The tallest plant in the world | ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మొక్క
పోటీ పరీక్షల ప్రత్యేకం
——————
పుష్పించే మొక్కలు
-పుష్పాలు, ఫలాలు (ఆవృతబీజాల్లో), విత్తనాలను కలిగి ఉన్న మొక్కలను పుష్పించే మొక్కలు అంటారు.
– వీటిని బీజయుత మొక్కలు (Sperma tophytes) అని కూడా అంటారు.
-వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఎ. వివృత బీజాలు (Gymno sperms), బి. ఆవృత బీజాలు (Angeo sperms).
ఎ. వివృత బీజాలు
-నగ్నంగా ఉండే అండాలుగల మొక్కలను వివృత బీజాలు అంటారు.
-ఈ మొక్కల్లో విత్తనాలు ఫలంలో కాకుండా మొక్క బహిర్గత భాగాలకు అతికి ఉంటాయి. ఎందుకంటే ఈ మొక్కల్లో ఫలాలు ఏర్పడవు.
-ఇవి అత్యంత ఎత్తుకు పెరిగే మొక్కలు.
-ఈ మొక్కల పుష్పాలను శంఖులు (Cones) అంటారు.
ఉదా: సైకస్, పైనస్, నీటం, గింగో (Ginkgo), సాలిక్స్/విల్లో, సికోయ (Red wood tree), దేవదారు (సిడ్రస్), టాక్సస్.
-సైకస్ మొక్క అండం వృక్షరాజ్యంలో అతిపెద్దది. ఈ మొక్క తిరుపతి కొండల్లో కనిపిస్తుంది.
– పైనస్ మొక్క కాండాన్ని పేపర్ తయారీకి వాడుతారు. దీని కాండంలో ఉండే రెసిన్ నాళాల నుంచి టర్పెంటైన్ అనే పదార్థం లభిస్తుంది. దీన్ని వార్నిష్‌ల తయారీలో ఉపయోగిస్తారు.
-గింగో (Ginkgo) అనేది సజీవ శిలాజ (Living fossile) మొక్క.
– సాలిక్స్/విల్లో మొక్క కలపను క్రికెట్ బ్యాట్లు, హాకీ హ్యాండిల్స్ తయారీకి వినియోగిస్తారు.
– సికోయ అనేది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మొక్క.
– దేవదారు (సిడ్రస్) మొక్క కలపను రైల్వే స్లీపర్స్ తయారీకి వాడుతారు.
-టాక్సస్ మొక్క కాండం నుంచి టాక్సాల్ అనే క్యాన్సర్ వ్యతిరేక రసాయన పదార్థం లభిస్తుంది.
బి. ఆవృత బీజాలు
– అండాలు అండకోశంలోని అండాశయం లోపల ఉండే మొక్కలు.
– ఈ మొక్కల్లో విత్తనాలు ఫలాల లోపల ఉంటాయి.
-ఈ మొక్కల విత్తనాల్లోని బీజదళాల సంఖ్యను ఆధారంగా చేసుకుని వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
i. ద్విదళ బీజాలు (Dicotyledons),
ii. ఏకదళ బీజాలు (Monocotyledons)..
II. మొక్కలను ఆకృతి/ఆకారాన్ని ఆధారంగా చేసుకుని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
1. గుల్మాలు (Herbs)
2. పొదలు (Shrubs)
3. వృక్షాలు (Trees)
గుల్మాలు (Herbs)
– భూమికి కొంచెం ఎత్తులో (3-4 అడుగులు) పెరిగే మొక్కలను గుల్మాలు అంటారు. వీటి కాండం బలంగా కాకుండా మెత్తగా ఉంటుంది.
ఉదా: టమాట, మిరప, వంకాయ, ఆవ, బెండ, కంది.
పొదలు (Shrubs)
– అంత బలహీనంగా, అంత బలంగా కాకుండా మధ్యరకంగా పెరిగే మొక్కలను పొదలు అంటారు. వీటి కాండం గట్టిగా ఉంటుంది.
ఉదా: మల్లె, మందార, గన్నేరు, గులాబి.
వృక్షాలు (Trees)-ఎక్కువ ఎత్తులో పెరిగే మొక్కలను వృక్షాలు అంటారు.
ఉదా: వేప, మరి, మామిడి.
III. మొక్కలను వాటి జీవితకాలాన్ని బట్టి 4 రకాలుగా విభజించవచ్చు. అవి..
1. అల్పకాలిక మొక్కలు (Ephemerals)
2. ఏకవార్షికాలు (Annuals)
3. ద్వివార్షికాలు (Biannuals)
4. బహువార్షికాలు (Pereennials)
అల్పకాలిక మొక్కలు (Ephemerals)
– కొన్ని వారాలు మాత్రమే జీవించే మొక్కలను అల్పకాలిక మొక్కలు అంటారు.
ఉదా: పల్లేరు (ట్రిబ్యులస్)
ఏకవార్షికాలు (Annuals)
-ఒక సంవత్సరం లోపలే పుష్పించి, ఫలాలను, విత్తనాలను ఇచ్చి జీవితకాలాన్ని పూర్తిచేసు కునే మొక్కలను ఏకవార్షికాలు అంటారు.
ఉదా: వరి, చిక్కుడు, గోధుమ, గుమ్మడి, బెండ, బఠాని, ఆవాలు.
ద్వివార్షికాలు (Biannuals)
– రెండు సంవత్సరాల్లో తమ జీవితకాలాన్ని పూర్తిచేసుకునే మొక్కలను ద్వివార్షికాలు అంటారు.
– ఈ మొక్కలు మొదటి సంవత్సరం శాఖీయంగా పెరిగి, రెండో సంవత్సరం పుష్పాలను, ఫలాలను, విత్తనాలను ఇస్తాయి.
ఉదా: బీట్రూట్, క్యారట్, ముల్లంగి.
బహువార్షికాలు (Pereennials)
-చాలా సంవత్సరాలు జీవించే మొక్కలను బవార్షికాలు అంటారు. ఇవి జీవితకాలం అంతా పుష్పాలు, ఫలాలు, విత్తనాలను ఇస్తాయి.
ఉదా: మామిడి, జామ, చింత, వేప, సపోట, కొబ్బరి, పారిజాతం.
ద్విదళ, ఏకదళ బీజాల మధ్య భేదాలు
ద్విదళ బీజాలు
-వీటిలో రెండు బీజదళాలు ఉంటాయి
– వీటిలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది
– వీటిలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది
– వీటిలో చతుర్భాగ, పంచభాగయుత పుష్పాలు ఉంటాయి
– చిక్కుడు గింజ ఆకారపు రక్షక కణాలు ఉంటాయి
-ఉదా: వేరుశనగ, చిక్కుడు, చింత, ఆవాలు, మామిడి, వేప, కందులు, పెసర్లు, మినుములు.
ఏకదళ బీజాలు
– వీటిలో ఒకేఒక బీజదళం ఉంటుంది
– వీటిలో పీచువేరు వ్యవస్థ ఉంటుంది
– వీటిలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది.
– వీటిలో త్రిభాగయుత పుష్పాలు ఉంటాయి
-ముద్గాకార రక్షక కణాలుంటాయి.
-ఉదా: వరి, మొక్కజొన్న, గోధుమ, కొబ్బరి, కర్జూర, జొన్న, సజ్జ, తాటి, ఈత, వెదురు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో ఏక కణయుత శైవలాలు ఏవి?
ఎ. క్లామిడోమోనాస్ బి. స్పైరులీనా సి. క్లోరెల్లా డి. స్పైరోగైరా
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి 3) డి, సి, బి 4) డి, ఎ, బి
2. ఆకుపచ్చ శైవలాల్లో పైరినాయిడ్లు కలిగి ఉండేవి?
ఎ. ప్రొటీన్లు బి. గ్లెకోజన్ సి. స్టార్చ్ డి. నూనెలు
1) ఎ, సి 2) ఎ, బి 3) సి, డి 4) బి, ఎ
3. మాస్ మొక్కలు కింది వాటిలో దేనిలో ప్రముఖపాత్ర వహిస్తాయి?
ఎ. మొక్కల అనుక్రమం బి. మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించడం సి. పీట్‌ను అందించడం
డి. మృత్తిక క్రమక్షయాన్ని పెంచడం
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి 3) బి, సి, డి 4) బి, సి, ఎ
4. కింది మొక్కల్లో గుల్మాలకు ఉదాహరణ?
ఎ. టమాట బి. మిరప సి. ఆవ డి. వంకాయ
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, సి 4) ఎ, డి
5. కింది మొక్కల్లో పొదలకు ఉదాహరణ?
ఎ. మల్లె బి. కంది సి. గన్నేరు డి. గులాబి
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
6. మొక్కల రకాలు, వాటి ఉదాహరణలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ.అల్పకాలిక మొక్కలు- పల్లేరు (ట్రిబ్యులస్) బి. ఏకవార్షికాలు – వరి, చిక్కుడు, బఠాని
సి. ద్వివార్షికాలు – బీట్రూట్, క్యారెట్, ముల్లంగి డి. బవార్షికాలు – మామిడి, జామ, చింత, వేప, సపోట, కొబ్బరి, పారిజాతం
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) ఎ, బి, సి, డి 4) డి, బి, ఎ
7. నిశ్చితం (ఎ): స్ఫాగ్నమ్ అనే మొక్కను సజీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు.
కారణం (ఆర్): స్ఫాగ్నమ్ నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని కలిగి ఉంది.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ రెండూ సరైనవే, కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు 4) ఎ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది
8. నిశ్చితం (ఎ): ఆంథోసిరాస్ అనేది ఒక హార్న్ వర్ట్.
కారణం (ఆర్): ఇది కొమ్ములాంటి సిద్ధబీజాలను కలిగి ఉంటుంది.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ రెండూ సరైనవే, కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు 4) ఎ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది
9. నిశ్చితం (ఎ): బ్రయోఫైటాలో జీవితచక్రం ఏక ద్వయస్థితిక రకానికి చెందినది.
కారణం (ఆర్): వీటి జీవితచక్రంలో సంయుక్త బీజం మాత్రమే ద్వయస్థితిలో ఉంటుంది.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ రెండూ సరైనవే, కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు 4) ఎ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది
10. నిశ్చితం (ఎ): బ్రయోఫైటాలు నిజమైన వేర్లు, కాండం, పత్రాలను కలిగి ఉండవు.
కారణం (ఆర్): టెరిడోఫైటాలు నిజమైన వేర్లు, కాండం, పత్రాలను కలిగి ఉంటాయి.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ రెండూ సరైనవే, కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు 4) ఎ సరైనది కాదు కానీ ఆర్ సరైనది
సమాధానాలు
1-1 2-1 3-2 4-1 5-3 6-3 7-1 8-1 9-3 10-2
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?