If you only knew yourself | నిన్ను నువ్వు తెలుసుకుంటేనే..

రెండే రెండు విషయాలు
ఈ కొటేషన్‌ని శ్రద్ధగా గమనించండి.
People like to hire those who show persistent optimism
-ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇంటర్వ్యూల్లో విజయం సాధించడం ఎలా అన్న విషయం ఇంతకన్నా అద్భుతంగా చెప్పగల్గడం ఇక ఎవరి వల్లా కాదు. ఎల్లవేళలా పాజిటివ్ థింకింగ్‌తో స్పందించే అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూల్లో విజయం వరిస్తుంది.
-ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా, ఉద్యోగ జీవితంలో విజేతగా ఉండాలన్నా రెండు సబ్జెక్టులను జీవితాంతం లోతుగా అధ్యయనం చేస్తూ ఉండాల్సిందే..! అవి ఏంటంటే…
1. నిన్ను నువ్వు తెలుసుకోవడం.
2. నీవు పని చేసే కంపెనీని అర్థం చేసుకోవడం.
ఇందాక మనం చెప్పుకున్నట్టు నిన్ను-నువ్వు& నీ కంపెనీని నీవు ఈ రెండు అంశాల్ని 100% పాజిటివ్ థింకింగ్‌తో అర్థం చేసుకోవాలి.
నిన్ను- నువ్వు-మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయో తెలుసా..
నాకు మంచి ఉద్యోగం ఉండాలి.
చాలా మంచి జీతం, ఇతర అలవెన్సులు ఉండాలి.
మంచి ఆఫీసు వాతావరణం, ఇంటి అలవెన్సు, కారు, ఏసీ ఛాంబర్, విదేశీ ప్రయాణాలు ఉండాలి.
అనేక సెలవు రోజులు ఉండాలి.
పని తక్కువ, జీతం ఎక్కువ ఉండాలి.
పని ఒత్తిడి ఉండరాదు.
ఇది సాధారణమైన ఆలోచనా ధోరణే. ఇందులో నేరంకానీ, ఘోరం కానీ ఏంలేదు. మనకు తెలియకుండానే మన సమాధానాల్లో ఈ ఆలోచనా ధోరణి బయటపడిపోతుంది.
ఇది నాకేం కావాలి? అన్న కోణం నుంచి ఆలోచించడం వల్ల వస్తున్న ఇబ్బంది. అలా కాకుండా నేనేం చేయగలను అన్న కోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి. అదే పాజిటివ్ థింకింగ్‌తో నిన్ను నువ్వు అర్థం చేసుకోవడమంటే..
మీరెప్పుడైతే ఎదుటి వారి కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారో మీ విజయం ప్రారంభమైనట్టే..! ఇంటర్వ్యూ సమయంలో మీ ప్రతి సమాధానం ఈ కోణంలోనే ఉండాలి. అంటే నేను ఈ ఉద్యోగం ద్వారా కంపెనీకి ఎలా లాభం కలిగిస్తాను అన్న కోణంలో మీ ప్రతి జవాబు ఉండాలి. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు.
మీలో ఈ లక్షణాలున్నాయా?
Adaptability : ఎటువంటి పరిస్థితులకైనా త్వరగా సర్దుకుపోయే గుణం
Quick Learning : త్వరగా విషయాలని నేర్చుకొనగలిగే గుణం.
Eternal Optimism : ఎల్లవేళలా పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండడం.
Humanity : వినయ సంపన్నత్వం.
Resilience : అపజయం ఎదురైనా కృంగిపోక తిరిగి విజేతగా నిలబడి పోరాడే గుణం.
Team Spirit: నలుగురితో కలివిడిగా ఉంటూ అందర్నీ కలుపుకొని పోయే గుణం.
Communicative : అందరికీ అర్థమయ్యేలా మాట్లాడగలగడం.
Empathy : ఎదుటివారిని సరైన రీతిలో వారి కోణం నుంచి అర్థం చేసుకోవడం.
Zeal to Lead : నాయకత్వ లక్షణాలు ఆకళింపు చేసుకొని త్వరితగతిన నాయకుడిగా ఎదగాలనే తపన కలిగి ఉండడం.
An Eye on Profitability: మీ చర్యల ద్వారా మీ మీద ఆధారపడ్డ వారందరికీ లాభం చేకూర్చే గుణం.
A Winning Streak : ఏ పని చేపట్టినా విజేతగా నిలిచే గుణం.
మిమ్మల్ని మీరు సరికొత్త కోణంలో అధ్యయనం చేయటం ప్రారంభించండి. ఈ 11లక్షణాలు మీలో సహజంగానే ఉంటాయి. కాకపోతే లోతుగా మిమ్మల్ని మీరు విశ్లేషించి ఈ పదకొండు గుణాలూ మీలో బలంగా ఉన్నాయని తీవ్రంగా విశ్వసించండి. నమ్మకమే విజయానికి పునాది. మీలో ఈ పదకొండు లక్షణాలు ఉన్నాయని నమ్మండి.
ఇక మీ జీవితం నుంచి ఈ పదకొండు లక్షణాలూ ఉన్నాయని ధృవీకరించే ఉదాహరణలు నెమరువేసుకోండి.
అవి మీ కాలేజీ జీవితంలో కావచ్చు. వ్యక్తిగత జీవితం నుంచి కావచ్చు. పార్ట్‌టైం జాబ్ ఏదైనా చేసుంటే ఆ సందర్భం నుంచి కావచ్చు. ఇలా వివిధ సందర్భాల నుంచి మీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయండి.
వీటిని మనం వ్యక్తిగత విజయ గాథలు (Personal Success Stories) అని పిలుచుకుందాం. ఇకపై ఈ వ్యక్తిగత విజయగాథలు మీకు ఇంటర్వ్యూ సమయంలో ఎలా ఉపయోగపడతాయి, ఎందుకు ఇలా తయారుగా ఉండాలి అన్న విషయం మీకు మున్ముందు తెలుస్తుంది.
మరి వ్యక్తిగత విజయగాథలతో సిద్ధంగా ఉంటారు కదూ..!
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?