Nature diversity | ప్రకృతి వైవిధ్య పట్టుగొమ్మలు
-భారతదేశానికి పెట్టని కోట హిమాలయ పర్వతాలు.
ప్రకృతి రమణీయత, సహజసిద్ధ ఉద్బిజ్జ సంపద హిమాలయాలకే సొంతం. ఈ పర్వతాల్లోని ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ప్రసిద్ధినొందినది. ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ హిమానీనదం కూడా ఇక్కడే ఉన్నది. కశ్మీర్ అందాల సోయగాలు అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎత్తైన హిమ శిఖరాలే కాకుండా ఆహ్లాదకరమైన వేసవి విడిది కేంద్రాలు, లోయలు, కనుమలు కలిగి ఎన్నో వింతలు, విశేషాలతో కనువిందు చేస్తున్నాయి.
లీప్లీ, నీతుల, తాతుల కనుమలు
-ఇవి ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.
-ఇవి భారత్, టిబెట్, నేపాల్‌లను కలుపుతున్నాయి. ఇది మూడు దేశాల కూడలి (Trijunction of India, Tibet, Nepal)
నాథులా కనుమ
-ఇది సిక్కింలో ఉంది. కాళిన్ సంగ్-లాసా (టిబెట్ రాజధాని)లను కలుపుతుంది.
-ప్రపంచంలో ఎత్తయిన విమానాశ్రయం లాసాలో ఉంది. ఇది 4363 మీ. ఎత్తులో ఉంది.
-ఈ కనుమను 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం సందర్భంగా మూసేశారు. 44 ఏండ్ల తర్వాత 2006 జూలైలో తిరిగి ప్రారంభించారు.
-జిలెపుల కనుమ : ఇది సిక్కింలో ఉంది.
బొమిడిల కనుమ
-ఇది అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉంది. తేజ్‌పూర్, తవాంగ్‌లను కలుపుతుంది.
-పాంగ్ సూ కనుమ : హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
హిమాచల్ హిమాలయాలు/నిమ్న హిమాలయాలు
-ఇవి హిమాద్రి హిమాలయాలకు దక్షిణంగా ఉన్నాయి.
-వీటి సగటు ఎత్తు : 3000-4500 మీ.
-వెడల్పు : 60-80 కి.మీ.
-ఇవి సతతహరిత ఓక్, శృంగాకార అరణ్యాలకు ప్రసిద్ధి.
-పొడవైన పర్వత శ్రేణులు కలవి. ఇక్కడ లైమ్‌స్టోన్, క్వార్ట్లు ప్రధాన శిలలు.
పిర్‌పంజాల్ పర్వత శ్రేణి
-ఇది జమ్ముకశ్మీర్‌లో ఉంది. దేశంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి. పొడవు 400 కి.మీ.
-ఇందులో బనిహాల్ కనుమ ఉంది. దీన్ని గేట్ వే ఆఫ్ కశ్మీర్ అని పిలుస్తారు.
దౌల్ధార్ పర్వతశ్రేణి
-ఇది హిమాచల్‌ప్రదేశ్‌లోని పిర్‌పంజాల్ పర్వతశ్రేణి నైరుతి భాగంలో ఉంది.
-ఈ శ్రేణిలో కులు, కాంగ్రా లోయలు ఉన్నాయి.
-వేసవి విడిది కేంద్రమైన సిమ్లా ఈ కనుమల్లోనే ఉంది.
నాగటిబా పర్వతశ్రేణి
-ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది. కొంతభాగం నేపాల్‌లో కలదు.
ముస్సోరి పర్వతశ్రేణి
-ఉత్తరాఖండ్‌లో ఉంది.
మహాభారత్
-ఇది నేపాల్‌లో ఉంది.
-ముఖ్యమైన వేసవి విడిది కేంద్రాలు
డార్జిలింగ్
-పశ్చిమబెంగాల్లో ఉంది.
-ఇది గ్రీన్‌టీ తోటలకు ప్రసిద్ధి.
-ఇక్కడ హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది.
డెహ్రాడూన్
-ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది.
-ఇక్కడ అటవీ పరిశోధనా కేంద్రం, ఇండియన్ మిలటరీ అకాడమీ ఉంది.
-దీంతోపాటు సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నది.
ముస్సోరి
-ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది.
-ఇక్కడ ఐఏఎస్ శిక్షణా కేంద్రం (లాల్ బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) ఉన్నది.
సిమ్లా
-ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ ఆలుగడ్డల పరిశోధనా కేంద్రం ఉది.
కులు, మనాలి
-హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
-ఇవి ఆపిల్ తోటలకు ప్రసిద్ధి
-ఆపిల్స్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్
ధర్మశాల
-ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నది. బౌద్ధమతానికి ప్రసిద్ధి.
-ముఖ్యమైన సరస్సులు
నైనిటాల్, భీమ్టాల్ సరస్సులు
-ఇవి ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.
చోలాము సరస్సు
-ఇది సిక్కింలో ఉంది. మనదేశంలో అత్యంత ఎత్తయిన సరస్సు అని ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది.
పుణ్యక్షేత్రాలు
-కేదారినాథ్, బద్రినాథ్ ఆలయాలు : ఇవి ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.
ముఖ్యమైన లోయలు
-కశ్మీర్ లోయ
-ఇది జమ్ముకశ్మీర్‌లో ఉంది.
-హిమాద్రి-హిమాచల్ పర్వతాల మధ్యఉన్న విశాలమైన లోయ.
-దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు.
-ఈ లోయలోని క్రమక్షయ మైదానాలను కారేవాస్ అంటారు.
స్వాప్ లోయ
-ఇది పాకిస్థాన్‌లో ఉంది.
-హిమాచల్ హిమాలయాల వెంబడి ఉన్న సన్నని మార్గాలను మార్గ్ అంటారు.
ఉదా: గుల్మార్గ్, సోన్మార్గ్, పేన్మార్గ్ (జమ్ముకశ్మీర్‌లో), భుజ్వాల్మార్గ్, పాయల్ మార్గ్
(ఉత్తరాఖండ్‌లో) శివాలిక్ హిమాలయాలు
-ఇది హిమాచల్ శ్రేణికి (హిమాచల్ హిమాలయాలకు) దక్షిణంగా ఉన్నాయి.
-ఇవి 600 – 1500 మీ. ఎత్తు, హిమాచల్‌లో 50 కి.మీ, అరుణాచల్‌ప్రదేశ్‌లో 15 కి.మీ.ల వెడల్పుతో ఉన్నాయి.
-ఇది భూకంపాలకు ప్రసిద్ధి (జమ్ముకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్).
శివాలిక్ హిమాలయాలకు పేర్లు
-జమ్ముకశ్మీర్- జమ్ముకొండలు
-దుద్వాకొండలు
-సిక్కిం – చురియా, మురియా కొండలు
-అరుణాచల్‌ప్రదేశ్ – మిరి, మిష్మి, అబోర, డాస్లా కొండలు
-అసోం – కచార్ కొండలు
-డూన్లు : హిమాచల్ హిమాలయాలకు, శివాలిక్ కొండలకు మధ్య ఏర్పడ్డవాటిని (లోయలు) డూన్లు అంటారు.
ఉదా: డెహ్రాడూన్, ప్లాటీడూన్, బౌక్లంబడూన్ (ఉత్తరాఖండ్), కొట్లీడూన్ (జమ్ముకశ్మీర్)
-బోస్ : శివాలిక్ కొండలను ఖండిస్తూ ప్రవహిస్తున్న చిన్న చిన్న నీటి ప్రవాహాలు.
ట్రాన్స్ హిమాలయాలు/టిబెట్ హిమాలయాలు
-ఇవి హిమాద్రి హిమాలయాలకు (అత్యున్నత హిమాలయాలకు) ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి.
-వీటి సగటు ఎత్తు 3000 మీ., పొడవు సుమారు 1000 కి.మీ., వెడల్పు 40 కి.మీ.
కారాకోరం పర్వత శ్రేణి
-ఇది ట్రాన్స్ హిమాలయాల్లో పొడవైనది. ఈ పర్వత శ్రేణిలో గల ఎత్తయిన శిఖరం గాడ్విన్ ఆస్టిన్ (K2 – 8611 మీ.)
-ఇది ప్రపంచంలో రెండో అతి ఎత్తయిన శిఖరం.
వివిధ దేశాల్లో కే2 శిఖరం పేరు
భారత్ – కృష్ణగిరి
పాకిస్థాన్ – చేగోరి
చైనా – క్వాగర్
-కారాకోరం పర్వత శ్రేణిని ఆసియా ఖండానికి వెన్నెముక అని పిలుస్తారు.
-ఈ పర్వత శ్రేణిలో అతిపొడవైన హిమానీనదం సియాచిన్. దీని పొడవు 75 కి.మీ.
గమనిక : ఇది పిస్టోసిన్, హాలోసిన్ యుగంలో ఏర్పడింది.
-సియాచిన్ హిమానీనదం జమ్ముకశ్మీర్‌లోని నుబ్రానది లోయలో ఉంది. దీన్ని ప్రపంచ మూడో ధృవం అంటారు.
-ఇది ప్రపంచంలోకెల్ల ఎత్తయిన యుద్ధక్షేత్రం.
-ఇది ప్రపంచంలో మానవుడు నివసిస్తున్న ఏకైక ఎత్తయిన హిమానీనదం.
-కారాకోరం, ఆగ్లా కనుమలు ఉన్నాయి.
హిందూకుష్ పర్వతశ్రేణి
-ఈ పర్వతాల్లో కైబర్, బోలాన్ కనుమలు ఉన్నాయి.
-దీన్ని చారిత్రక యుగంలో గేట్‌వే ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.
కైలాసనాథ పర్వతశ్రేణి
-ఈ పర్వత శ్రేణిలో మానస సరోవరం సరస్సు ఉంది.
-ఇంది సింధు, బ్రహ్మపుత్ర నదులకు జన్మస్థలం.
కున్లున్ పర్వతశ్రేణి
-ప్రపంచంలో అతి ఎత్తయిన పీఠభూమి పామీర్పీఠభూమి. ఇది టిబెట్‌లో ఉంది.
-ఇది కున్లున్-కైలాసనాథ పర్వత శ్రేణుల మధ్య ఉంది.
-ఈ పీఠభూమిని ప్రపంచం పైకప్పు పీఠభూమి (Roof of the world Plateatu) అని, హార్ట్ ఆఫ్ ది ఏషియా అని అంటారు.
దేశంలోని లోయలు
-పువ్వులలోయ : ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో 2004లో గుర్తించింది.
-కాంగ్రాలోయ : ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఆపిల్ తోటలకు ప్రసిద్ధి.
-పుష్కర్లోయ : రాజస్థాన్‌లో ఉంది. ఇది అనేక రకాల గులాబీ పువ్వులకు ప్రసిద్ధి.
-గులాబీల నగరం (పింక్ సిటీ) అని జైపూర్‌ను పిలుస్తారు.
-టైగర్ లోయ : ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. పులులకు ప్రసిద్ధి. దీనిని టైగర్ స్టేట్ అంటారు.
-చుంబీలోయ : సిక్కింలో ఉంది.
-సుర్మాలోయ : ఇది అసోంలో ఉంది. సాల్ వృక్షాలకు ప్రసిద్ధి. వీటిని రైల్వే స్వీపర్ల తయారీలో వాడుతారు.
-నిశ్శబ్ద లోయ (సైలెంట్ వ్యాలీ): ఇది కేరళలో ఉన్న పర్యావరణ ప్రాంతం. అత్యంత జీవవైవిధ్యం కలది.
-మాక్డోక్ లోయ : ఇది మేఘాలయలో ఉంది.
హిమాచల్ హిమాలయాల్లో ముఖ్య పర్వత శ్రేణులు
1. పిర్‌పంజాల్ పర్వత శ్రేణి – జమ్మూ
2. దౌల్ధార్ పర్వత శ్రేణి – హిమాచల్‌ప్రదేశ్
3. నాగటిబా పర్వత శ్రేణి – ఉత్తరాఖండ్
4. ముస్సోరి పర్వత శ్రేణి – ఉత్తరాఖండ్
5. మహాభారత్ – నేపాల్
ముఖ్యమైన పర్వత శ్రేణులు
1) కారాకోరం పర్వత శ్రేణి
2) లడక్ పర్వత శ్రేణి
3) జస్కార్ పర్వత శ్రేణి
4) హిందూకుష్ పర్వత శ్రేణి
5) కైలాస్నాథ్ పర్వత శ్రేణి
6) కున్లున్ పర్వత శ్రేణి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?