కంపెనీ సెక్రటరీ చదవాలంటే..?
సంస్థలోపల జరిగే అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత, చట్టబద్ధత అనేవి చాలా అవసరం. ఇటువంటి కీలక బాధ్యతలను నిర్వహించి, వ్యాపార సామ్రాజ్యాన్ని తమ భుజస్కంధాలపై మోసేవారు, ఓర్పు, నేర్పుతో వ్యాపారవేత్తలకు ఎప్పటికప్పుడు సమయానుగుణంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారే కంపెనీ సెక్రటరీలు.
-ఇంటర్లో ఏ గ్రూపు చదివినా సీఎస్ కోర్సు చదవచ్చు.
-ఎలా చదవాలి.. సీఎస్ కోర్సును ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు స్థాయిల్లో పూర్తిచేయాలి.
సీఎస్ ఫౌండేషన్
-సీఎస్ ఫౌండేషన్ పరీక్షను కూడా సీఏ కోర్సులో సీపీటీ పరీక్ష మాదిరిగానే ప్రవేశ పరీక్షను (ఎంట్రన్స్ ఎగ్జామ్) మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఇది మొత్తం 200 ప్రశ్నలకు 400 మార్కులుగా ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అన్నమాట. కంప్యూటర్ బేస్డ్గా ఉండే ఈ పరీక్షలో 50 శాతం మార్కులు సాధించాలి. దీన్ని ప్రతి ఏడాది రెండు సార్లు (జూన్, డిసెంబర్ నెలల్లో) నిర్వహిస్తారు.
-డిగ్రీ పూర్తిచేసినవారు సీఎస్ ఫౌండేషన్ అసవరం లేకుండా సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ చదవచ్చు.
సబ్జెక్టులు
-బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ లా- 100 మార్కులు
-బిజినెస్ మేనేజ్మెంట్ ఎథిక్స్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్- 100 మార్కులు
-బిజినెస్ ఎకనామిక్స్- 100 మార్కులు
-ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్- 100 మార్కులు. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్ష (రెండు మాడ్యూల్స్‌గా 8 పేపర్లు) రాయవచ్చు. మాడ్యూల్‌లోని ప్రతి పేపర్లో 40 శాతం మార్కులకు తగ్గకుండా మాడ్యూల్ మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించాలి.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ సిలబస్
మాడ్యూల్-1
1. జ్యూరిస్ప్రూడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్ అండ్ జనరల్ లాస్
2. కంపెనీ లా
3. సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ క్లోజర్
4. ట్యాక్స్ లాస్
మాడ్యూల్-2
5. కార్పొరేట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్
6. సెక్యూరిటీస్ లాస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్
7. ఎకనామిక్స్, బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్
8. ఫైనాన్షియల్ అండ్ స్టాటజిక్ మేనేజ్మెంట్
-ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించినవారు లేదా సాధించి ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేసుకున్నవారు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ చదవడానికి అర్హులు.
ప్రాక్టికల్స్
-సీఎస్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ సిలబస్‌తోపాటు ఫౌండేషన్ నుంచి ప్రొఫెషనల్ వరకు అమలు చేస్తున్న పలురకాల శిక్షణా విధానాల్లో సీఎస్ ఇన్స్టిట్యూట్ మార్పులు చేసింది. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్, కంప్యూటర్ ట్రెయినింగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది.
అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్
-సీఎస్ కోర్సులో భాగంగా అప్రెంటిస్‌షిప్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రెయినింగ్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ అప్రెంటిస్‌షిప్ గరిష్ఠ వ్యవధి మూడేండ్లు. అయితే ఇది అభ్యర్థులు సీఎస్ కోర్సు ఏ దశలో చేరారో.. దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పు ఉంటుంది.
సీఎస్ కోర్సు పూర్తి వివరాలు..
ప్రొఫెషనల్ ప్రోగ్రామ్..మాడ్యూల్-1
1. గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, కంప్లయన్సెస్ అండ్ ఎథిక్స్
2. అడ్వాన్స్డ్ ట్యాక్స్
3. డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్ అండ్ అప్పియరెన్సెస్
మాడ్యూల్-2
4. సెక్రటేరియల్ ఆడిట్, కంప్లయన్స్ మేనేజ్మెంట్ అండ్ డ్యూ డెలిగెన్స్
5. కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ అండ్ వైండింగ్ అప్
6. రిసొల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్, నాన్ కంప్లయన్సెస్ అండ్ రెమెడీస్
మాడ్యూల్-3
7. కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్స్ ఇన్ స్టాక్ ఎక్చ్సేంజ్
8. ఎలక్టివ్ పేపర్
-ఇందులో 8 పేపర్లు ఉంటాయి. అవి.. బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్, ఇన్సూరెన్స్ లా అండ్ ప్రాక్టీస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్-లాస్ అండ్ ప్రాక్టీసెస్, ఫోరెన్సిక్ ఆడిట్, డైరెక్ట్ ట్యాక్స్ లా అం డ్ ప్రాక్టీస్, లేబర్ లాస్ అండ్ ప్రాక్టీస్, వాల్యుయేషన్ అండ్ బిజినెస్ మోడలింగ్, ఇన్సాల్వెన్సీ లా అండ్ ప్రాక్టీస్
-ఈ పేపర్లో ఓపెన్ బుక్ సిస్టమ్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు.
-ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసిన ఏడాది తర్వాత ఈ ప్రొఫెషనల్ పరీక్ష (మూడు మాడ్యూల్స్‌గా 9 పేపర్లు) రాయాలి. మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి 50 శాతం సగటు మార్కులను సాధిస్తే విద్యార్థి మాడ్యూల్ లేదా ప్రొఫెషనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తారు.
-రెండు, మూడు దశల్లో మార్పులు: 2018 మార్చి 1 నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (మాడ్యూల్ 1/4 పేపర్లు, మాడ్యూల్ 2/4 పేపర్లు)కు కొత్త సిలబస్ అమల్లోకి వచ్చింది. ఈ సిలబస్ ప్రకారం మొదటి పరీక్ష డిసెంబర్ 2018 నుంచి నిర్వహిస్తారు. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ (మూడు మాడ్యూళ్లలో 9 పేపర్లు)కు 2018, సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిలబస్ అమలవుతుంది. ఈ సిలబస్ ప్రకారం మొదటి పరీక్ష జూన్ 2019 నుంచి నిర్వహిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు