Rajiv Awas Yojana | రాజీవ్ ఆవాస్ యోజన
దేశంలోని నగరాలు/పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సొంత గృహసముదాయం కల్పించే లక్ష్యంతో 2009లో కేంద్రప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై) పథకాన్ని ప్రారంభించింది.
-మురికివాడల రహిత దేశంగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధానోద్దేశం.
-ఇది పట్టణ పేదరిక నిర్మూలనకు సంబంధించినది.
-మురికివాడలను లేకుండా చేసేందుకు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించడంతో పాటు దృష్టిసారించడం.
-ఈ పథకం చేపట్టిన ఐదేండ్లలో మురికివాడల్లో గృహవసతి, నీటిసరఫరా, మురుగునీటి పారుదల, వీధిదీపాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం.
-మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా మొత్తం నగ రం విధానం అవలంబిస్తూ ఏర్పాటు చేయాలి.
-పట్టణ పేదలకు మెరుగైన గృహ, ప్రాథమిక సౌకర్యాలతోపాటు సదుపాయాల కేటాయింపులకు గాను 2009-10 కేంద్రబడ్జెట్లో రూ. 150 కోట్లు కేటాయించారు.
-ఈ పథకం రెండు దశల్లో భాగంగా మొదట జూన్ 2011లో ప్రారంభించగా, రెండో దశ అమలు కాలం 2013-2022గా నిర్ణయించారు.
-ఇది ముందుగా పైలెట్ ప్రాజెక్ట్‌గా మొదలై మిషన్మోడ్గా మార్పు చెందింది.
-దీని నిర్వహణను కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.
-ఈ పథకం మార్గదర్శకాల ముసాయిదా అన్ని రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రమంత్రిత్వ శాఖ లు, ప్రభుత్వేతర సంస్థలకు అందజేశారు.
-మురికివాడల్లో కచ్చితమైన డేటాబేస్ అభివృద్ధి ప్రతిపాదనల్లో అమలు కీలకం చేశారు. అంతేకాకుండా నిధులు కూడా దశలవారీగా విడుదల చేస్తారు.
-డేటా ప్రాసెసింగ్ కోసం జాతీయ డేటాబేస్ నిర్వహణ అభివృద్ధి చేపట్టారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?