Indian river system formed | భారతదేశ నదీజల వ్యవస్థ ఏ భౌతిక అంశాల ప్రకారం రూపొందింది?
టెట్ ప్రత్యేకం –భూగోళ శాస్త్రం
-భూమి గోళాకారంలో గుడ్రంగా ఉండదు. ఉత్తర, దక్షిణ ధృవాలు దగ్గర కొంత క్కుకున్నట్టు, భూ మధ్య రేఖ ఉబ్బినట్టు ఉంటుంది.
-దక్షిణ ధృవంలో విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండటం వల్ల అంటార్కిటికా అంటారు.
-భూ భ్రమణం పడమర నుంచి తూర్పునకు ఉంటుంది.
-భూమికి ఉత్తరాన ఉత్తర ధృవం, దక్షిణాన దక్షిణ ధృవాలను కలిపే రేఖని ’అక్షం’ అంటారు.
-భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీసే ఊహా రేఖలను ’అక్షాంశాలు’ అంటారు.
-అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ, ఇవి ధృవాల వైపు అంతకంతకూ తగ్గుతూ ఉంటాయి.
-ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ గీసే ఊహా రేఖలను ’రేఖాంశాలు’ అంటారు. ఇవన్నీ ఒకే పొడవుతో ఉంటాయి.
-రేఖాంశాల్లో ’గ్రీన్విచ్’ రేఖాంశాన్ని 0o జీరో డిగ్రీస్‌గా, దీనికి పూర్తి వ్యతిరేక దిశలో ఉన్న 180o తూర్పు, పశ్చిమ రేఖాంశాన్ని’అంతర్జాతీయ దినరేఖ’ అంటారు.
-ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అని ఏడు ఖండాలు ఉన్నాయి.
-విశాలమైన జల భాగాలను ’మహాసముద్రాలు’ అంటారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అర్కిటిక్ మహాసముద్రం. వీటిలో పెద్దది పసిఫిక్
మహాసముద్రం.
-భూస్వరూపాలు మూడు రకాలు అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. వీటినే ’నైసర్గిక లక్షణాలు’ అంటారు.
-పర్వతాల్లో ఆరావళి పర్వతాలు అతి ప్రాచీనమైనవి. హిమాలయాలు అతి ఎత్తైనవి.
-పీఠభూములు స్వల్ప అసమాన ఎత్తు, పల్లాలతో ఉంటాయి. అతిపెద్ద పీఠభూమి ’దక్కన్ పీఠభూమి’.
దేశంలో అతి విశాలమైన మైదానం – గంగా సింధూ మైదానం.
-సింధూ, దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి.
-గంగా నది, దాని ఉపనదులు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ మీదుగా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచాయి.
-మన రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో, తూర్పునకు వాలి ఉంది. రాష్ట్రానికి పశ్చిమాన కనుమలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులకు పుట్టినిల్లు.
-గోదావరి నది మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో బాసర సమీపంలోని కందుకుర్తి దగ్గర ప్రవేశిస్తుంది.
-నదులు సముద్రంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా ఏర్పడి, వాటి మధ్య మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడటాన్ని డెల్టాలు అంటారు. ఇవి త్రిభుజాకారంగా నదులు తెచ్చే ఒండ్రు మట్టిని కలిగి ఉంటాయి.
-కృష్ణానదిపై 1853లో విజయవాడలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్మించారు.
-నల్లరేగడి మట్టి జిగురుగా ఉండి ఆరిపోతున్నప్పుడు భూమిపై పగుళ్లు ఏర్పడి, ఆ పగుళ్లలో మట్టి రాలుతుంది. దీన్ని ’సెల్ఫ్ ప్లవింగ్’ (self ploughing) అంటారు.
-కోస్తా తీర మైదానంలో జూన్, జూలై మాసాల్లో నాటే పంటను ’సాల్వ’ పంట అంటారు.
-డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాలం పంటను ’దాల్వ’ పంట అంటారు.
-రాష్ట్రం కరువు బారిన పడకుండా పాలకులు ముందుచూపుతో తెలంగాణ అంతటాగొలుసుకట్టు చెరువులు నిర్మించారు.
-పీఠభూమి ప్రాంతాల్లో నీటి నిల్వకు, నీటిని ఇంకించడానికి ’కాంటూరు కట్టలు’నిర్మిస్తారు.
-భూములను మెట్ట, తడి రకాలుగా పేర్కొంటారు. మెట్ట భూముల్లో వర్షాధార పంటలు పండిస్తారు, తడి భూముల్లో సాగునీటితో వరి పంటను పండిస్తారు.
-తెలంగాణలో ఎక్కువ భాగం విస్తరించిన కొండలు పశ్చిమ కనుమల్లోనివి.
-తూర్పు కనుమలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తూర్పు సరిహద్దులో ఉన్నాయి.
-సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ జాతులు గిరిజన తెగవారు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
-’కోయ’ అంటే కొండల్లో ఉంటున్న మనిషి అని అర్థ్ధం.
-తెలంగాణలో ప్రఖ్యాత జలపాతం ’బొగత’ ప్రస్తుతం చీకుపల్లి దగ్గర ములుగు జిల్లాలో ఉంది.
-కొండ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తారు. దీన్ని ’ఝూమ్’ సాగు అని కూడా అంటారు.
-పెనగోలు గిరిజనులు ఎల్ల సంపదం (భూమి పూజ), కొడతల పండుగ (పెద్ద పండుగ), భీముని పండుగ (ఇప్పపువ్వు పండుగ) జరుపుకొంటారు.
1. 0o అక్షాంశాన్ని ఏమంటారు? (సి)
ఎ) కర్కట రేఖ బి) మకర రేఖ
సి) భూమధ్య రేఖ
డి) 66 1/2o ఉత్తర రేఖ
2. భూగోళం ఆకృతికి సంబంధించి సరికానిది గుర్తించండి (ఎ)
ఎ) భూమి కచ్చితమైన గోళాకారంలో ఉంటుంది.
బి) భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్టు ఉంటుంది.
సి) ఉత్తర, దక్షిణ ధృవాల దగ్గర
క్కుకున్నట్టు ఉంటుంది
డి) 0o భూమధ్య రేఖ అతిపెద్ద వృత్తం.
3. సముద్ర మార్గ అన్వేషకుడు కొలంబస్
ఏ దేశానికి చెందిన వాడు ? (బి)
ఎ) పోర్చుగల్ బి) ఇటలీ
సి) ఇంగ్లండ్ డి) టర్కీ
4. ఖండాలకు సంబంధించి కింది అంశాలను (సరైనవి) పరిగణించండి (బి)
1) ఆసియా అతిపెద్ద ఖండం
2) అంటార్కిటికా ఖండం మానవ జీవనానికి అనువైనది
3) రష్యా రెండు ఖండాల్లో విస్తరించింది 4) ఆస్ట్రేలియా చిన్న ఖండం
ఎ) 1, 2 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) 3, 4
5. భూమికి సంబంధించి కింది అంశాలను జతపరచండి. (బి)
అర్ధ గోళం ఖండం
ఎ. ఉత్తరార్ధ గోళం 1) ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా
బి. దక్షిణార్ధ గోళం 2) దక్షిణాఫ్రికా, ఉత్తరాఫ్రికా
సి. తూర్పు అర్ధగోళం 3) ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా
డి. పశ్చిమార్ధ గోళం 4) ఆస్ట్రేలియా, అంటార్కిటికా
5) ఆఫ్రికా, యూరప్
ఎ) ఎ-3,2, బి-1,3, సి-4,4, డి-2 బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-1, బి-2, సి-3, డి-4 డి) ఎ-2, బి-4, సి-3, డి-1
6. గ్లోబుకు సంబంధించి కింది అంశాలను (సరైనవి) పరిగణించండి. (బి)
ఎ. భూమికి కచ్చితమైన నమూనా కాదు
బి. మహా సముద్రాలు, ఖండాలు చూపిస్తుంది
సి. భూభ్రమణాన్ని చూపిస్తుంది
డి. అక్షాంశాలు, రేఖాంశాలు చూపుతుంది
ఎ) ఎ, బి బి) బి, సి, డి
సి) సి, డి డి) ఎ, సి, డి
7. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? (సి)
1) ఉత్తరార్ధ గోళం 2) దక్షిణార్ధ గోళం
3) తూర్పు అర్ధ గోళం 4) పశ్చిమార్ధ గోళం
ఎ) 1, 2 బి) 1, 3, 4 సి) 1, 3 డి) 3
8. అక్షాంశాలు, రేఖాంశాలు, ధృవాలపై అవగాహన ఉన్న భారతీయ శాస్త్రవేత్త? (ఎ)
ఎ) ఆర్యభట్ట బి) వరాహమిహిరుడు
సి) చారకుడు డి) కౌటిల్యుడు
9. కొండల వరుసలు, అవి విస్తరించిన జిల్లాతో జతపరచండి (బి)
కొండల వరుసలు జిల్లా
ఎ) సాత్మల్ కొండలు 1) పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి
బి) బాలు ఘాట్ శ్రేణులు 2) నిజామాబాద్, వరంగల్
సి) అనంతగిరి కొండలు 3) వికారాబాద్
డి) కందికల్ కొండలు 4) మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్
5) ఆదిలాబాద్, నిర్మల్
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-5 బి) ఎ-5, బి-4, సి-3, డి-1
సి) ఎ-5, బి-4, సి-1, డి-2 డి) ఎ-2, బి-3, సి-4, డి-1
10. భారతదేశానికి అతిపెద్ద పీఠభూమి ఏది? (డి)
ఎ) చోటా నాగ్‌పూర్ పీఠభూమి
బి) మాళ్వా పీఠభూమి
సి) తెలంగాణ పీఠభూమి డి) దక్కన్ పీఠభూమి
11. మైదానాలకు సంబంధించి కింది వాటిని (సరైనవి) పరిగణించండి (బి)
ఎ. సున్నితమైన వాలుతో సమతల విశాల ప్రాంతాలే మైదానాలు
బి. సింధూ, దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి
సి. గంగానది ఉతరాఖండ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల నుంచి ప్రవహించి గంగా మైదానాన్ని ఏర్పరిచింది
డి. గంగా సింధూ మైదానం నదులు మేట వేసిన ఒండ్రుతో ఏర్పడింది
ఎ) ఎ,సి,డి బి) ఎ,బి,డి
సి) ఎ,బి,సి డి) ఎ,సి
12. కృష్ణా, గోదావరి నదుల జన్మస్థలం (బి)
ఎ) తూర్పు కనుమలు
బి) పశ్చిమ కనుమలు
సి) వింధ్య పర్వతాలు
డి) ఆరావళి పర్వతాలు
13. బొగత జలపాతం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? (ఎ)
ఎ) ములుగు బి) జయశంకర్ భూపాలపల్లి
సి) భద్రాద్రి కొత్తగూడెం డి) ఖమ్మం
14. పోడు వ్యవసాయానికి సంబంధించి కింది వాటిని (సరైనవి) పరిగణించండి. (బి)
ఎ. ఝూమ్ సాగు అని కూడా పిలుస్తారు
బి. అడవిని నరికి కాలుస్తారు
సి. నాగలితో దున్ని పారతో చదును చేస్తారు
డి. సాగు భూమి తరచుగా మారుతుంది
ఎ) ఎ,బి బి) ఎ,బి,డి
సి) సి డి) సి,బి,డి
భారతదేశ నదులు – నీటి వనరులు
– భారతదేశ నదీజల వ్యవస్థ ఈ భౌతిక అంశాల ప్రకారం రూపొందింది.
1. హిమాలయాలు
2. ద్వీపకల్ప పీఠభూములు
3. గంగా సింధూ మైదానం
-భారతదేశ నదీ వ్యవస్థను పుట్టుక ఆధారంగా హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులుగా పేర్కొన్నారు.
సింధూ నది టిబెట్‌లోని కైలాస పర్వతాల్లో మానస సరోవరం దగ్గర జన్మించింది.
-సింధూ నదికి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు ప్రధాన ఉపనదులు.
-భగీరథి, అలకనంద నదుల కలయికతో గంగానది ఏర్పడింది.
-హిమాలయాల్లో గంగోత్రి హిమానీ నదం దగ్గర భగీరథి జన్మించింది. అలకనంద బదరీనాథ్ సమీపంలో సతప్ నాథ్ దగ్గర జన్మించింది.
-బ్రహ్మపుత్ర నది టిబెట్‌లో కైలాస పర్వతాల్లో మానస సరోవరం దగ్గర చెమయుంగ్ డంగ్ హిమానీ నదం నుంచి పుడుతుంది.
-ద్వీపకల్ప నదుల్లో గోదావరి నది జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకం.
బంగాళాఖాతంలో కలిసే ప్రధాన ద్వీపకల్ప నదుల్లో మహానది, గోదావరి, కృష్ణా, కావేరి ముఖ్యమైనవి.
-కృష్ణానది తంగడి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది.
-కృష్ణా నది జన్మస్థలం మహారాష్ట్రలో పశ్చిమ కనుమలోని మహాబలేశ్వర్.
-కృష్ణా నదికి ఉపనదులు భీమ, దిండి, మూసి, పాలేరు, మున్నేరు, కొయన, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర ముఖ్యమైనవి.
-కృష్ణా నది 1290 కిలోమీటర్లు ప్రవహించి హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.
గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహించి అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.
1. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? (సి)
ఎ) కృష్ణా బి) మహానది
సి) గోదావరి డి) కావేరి
2. జీవనది కానిది ఏది? (బి)
ఎ) బ్రహ్మపుత్ర బి) గోదావరి
సి) సింధు డి) గంగా
3. గంగా నదికి సంబంధించి కింది విషయాలను (సరైనవి) పరిగణించండి (సి)
1) దేవప్రయాగ వద్ద గంగ నదిగా మారుతుంది
2) గండక్ యమున, గోమతి ఉపనదులు
3) ఇది ఒక ద్వీపకల్ప నది
4) ఇది పర్వతాల నుండి హరిద్వార్ వద్ద
మైదానంలోకి ప్రవహిస్తుంది.
ఎ) 1, 2, 3 బి) 3, 4
సి) 1, 2, 4 డి) 2, 3, 4
4. సింధూ నది, దాని ఉప నదులు భారతదేశంలో కింది ఏ రాష్ట్రం నుంచి ప్రవహించవు ? (ఎ)
ఎ) రాజస్థాన్ బి) జమ్ముకశ్మీర్
సి) హిమాచల్ ప్రదేశ్ డి) పంజాబ్
5. బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో ఏమని పిలుస్తారు? (బి)
ఎ) చెమయుంగ్ డంగ్ బి) సాంగ్ పో సి) సియాంగ్ డి) ది హంగ్
6. ద్వీపకల్ప నదుల్లో పశ్చిమంగా ప్రవహించి
అరేబియా మహాసముద్రంలో కలిసేవి? (డి)
ఎ) కృష్ణా, గోదావరి
బి) దామోదర, మహానది
సి) గండక్, గోమతి డి) నర్మద, తపతి
7. ద్వీప కల్ప నదుల్లో పెద్దది? (సి)
ఎ) మహానది బి) నర్మద
సి) గోదావరి డి) కావేరి
8. నదుల జన్మస్థలానికి సంబంధించి సరికానిది గుర్తించండి (సి)
ఎ) సింధూ నది – మానస సరోవరం బి) గంగా నది-దేవ ప్రయాగ
సి) భాగీరథి – మానస సరోవరం డి) గోదావరి- త్రయంబకం
1. అన్నామలై కొండల ప్రాంతాల్లో 1200 మీటర్లకంటే అధిక ఎత్తులో పెరిగే సమశీతోష్ణ మండల అరణ్యాలను ఏమంటారు?
షోలా అరణ్యాలు.
2.ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ అడవుల స్థితిగతుల గురించి తెలిపే రిపోర్ట్ ను మొదటిసారి
ఎప్పుడు ప్రకటించారు?
1987
3. వన్యమృగ సంరక్షణకు భారత ప్రభుత్వం ‘ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సంస్థను’
ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
1952
డాక్టర్. రాచర్ల గణపతి
పాఠ్యపుస్తకాల రచయిత & విషయ నిపుణులు
హన్మకొండ
9963221590
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?