లోహ ఖనిజాల గురించి కొన్ని విషయాలు
ఇనుము, మాంగనీస్, అల్యూమినియం, రాగి, బంగారం, వెండి, ప్లాటినం, టంగ్స్టన్, క్రోమైట్ మొదలైన వాటిని లోహ ఖనిజాలు అంటారు.
ఇనుము
– ఇనుము నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు
– ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్
– ఇనుము ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు
– మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా
– ఇనుములోని ఫెర్రస్ శాతాన్ని బట్టి ఈ ఖనిజాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. అవి: 1. మాగ్నటైట్, 2. హెమటైట్, 3. లిమోనైట్, 4. సిడెరైట్.
మాగ్నటైట్
– ఇది నలుపు రంగులో ఉంటుంది. దీనిలో అధిక శాతం ఇనుప ధాతువు లభ్యమవుతుంది. 72 శాతం ఇనుము ఉంటుంది. ఇది ప్రధానంగా తమిళనాడులోని సేలంలో లభిస్తుంది.
హెమటైట్
– ఇది ప్రపంచంలో విస్తృతంగా లభిస్తుంది. దీనిలో సుమారు 69 శాతం వరకు ఖనిజ పదార్థం ఉంటుంది. మాగ్నటైట్లాగే గట్టి పదార్థం. కానీ బరువు తక్కువగా ఉంటుంది.
లిమోనైట్
– దీనిలో 60 శాతం ఇనుప ఖనిజం లభిస్తుంది. సుమారు 11 శాతం నీటితేమను కలిగి ఉంటుంది. సాధారణంగా పసుపురంగు లేదా బూడిదరంగులో కనిపిస్తుంది.
సిడెరైట్
– ఇది పుసుపు పచ్చగా లేదా సిమెంటు రంగులో కనిపిస్తుంది. 40-50 శాతం వరకు ఇనుప ధాతువు లభ్యమవుతుంది. దీనిలో 0.7 శాతం తేమ ఉంటుంది.
మాంగనీస్
– మాంగనీస్ లభించే శిల – థార్వార్ శిల
– దేశంలో అత్యంత పురాతనమైన మాంగనీస్ గని – శ్రీకాకుళం (1892)
– మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్-చింద్వారా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్-బాండారా, ఒడిశాలోని మహేంద్రగిరి, గురుమహిసాని, మయూర్ భంజ్ ప్రాంతాల్లో మాంగనీస్ లభిస్తుంది.
– దేశంలో అత్యధికంగా మాంగనీస్ నిల్వలు ఉన్న రాష్ట్రం – ఒడిశా.
అల్యూమినియం
– అల్యూమినియం బాక్సైట్ రూపంలో లభిస్తుంది. దీన్ని మధ్యతరగతి ప్రజల లోహంగా పిలుస్తారు.
– ఒడిశాలోని కలహండి-కోరాపూట్, సంబల్పూర్-బొలంగిర్, ఏపీలోని విశాఖపట్నం, మధ్యప్రదేశ్‌లోని అమర్కంటక్, మకాల, కట్ని, గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతాల్లో అల్యూమినియం ఖనిజం లభ్యమవుతుంది.
– దేశంలో అత్యధికంగా అల్యూమినియం నిల్వలు ఉన్న రాష్ట్రం – ఒడిశా.
రాగి
– రాగి మానవుడు ఉపయోగించిన తొలి లోహం.
– ఇది అత్యుత్తమ విద్యుత్ వాహకం కావడంతో ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ పరిశ్రమల్లో దీని ఉపయోగం ఎక్కువగా ఉంటుంది.
– రాగి నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం – రాజస్థాన్.
– ఏపీలోని గుంటూరు (అగ్ని గుండాల), నెల్లూరు (గరిమెనపెంట), అనంతపురం (మడిగుబ్బల), కడప (జంగంరాజు పేట), మధ్యప్రదేశ్‌లోని మలజ్‌ఖండ్, జార్ఖండ్‌లోని హజారీబాగ్, రాజస్థాన్‌లోని ఖేత్రి, జున్‌జున్‌హు, తెలంగాణలోని ఖమ్మం (అప్పల్రాజు కొండ) ప్రాంతాల్లో రాగి ఖనిజం లభిస్తుంది.
– దీన్ని నాణేల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
బంగారం
– ఇది క్వార్ట్ శిలల్లో లభిస్తుంది. ఆభరణాలుగా ఉపయోగిస్తారు.
– ప్రపంచ బంగారం ఉత్పత్తిలో మన దేశం వాటా 0.75 శాతం ఉంది.
– దేశంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రాంతం – కోలార్, హట్టి (కర్ణాటక)
– ప్రస్తుతం బంగారం లభించడం లేదు.
వెండి
– వెండిని బంగారం తర్వాత నాణ్యమైన వస్తువుగా చెప్పుకుంటారు.
– దీన్ని ఆభరణాల తయారీకి, పళ్లు కట్టడానికి, ఛాయాచిత్ర వస్తువుల తయారీకి, ఎలక్ట్రోప్లేటింగ్ మొదలైన వాటికి ఉపయోగిస్తారు.
– వెండికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం – రాజస్థాన్‌లోని జావార్. ఇది మంచి విద్యుత్ వాహకం.
ప్లాటినం
– దేశంలో 2010లో కనిపెట్టిన విలువైన ఖనిజం ప్లాటినం.
– ఒడిశా, తమిళనాడులో ప్లాటినం నిల్వలు ఉన్నాయి.
టంగ్స్టన్
– టంగ్స్టన్ ఖనిజానికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం – రాజస్థాన్‌లోని డేఘన.
– దీన్ని వెల్డింగ్ ఎలక్ట్రోడ్లుగా, మెటల్ వర్కింగ్‌లో ఉపయోగిస్తారు.
క్రోమైట్
– క్రోమైట్ ఖనిజానికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం – ఒడిశాలోని సుకింద.
– దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు