The possibilities are many | ఆలోచనలు భిన్నమైతేఅవకాశాలు అనేకం
స్టార్ట్ స్టార్టప్
స్టార్టప్.. ప్రస్తుతం ఇదో కొత్త ట్రెండ్. అయితే ప్రతిఒక్కరికి వినూత్న ఆలోచనలు వస్తుంటాయి. కానీ అసలు స్టార్టప్‌ను ఎలా ప్లాన్ చేయాలి? ఏవిధంగా స్టార్ట్ చేయాలనే విషయాలు ప్రాథమికంగా తెలిసి ఉండాలి కదా! దాని కోసం ఈ కోర్సులు నేర్చుకుంటే మీరూ స్టార్టప్‌ను ఈజీగా స్టార్ట్ చేయవచ్చు.
How to Start a Startup, Sam Altman at Stanford University
How to Build a Startup, Udacity
New Venture Finance: Startup Funding for Entrepreneurs, Coursera
గ్రాఫిక్ డిజైన్
మీరు గ్రాఫిక్స్‌ను ఇష్టపడేవారైతే ఫొటోషాప్, కోరల్డ్రా వంటి సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి. ఆన్లైన్ ద్వారా ఈ స్కిల్స్‌ను నేర్చుకున్నట్లయితే గ్రాఫిక్ డిజైనర్‌గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఈ కోర్స్ ఆప్షన్స్ తెలుసుకోండి.
Introduction to Graphic Design, Udemy
Beginners Adobe Photoshop, Adobe KnowHow
Learn Adobe Illustrator From Scratch, Udemy
Adobe Photoshop CS6 Essential Tools, ALISON
సోషల్ మీడియా మార్కెటింగ్
ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటివి ఎలా వినియోగించాలో తెలిసి ఉంటే ఎన్నో అవకాశాలున్నట్లే. బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలనుకున్నా.. ఏదైనా కంపెనీ, సంస్థల కార్యకలాపాలు విస్తృతపర్చుకోవాలన్నా.. సోషల్ మీడియానే బెస్ట్ ఆప్షన్.
Social Media 101, Buffer
Diploma in Social Media Marketing, ALISON
Advanced SEO: Tactics and Strategy, Udemy
Getting Started With Google Analytics, Udemy
వెబ్ రైటింగ్
మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నవారికి ఈ రంగంలో అపార అవకాశాలున్నాయి. కరెంట్ ఇష్యూస్, తాజా వార్తల సమాచారం, విశ్లేషణలతో కూడిన సమగ్ర కథనాలు రాయగలిగినవారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇందుకోసం కింది ఆప్షన్స్‌ను ఫాలో అవ్వండి.
Writing for the Web, OPEN2STUDY
Secret Sauce of Great Writing, Udemy
Writing on Contemporary Issues: Culture Shock! Writing, Editing, and Publishing in Cyberspace, MIT OpenCourseWare
Becoming Digital: Writing About Media Change, MIT Open Course Ware
లాంగ్వేజెస్
ఉద్యోగులు, విద్యార్థులు విదేశీ భాషలు నేర్చు కుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇంటి నుం చే ఓ క్లిక్ చేస్తే విదేశీ భాషలను నేర్చుకోవచ్చు.
Basic French Language Skills for Everyday Life, ALISON
Chinese Language: Learn Basic Mandarin, edX
Spanish I, MIT OpenCourseWare
German Course for Beginners, Deutsch-Lernen.com
Talk Italian, BBC
ప్రోగ్రామింగ్
సొంతంగా వెబ్‌సైట్‌ను రన్ చేయాలన్నా, డిజైన్ చేయాలన్నా కోడర్లు, ప్రోగ్రామర్లకు డిమాండ్ ఉంది. కాబట్టి వీటిపై దృష్టి సారిస్తే అవకాశాలు చాలా ఉన్నాయి.
Harvard Universitys Introduction to Computer Science, edX
Introduction to Programming in Java, MIT OpenCourseWare
University of Michigans Programming for Everybody (Python), Coursera
Introduction to C and C++, MIT OpenCourseWare
యాప్ డెవలప్మెంట్
డిజిటల్ కాలంలో యాప్‌ల అవసరం కూడా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు, కార్యాలయాల సమాచారాన్ని చేరవేయాలన్నా.. వ్యవహారాలు కొనసాగించాలనుకున్నా యాప్స్‌ను కలిగి ఉండటం అవసరంగా మారుతుంది. అయితే యాప్‌ను ఎలా డిజైన్ చేయాలి? డెవలప్ చేయాలి? అనే విషయాలు తెలిసి ఉండటం ముఖ్యం.
Developing Android Apps, Udacity
Understanding the Computer Game Development Business, ALISON
This Is How You Make iPhone Apps, Udemy
హ్యూమన్ రిసోర్స్ మెనేజ్మెంట్
చిన్నాపెద్దా తేడా లేకుండా ఏ సంస్థలో అయినా హెచ్ఆర్ విభాగం తప్పనిసరిగా ఉంటుంది. సంస్థ యాజమాన్యం ఆలోచనలకు అనుగుణంగా హెచ్ఆర్ విభాగం నడుచుకుంటుంది. మీరూ హెచ్ఆర్ ప్రొఫెషనల్‌గా పనిచేయాలంటే కింది కోర్సులు ఉపయోగపడతాయి.
Diploma in Human Resources, ALISON
Human Resources, OPEN2 STUDY
Strategic HR Management, MIT OpenCourseWare
ఫిల్మ్ మేకింగ్ ఫర్ వెబ్
రోజురోజుకు షార్ట్‌ఫిల్మ్స్ తీసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇంట్రస్టింగ్ వీడియోలైనా, మీరు డైరెక్ట్ చేసిన షార్ట్‌ఫిల్స్ అయినా ప్రమోట్ చేసుకోవడానికి ఫిల్మ్ మేకింగ్ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. అయితే వాటి కోసం వీటిపై దృష్టి సారించండి.
Digital Storytelling: Filmmaking for the Web, University of Birmingham
Explore Filmmaking: from Script to Screen, National Film and Television School
Explore Animation, National Film and Television School
సైబర్ సెక్యూరిటీ
పెరుగుతున్న ఆన్లైన్ సేవలతోపాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీపై పట్టు ఉంటేగానీ ఈ నేరాలు అరికట్టడం సాధ్యం కాదు. టెక్నాలజీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే సైబర్ సెక్యూరిటీ రంగంలో ఈజీగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఈ కోర్సులు చేసినట్లయితే మీకు సులువవుతుంది.
Introduction to Cyber Security, The Open University
Securing Digital Democracy, Coursera
ఫొటోగ్రఫీ బేసిక్స్
అందమైన దృశ్యాలు కంటపడగానే వాటిని మీ సెల్ఫోన్లో బంధిస్తున్నారా? అయితే మీకు ఫొటోగ్రఫీపై ఇష్టం ఉన్నట్లే. మీరు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా మారాలంటే కెమెరా టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఇంట్లో కూర్చునే వెంటనే ఈ టెక్నిక్స్ నేర్చుకోండి మరి.
Digital Photography, ALISON
The Art of Photography (PHOT), OPEN2STUDY
ఉచిత ఆన్లైన్ కోర్సులు
మీరు భిన్నంగా ఆలోచిస్తున్నారా? క్రియేటివిటీ స్కిల్స్, ఇన్నోవేటివ్ కెరీర్ కోసం ప్రయత్నిస్తున్నారా? వెబ్ రైటింగ్, ఫారిన్ లాంగ్వేజెస్, యాప్ డెవలపింగ్ వంటి కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా?
ఇంట్రెస్ట్ ఉన్నా.. టైమ్, మనీ ఎక్కడ ఉందంటారా! అందుకే ఇంటి నుంచే ఉచితంగా నేర్చుకునే ఆన్లైన్ కోర్సులు చాలా ఉన్నాయి. వీటిని నేర్చుకొంటే కెరీర్ వృద్ధికి చాలా ఉపయోగపడతాయి.
స్టార్టప్, గ్రాఫిక్ డిజైన్, సోషల్ మీడియా, వెబ్ రైటింగ్, లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్, యాప్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్, ఫిల్మ్ మేకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫొటోగ్రఫీ బేసిక్స్
Coursera, edX, ALISON, Udemy వంటి వెబ్సైట్లు ఫ్రీ ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. వాటి వివరాలు నిపుణ పాఠకుల కోసం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?