Indian Atomic Energy | భారతదేశ అణుశక్తి కార్యక్రమం..
1945-డా. హోమి జహంగీర్ బాబా (అణుశక్తి పితామహుడు-హెచ్ జె బాబా) ఆధ్యర్వంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఎఫ్‌ఐఆర్, ముంబై)లో ఏర్పాటు చేశారు.
-1948- బాబా అధ్యక్షతన భారత అణుశక్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు.
-1954- అణుశక్తి రంగం కోసం ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని భారత ప్రభుత్వం నెలకొల్పింది.
-1956- భారతదేశ తొలి అణు రియాక్టర్ అయిన అప్సరను ప్రారంభించారు.
-1962- తొలి భారజల కర్మాగారాన్ని పంజాబ్‌లోని నంగల్ వద్ద ఏర్పాటుచేశారు.
-1967-ముంబై సమీపంలోని ట్రాంబే వద్ద భారతదేశ ప్రధాన అణు పరిశోధనా కేంద్రమైన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)ను ఏర్పాటు చేశారు. బాబా మరణాంతరం (1966)లో ఆయన జ్ఞాపకార్థం బార్క్ను ప్రారంభించారు.
-1967-యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను జార్ఖండ్‌లోని జాదుగూడ వద్ద ఏర్పాటుచేశారు.
-1968- అణు ఇంధన శుద్ది కేంద్రమైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు.
-1969- మొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని మహారాష్ట్రలోని తారాపూర్‌లో నెలకొల్పారు.
అణుశక్తి రంగ వ్యూహం
-మనదేశ అణు కార్యక్రమం ప్రధానంగా శాంతియుతంగా ప్రయోజనాలకే పరిమితమైంది. కానీ సాంకేతికంగా భారత అణుశక్తి రంగం మూడు దశలుగా విభజితమైంది.
-మొదటి దశ: సహజ యురేనియం ఇంధనంగా ఉపయోగించే న్యూక్లియర్ రియాక్టర్లను అభివృద్ధి చేశారు.
-రెండో దశ: ప్లుటోనియం ఇంధనంగా వాడే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను ఉపయోగిస్తున్నారు.
-మూడో దశ: థోరియం ఆధారిత రియాక్టర్లను అభివృద్ధి చేస్తున్నారు.
భారతదేశ అణు పరీక్షలు
-మనదేశం అణు కార్యక్రమాన్ని శాంతియుత ప్రయోజనాలకే వాడుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచం దృష్ట్యా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దీటుగా రెండుసార్లు అణు పరీక్షలను భూగర్భంలో జరిపింది. దీంతో మనదేశం కూడా అణు ఆయుధాలు కలిగిన దేశాల సరసన నిలిచింది.
మొదటి అణు పరీక్ష
-తొలిసారిగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మనదేశం 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో ఒక అణుపరీక్షను నిర్వహించింది.
-దీనికి డాక్టర్ రాజా రామన్న సారథ్యం వహించగా కోడ్ భాషలో బుద్ధుడు నవ్వాడు (BUDDHA SMILED) పేరుతో నిర్వహించాడు.
రెండో అణు పరీక్ష
-వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం సారథ్యంలో 1998 మే 11న ఆపరేషన్ శక్తి మూడు పరీక్షలు, మే 13న రెండు పరీక్షలను మనదేశం నిర్వహించింది. దీంతో ఇప్పటివరకు మనదేశం రెండుసార్లుగా 6 అణు పరీక్షలను నిర్వహించింది. రెండో పరీక్షకు కోడ్ బుద్ధుడు మళ్లీ నవ్వాడు. దీంతో ప్రపంచంలో హైడ్రోజన్ బాంబ్ తయారుచేసే సామర్థ్యం గల దేశాల్లో మొదటిది అమెరికా, రెండోది రష్యా, మూడోదిగా ఇండియా గుర్తింపు పొందింది.
దేశంలో అణుపరిశోధన కేంద్రాలు
-బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్): దీన్ని 1967లో ముంబై సమీపంలోని ట్రాంబే వద్ద నెలకొల్పారు. ఇది భారత తొలి అణుపరిశోధన కేంద్రం. ఇక్కడ ప్రయోగించిన తొలి అణు పరిశోధక రియాక్టర్లు అప్సర, సైరస్, ధృవ, జర్లీన, పూర్ణిమ ఉన్నాయి.
-ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్: దీన్ని 1971లో తమిళనాడులోని కల్పకం వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడే భారతదేశం తొలి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను రూపొందించారు.
-రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ: దీన్ని ఇండోర్‌లో ఏర్పాటు చేశారు.
-వేరియబుల్ ఎనర్జీ సైక్లోన్ సెంటర్: అణు పరిశోధనల కోసం కోల్‌కతాలో ఏర్పాటు చేశారు
అణువిద్యుత్ కేంద్రాలు-రాష్ర్టాలు
అణువిద్యుత్ కేంద్రం రాష్ట్రం స్థాపన
తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం మహారాష్ట్ర 1969
రావత్‌భట్టా అణువిద్యుత్ కేంద్రం రాజస్థాన్ 1972
కల్పకం అణువిద్యుత్ కేంద్రం తమిళనాడు 1984
నరోరా అణువిద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్ 1989
కాక్రపారా అణువిద్యుత్ కేంద్రం గుజరాత్ 1992
కైగా అణువిద్యుత్ కేంద్రం కర్ణాటక 2000
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA):
-దీన్ని 1957లో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 146 సభ్య దేశాలు ఉన్నాయి. అణ్వస్త్ర వ్యాప్తిని అరికట్టడం, అణు ఒప్పందాలను పర్యవేక్షించడం దీని ముఖ్య విధి. ఇందులో భారత్‌కు సభ్యత్వం ఉంది.
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG)
-దీన్ని 1974లో ఏర్పాటు చేశారు. అణు ఇంధనాలను సరఫరా చేసే 45 దేశాలు కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు.
ముఖ్యమైన అణు ఒప్పందాలు
న్యూక్లియర్ నాన్ ప్రొలిఫిరేషన్ ట్రియటి (NPT)
-అణ్వాయుధాల నియంత్రణే ప్రధాన ఉద్దేశంతో 1968లో ఈ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం 146 దేశాలు ఈ ఒప్పదంపై సంతకం చేయగా భారత్ సంతకం చేయలేదు.
కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రియటీ (CTBT):
-అణు పరీక్షలు జరపకుండా నిరోధించడం ఈ ఒప్పందం లక్ష్యం. దీనిపై 180 దేశాలు సంతకం చేయగా భారత్ సంతకం చేయలేదు.
యురేనియం అధికంగా గల దేశాలు
1. ఆస్ట్రేలియా 2. కజకిస్తాన్ 3. కెనడా
4. దక్షిణాఫ్రికా 5. నమీబియా
యురేనియం ఉత్పత్తిలో మొదటి మూడు దేశాలు
1. కెనడా 2. ఆస్ట్రేలియా 3. నైగర్
భారజల కేంద్రాలు
భారజల కేంద్రం నెలకొల్పిన రాష్ట్రం
నంగల్ పంజాబ్
(తొలి భారజల కేంద్రం)
మణుగూరు ఖమ్మం
ట్యూటికోరిన్ తమిళనాడు
థాల్ మహారాష్ట్ర
తాల్చేరు ఒడిశా
కోటా రాజస్థాన్
హజీరా, బరోడా గుజరాత్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?