Priority in international relations | అంతర్జాతీయ సంబంధాల ప్రాధాన్యం
5. నిరాయుధీకరణ-ఆయుధ నియంత్రణ: ప్రపంచ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్య ఆయుధాల ఉత్పత్తి-ఆయుధపోటీ. దీన్ని నివారించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. 1899లో ప్రపంచపు మొదటి నిరాయుధీకరణ సమావేశం ది హేగ్‌లో జరిగింది. 1907లో రెండో సమావేశం కూడా అక్కడే జరిగింది.
1932లో నానాజాతి సమితి జెనీవా నగరంలో ప్రపంచ నిరాయుధీకరణ సదస్సు నిర్వహించింది.
1946లో UNO సాధారణసభ అంతర్జాతీయ అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేసింది.
1952లో UNO నిరాయుధీకరణ సంఘాన్ని రూపొందించింది.
1954లో నెహ్రూ.. అణుపరీక్షలపై నిషేధం విధించాలని UNOలో ప్రకటించాడు.
1963లో PTBT పాక్షిక అణుపాటవ పరీక్ష నిషేధ ఒప్పందాన్ని అమెరికా, రష్యా, బ్రిటన్లు కుదుర్చుకున్నాయి.
1967 – NPT – అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరింది.
1972లో – SALT-I – కీలక ఆయుధాల పరిమితి ఒప్పందాన్ని నిక్సన్ (అమెరికా), బ్రెజ్నెల్ (USSR) కుదుర్చుకున్నారు.
1979లో – SALT-II వియన్నాలో జిమ్మీకార్టర్ (అమెరికా), బ్రెజ్నెల్ (USSR)ల మధ్య కుదిరింది.
1989లో – START – కీలక ఆయుధాల తగ్గింపు ఒప్పందం కుదిరింది.
……………… – CTBT – సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందం రూపొందించబడింది.
2010లో వాషింగ్టన్లో జరిగిన అణుశక్తి దేశాల అంతర్జాతీయ సమావేశం భారత్, పాకిస్థాన్‌లను పూర్తిస్థాయి అణుశక్తి దేశాలుగా గుర్తించింది.
1974, 1998లలో భారత్ అణుపాటవ పరీక్షలు నిర్వహించింది.
1998లో పాకిస్థాన్ అణుపరీక్షలు నిర్వహించింది.
ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్‌లు అణ్వస్త్ర దేశాలుగా గుర్తించబడ్డాయి.
6. తృతీయ ప్రపంచ దేశాలు: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్య్రం పొందిన దేశాలను తృతీయ ప్రపంచ దేశాలంటారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను మూడో ప్రపంచ దేశాలని అల్జీరియా రచయిత ఫ్రాంజ్ ఫెనన్ వర్ణించాడు. ఇవి వెనుకబడిన దేశాలు. ఆఖరికి పేదరికం, నిరుద్యోగం, అధిక జనాభా వంటి సమస్య ఎదుర్కొంటున్నాయి.
7. ప్రచ్ఛన్న యుద్ధం: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా-రష్యా దేశాల మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తి ఆధిపత్య పోరుకు జరిగింది. దీంతో ప్రపంచం రెండు ముక్కులుగా విడిపోయింది. తూర్పున రష్యా ఆధిపత్యంలో కమ్యూనిజం, పశ్చిమాన అమెరికా నేతృత్వంలో క్యాపిటలిస్టు వ్యవస్థ ఏర్పడి ఆయుధపోటీ ఏర్పడింది. ప్రత్యక్ష యుద్ధం జరగకుండా యుద్ధా వాతావరణాన్ని సృష్టించి ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే ప్రచ్ఛన్న యుద్ధం. అమెరికాకు చెందిన బెర్నార్డ్ బారుచ్ ప్రచ్ఛన్న యుద్ధమనే పదాన్ని తొలిసారి ఉపయోగించాడు. వాల్టర్ లిప్మన్ ప్రచారంలోకి తెచ్చాడు.
8. అలీన విధానం: అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ కూటమిలోగానీ, సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు కూటమిలోగానీ విలీనం కాకుండా ఉన్న తృతీయ ప్రపంచ దేశాలను అలీన దేశాలంటారు. నెహ్రూ, నాజర్, మార్షల్ టిటో వంటి నాయకులు 1961లో NAMను ఏర్పాటు చేశారు. 25 సభ్య దేశాలతో బెల్గ్రేడ్లో మొదలైన అలీన విధానం ప్రస్తుతం 119 దేశాలతో UNO తర్వాత అతిపెద్ద అంతర్జాతీయ సంస్థగా విరాజిల్లుతుంది.
9. మానవ హక్కులు: ఆంక్షలులేని స్వేచ్ఛతో మానవుడు పరిపూర్ణత సాధించడానికి హక్కులు కావాలి. 1215లో తొలిసారి బ్రిటన్ రాజు జాన్ ఎడ్వర్డ్-I మాగ్నాకార్టా పేరుతో ఆ దేశ ప్రజలకు హక్కులు కల్పించాడు.
1689లో బ్రిటన్ పార్లమెంట్ బిల్ ఆఫ్ రైట్స్‌ను ఆమోదించింది.
1948 డిసెంబర్ 10న UNO విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది.
1993లో వియన్నా మానవ హక్కుల సమావేశం వివిధ వర్గాలవారి హక్కులను ప్రస్తావించింది.
10. పర్యావరణం: ఇది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. పారిశ్రామికీకరణ, నగరీకరణ పెరగడం ద్వారా ధ్వని, వాయు, జల కాలుష్యాలు పెరిగినాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, ఓజోన్‌పొర క్షీణత, హరితగృహ ప్రభావం, ఆమ్లవర్షాలు, సునామీలు, వరదలు, భూకంపాలు, ఎడారీకరణ, కరువు కాటకాలు వంటి పర్యావరణ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పట్టిపీడిస్తున్నాయి.
1992 – బ్రెజిల్లో రియోడిజెనిరియోలో ధరిత్రీ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇందులో 172 దేశాలు పాల్గొన్నాయి.
1997 – క్యోటో ప్రొటోకాల్ పర్యావరణ సదస్సులో 37 పారిశ్రామిక దేశాలు సంతకాలు చేశాయి. ఇది 2005 ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?