Suppression-movement | అణచివేత-ఉద్యమం
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన
నాదెండ్ల భాస్కరరావు
-(1984 ఆగస్టు 16 – 1984 సెప్టెంబర్ 16)
-ఈయన గుంటూరు జిల్లాకు చెందినవారు.
-రాంలాల్ ఇతన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
-ఇతను ధర్మ మహామాత్య పదవిని రద్దు చేశారు.
-ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 55 నుంచి 58 ఏండ్లకు పెంచారు.
-గవర్నర్ శంకర్దయాల్శర్మ ఆదేశం మేరకు ఇతను తన పదవికి రాజీనామా చేశారు.
మర్రి చెన్నారెడ్డి
-(1989 డిసెంబర్ 3 – 1990 డిసెంబర్ 17)
-ఈయన రంగారెడ్డి జిల్లాకు చెందినవారు.
-1989 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 186 సీట్లు గెలుచుకుంది.
-హైదరాబాద్‌లోని మతకల్లోల కారణంగా ఇతను తన పదవిని కోల్పోయారు.
నేదురుమల్లి జనార్దనరెడ్డి
(1990 డిసెంబర్ 17 – 1992 అక్టోబర్ 9)
-ఈయన నెల్లూరు జిల్లాకు చెందినవారు.
-14 డెంటల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.
-ఇతను అధికంగా ప్రొఫెషనల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
-గ్రానైట్ లీజ్ వ్యహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
-ఇతను కూడా హైదరాబాద్ మతకల్లోల కారణంగా పదవిని కోల్పోయారు.
కోట్ల విజయభాస్కరరెడ్డి
(1992 అక్టోబర్ 9 – 1994 డిసెంబర్ 12)
n ఈయన కర్నూలు జిల్లాకు చెందినవారు.
n ఇతను సారాను నిషేధించారు.
n 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యల్పంగా 26 సీట్లు మాత్రమే గెలుచుకొని, ప్రతిపక్షపార్టీ హోదాను కూడా కోల్పోయింది.
నారా చంద్రబాబునాయుడు
(1995 సెప్టెంబర్ 1 – 2004 మే 13)
-ఈయన చిత్తూరు జిల్లాకు చెందినవారు.
-ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు.
-దేశంలో హైటెక్ ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందారు.
ఇతని ప్రధాన కార్యక్రమాలు
-జన్మభూమి (దక్షిణ కొరియాలోని సెమల్ అన్డంగ్ అనే కార్యక్రమం ఆధారంగా 1997లో ప్రారంభం)
-నీరు – మీరు, ప్రజల వద్దకు పాలన
-ముందడుగు,
-విజన్ 2020 అనే పథకాన్ని అమెరికాకు చెందిన మెక్కిన్లే అనే సంస్థతో రూపొందించి స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ప్రయత్నించారు.
-గతంలో దక్షిణ అమెరికాలోని పెరూ దేశం ఇటువంటి పథకం ద్వారా విజయం సాధించింది.
వైఎస్.రాజశేఖర్‌రెడ్డి
(2004 మే 14- 2009 సెప్టెంబర్ 2)
-ఈయన కడప జిల్లాకు చెందినవారు.
-2003 ఏప్రిల్-మే నెలలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు 1500 కి.మీ.ల పాదయాత్ర నిర్వహించారు.
-2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై మొదటి సంతకం చేశారు.
-ఇతని కార్యక్రమాలు- జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు
-2009 సెప్టెంబర్ 2న రచ్చబండ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో కర్నూలులోని ఆత్మకూరు సమీపాన గల పావురాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
కే రోశయ్య
(2009 సెప్టెంబర్ 2 – 2010 నవంబర్ 23)
-ఈయన గుంటూరు జిల్లాకు చెందినవారు.
-ఇతను శాసనమండలి నుంచి ముఖ్యమంత్రి అయిన 2వ వ్యక్తి.
-ఇతని కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది.
-బడ్జెట్‌ను అత్యధికంగా 16 సార్లు ప్రవేశపెట్టారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి
(2010 నవంబర్ 24 – 2014 మార్చి 1)
-ఈయన చిత్తూరు జిల్లాకు చెందినవారు.
-ఇతను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
-1989, 1999, 2004 వాయల్పాడు నియోజకవర్గం నుంచి, 2009లో పీలేరు నియోజకవర్గం నుంచి గెలిచారు.
ఇతని కార్యక్రమాలు
రాజీవ్ యువ కిరణాలు, రూపాయికే కిలోబియ్యం
-రచ్చబండ, బంగారుతల్లి
-ఇందిరా క్రాంతి, మీ సేవ మొదలైనవి.
-ఇతని కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైంది.
-పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదించిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?