్స్ సోషలైజేషన్
4. శిక్షణ ద్వారా నేర్చుకోవడం డి. యాంటిస్పేటరీ సోషలైజేషన్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?






