Malnutrition in children | పిల్లల్లో పోషకాహార లోపం-రుగ్మతలు
-పిల్లల్లో పోషకాహార లోపం 3 రకాలుగా ఉంటుంది. అవి: 1. కేలరీ పోషకాహార లోపం 2. ప్రొటీన్ పోషకాహార లోపం 3. ప్రొటీన్-కేలరీ పోషకాహార లోపం.
-కేలరీ పోషకాహార లోపం: కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లోపించిన ఆహారం తీసుకోవడం ద్వారా కలుగుతుంది.
-ప్రొటీన్ పోషకాహార లోపం: ప్రొటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం ద్వారా కలుగుతుంది.
-ప్రొటీన్-కేలరీ పోషకాహార లోపం: ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లోపించిన ఆహారం తీసుకోవడం ద్వారా కలుగుతుంది.
పోషకాహార లోపంవల్ల పిల్లల్లో వచ్చే వ్యాధులు క్వాషియోర్కర్
-దీన్నే నిర్లక్ష్యం చేయబడిన శిశువు అంటారు.
-ప్రొటీన్ల లోపంవల్ల ఈ వ్యాధి వస్తుంది.
-పిల్లలకు తల్లిపాలు సరిగా అందక ఈ వ్యాధి వస్తుంది.
-ఈ రుగ్మత కలిగిన పిల్లలు తరచూ అతిసార వ్యాధితో బాధపడుతారు.
-పెరుగుదల మందగిస్తుంది. కండరాల అభివృద్ధి సక్రమంగా ఉండదు.
-కణాల మధ్య ఖాళీల్లో నీరు చేరడంవల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి.
మెరాస్మస్
-ఈ వ్యాధి ప్రొటీన్లు+కేలరీల లోపంవల్ల వస్తుంది.
-ఈ వ్యాధిగల పిల్లలు తమ వయస్సులో ఉండాల్సిన బరువులో 60 శాతం మాత్రమే ఉంటారు.
-ఉదరం ఉబ్బినట్లుగా ఉండి ముందుకు వస్తుంది.
-చర్మం కింద కొవ్వు ఉండదు. పొడిగా, వేలాడుతూ ఉంటుంది.
-కాళ్లు, చేతులు సన్నగా శుష్కించి ఉంటాయి. పక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
-రోగ నిరోధక వ్యవస్థ క్షీణించి ఉంటుంది.
స్థూలకాయత్వం (ఒబేసిటీ)
-అతిగా తినడం ద్వారా కొవ్వు అధికమై ఈ వ్యాధి వస్తుంది.
-శరీరం మొత్తం బరువులో 20 శాతానికంటే ఎక్కువగా కొవ్వులు ఉంటే దాన్ని స్థూలకాయంగా పరిగణిస్తారు.
-ఈ వ్యాధి జన్యు లోపాలవల్ల కలుగుతుంది.
-ఇది క్రమంగా మధుమేహానికి దారితీస్తుంది. హృదయం, రక్తనాళాలు, మూత్రపిండం, పిత్తాశయానికి సంబంధించిన వ్యాధులు కలుగుతాయి.
-వీరు పీచు పదార్థాలుగల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఉండటం ద్వారా క్రమంగా ఎడిపోస్ కణాల్లోని కొవ్వు తగ్గి సన్నబడుతారు.
గమనిక:
-దేశంలో పోషకలేమితో వచ్చే వ్యాధుల గురించి పరిశోధించే సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-NIN. ఇది హైదరాబాద్లో ఉంది.
-ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం పోషకాహార లోపంతో బాధపడుతున్న భారతీయుల సంఖ్య 245 మిలియన్లు.
విటమిన్ల లోపంవల్ల వచ్చే వ్యాధులు విటమిన్ లోపం – కలిగే వ్యాధులు
-విటమిన్ A – కెరటోమాలాసియా, జెరోప్థాల్మియా, నిక్టలోపియా (రేచీకటి), బైటాల్ చుక్కలు.
-విటమిన్ D – రికెట్స్, రికెటింగ్ రోజరీ, సోరియాసిస్, ఎముకల్లో డీ కాల్సిఫికేషన్.
-విటమిన్ E – పురుషుల్లో వంద్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, డిస్మోనోరియా.
-విటమిన్ K – గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టకపోవడం (హిమరేజ్).
B కాంప్లెక్స్
-B1 (థయమిన్) – బెరి-బెరి, పాలీన్యూరైటిస్.
-B2 (రెబోఫ్లేవిన్) – ఖీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైసిస్.
-B3 (నియాసిన్) – పెల్లాగ్రా
-B5 (పాంటోథెనిక్ ఆమ్లం) – రుమటాయిడ్ ఆర్థరైటిస్, బర్నింగ్ ఫీట్.
-B6 (పెరిడాక్సిన్) – అనీమియా.
-B7 (బయోటిన్) – రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం.
-B11(ఫోలిక్ ఆమ్లం) – రక్తహీనత,
మానసిక వ్యాధులు.
-B12 (సయనోకోబాలమైన్) – మాక్రోసైటిక్ అనీమి యా, పెర్నిసియాస్ అనీమియా.
-విటమిన్ C – స్కర్వీ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?