When did the Navagraha Alliance take place? | నవగ్రహ కూటమి ఎప్పుడు సంభవించింది?
జాగ్రఫీ
1. సూర్యుడు, దాని చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాల సముదాయాన్ని సౌరకుటుంబం అంటారు. ఇది ‘మిల్కీవే’ అనే నక్షత్ర మండలంలో అంతర్భాగం. భారతీయులు దీన్ని పాలపుంత అని ఆకాశగంగ అని పిలుస్తారు. చైనీయులు దీన్ని ఖగోళ నదులు, హిబ్రులు కాంతి నదులు, ఎస్కిమోలు తెల్లని బస్మపీటలం అని పిలుస్తారు. ఈ మిల్కీవేలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి ?
1) అనంతం 2) సుమారు 1500 3) 24 4) 9
2. జాగ్రఫీ అనే పదాన్ని మొదటగా వాడింది ఎరటోస్థనీస్, భూమి గుండ్రంగా ఉందని చెప్పినవారు అరిస్టాటిల్, భూకేంద్ర సిద్ధాంత కర్త టాలమి, సూర్యకేంవూదక సిద్ధాంత కర్త కొపర్నికస్, 3600లను సృష్టించింది హిప్పార్కర్, గ్లోబులను సృష్టించింది ‘మెర్కేటర్’ అయితే ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ ఎవరు ?
1) ఆల్ఫ్రేడ్ వెజినర్ 2) జార్జెస్ అబే లిమిటియర్
3) హెకొటియస్ 4) సోక్రటీస్
3. హైడ్రా అనేది ఒక ?
1) జీవి 2) రక్తంలేని మొక్క
3) గెలాక్సీ 4) నెబ్యులా
4. నెబ్యులాపై మొదట అధ్యయనం చేసింది ?
1) క్వాజర్ 2) హ్యుజెన్స్
3) హెరటోస్తనిస్ 4) గెలీలియో
5. ఉల్కలు అంటే భూమ్యాకర్షణ శక్తికి లోనైన గ్రహ శకలాలు. డాగ్స్టార్ అంటే ధృవాలపైన స్థిర నక్షవూతాలు. ‘నోవా’ అంటే హఠాత్తుగా మెరిసి మాయమయ్యే తాత్కాలిక నక్షవూతాలు. మరి విశ్వం స్థితిని గుర్తించండి ?
1) శూన్య ప్రదేశాలు
2) ఒకదాని ఆకర్షణ శక్తికి మరొకటి లోబడి అంతమవడం
3) నిరంతర విస్తరణ
4) 97 శాతం శూన్యం, నక్షవూతాలు
6. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లే సూర్యుడు+ గ్రహాలు కలిసి ఒక డిస్క్లాగా తనచుట్టూ తాను తిరుగుతూ మరొక కేంద్రకం చుట్టూ సౌరకుటుంబం పరివూభమిస్తోంది. పరివూభమణ వేగం 19.3 కి.మీ./సెకండ్. భూమికి ఒక సంవత్సరం ఉన్నట్లు సూర్యుడు కేంద్రకం చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం ఉంటుంది. దాన్ని ‘కాస్మిక్ సంవత్సరం’ అంటారు. మన సంవత్సరాలతో పోల్చితే కాస్మిక్ సంవత్సరాన్ని అంచనా వేయండి ?
1) 300 సం.లు 2) 250 మి. సం.లు
3) 600 సం.లు 4) 900 మి. సం.లు
7. కాంతివేగం వాతావరణంలో తక్కువగా ఉంటుంది. శూన్యం లో ఎక్కువగా ఉంటుంది. శూన్యంలో దానివేగం మూడు లక్షల కి.మీ./ సెకుండ్కు (3 X105) సూర్యుని కాంతి భూమిని సుమారు 8 నిమిషాల్లో చేరుతుంది. కాంతి ఒక సంవత్సరం పాటు ప్రయాణించడాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ సొసైటీ అంతరిక్షం లో ఖగోళ వస్తువుల మధ్యదూరాన్ని కొలవడానికి 1888లో ఈ కాంతి సంవత్సరాన్ని ఒక కొలబద్ధగా ఆమోదించింది. అయితే కాంతి సంవత్సరపు దూరాన్ని అంచనా వేయండి ?
1) 99.5 మి. కి.మీ. 2) 284.5 మి. కి.మీ.
3) 9.5 మి. కి.మీ. 4) 19.5 బి. కి.మీ.
8. ఆర్యభట్ట గుప్తుల కాలంలో ప్రతిపాదించిన సౌరకుటుంబం సిద్ధాంతం ఏది?
1) భూకేంవూదక 2) సూర్యకేంవూదక
3) చంద్ర కేంద్రక 4) అపకేంవూదక, అభికేంవూదక
9. పోలెండ్‌కు చెందిన నికోలస్ కోపర్నికస్ విశ్వం సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నాడు. జర్మనీకి చెందిన జోహన్నెస్ కెప్లర్ విశ్వం, సౌరకుటుంబం ఒకటికాదని, గ్రహాల కక్షలు, కదలికలు కూడా నిర్ధారించాడు. టెలిస్కోప్ సాయంతో కెప్లర్ సిద్ధాంతాన్ని గెలీలియో నిరూపించాడు. కొత్త గ్రహాలను కూడా కనుగొన్నాడు. ఈ విషయాలను న్యూటన్ గ్రంథస్తం చేశాడు. అయితే న్యూటన్ గ్రహాల మధ్య, అంతరిక్షంలో ఆకర్షణ, వికర్షణ బలాల గురించి రాసిన గ్రంథం పేరు?
1) లాస్ ఆఫ్ ఫిజిక్స్ 2) ది గ్రావి
3) ప్రిన్సిపియా 4) యాక్షన్ అండ్ రియాక్షన్
10. గెలాక్సీల కేంద్రస్థానమైన బ్లాక్‌హోల్స్‌పై విస్తక్షుత పరిశో ధ నలు చేసింది ఎవరు?
1) బోఢ్ 2) ఎడ్విన్ హబుల్
3) హెర్చల్ 4) స్టీఫెన్ హాకింగ్
11. ఆండ్రోమెడా గెలాక్సీని ఎక్కడి నుంచి చూడగలం?
1) ఉత్తర ధ్రువం 2) భూమధ్యరేఖ
3) దక్షిణ ధ్రువం 4) ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్
12. బిగ్‌బ్యాంగ్‌ను నిరూపించేందుకు యురోపియన్ యూని యన్ స్పేస్లాబ్ సెర్న్ (Cern)లో లిటిల్బ్యాంగ్ ప్రయోగా లు జరుగుతున్నాయి. ఇది స్విట్జర్లాండ్‌లో ఉంది. బిగ్‌బ్యాంగ్ సృష్టికర్త ఎవరు ?
1) అలెన్ శాండేజ్
2) థామస్ గోల్డ్‌మన్, హెర్మన్ బోండి
3) ఎడ్విన్ హబుల్ 4) అబ్బె, జార్జిలామిటైర్
13. మనం పెట్టుకొన్న రోజుల పేర్లు గ్రహాల ఆధారంగా పెట్టుకు న్నవే. సన్డే /ఆదివారం, బుధవారం-గురువారం శుక్ర వారం, శనివారం మొదలైనవి. కిందివాటిలో సరి కానిది?
1) ఆది-భానువారం 2) మంగళ-భౌమవారం
3) బుధ-సౌమ్యవారం 4) సోమ-స్థిరవారం
14. మన సౌరవ్యవస్థ ఇటునుంచి అటు, పైనుంచి కిందికి ఎటు కొలిచినా మొత్తం దూరం ఎన్ని కాంతి సంవత్సరాలు ?
1) <5 2) <10 3) <4 4) <1
15. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్‌తో నక్షవూతాల్లో కాంతి పుడుతుంది. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. రెండోది ఫ్రాక్సిమా సెంచూరి. ఒక్కో నక్షత్ర వ్యాసం 200 కోట్ల చ.కి.మీ., భూమి-సూర్యునికి మధ్యదూరం 150 మి.కి.మీ. కానీ నక్షవూతాలు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంచూరి. ప్రకాశవంతమైన నక్షత్రం డాగ్స్టార్ సిరియస్ ‘ఏ’. దీన్ని ఉత్తరార్థగోళంలో సీతాకాలపు నెలల్లో, దక్షిణార్థగోళంలో డిసెంబర్ 31న మాత్రమే చూడొచ్చు. మన కంటితో సుమారు ఎన్ని నక్షవూతాలు చూడగలం?
1) 5,776 2) 7,556 3) 6,775 4) 5,667
16. నక్షవూతాల సంఖ్య సుమారు 400 లక్షల కోట్లు. వాటి వయస్సు సుమారు 10 లక్షల కోట్ల ఏండ్లు. టెలిస్కోప్ సహాయంతో 50 కోట్ల నక్షవూతాల వరకు లెక్కించవచ్చు. దీనికోసం ప్రపంచంలో ఏర్పడ్డ మొదటి నక్షవూతశాల ఎక్కడ ఉంది ?
1) జంతర్‌మంతర్ 2) గ్రీనిచ్
3) పారిస్ 4) వాషింగ్టన్ డీసీ
17. షుమేకర్ లెవి అనేది ఒక ?
1) ఆస్టరాయిడ్ 2) గ్రహశకలం
3) ఉల్క 4) తోకచుక్క
18. నిమ్న గ్రహాలు అంటే?
1) భూకక్ష్య లోపలివి 2) చిన్న గ్రహాలు
3) పొట్టి గ్రహాలు 4) మరుగుజ్జు గ్రహాలు
19. నవక్షిగహాల జాబితా నుంచి తొలగించిన అనంతరం ఫ్లూటో ను 134340 సంఖ్యతో వ్యవహరిస్తున్నారు తగినంత గురుత్వాకర్షణ లేకపోవడం, కక్షామార్గం భిన్నంగా ఉండ టం, తన క్షక్షలోకి వచ్చిన ఖగోళ వస్తువుల ను తొలగించు కొనే శక్తి లేకపోవడం మొదలైన కారణాలతో ఫ్లూటో గ్రహస్థాయిని తొలగించారు. దీనికున్న ఉపక్షిగహం పేరు?
1) ట్రిటాన్ 2) ప్రోటస్ 3) చరోన్ 4) నెయిర్డ్
20. భూమికి అతి దగ్గరి గ్రహం శుక్రుడు, పోలికలున్న గ్రహం అంగారకుడు. జంట గ్రహాలు భూమి, చంద్రుడు. కవల గ్రహాలు భూమి, శుక్రుడు. అయితే శుక్రక్షిగహానికి సంబంధించి సరికానిది?
1) అత్యధిక ఉష్ణోక్షిగత 2) ఉపక్షిగహాలు లేవు
3) అన్ని గ్రహాలకు వ్యతిరేక దిశలో భ్రమణం
4) భ్రమణకాలం పరివూభమణకాలం కంటే తక్కువ
21. శుక్రుడిని ఉదయతార, సంధ్యాతార అని పిలుస్తారు. యురే నస్ను గ్రీన్ ప్లానెట్, నెప్టూన్ – గ్రీన్స్టార్, అంగారకుడు- రెడ్ ప్లానెట్, బుధుడు- పోలో, బృహస్పతికి లార్డ్ ఆఫ్ హెవెన్స్, నక్షవూతక్షిగహం అనే పేర్లు ఉన్నాయి. గ్రహాలకు సంబంధించి సరికానిది ఏది ?
1) గ్రహాల వేగం-దూరం వ్యతిరేక దిశల్లో కొనసాగుతాయి
2) సూర్యునికి దగ్గరవుతన్నకొద్దీ భ్రమణ కాలం,
గ్రహాల భ్రమణ వేగం రెండూ పెరుగుతాయి
3) సూర్యునికి దగ్గరవుతున్నకొద్దీ గ్రహాల పరివూభమణ
కాలం, పరివూభమణ వేగం తగ్గుతున్నది
4) వేగం-ఉష్ణోక్షిగతలు సవ్యదిశలో కొనసాగుతున్నాయి
22. నవక్షిగహాల కూటమి ఎప్పుడు సంభవించింది?
1) 1980 2) 1982 3) 1996 4) 2003
23. పశ్చిమాన సూర్యోదయం ఎక్కడ ఉంది ?
1) చంద్రుని మీద 2) శుక్రుడు+యురేనస్
3) గ్రావిటీ కాపాడుకోవడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, భూమి భ్రమణానికి వ్యతిరేక దిశలో తిరగాలి కాబట్టి అందులో ఉండే వ్యోమగాములు పశ్చిమాన సూర్యోదయాన్ని చూస్తారు.
4) అరోరా బోరాలియస్/నార్వే
24. గ్రహ సంవత్సరాన్ని బుధునిపై 88 రోజుల్లో చూడవచ్చు , శుక్రుడు 223 రోజులు, అంగారకుడు 687 రోజులు, గురుక్షిగహంపై 12 సం., శనిపై 30 సం., యురేనస్ 84 సం., నెప్టూన్పై 165 సం. సమానం. అంటే అంగారక గ్రహం వరకు రోజుల్లో ఉన్నది గురుక్షిగహం నుంచి సంవత్స రాల్లో పడుతుంది. అలాగే తనచుట్టూ తాను పరివూభమించే కాలం దీనికి వ్యతిరేకంగా, ముందు గ్రహాలు రోజులు ఆ తర్వాతి గ్రహాలుకు గంటలు చాలు. భ్రమణానికి తక్కువ సమయం తీసుకొనే గ్రహం ?
1) బుధుడు 2) నెఫ్టూన్ 3) గురు 4) యురేనస్
25. బుధుడు అధికంగా వేడిని గ్రహించి, అధికంగా వదిలేస్తుంది కాబట్టి ఉష్ణోక్షిగతా వ్యత్యాసం అధికం. శుక్రుడు-కఠిన శిలలు ఉండటంతో కాంతి వచ్చినట్లు పరావర్తనం చెందడంవల్ల అత్యంత ప్రకాశవంతమైనది. అంగారకుడుధువాల వద్ద మంచునుబట్టి మనిషి ఉండవచ్చని అంచనా. దీనిపై ఎవస్ట్కన్నా మూడు రెట్లు అధిక ఎత్తయిన పర్వతాలు, కొలరాడో కన్నా మరింత లోతైన అగాథాలు ఉన్నాయి. అతి బరువైనది గురుక్షిగహం. విషపూరిత వాయువులు, అధిక సంఖ్యలో ఉపక్షిగహాలు దీని ప్రత్యేకత. గోల్డెన్, క్రూయల్ ప్లానెట్ శనిక్షిగహం. అతి తక్కువ సాంద్రత , కంకణాల వంటి వలయాలు, వీటిని నియంవూతించేవి ‘షెప్ఫర్ట్ మూన్స్’. ఇక యురేనస్‌పై ఉపరితలం అంటూ లేదు. సుదీర్ఘ పగళ్లు, సుదీర్ఘ రాత్రులు- భూమి కుడివైపునకు వంగి తిరిగితే ఇది ఎడమవైపునకు వంగి ఉంటుంది. అయితే వలయాలు లేని గ్రహం?
1) యురేనస్ 2) నెప్టూన్
3) గురుక్షిగహం 4) శనిక్షిగహం
26. సూర్యుడు మండుతున్న అగ్నిగోళం, పసుపు పచ్చ నక్షత్రం, అన్ని గ్రహాల మాస్ కన్నా 740 రెట్లు అధికం, భూమికన్నా 109 రెట్లు పెద్దది. పాలపుంత కేంద్రకం నుంచి 32 వేల కాంతి సం.ల దూరంలో ఉంది. భూమికి, సూర్యునికి మధ్య దూరంలో 150 మి.కి.మీ. భ్రమణకాలం 33 రోజులు. పరివూభమణం 250 మి. సం.లు. సూర్యుని చుట్టూ మూడు వలయాలు ఉన్నాయి. లోపలిది కాంతి మండలం, మధ్యలో వర్ణావరణం, పూర్తిగా బయట కరోనా. మొదటి దానికి, రెండో దానికి మధ్య ష్రాన్హోవర్ రేఖలున్నాయి. అయితే సూర్యుని కేంద్రకం నుంచి పైకి బయటికి వస్తుంటే జరిగే మార్పులను గుర్తించండి.
1) వాయువుల సాంద్రత, ఉష్ణోవూగత పెరుగుతుంది
2) సాంద్రత తగ్గుతూ, ఉష్ణోక్షిగత పెరుగుతుంది
3) సాంద్రత పెరిగి, ఉష్ణోక్షిగత తగ్గుతుంది
4) రెండూ తగ్గుతాయి
27. లోపలి కిరణాలు వసుపు, మధ్యలో ఎరుపు మరి కరోనాలో కాంతి రంగు ?
1) నారింజ 2) నలుపు 3) తెలుపు 4) ఉదారంగు
28. ఉదయం – సాయంత్రం కన్పించేది
1) కరోనా 2) వర్ణావరణం
3) కాంతి మండలం 4) ష్రాన్ హోవర్ రేఖలు
29. రాకెట్ సూర్యునిపైకి వెళ్తున్నప్పుడు మనం ఉష్ణోక్షిగతను ఎలా అనుభవిస్తాం?
1) పెరగడం 2) తగ్గడం
3) పెరిగి- తగ్గుట 4) పెరిగి-తగ్గి-మళ్లీ పెరగడం
30. చంద్రుని ఆర్బిట్ దూరం 25లక్షల కి.మీ. భూమి ఆర్బిట్ పరివూభమణ దూరం 965 మి. కి.మీ. సూర్యుని ఆర్బిట్ 20 లక్షల బి. కి.మీ. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. అయితే చంద్రుని కాంతి భూమిని తాకడానికి ఎంత సమయం పడుతుంది? (నిమిషాల్లో)
1) 2.3 2) 1.3 3) 8.2 4) 4.1
31. భూమి వయస్సు 460 కోట్ల సం., విస్తీర్ణం 52 కోట్ల చ.కి.మీ., భూభాగం 29 శాతం, జలభాగం 71శాతం. భూమధ్య రేఖ వద్ద చుట్టు కొలత 39,960 కి.మీ. సూర్యుని నుంచి సగటు దూరం 149.5 మి.కి.మీ. అపహేళి (సూర్యునికి దూరపు బిందువు) 152 మి.కి.మీ. పరిహేళి (సూర్యునికి దగ్గరి బిందువు) 147మి.కి.మీ. భ్రమణ కాలం 23 గంటల 50 నిమిషాల 4.09 సెకన్లు, పరివూభమణ కాలం 365 రోజుల 6 గంటల 10 సెకన్లు. అయితే ప్రస్తుతం మనం ఉంటున్న భూమి, పదార్థానికి ఉండే మూడు స్థితులకు లోనైంది. వాటిని వరుసగా గుర్తించండి.
1) ఘన- ద్రవ- వాయు 2) వాయు- ద్రవ- ఘన 3) వాయు- ఘన దవ 4) ద్రవ- ఘన- వాయు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?