Union Territory has its own High Court | సొంత హైకోర్టు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు?
ఎ) ఐదేండ్ల పాటు వరుసగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
బి) ఒక హైకోర్టులో లేదా రెండు లేదా ఎక్కువ హైకోర్టుల్లో వరుసగా కనీసం పదేండ్ల పాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
సి) భారత రాష్ట్రపతి అభిప్రాయంలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి.
డి) సుప్రీంకోర్టు న్యాయమూర్తి నకు 65 ఏండ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు.
ఎ) బి, సి బి) ఎ, డి సి) బి,సి,డి డి) పైవన్నీ
2. రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం ఏ కోర్టులకు ఉంది?
ఎ) సుప్రీంకోర్టు బి) హైకోర్టు సి) జిల్లా సెషన్స్ కోర్టు డి) ఎ, బి
3. న్యాయసమీక్షకు అవకాశం లేని రాజ్యాంగ అంశాల్లో సరికానిది?
ఎ) ప్రకరణ 74(1) ప్రకారం దేశ పాలనలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు
బి) ప్రకరణ 105 ప్రకారం పార్లమెంట్ సభ్యులకు, సభకు కల్పించబడిన ప్రత్యేక సౌకర్యాలు
సి) ప్రకరణ 122 ప్రకారం పార్లమెంట్ వ్యవహారాలపై న్యాయస్థానాలు విచారణ జరపరాదు.
డి) ప్రకరణ 194 ప్రకారం శాసనసభ సభ్యులకు, సభకు కల్పించబడిన ప్రత్యేక సౌకర్యాలు, హక్కుల గురించి ప్రశ్నించవచ్చు.
4. కిందివాటిలో సరికానిది?
ఎ) 141వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను దేశంలోని అన్ని న్యాయస్థానాలు పాటించాలి.
బి) 137వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను తాను తిరిగి పరిశీలించవచ్చు.
సి) 134(ఎ)1 ప్రకరణ ప్రకారం హైకోర్టు కక్షిదారుడికి సుప్రీంకోర్టులో అప్పీళ్లను చేసుకోవడానికి అనుమతినిస్తుంది.
డి) 138వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటీషన్ ఉంది.
5. కింది వాటిని సరైన వాటితో జతపర్చండి?
ఎ) హైకోర్టు న్యాయమూర్తుల అర్హతలు
1. 217 (2) ప్రకరణ
బి) హైకోర్టు న్యాయమూర్తుల నియామకం
2. 217(1) ప్రకరణ
సి) హైకోర్టు న్యాయమూర్తుల పదవీకాలం
3. 217(1) ప్రకరణ
డి) హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు
4. 217(1)బి, 124(4) ప్రకరణలు
5. 225 ప్రకరణ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-5, బి-2, సి-3, డి-4
సి) ఎ-3, బి-2, సి-5, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-5
6. కిందివాటిలో సరైన అంశాలు
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీశ్‌సింగ్ ఖేహర్ బాధ్యతలు చేపట్టనున్నారు
బి) జస్టిస్ జగదీశ్‌సింగ్ ఖేహర్ 2017 జనవరి 4న, 44వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
సి) ఈయన పదవిలో దాదాపు 8 నెలల పాటు 2017 ఆగస్టు 27లో కొనసాగుతారు
డి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్
ఎ) బి బి) ఎ, సి, డి సి) సి, డి డి) ఎ, బి, సి, డి
7. కింది వాటిని సరైన వాటితో జతపర్చండి?
ఎ) హెబియస్ కార్పస్ 1. పరమాదేశ
బి) మాండమస్ 2. ప్రతిపేద
సి) ప్రోహిబిషన్ 3. బందీ ప్రత్యక్ష
డి. కోవారంటో 4. అధికార పృచ్ఛ
ఇ. సెర్షియోరారి 5. ఉత్ప్రేషణ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
బి) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
సి) ఎ-3, బి-1, సి-2, డి-4, ఇ-5
4) ఎ-5, బి-2, సి-3, డి-4, ఇ-1
8. పార్లమెంట్‌కు రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చకుండా రాజ్యాంగంలోకి ఏ అంశాన్నయినా సవరించే అధికారం ఉందని ఏ కేసులో తీర్పునిచ్చింది?
ఎ) సజ్జన్ సింగ్ కేసు బి) గోలక్‌నాథ్ కేసు
3) కేశవానంద భారతి కేసు డి) శంకర్ ప్రసాద్ కేసు
9. శాసనసభ కార్యనిర్వాహక వర్గం కాని తమ రాజ్యాంగ విధుల్లో నిర్లిప్తంగా లేదా ఆలక్ష్యంగా ఉంటే వాటి కార్యోన్ముఖులుగా చేయడానికి న్యాయస్థానాలు చైతన్యవంతమైన తీర్పులు ఇస్తున్నాయి. ఈ రకమైన న్యాయశాఖ స్వీకరించిన ప్రత్యేక పాత్రను ఏమంటారు?
ఎ) సమన్యాయ బి) న్యాయ సమీక్ష
సి) న్యాయశాఖ క్రియాశీలత
డి) సమగ్ర న్యాయవ్యవస్థ
10. కింది వాటిలో భారత న్యాయవ్యవస్థ లక్షణాలు ఏవి?
ఎ) ఏకీకృత సమగ్ర న్యాయవ్యవస్థ
బి) స్వతంత్ర న్యాయశాఖ
సి) రాజ్యాంగంపై వాఖ్యానం
డి) కేంద్ర, రాష్ర్టాల మధ్య వివాదాల విచారణ
ఇ) న్యాయశాఖ క్రీయాశీలత
ఎ) ఎ, బి, ఇ, బి) బి, సి, డి
సి) ఎ, బి, సి, ఇ డి) పైవన్నీ
11. రాజ్యాంగం అమలులోనికి రాకముందు ఏర్పడి, ఇప్పటికీ అమలులోనికి రాకముందు ఏర్పడి, ఇప్పటికీ అమలులో ఉన్న కొన్ని ఒప్పందాలు మొదలైనవి సమాఖ్య స్వభావం ఉన్నప్పటికీ ఈ అధికార పరిధిలో రావని 131వ ప్రకరణ పేర్కొంటుంది. ఈ అంశాన్ని 1956లో రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో చేర్చారు?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
12. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి.
ఎ) భారత రాజ్యాంగంలో 6వ భాగంలో 233 నుంచి 237 వరకు గల ప్రకరణలతో సబార్డినేట్ కోర్టులు గురించి ప్రస్తావించారు.
బి) హైకోర్టు తరువాత వచ్చే దిగువ కోర్టులను సబార్డినేట్ కోర్టు అంటారు.
సి) వీటిలో జిల్లా కోర్టులు, సిటీ కోర్టులు, మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి.
డి) జిల్లా న్యాయమూర్తుల నియామకం, పదోన్నతి విషయంలో గవర్నర్ హైకోర్టును సంప్రదిస్తారు.
ఎ) ఎ, బి బి) ఎ, బి, సి
సి) ఎ, బి, డి డి) ఎ, బి, సి, డి
13. నిర్దేశిక నియమాలను ఏ ప్రకరణ ప్రకారం ప్రజలకు ఉచిత న్యాయసలహా అందించాలని అనే దానికనుగుణంగా లోక్‌అదాలత్‌లను ఏర్పాటుచేశారు?
ఎ) 39 బి) 39 (ఎ) సి) 40 డి) 41
14. గ్రామ న్యాయాలకు సంబంధించి సరైనవి?
ఎ) గ్రామన్యాయాల బిల్లు 2008ని పార్లమెంట్ ఉభయసభలు డిసెంబర్ 3న ఆమోదిస్తాయి.
బి) గ్రామ న్యాయాల చట్టం గాంధీ జయంతి 2009 అక్టోబర్ 2 నుంచి అమలులోకి వచ్చింది.
సి) ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా బ్లాక్‌స్థాయిలో 5,067 కోర్టులను ఏర్పాటుచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
డి) గ్రామ న్యాయాలయాల బిల్లు ప్రకారం దేశంలోని వివిధ గ్రామాల్లో సంచార న్యాయస్థానాలను ఏర్పాటుచేస్తారు.
ఎ) బి బి) ఎ, బి సి) ఎ, బి, డి డి) పైవన్నీ
15. వినియోగదారుల ఫోరానికి సంబంధించి సరికాని అంశం?
ఎ) వినియోగదారులకు, అమ్మకందారులకు కలిగే వివిదాలను పరిష్కరిస్తుంది.
బి) 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణే చట్టాన్ని చేశారు.
సి) ఇది జిల్లాస్థాయిలో 20 లక్షలలోపు, రాష్ట్రస్థాయిలో కోటి రూపాయలలోపు, జాతీయస్తాయిలో కోటి రూపాయలు పైబడిన కేసులను పరిశీలిస్తాయి.
డి) వినియోగదారుడు రూ.1000 రుసుము చెల్లించి పిర్యాదు చేయవచ్చును.
16. న్యాయస్థానాలు తమకుతామే కేసులను ప్రవేశపెట్టి ప్రజల హక్కుల కోసం తగిన ఆదేశాలను జారీ చేయడాన్ని ఏమంటారు?
ఎ) న్యాయశాఖ క్రియాశీలత
బి) ఒరిజినల్ అధికారాలు
సి) న్యాయసమీక్ష డి) సుమోటో
17. సుప్రీంకోర్టులో అత్యధికకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు?
ఎ) హరిలాల్ జే కానియా బి) వైవీ చంద్రచూడ్
సి) కేజీ బాలక్రిష్ణన్ డి) బి, సి
18. గోలక్‌నాథ్ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి?
ఎ) ఎస్ఎం సిక్రి బి) కోకా సుబ్బారావు
సి) వైవీ చంద్రచూడ్ డి) కృష్ణ అయ్యర్
19. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?
ఎ) గౌహతి బి) ముంబై సి) చెన్నై డి) కలకత్తా
20. సొంత హైకోర్టును కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం?
ఎ) పాండిచ్చేరి
బి) అండమాన్ నికోబార్ దీవులు
సి) ఢిల్లీ డి) ఏదీకాదు
21. కేశవానంద భారతీ కేసు సమయంలో తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి?
ఎ) ఎస్ఎం సిక్రి బి) కోకా సుబ్బారావు
సి) కేఎన్ సింగ్ డి) కేజీ బాలకిష్ణన్
22. నిందితులు నేరాన్ని అంగీకరిస్తే న్యాయస్థానం విచారణను ఆపేపి నిందితుడికి తక్కువ శిక్ష విధిస్తే ఏమంటారు?
ఎ) న్యాయ ప్రవర్తన బి) ప్లి బార్గెమ్సింగ్
సి) ఎ, డి డి) ఏదీకాదు
23. న్యాయమూర్తులు శీఘ్రగతిన కేసులు విచారించడం, విచారణ సమయంలో విపరీత జాప్యానికి బాధ్యత వహింపచేయడం, న్యాయమూర్తుల ప్రవర్తన ఆదర్శంగా ఉండేలా చేయడం మొదలగు అంశాల పరిశీలనను ఏమంటారు?
ఎ) సోషల్ జస్టిస్ బెంచ్ బి) ప్లి బార్గెమ్సింగ్
సి) న్యాయ ప్రవర్తన డి) ఏదీకాదు
24. ప్రజల సామాజిక సమస్యలను ప్రభుత్వం ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను త్వరితగతిన విచారించడానికి ఏర్పాటుచేసి సోషల్ జస్టిస్ బెంచ్ ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించింది?
ఎ) 2014 డిసెంబర్ 12 బి) 2014 డిసెంబర్ 14 సి) 2014 నవంబర్ 14 డి) 2014 అక్టోబర్ 2
25. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి సరైన అంశాలు?
ఎ) పార్లమెంట్ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం దీన్ని ఏర్పాటుచేశారు.
బి) 1992లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ, అభివృద్ధి సమావేశం, రిమోటిజెనిరియోలో చేసిన తీర్మానం మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదికగా చెప్పవచ్చు.
సి) ఒక చైర్మన్, 10 మంది సభ్యులకు తక్కువ కాకుండా 20 మంది సభ్యులకు మించకుండా జ్యుడీషియల్ మెంబర్స్. అలాగే పదిమందికి తక్కువ తగ్గకుండా 20 మందికి మించకుండా పర్యావరణం సంబంధిత రంగాల్లో నిష్ణాతులైన సభ్యులు ఉంటారు.
డి) చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేండ్లు. పునర్ నియామకానికి అర్హులు కారు.
ఎ) ఎ, బి, సి బి) బి, సి సి) ఎ, సి డి) పైవన్నీ
26. ప్రజా ప్రయోజన వ్యాజ్యం సంబంధించి సరికాని అంశం?
ఎ) ప్రజా ప్రయోజనాలు ఉంటే థర్డ్ పార్టీ కూడా జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుంది
బి) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పీఎస్ భగవతి, వీఆర్ కృష్ణ అయ్యర్ చొరవ వల్ల ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన ప్రచారంలోకి వచ్చింది
సి) పిల్‌ను సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మాత్రమే వేయాలి
డి) ఈ కేసుల్లో ప్రజా ప్రయోజనాలు ఉన్నట్లు జోక్యం కోరే వ్యక్తి కచ్చితంగా నిరూపించాల్సిన అవసరం లేదు
27. ప్రవేశికలోని లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుందని దాన్ని రద్దుపరిచే అధికారం లేదని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లౌకిక తత్వాన్ని ఉల్లంఘిస్తే ప్రకరణ 356 ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
ఎ) మినర్వామిల్స్ బి) ఎస్ఆర్ బొమ్మై కేసు
సి) చంద్రకుమార్ కేసు డి) గోలక్‌నాథ్ కేసు
28. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్‌కు పరిమిత అధికారమే ఉందని స్పష్టం చేసింది. అలాగే న్యాయసమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక లక్షణాలతో అంతర్భాగం అని, దానిని పరిమితం చేయడం లేదా మొత్తానికి తీసివేయడం జరగదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును వెలువరించింది?
ఎ) కేశవానంద భారతి కేసు
బి) ఎస్ఆర్ బొమ్మై కేసు సి) మినర్వామిల్స్
డి) గోలక్‌నాథ్ కేసు
29. సెమినార్ పత్రిక సంపాదకుడైన రమేష్ థాపర్‌ను కారణాలు చెప్పకుండా నిర్బంధించడం వ్యక్తి స్వేచ్ఛకు భంగమని, వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
ఎ) ఏకే గోపాల్ కేసు బి) శంకర్ ప్రసాద్ వివాదం సి) ప్రివిపర్సుల కేసు డి) గోలక్‌నాథ్ కేసు
30. రిట్లు జారీ చేసే అధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పుచెప్పింది?
ఎ) సజ్జన్‌సింగ్ కేసు బి) మినర్వామిల్స్
సి) ఎస్ఆర్ బొమ్మై కేసు డి) చంద్రకుమార్ కేసు
31. న్యాయసమీక్షకు అవకాశం లేని రాజ్యాంగ అంశాలు సరైనవి?
ఎ) 9వ షెడ్యూల్లో పేర్కొన్న భూసంస్కరణలు
బి) ప్రకరణ 77(1) ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారానే నిర్వహించడం
సి) ప్రకరణ 166(1) ప్రకారం, రాష్ర్టాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించడం
డి) ప్రకరణ 392 (2) ప్రకారం, 1935 చట్టానికి సంబంధించిన ఏదైనా అంశాలను ప్రస్తుత రాజ్యాంగంలో తీసుకోవడానికి సంబంధించిన రాష్ట్రపతి జారీ చేసే ఉత్తర్వులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సంబంధించిన విషయాలు
ఎ) బి, సి బి) ఎ
సి) ఎ, బి, సి డి) పైవన్నీ
32. రాష్ర్టానికి న్యాయసలహాలు ఇచ్చే అడ్వకేట్ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
ఎ) రాష్ట్రపతి బి) ముఖ్యమంత్రి
సి) గవర్నర్ డి) రాష్ట్ర కెబినెట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?