Telugu Literary Processes-Drama, Novel | తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం, నవల
-తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి రచించిన నాటికలు – పద్మావతీ, చరణ చారణ చక్రవర్తి, వర పరీక్ష
-మల్లవరపు విశ్వేశ్వర శాస్త్రి రచించిన నాటికలు – కృష్ణాపుష్కరం, శారదోత్సవం, బలహీనులు, వరూధిని, మహిషాసురమర్ధని
-వావిలాల సోమయాజులు రచించిన నాటికలు – ధర్మఘంటిక, సౌగంధిక, సంక్రాంతి
-డా. సి.నారాయణరెడ్డి రచించిన నాటికలు – వెన్నెలవాడ, దివ్వెల సంగీతం, గోకుల విహారం, నవ్వని పువ్వు, రుతువుల రాణి, అజంతా సుందరి, మనిషి, యంత్రం, సుగాత్రి, సంక్రాంతి
-సి. నారాయణరెడ్డి రచించిన సంగీత రూపకం – రామప్ప
-బోయి భీమన్న రచించిన గేయ నాటికలు – పైరు పాట, మరొక మజిలి
-దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన రేడియో నాటికలు, శర్మిష్ట, కృష్ణాష్టమి, యమునావిహారి, ఏడాది పొడుగునా, శివక్షేత్రయాత్ర, గౌతమి, వేణుకుంజం, ధనుర్దాసు సాయుజ్యం, గుహుడు మొదలైనవి.
-శ్రీశ్రీ రచించిన రేడియో నాటికలు, సుప్తాస్థికలు, వంట రి బావి, భూతాల కొలిమి, మరో ప్రపంచం, అనంతయాత్ర, బలి, చతురస్త్రం మొదలైనవి.
-ముని మాణిక్యం నర్సింహారావు రచించిన నాటికలు, కరువు రోజుల్లో కాంతమ్మ ఇంట్లో, బ్రహ్మరాక్షసి, రాజబందీ, మాటలదొంగ, విదూషకుడు మొదలైనవి.
-త్రిపురనేని గోపీచంద్ రచించిన నాటికలు – తత్వమసి, కాల ప్రవాహం, నిలబడిన పరువు, విశ్వరూప సందర్శ నం, రచ్చబండ, విచిత్ర ప్రక్రియ మొదలైనవి.
-కొప్పరపు సుబ్బారావు రచించిన సంగీత రూపకాలు – నేటి నటుడు, చేసిన పాపం, అల్లీ ముఠా
-రేడియో అక్కయ్య, అన్నయ్యలుగా ప్రసిద్ధి చెందినవారు న్యాయపతి కామేశ్వరి, న్యాయపతి రాఘవరావు. న్యాయపతి రాఘవరావు రాసిన గేయనాటికల సంపుటి – మూడు పెళ్లిళ్లు
-బాలహాస్య నాటికలు, బాల పౌరాణిక నాటికలు అనే సంపుటములను వెలువరించినవారు – న్యాయపతి కామేశ్వరి, న్యాయపతి రాఘవరావు
-కాశీ విశ్వనాథ్ రచించిన నాటికలు – అడ్రసు లేని మనుషులు, నేను రాముణ్ణి కాను, ఇక్కడ ప్రేమలేఖలు రాయబడును. గరీబీ హటావో మొదలైనవి.
-గణేష్ పాత్రో రచించిన నాటికలు – పావలా, త్రివేణి, ఆగండి కొంచెం ఆలోచించండి.
-కొత్త పంథాలో వస్తువును విశ్లేషించి కళాత్మకంగా, హాస్యంగా వివరించిన రచయిత తణికెళ్ల భరణి రచించిన నాటికలు గార్ధభాండం, కొక్కొరొక్కో, గోగ్రహణం, గొయ్యి, చల్ చల్ గుర్రం మొదలైనవి.
-మా సమాధులే మీ పునాదులు నాటిక రచయిత – సుకమంచి కోటేశ్వరరావు
-ఎల్బీ శ్రీరామ్ రచించిన నాటిక – గజేంద్రమోక్షం
-దివాకరబాబు రచించిన నాటికలు – కుందేటి కొమ్ము, పుటుక్కు జర జర డబుక్కుమే
-మార్గశీర్ష కలం పేరుతో బీవీ రమణమూర్తి రచించిన నాటికలు- సింధూరం, కవచం, నీలిరాగం
ప్రహసనం
-హాస్యరసాత్మకమైన వ్యంగ్య నాటకమే ప్రహసనం.
-దశవిధ రూపకాల్లో ఒకటి ప్రహసనం. హాస్యరస ప్రధానమై 1 లేదా 2 అంకాలు కలిగిన రూపక భేదం ప్రహసనం. సంస్కృత ప్రహసనాల్లో ప్రాచీనమైనవి బోధాయనుడు రచించిన భగవజ్జకం, మహేంద్రవిక్రయ వర్మ రచించిన మత్తవిలాసం.
-తెలుగులో ప్రహసనాలకు ఆద్యుడు – కందుకూరి వీరేశ లింగం పంతులు, ఈయన రచించిన ప్రహసనాలు – అపూర్వ బ్రహ్మచర్యం, విచిత్ర వివాహం, మహా బధిర ప్రహసనం, బలాత్కార గానవినోద ప్రహసనం, మహామహోపాధ్యాయ ప్రహసనం, కలిపురుషశనైశ్చర విలాసం, వేశ్య ప్రియ ప్రహసనం, బ్రాహ్మ వివాహం (పెద్దయ్య గారి పెళ్లి పుస్తకం)
-హాస్య సంజీవని పేరుతో ప్రహసనాలను రచించిన సంఘ సంస్కర్త కం దుకూరి వీరేశలిం గం పంతులు.
-నవ్వుల గని వినోదం అనే ప్రహసన సంపుటాలను వెలువరించిన రచయిత – చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు. ఈయన రచించిన ప్రహసనాలు – బధిర చతుష్టయం, బలవంత బ్రాహ్మనా ర్థం, జనాభా లెక్కలు, కనకయ్య పంతులు కంతి, మహారసిక ప్రహసనం, కైలాస దూత ప్రహసనం, దివాలాదేవి వ్రతకల్పం మొదలైనవి. మనోరమ అనే పత్రికలో చిలకమర్తి ప్రహసనాలు వరుసగా ప్రచురించబడ్డాయి.
-పానుగంటి లక్ష్మీనరసింహం రచించిన ప్రహసనాలు – కంఠాభరణం, విధి లేక వైద్యుడు, లుబ్ధాగ్రేసర చక్రవర్తి మొదలైనవి.
-తెలుగు సాహిత్యంలో ప్రహసనానికి స్వతంత్ర స్థానాన్ని కలిగించిన సుప్రసిద్ధ రచయిత – భమిడిపాటి కామేశ్వరరావు. ఈయన రచించిన ప్రహసనాలు – ఐదు రోజు లు, ఈడు-జోడూ, పెళ్లి కంట్రోల్, పెళ్లి ట్రైనింగ్, వద్దంటే పెళ్లి మొదలైనవి.
-పీవీ రాజమన్నార్ రచించిన నాటికలు- ఏమి మగవాళ్లు, నాగుపాము, నిష్ఫలం, దెయ్యాల లంక మొదలైనవి.
తెలుగు నాటక సాహిత్యం-పరిశోధన గ్రంథాలు
-ఆంధ్ర నాటక రంగం – గొల్లపూడి శ్రీరామ శా్స్త్రి
-ఆంధ్ర నాటకములు – టేకుమళ్ల అచ్యుతరావు
-ఆంధ్ర నాటకములు – రంగ స్థలములు – టేకుమళ్ల అచ్యుతరావు.
-ఆంధ్రనట ప్రకాశిక – పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి
-నాటక మరణం – పోరంకి వెంకట సుబ్బారావు
-అంధనాటక పద్య పఠనం – భమిడిపాటి కామేశ్వరరావు
-నాటకోపన్యాసములు – రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
-ఆంధ్రనాటక పితామహుడు – దివాకర్ల వేంకటావధాని
-తెలుగు నాటక వికాసం – పోణంగి శ్రీరామ అప్పారావు
-తెలుగు సాంఘిక నాటకం – డా. పి.వి రమణ
-ఆంధ్ర నాటకరంగ చరిత్ర – మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
-నూరేళ్ల తెలుగు నాటక రంగం – రాష్ట్ర సంగీత నాటక అకాడమి
నవల
-సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను చిత్రించే సాహిత్య ప్రక్రియ నవల. నవాన్ విశేషాన్ లాతి గృహ్ణాతీతి నవల అనగా కొత్త విశేషాంశములు కలది నవల అని వివరించి, నవల అనే పదాన్ని మొదట తెలుగులో ప్రయోగించిన విమర్శకుడు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి. నవల అనుపదం ఆంగ్లంలోని నావెల్ నుంచి వచ్చిందని కొందరి అభిప్రాయం.
నవల నిర్వచనాలు
-రచనా కాలమందలి వాస్తవికములైన జీవితాచారవ్యవహారములను చిత్రించునది నవల- బొడ్డపాటి వేంకట కుటుంబరావు- ఆంధ్రనవలా పరిణామం.
-సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ, జనుల ఆచారవ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల- మొదలి నాగభూషణశర్మ – తెలుగు నవలా వికాసం
-యధార్థ జీవితముల వాస్తవిక చిత్రణముగల గద్యరూపక కథ సాహిత్యం నవల- పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు- తెలుగు నవలా వికాస సాహిత్యం.
-కల్పనతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహానిర్మిత కథనమే నవల- యండమూరి సత్యనారాయణ- తెలుగు విజ్ఞాన సర్వస్వం.
-వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితాన్ని స్ఫురింపజేసేది నవల- ఆర్ఎస్ సుదర్శనం- తెలుగు నవల సమకాలీనత.
-1866లో తడకమళ్ల కృష్ణారావు రచించిన నవలలు – కంబుకంధర చరిత్ర, కామరూపకథ. తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నవలలుగా వీటిని పరిగణించారు. 1879లో తడకమళ్ల కృష్ణారావు రచించిన నవల – తెలుగు వెలుగుముగాద కథ.
-1867లో కొక్కొండ వేంకటరత్నం పంతులు రచించిన మహాశ్వేత తొలి అనువాద నవలగా ప్రసిద్ధిగాంచింది. ఇది సంస్కృతంలో బాణభట్టు రచించిన కాదంబరికి స్వేచ్ఛానువాదం. మహాశ్వేత తొలి నవలయని భావించినవాడు నిడదవోలు వెంకట్రావు.
-1872లో లార్డ్ మెయో బెంగాల్ గెజిట్లో చేసిన ప్రకటనను చూసి నరహరి గోపాల కృష్ణమశెట్టి రచించిన నవల- శ్రీరంగ రాజు చరిత్ర. దీనికి గల మరోపేరు సోనాబాయి పరిణయం. శ్రీరంగరాజు చరిత్రలో నాయకుడు రంగరాజు, నాయిక- సోనాబాయి.
-శ్రీరంగరాజు చరిత్రను నవీన ప్రబంధంగా పేర్కొన్నవాడు – నరహరి గోపాలకృష్ణమశెట్టి. శ్రీరంగరాజు చరిత్రను తొలినవలగా పేర్కొన్నవారు- బొడ్డపాటి వెంకటకుటుంబరావు, మొదలి నాగభూషణశర్మ.
-సమకాలీన సమాజాన్ని సమగ్రంగా చిత్రించి నవలా ప్రయోజనాన్ని ఎలుగెత్తిచాటిన స్వతంత్రమైన తొలి సాంఘిక నవల- రాజశేఖరచరిత్ర. దీనిని 1878లో కందుకూరి వీరేశలింగం రాశాడు. దీనికి గల మరోపేరు వివేకచరిత్ర. ఈ నవల వివేకవర్థిని పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది.
-వీరేశలింగం పంతులు రాజశేఖర చరిత్రను వచన ప్రబంధంగా పేర్కొన్నాడు. ఈ నవలకు ఆధారం ఆంగ్లంలో గోల్డ్స్మిత్ రచించిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ ఈ నవలలోని ప్రధాన పాత్రలు – రాజశేఖరం, మాణిక్యాంబ, సుబ్రమణ్యం, రుక్మిణి, సీత. ఫార్చూన్ వీల్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన తొలి తెలుగు నవల- రాజశేఖరచరిత్ర. ఫార్చూన్వీల్ రచయిత- జార్జ్ రాబర్ట్హచిన్సన్.
-రాజశేఖర చరిత్రను తొలినవలగా పేర్కొన్నవారు అక్కిరాజు రమాపతిరావు, పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు, ఆర్.ఎస్ సుదర్శనం.
-గోదావరి తీర ప్రాంతంనందు గల బ్రాహ్మణుల జీవితాన్ని చిత్రించిన నవల – రాజశేఖరచరిత్ర.
-సత్యరాజా పూర్వదేశ యాత్రలు, సత్యవతీ చరిత్రం నవలల రచయిత- కందుకూరి. ఆంగ్లంలో జోనాథన్స్విఫ్ట్ రచించిన గుల్లీవర్ ట్రావెల్స్ ఆధారంగా రచింపబడిన నవల సత్యరాజాపూర్వదేశయాత్రలు.
-చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన నవలలు- రామచంద్రవిజయం, అహల్యాబాయి, సౌందర్యతిలక, కర్పూరమంజరి, హేమలత, గణపతి, దాసీ కన్య, రాజారత్నం మొదలైనవి.
-తెలుగులో తొలి చారిత్రక నవలగా ప్రసిద్ధిగాంచిన నవల హేమలత. ఇది మహ్మదీయుల పరిపాలనలోని దుర్మార్గాలను, రాజపుత్రుల విజయాన్ని వివరిస్తుంది. ఇది చింతామణి పత్రిక ప్రథమ బహుమతి పొందినది.
-తెలుగులో తొలి హాస్యనవల – గణపతి. చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి గెలుచుకున్న నవల. చిలకమర్తి నిర్వహించిన పత్రిక దేశమాత.
-తల్లాప్రగడ సూర్యనారాయణ రచించిన నవలలు – హేలావతి, సంజీవరాయ చరిత్ర.
-మాతృమందిరం నవల రచయితలు -వేంకటపార్వతీశ్వర కవులు. హరిజన సమస్య గల మొదటి నవల ఇది.
-వేలూరి శివరామశాస్త్రి రచించిన నవలలు
– ఓబయ్య, అహోబలీయం.
-జాతీయభావాన్ని ప్రతిబింబింపజేసిన తొలినవల
– ఓబయ్య.
-ఉన్నవలక్ష్మీనారాయణ రచించిన సుప్రసిద్ధ నవల
– మాలపల్లి. దీనికి గల మరోపేరు సంగ విజయం. వామపక్ష భావాలు కలిగిన తొలి సామాజిక నవల ఇది. ఈ నవలలోని నాయకుడు రామదాసు.
-మాలపల్లిని ఆధునిక మహేతిహాసంగా భావించిన విమర్శకులు
– జి.వి సుబ్రహ్మణ్యం, అనుమాండ్ల భూమయ్య.
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో డా.సి. నారాయణ రెడ్డి రచన?
1) రామప్ప 2) నవ్వనిపువ్వు
3) అజంతాసుందరి 4) పైవన్నీ
2. గోగ్రహణం నాటిక రచయిత? 1) గణేశ్పాత్రో 2) కాశీవిశ్వనాథ్
3) తణికెళ్లభరణి 4) ఎల్.బి శ్రీరాం
3. నవ్వుల గని,వినోదము ప్రహాసన సంపుటాలను వెలువరించిన రచయిత?
1) చిలకమర్తి లక్ష్మీనరసింహం
2) పానుగంటి లక్ష్మీనరసింహం
3) భమిడిపాటి కామేశ్వరరావు
4) కందుకూరి వీరేశలింగం
4. తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నవల ?
1) మహాశ్వేత 2) కంబుకంధర చరిత్ర
3) రుద్రమదేవి 4) మాలపల్లి
5. తెలుగులో తొలి హాస్య నవల ?
1) గణపతి 2) రాజశేఖరచరిత్ర
3) హేమలత 4) మాతృమందిరం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?