2. ఐఎన్ఎస్ విక్రాంత్
-దీన్ని కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో తయారు చేశారు.
-స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇది యుద్ధ విమానాలను మోసుకెళ్లే యుద్ధనౌక. విక్రాంత్‌ను 2015 మే10న విధుల నుంచి తొలిగించారు.
3. ఐఎన్ఎస్ విరాట్
-1986లో బ్రిటిష్ రాయల్ నేవి నుంచి కొనుగోలు చేశారు.
-యుద్ధ విమానాలను మోసుకెళ్లగల ప్రపంచంలోనే అతిపురాతన నౌక.
-2016 అక్టోబర్ 23న విధుల నుంచి తొలిగించారు.
-దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ యుద్ధనౌకను విశాఖపట్టణంలో పురావస్తు ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
-భారత నావికాదళంలో అధికకాలం సేవలందించిన యుద్ధ విమాన వాహక నౌక.
4. ఐఎన్ఎస్ విశాఖపట్టణం
-ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణులను అమర్చడానికి ఉపయోగిస్తారు.
-దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ తయారు చేసింది.
-2015 ఏప్రిల్ 20న మజ్గావ్ డాక్ లిమిటెడ్ వద్ద ప్రారంభిచారు.
-శత్రుదేశ నౌకలను నాశనం చేయగల దేశంలోనే అతిపెద్ద యుద్ధనౌక.
ఐఎన్ఎస్ మార్ముగావ్
-ప్రపంచంలోనే అత్యాధునిక, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక. ఐఎన్ఎస్ మార్ముగావ్ను 2016 సెప్టెంబరు 17న ముంబైలో నావికాదళం ప్రారంభించింది. దీన్ని విశాఖపట్టణంలో ప్రాజెక్ట్-15బీలో భాగంగా అభివృద్ధి చేశారు.
ఐఎన్ఎస్ చెన్నై
-ఇది కోల్‌కతా తరగతికి చెందిన క్షిపణి విధ్వంసక యుద్ధనౌక. దీనిని అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ముంబైలో ప్రారంభించారు.
-స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ నౌకపై సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, బరాక్-8, దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించారు.
-కోల్‌కతా తరగతికి చెందిన ఇతర యుద్ధ నౌకలు: ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ కొచ్చి
-కోల్‌కతా తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకల ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ – ప్రాజెక్ట్ 15ఏ
-ఐఎన్ఎస్ తరంగిణి ప్రపంచాన్ని చుట్టి వచ్చింది.
-ఐఎన్ఎస్ అశ్విని నావికాదళంలో వైద్య సేవలు అందిస్తుంది.
-2015 డిసెంబర్ 23న విధుల నుంచి తొలిగించిన దేశంలోని తొలి స్వదేశీ యుద్ధ నౌక- ఐఎన్ఎస్ గోదావరి.
-2016 జూన్ 29న శత్రుదేశాల జలాంతర్గాములను విధ్వంసం చేసే వరుణాస్త్ర యుద్ధనౌక నౌకాదళంలో చేరింది. ఇది గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది.
-2016 జూలై 12న ఐఎన్ఎస్ కర్ణను భారత నౌకాదళాధిపతి సునీల్ లాంబ విశాఖ తీరంలోని భీమునిపట్నం నేవల్ బేస్‌లో జాతికి అంకితమిచ్చారు.