Committees of Parliament | పార్లమెంట్ కమిటీలు
పార్లమెంట్ ముందుకు వచ్చిన అన్ని విషయాలను ప్రభావాత్మకంగా చర్చించలేదు. శాసనాల్లో అంతర్లీనంగా ఉన్న అంశాలను వివరంగా పరిశీలించటానికి, చర్చించటానికి తగిన సమయం, అందుకు అసవరమైన పరిజ్ఞానం ఉండదు. ఈ క్రమంలో పార్లమెంట్ విధులను సమర్థవంతంగా నిర్వహించటంలో సహాయ పడటానికి అనేక కమిటీలను నియమించారు. రాజ్యాంగంలో ఈ కమిటీల గురించి ప్రస్తావించారు. కానీ వాటి నిర్మాణం, పదవీకాలం, విధులు ఇతర నిబంధనలను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఈ విషయాలను ఉభయసభల నియమనిబంధనల్లో పొందుపర్చారు.
పార్లమెంట్ కమిటీ అంటే
1.పార్లమెంట్ ద్వారా నియామకమయ్యే/ ఎన్నుకొనే లేదా సభాపతి/అధ్యక్షుడు ఏర్పాటు చేసేది.
2.సభాపతి/అధ్యక్షుడి మార్గదర్శకత్వంలో పనిచేసేది.
3.నివేదికను సభకు లేదా సభాపతి/అధ్యక్షుడికి సమర్పించేది.
4.లోక్‌సభ/రాజ్యసభ సభ్యులతో సచివాలయంలో ఏర్పాటు చేసిన కమిటీ.
– సంప్రదింపుల కమిటీలు కూడా పార్లమెంట్ సభ్యులతో ఏర్పాటవుతాయి. కానీ, అవి పార్లమెంటరీ కమిటీలు కావు. ఎందుకంటే పైన పేర్కొన్న విధులను నిర్వర్తించవు.
పార్లమెంటరీ కమిటీలు రెండు రకాలు
-1. స్థాయీ సంఘాలు 2. తాత్కాలిక కమిటీలు
-స్థాయీ సంఘాలు శాశ్వతమైనవి. ప్రతి సంవత్సరం లేదా నియమిత కాలానికి ఏర్పాటై నిరంతరం పనిచేసేవి.
-తాత్కాలిక సంఘాలు వాటికి అప్పగించిన పని పూర్తయిన తర్వాత రద్దవుతాయి. కాబట్టి వాటిని తాత్కాలిక సంఘాలు అంటారు.
స్థాయీ సంఘాలు
-స్థాయీ సంఘాల విధులను అనుసరించి, వాటిని ఆరు రకాలుగా వర్గీకరించవచ్చు.
తాత్కాలిక సంఘాలు: ఇవి రెండు రకాలు.
1. దర్యాప్తు సంఘాలు
-వీటిని ఒక ప్రత్యేక విషయమై సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభాపతి నియమిస్తారు.
ఎ. రాష్ట్రపతి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో కొందరు సభ్యుల నడవడికపై సంఘం
బి. పంచవర్ష ప్రణాళికా ముసాయిదాపై సంఘం
సి. స్థానిక ప్రాంతాల అభివృద్ధి పథకంపై పార్లమెంటరీ సభ్యుల సంఘం (ఎంపీఎల్ఏడీఎస్)
2. సలహా సంఘం సెలెక్ట్ లేదా బిల్లులపై సంయుక్త సంఘాలు
-ఏదైనా ఒక నివేదిక లేదా ప్రత్యేకమైన బిల్లుల పరిశోధన కోసం ఈ సంఘాలను నియమిస్తారు.
-సలహా సంఘాలకు, తాత్కాలిక సంఘాలకు మధ్య తేడా ఉంది. ఇవి పేరులో ఉన్నట్లు నియమనిబంధనల ప్రక్రియలు, మార్గదర్శకాలు సభాపతి ఆదేశాల ప్రకారం ఉంటాయి.
-సభ ముందుకు ఒక బిల్లు చర్చకు వచ్చినప్పుడు సభ దాన్ని సెలెక్ట్ కమిటీకి లేదా ఉభయసభల సంయుక్త కమిటీల పరిశీలనకు సిఫారసు చేయవచ్చు. ఈ బిల్లు సభలో పరిశీలనకు వచ్చినప్పడు ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఒకవేళ ఆ బిల్లును సంయుక్త కమిటీకి సిఫారసు చేయాలని తీర్మానాన్ని చేస్తే ఆ నిర్ణయాన్ని ఇంకొక సభకు తెలియజేసి ఆ కమిటీ సభ్యుల పేర్లను సూచించాలన్న విన్నపాన్ని కూడా పంపిస్తారు.
-ఈ సంయుక్త కమిటీ ఈ బిల్లులోని ఒక్కో క్లాజ్‌ను ఉభయసభల మాదిరిగా పరిశీలించి లోతుగా అధ్యయనం చేస్తాయి. సభ్యులు ఒక్కో క్లాజ్‌కు సవరణలు చేయాలని తీర్మానాలు ప్రతిపాదించరాదు. అంతేకాకుండా ఈ బిల్లుపై ఆసక్తి కనబర్చిన సంస్థలు, ప్రజా సంఘాలు లేదా నిపుణుల సలహాలను, అభిప్రాయాలను ఈ సంఘం సేకరించవచ్చు. ఆ తర్వాత ఈ సంఘం బిల్లుపై ఒక నివేదికను సభకు సమర్పిస్తుంది. నివేదికలో అత్యధిక భాగాన్ని వ్యతిరేకించే సభ్యులు అనుబంధాలను చేర్చమని కోరవచ్చు లేదా నివేదికపై తమ అసమ్మతిని తెలియజేయవచ్చు.
విత్త కమిటీలు ప్రభుత్వ ఖాతాల సంఘం
-భారత ప్రభుత్వ చట్టం-1919 నిబంధనల మేరకు ఈ సంఘం 1921లో ఏర్పాటైంది. అప్పటి నుంచి నేటికీ ఈ సంఘం కొనసాగుతున్నది. ప్రస్తుతం ఈ సంఘంలో 22 మంది సభ్యులు (లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7) ఉన్నారు. ఈ సంఘం సభ్యులు పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులతో ప్రతి సంవత్సరం నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతి ప్రకారం ఎన్నికవుతారు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల అన్ని రాజకీయ పక్షాలకు సమాన అవకాశాలు వస్తాయి. సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం. ఈ సంఘానికి మంత్రులు సభ్యులుగా ఎన్నికవుతారు. ఈ సభ్యుల్లో ఒకరిని స్పీకర్ ప్రభుత్వ ఖాతాల సంఘానికి అధ్యక్షుడిగా నియమిస్తారు. 1966-67 వరకు ఈ సంఘంలో అధికారపక్షానికి చెందిన సభ్యున్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత నుంచి ప్రతిపక్షానికి చెందిన సభ్యున్ని అధ్యక్షుడిగా ఎన్నుకొనే సంప్రదాయం ప్రారంభమైంది. భారత కంప్ట్రోరల్ అండ్ ఆడిటర్ జనరల్ వార్షిక ఆడిట్ నివేదికలు రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్‌కు సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించడం ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రధాన విధి. సీ అండ్ ఏజీ మూడు ఆడిట్ నివేదికలను అంటే పార్లమెంట్ మంజూరు చేసిన ధనాన్ని ప్రభుత్వం అదే ప్రయోజనం కోసం వెచ్చించాలి. లేదా అదే విషయాలను వాటికి సంబంధించిన ఖాతాలను నిధుల వినియోగంపై ఆడిట్ నివేదిక, ప్రభుత్వ ఉపక్రమాలపై ఆడిట్ నివేదికలు సమర్పిస్తారు.
-ప్రభుత్వ వ్యయం న్యాయబద్ధంగా జరిగిందా లేదా సాంకేతిక అక్రమాలు ఏవైనా జరిగాయా అని పరిశీలించి అవసరమైన వ్యయం దుబారా, నష్టాలు జరిగాయా మొదలైన విషయాలను కూడా ఈ సంఘం పరిశీలిస్తుంది.
విధులు
1.కేంద్రప్రభుత్వం లోక్‌సభ ముందు ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన ఖాతాలను, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఖాతాలను ఈ సంఘం పరిశీలిస్తుంది. పార్లమెంట్ అప్రాప్రియేషన్ చట్టం ప్రకారం ఆమోదించిన మొత్తాన్ని, ఖర్చు చేసిన మొత్తం నిధులను తులనాత్మకంగా పరిశీలిస్తుంది. ఆర్థిక ఖాతాలు అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం చెల్లింపులు.
2.ప్రభుత్వ ఖాతాలు, వాటిపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదిక విషయంలో ప్రభుత్వం ఖాతాల సంఘం తనకు తానే కింది విషయాల్లో తృప్తిపడాలి.
-లెక్కల్లో చూపిన ధనం న్యాయరీత్యా ఆయా పనులకు ఖర్చు పెట్టిందా? లేదా?
-ధనాన్ని వ్యయం చేసిన వారికి ఆ అధికారం ఉందా? లేదా?
-ప్రభుత్వం చేసిన వ్యయం నియమ నిబంధనల ప్రకారం ఉందా? లేదా?
3.ప్రభుత్వ కార్పొరేషన్లలో వాణిజ్య, మార్కెటింగ్ సంస్థల ఖాతాలు, వాటిపై కాగ్ నివేదికలను పరిశీలించడం.
4.స్వయం ప్రతిపత్తి లేదా అర్స-స్వతంత్ర సంస్థల ఖాతాలను వాటిపై కాగ్ సమర్పించిన లోపాలను వెలికి తీయడం
5.స్టోర్లు స్టాక్‌ల ఖాతాలకు సంబంధించిన విషయాలను కాగ్ పరిశీలించడం.
6.ప్రభుత్వం చేసిన వ్యయాలలో ఏదైనా తేడాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం.
-పై విధుల నిర్వహణలో ఈ సంఘానికి కాగ్ సలహాదారుడిగా, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తుంది.
పరిమితులు
-ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించలేదు.
-ఎప్పుడో జరిగిపోయిన విషయాలను మాత్రమే పరిశీలిస్తుంది.
-ప్రభుత్వ ఖాతాల దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.
-ప్రభుత్వ ఖాతాల సంఘం ఇచ్చే సూచనలు ప్రభుత్వశాఖలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఈ సంఘం కేవలం సలహాలను మాత్రమే ఇస్తుంది.
-ప్రభుత్వశాఖల ఖర్చులకు అయిష్టతను తెలిపే అధికారం ఈ సంఘానికి లేదు.
-ఈ సంఘం కార్యనిర్వాహక యంత్రాంగ భాగం కాదు. ఈ సంఘానికి ఆజ్ఞలు ఇచ్చే అధికారం లేదు. కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఈ సంఘం నిర్ణయాలపై అంతిమ నిర్ణయం తీసుకొనే అధికారం ఉంది.
ప్రభుత్వ అంచనాల సంఘం
-స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ సిఫారసులకు అనుగుణంగా 1950లో ఈ సంఘం ఏర్పాటైంది. మొదట 25 మంది సభ్యులు ఉండేవారు. 1956లో 30కు పెంచారు. సభ్యులందరూ లోక్‌సభకు చెందినవారై ఉంటారు. వీరి పదవీకాలం ఏడాది. సభ్యులు ఒక ఓటు బదిలీ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికకావడంతో అన్ని రాజకీయపక్షాలకు ఈ సంఘంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. సభ్యులుగా మంత్రులు ఉండకూడదు. సభ్యుల్లో ఒకరిని స్థాయీ సంఘం అధ్యక్షుడిగా లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు. ఇతను తప్పనిసరిగా అధికార పార్టీకి చెందినవాడై ఉంటాడు.
-ఈ సంఘం ప్రధాన విధి బడ్జెట్ అంచనాలను పరిశీలించటం, వ్యయంలో పొదుపును పాటించటానికి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయటం. దీంతో ఈ సంఘాన్ని నిరంతర ఆర్థిక సంఘంగా పరిగణిస్తారు. ఇతరు విధులు..
1.అంచనాల్లో పొందుపర్చిన విధానాన్ని అనుసరించి పొదుపు చర్యలు, సంస్థల అభివృద్ధికి సమర్థ పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడం.
2.పాలనలో పొదుపును ప్రవేశపెట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం.
3.అంచనాల్లో పొందుపర్చిన విధానాల హద్దుల్లో ఖర్చు జరిగింది లేనిది పరిశీలించడం.
4.పార్లమెంట్లో ఏ రూపంలో అంచనాలు ప్రవేశపెట్టాలో సూచించడం.
-ఈ సంఘం ప్రభుత్వరంగ సంస్థల విషయాల్లో జోక్యం చేసుకోదు. ఈ సంఘం ఆర్థిక సంవత్సరం మొత్తం కాలానుగుణంగా అంచనాలను తయారు చేసి వాటిని సభ పరిశీలనార్థం పంపిస్తుంది.
పరిమితులు
-పార్లమెంట్లో ఓటు వేసిన తర్వాత మాత్రమే బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తుంది.
-పార్లమెంట్ రూపొందించిన విధానాన్ని ప్రశ్నించటానికి అధికారం లేదు.
-ప్రభుత్వ శాఖలకు ఇచ్చే సూచనలు సలహాపూర్వకమైనవి మాత్రమే. ప్రభుత్వ శాఖలు వాటిని పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
-అన్ని శాఖల అంచనాలను వంతులవారీగా పరిశీలిస్తుంది. దీంతో కొన్ని మంత్రిత్వశాఖలపై ఏండ్లతరబడి మళ్లీ ఆ శాఖను పరిశీలించదు. అందువల్ల ఆ శాఖ నిర్లక్ష్యంగా తయారయ్యే ప్రమాదం ఉంది.
-కాగ్ సలహాలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఈ సంఘం నిపుణుల సహాయం లేకుండా పనిచేస్తుంది.
-ఈ సంఘం పని శవపరీక్షలా ఉంటుంది.
1. విత్త కమిటీలు
-ప్రభుత్వ ఖాతాల సంఘం
-అంచనాల సంఘం
-ప్రభుత్వ ఉపక్రియల సంఘం
2. శాఖీయ స్థాయిలో సంఘాలు (24)
3. విచారణ సంఘాలు
-అర్జీలు/విజ్ఞప్తుల సంఘం
-హక్కులు/గౌరవాల సంఘం
-నైతిక విలువల సంఘం
4. పరిశీలన, నియంత్రణ కోసం ఏర్పాటు చేసే సంఘాలు
-ప్రభుత్వ హామీల సంఘం
-సభా కార్యకలాపాల సలహా సంఘం
-పార్లమెంట్ ముందు ఉంచిన విషయాలను పరిశీలించే సంఘం
-షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమ సంఘం
-మహిళాసాధికారత సంఘం
-లాభసాటి పదవుల సంయుక్త సంఘం
5. ఉభయసభల దైనందిన వ్యవహారాల సంఘాలు
-సభా వ్యవహారాల సంఘం
-ప్రైవేటు సభ్యుల బిల్లుల, ప్రతిపాదనల సంఘం
-నియమనిబంధల సంఘం
-సమావేశాలకు గైర్హాజరు సంఘం
6. అనుషంగిక సంఘాలు లేదా సర్వీసు సంఘాలు
-సాధారణ ప్రయోజనాల సంఘం
-సభా సంఘం
-గ్రంథాలయ సంఘం
-సభ్యుల జీతభత్యాలపై సంఘం
-ప్రభుత్వ ఖాతాల సంఘం
-అంచనాల సంఘం
-ప్రభుత్వ ఉపక్రియల సంఘం
2. శాఖీయ స్థాయిలో సంఘాలు (24)
3. విచారణ సంఘాలు
-అర్జీలు/విజ్ఞప్తుల సంఘం
-హక్కులు/గౌరవాల సంఘం
-నైతిక విలువల సంఘం
4. పరిశీలన, నియంత్రణ కోసం ఏర్పాటు చేసే సంఘాలు
-ప్రభుత్వ హామీల సంఘం
-సభా కార్యకలాపాల సలహా సంఘం
-పార్లమెంట్ ముందు ఉంచిన విషయాలను పరిశీలించే సంఘం
-షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమ సంఘం
-మహిళాసాధికారత సంఘం
-లాభసాటి పదవుల సంయుక్త సంఘం
5. ఉభయసభల దైనందిన వ్యవహారాల సంఘాలు
-సభా వ్యవహారాల సంఘం
-ప్రైవేటు సభ్యుల బిల్లుల, ప్రతిపాదనల సంఘం
-నియమనిబంధల సంఘం
-సమావేశాలకు గైర్హాజరు సంఘం
6. అనుషంగిక సంఘాలు లేదా సర్వీసు సంఘాలు
-సాధారణ ప్రయోజనాల సంఘం
-సభా సంఘం
-గ్రంథాలయ సంఘం
-సభ్యుల జీతభత్యాలపై సంఘం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?