Commercial crops | వాణిజ్య పంటలవైపే మొగ్గు
సజ్జలు
-ఈ పంటకు ఇసుక నేలలు (లోమ్ నేలలు) అనుకూలం
-జొన్న, రాగి, సజ్జలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు.
-ప్రపంచంలో.. సజ్జలు ఎక్కువగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి.
-దేశంలో సజ్జల ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉండగా, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి.
-తెలంగాణలో.. 2014-15లో నిజామాబాద్‌లో అత్యధికంగా ఉత్పత్తి కాగా, మహబూబ్‌నగర్ జిల్లా రెండో స్థానంలో ఉంది.
బార్లీ
-బార్లీ గింజలను బీరు, విస్కీ తయారీలో వాడతారు.
-ఉష్ణోగ్రత 100C-150C, వర్షపాతం 75-100 సెం.మీ.
ఉత్పత్తి
-ప్రపంచంలో బార్లీ ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా ఉన్నది.
-దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి.
-ప్రపంచ బార్లీ ఉత్పత్తిలో 10 శాతం వాటా భారతదేశం కలిగి ఉంది.
పప్పు దినుసులు ఉత్పత్తి
-దేశంలో పప్పు దినుసుల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ 29 శాతంతో ఒకటో స్థానాన్ని ఆక్రమిస్తుంది.
-రాజస్థాన్, మధ్యప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
-పప్పు దినుసులు బఠాణి, వేరుశనగ, చిక్కుడు.
-వీటిని ఫాబేసి/లెగ్యుమినేసి అంటారు. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన పప్పు దినుసులు, వేరుశనగ వంటి పంటలను పంట మార్పిడి పద్ధతిలో సాగుచేస్తారు. కారణం ఈ మొక్కల వేరుబొడిపెల్లో రైజోబియం లాంటి నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు నివసిస్తూ వాతావరణంలో నత్రజనిని ప్రైమేట్స్ రూపంలోకి మార్చి నేలలను సారవంతం చేస్తాయి.
నగదు పంటలు
-వీటిని వాణిజ్య పంటలు అంటారు. ఇవి ఇండియా విస్తీర్ణంలో 15 శాతాన్ని ఆక్రమిస్తున్నాయి. కానీ ఉత్పత్తిలో 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
నూనెగింజలు ఉత్పత్తి
-ప్రపంచంలో నూనెగింజలు భారత్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి.
-దేశంలో.. మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా, రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది.
-రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌లో నూనెగింజలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.
వేరుశనగ
-ప్రపంచ వ్యాప్తంగా వేరుశనగ ఉత్పత్తిలో చైనా (2014-15) ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది.
-దేశంలో.. గుజరాత్, తమిళనాడు, తెలంగాణలు అత్యధికంగా పండిస్తున్నాయి.
-తెలంగాణలో.. మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో వరంగల్ ఉన్నది.
-విస్తీర్ణంలో.. భారత్ మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా సాగవుతుండగా, వరంగల్ రెండో స్థానంలో ఉంది.
ఆముదం
-ప్రపంచ వ్యాప్తంగా ఆముదం ఉత్పత్తిలో బ్రెజిల్ (2014-15) మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.
-దేశంలో.. గుజరాత్లో అత్యధికంగా ఉత్పత్తి అవుతుండగా, రాజస్థాన్ తర్వాతి స్థానంలో ఉంది.
-రాష్ట్రంలో.. మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో ఉండగా, వరంగల్ రెండో స్థానంలో ఉన్నది.
పొద్దుతిరుగుడు
-ఉత్పత్తి పరంగా దేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో.. మెదక్ మొదటి స్థానంలో, నిజామాబాద్ రెండో స్థానంలో ఉన్నాయి.
-మొత్తం సాగు విస్తీర్ణంలో నిజమాబాద్ ప్రథమ స్థానంలో, మెదక్ రెండో స్థానంలో ఉన్నాయి.
పొగాకు
-పొగాకు పంటను భారత్‌లోకి పోర్చుగీసువారు (1508) తెచ్చారు.
ఉత్పత్తి
-ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి.
-దేశంలో.. గుజరాత్లో అత్యధికంగా ఉత్పత్తి అవుతుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో.. ఖమ్మం మొదటి స్థానంలో ఉండగా, మహబూనగర్ రెండో స్థానంలో ఉన్నది.
-భారత్‌లో రెండు రకాల పొగాకును పండిస్తున్నారు.
1) నికోటినా టొబాకం 2) నికోటినా రస్టికా
-ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే నికోటినా టొబాకాన్ని వర్జీనియా పొగాకు అంటారు.
-ప్రపంచవ్యాప్తంగా వర్జీనియా పొగాకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లభిస్తుంది.
-ఇది అధికంగా పండే జిల్లాలు 1) గుంటూరు, 2) ప్రకాశం
-ఏపీని హవానా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
-పొగాకులోని ఆల్కలాయిడ్- నికోటిన్
-కేంద్రప్రభుత్వం 2008లో మే 31ని ప్రపంచ నో టొబాకో డేగా పాటించాలని ప్రకటించింది.
-2009, అక్టోబర్ 2 నుంచి బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడంపై నిషేధం విధించారు
-ప్రపంచంలో పొగ తాగేవారు ఎక్కువగా ఉన్న దేశాలు 1) చైనా 2) ఇండియా
-పొగను నిషేధించిన కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్, రాష్ట్రం-గోవా
-జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం- రాజమండ్రి
-రాష్ట్ర పొగాకు బోర్టు- గుంటూరు
-పొగాకు ఉత్పత్తులపై ప్రణబ్‌ముఖర్జీ కమిటీ నివేదిక ప్రకారం ముద్రిస్తున్న చిహ్నాలు.
1) ఊపిరితిత్తులు-క్షయ (నిశబ్ద హంతకి)
2) తేలు-క్యాన్సర్ (క్యాన్సర్ వారికి లక్షణం ఆధారంగా చిహ్నం)
పత్తి
-దీన్ని తెల్లబంగారం అంటారు.
-ఇది ముఖ్యమైన మొదటి నారపంట
-పత్తిగింజలను బినోతా అంటారు.
-పత్తిగింజలను వనస్పతి పరిశ్రమలో పశువుల దాణాగా ఉపయోగిస్తారు.
-ఉష్ణోగ్రత 20-300C
-పత్తి జన్మస్థలం-సింధునది లోయ
-పత్తి రకాలు 1) పొడుగు పింజపత్తి 2) మధ్యరకం పత్తి 3) పొట్టి పింజ పత్తి
-ఇండియాలో ఎక్కువగా పొడుగు, మధ్యరకం పింజ పత్తిని పండిస్తారు.
-పొడుగు పింజ పత్తిని నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండిస్తారు.
-పొట్టి పింజ పత్తిని నీటి వసతిలేని ప్రాంతాల్లో పండిస్తారు.
-పత్తికి ప్రధాన శత్రువు మంచు
-పంటవేసినప్పటి నుంచి 210 రోజుల్లో మంచు లేకుండా ఉంటే దిగుబడి బాగా వస్తుంది.
-పత్తి అధికంగా నల్లరేగడి నేలల్లో పండుతుంది.
-పత్తి వంగడాలు 1) గాసిపియం ఆర్బోరియం, 2) గాసిపియం హెర్బకమ్ 3) గాసిపియం హిర్స్టమ్
ఉత్పత్తి
-ప్రపంచంలో.. చైనా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి.
-భారతదేశంలో.. గుజరాత్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లు వరుసగా ఉన్నాయి.
-రాష్ట్రంలో పత్తి అత్యధికంగా నల్లగొండ జిల్లాలో సాగవుతుండగా, వరంగల్ రెండో స్థానంలో ఉంది.
-దేశంలో మొత్తం పత్తి ఉత్పత్తిలో గుజరాత్ 33 శాతం వాటా కలిగి ఉంది.
-ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని భారత్‌లో సింధు నాగరికత కాలంలో పండించారు.
-పత్తి పరిశోధన కేంద్రం నాగపూర్, ముంబై (మహారాష్ట్ర)
-మాంచెస్టర్ ఆఫ్ ఇండియా-అహ్మదాబాద్
-కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా- ముంబై
జనుము
-దీన్ని బంగారు పీచు అని పిలుస్తారు.
-వర్షపాతం-100-200 సెం.మీ.
-ఉష్ణోగ్రత-25-350c
-ఇది 8-10 నెలల పంట
-అనుకూల నేలలు: డెల్టాలు, లోమ్ నేలలు (ఒండ్రు మృత్తికలు)
-జనుము కాండాలను నానబెట్టి దానినుంచి నారను తీయడాన్ని Rotting అంటారు.
-జనుము వంగడాలు: 1) corchorus capsularis
2) corchorus olitorius
ఉత్పత్తి
-ప్రపంచంలో.. భారత్ మొదటి స్థానంలో, బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి.
-భారత్‌లో.. పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో, అసోం రెండో స్థానంలో, బీహార్, ఒడిశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో.. ఖమ్మం, మహబూబ్‌నగర్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-2009ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పీచు పదార్థాల సంవత్సరంగా ప్రకటించింది.
-జనపనారను బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ తయారీలో ఉపయోగిస్తారు.
చెరకు
-ఇది గడ్డిజాతి మొక్క
-ఉష్ణోగ్రత-21-270c, వర్షపాతం-75-150 సెం.మీ.
-ఇది ఉష్ణమండల పంట
-ఇది నగదు, పారిశ్రామిక పంట
-చెరకు పంట పూర్తి పక్వానికి చేరడానికి పట్ట్టే సమయం- 12 నెలలు
ఉత్పత్తి
-ప్రపంచ చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ తొలి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది.
-దేశంలో.. ప్రథమ స్థానంలో ఉండగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-దేశ చెరకు ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ 40 శాతం వాటా ఉన్నది.
-తెలంగాణలో.. ప్రథమ స్థానంలో మెదక్, రెండో స్థానంలో నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి.
-భారతదేశ చెరకు పరిశోధన కేంద్రం
– కోయంబత్తూర్ (తమిళనాడు)
-ఆంధ్రప్రదేశ్‌లో చెరకు పరిశోధన కేంద్రం
– అనకాపల్లి (వైజాగ్)
-భారతదేశంలో పండే చెరకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది.
-సుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్- క్యూబా
-సుగర్ బౌల్ ఆఫ్ ఇండియా- ఉత్తరప్రదేశ్
తోటపంటలు కాఫీ
-ఉష్ణోగ్రత: 15-280c
-వర్షపాతం: 150-250 సెం.మీ.
-కాఫీ జన్మస్థలం అబిసీనియా పీఠభూమిలోని కప్పా (ఇథియోపియా)
-క్రీ.శ. 850లో కల్ది అనే అరబ్ గొర్రెల వ్యాపారి వల్ల కనుగొన్నారు.
-17వ శతాబ్దంలో బాబు బుడాన్ అనే వ్యక్తి వల్ల భారత్‌లోకి ప్రవేశించింది.
-కాఫీలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి.
1) కాఫీ అరబికా-శ్రేష్ఠమైనది
2) కాఫీ రొబస్టా
3) కాఫీ లిబెరికా
కాఫీ మొక్క 600-800 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది.
-కాఫీ విత్తనాల నుంచి వస్తుంది.
-కాఫీలో ఆల్కలాయిడ్-కెఫిన్
-కాఫీ బోర్డు-బెంగళూరు
-బ్రెజిల్‌లోని కాఫీ ఎస్టేట్స్‌ను సెజెండాలు అంటారు.
-కాఫీ మొక్కలో ఉపయోగపడే భాగం-గింజలు
-ఇది ఉష్ణ మండలపు తోట పంట
-బ్రెజిల్‌ను కాఫీ భాండాగారం అంటారు.
-బ్రెజిల్‌లోని సాంతోస్ అనే ఓడరేవును కాఫీ పోర్ట్ ఆఫ్ వరల్డ్ అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?