Economic development | అన్ని సమస్యలకు ఆర్థికాభివృద్ధే పరిష్కారం
ఆధునిక ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో రకమైన సమస్యలతో నిరంతరం యుద్ధం చేస్తున్నది. కానీ, దాదాపుగా అన్ని దేశాల్లో కనిపిస్తున్న మౌలికమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆకలి, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, అధిక జనాభా, కనీస వసతుల లేమి తదితర సమస్యలు పేద దేశాలతోపాటు కొన్ని ధనిక దేశాల్లో కూడా సాధారణంగా కనిపిస్తున్నాయి. అయితే, ధనిక దేశాలు సుస్థిరాభివృద్ధి కోసం కృషిచేస్తుండగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికవృద్ధి కోసం పడుతూ లేస్తూ పరుగులు పెడుతున్నా యి. అన్ని దేశాలూ తమ సమస్యలకు ఏకైక పరిష్కారం ఆర్థికాభివృద్ధేనని బలంగా విశ్వసిస్తూ ఆ దిశగా పురోగమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికవృద్ధి, అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి భావనలపై నిపుణ పాఠకులకు ప్రత్యేకం..
అభివృద్ధి నిచ్చెనలో మొదటి మెట్టు ఆర్థికాభివృద్ధి (ఎల్డీసీఎస్) చివరి మెట్టు ఆర్థికాభివృద్ధి. (ఐఏసీఎస్)
-మొదటి మెట్టు నుంచి చివరి మెట్టుకు కదలికలు, గతిశీలక పురోభివృద్ధి
ఆర్థికవృద్ధి – జాతీయ , తలసరి ఆదాయాలు
వస్తుసేవల ఉత్పత్తిలో పెరుగుదల
-అనాగరిక/ప్రాథమిక స్థాయి నుంచి, ఆర్థిక వ్యవస్థ ప్రకృతితో తనకున్న అనుబంధాన్ని విడదీసుకొని ఒక ఉన్నతస్థాయి సమతౌల్య స్థితికి చేరుకొనే ప్రయత్నం. అందులోని ప్రకంపనలు ఎదుర్కోవడాన్ని గతిశీలక పురోభివృద్ధి అంటారు.
-భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు వృద్ధిపై కన్నెస్తే అమెరికా వంటి ధనికదేశం సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెడుతది.
-ప్రస్తుత తరం సంతోషంగా ఉండటంతో పాటు భవిష్యత్తు తరాలను కాపాడుకొనే ప్రయత్నమే సుస్థిర అభివృద్ధి.
అభివృద్ధి – దశలు
-మూడు దశలు – సైమన్ కుజ్నెట్స్ మొదటి మెట్టు – వ్యవసాయం, రెండోమెట్టు – పారిశ్రామిక రంగం, మూడోమెట్టు – సేవారంగం
-ఐదు దశలు/మెట్టు – రోస్టోవ్
-సాంప్రదాయ, పవన, ప్లవన దశలు
-పరిపక్వత, సామూహిక వినియోగ దశలు
-ఆరు దశలు, కార్ల్‌మార్క్స్
-ఆదిమ, బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారి, సామ్యవాదం, కమ్యూనిజం. దశలు/మెట్లు
అభివృద్ధి వేగం – నిర్ధారకాలు
-అభివృద్ధి వేగాన్ని రెండు రకాల అంశాలు నిర్ధారిస్తాయి.
ఆర్థికాంశాలు
-ఆర్థిక వ్యవస్థ స్వరూపం – వ్యవసాయంలో మిగులు మూలధన సంచయనం-వర్తక వాణిజ్యాలు-ఎగుమతి, దిగుమతులు-విదేశీవ్యాపారం
ఆర్థికేతర అంశాలు
-సహజ వనరులు, మానవ వనరులు, ఆకాంక్ష, నైపుణ్యం, విద్యా, ఆర్యోగాలు, అవస్థాపనా, పరిశోధన, సాంకేతిక ప్రగతి, అవినీతి, సాంఘిక వ్యవస్థ, రాజకీయస్వేచ్ఛా, సుస్థిరతలు. సాంఘిక వ్యవస్థ-రాజకీయ స్వేచ్ఛా, సుస్థిరతలు. నిర్వాసితులు, పునరావాసం, సామాజిక, ప్రాంతీయ అసనమాతలు-విచక్షణలు.
-మేలు చేసే అంశాలు ఎన్ని చేసినా లెక్కలోకి రావు. కానీ కీడు చేసే చిన్న అంశమైనా సమాజాన్ని ఒక కుదుపు కుదిపేయవచ్చు.
ఉదా : నిర్భయ ఘటన
-పదేండ్లలో మనం సాధించుకున్న లింగ సాధికారత ర్యాం కు, మానవాభివృద్ధి సూచికలు అన్ని నేలమట్టమయ్యాయి.
-ఆర్థిక పరపతికి స్టాక్ మార్కెట్ సూచికలు అయినట్టు, గతిశీలక మార్పులు కూడా ఆర్థిక పురోగతికి సూచికలు
వృద్ధి – సంపద పెరుగుదల
-ఆర్థికాభివృద్ధి-వృద్ధి, మార్పులు
-గతిశీలక పురోభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సవాళ్లు
గతిశీల ఫురోభివృద్ధి, మేలు చేసే అంశాలు
-విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆదాయాలు, పొదుపు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, నగరీకరణ, అవస్థాపనా సౌకర్యాలు, జీవన ప్రమాణాలు, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు తగ్గుముఖం, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాల నిర్మూలన, విష వలయాల విచ్ఛేదన, ప్రదర్శనా ప్రభావం.
గతిశీలక అభివృద్ధి, కీడు చేసే అంశాలు
పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యాలు
-సహజ వనరులు, ప్రకృతి శక్తులపై మానవుడు ప్రణాళిక రహిత విధ్వంసాలు.
-వ్యర్థాలు, విషపూరిత వాయువులు
-నిర్వహణ సరిగా లేకపోవడం, ప్రమాదాలు
-మానవ మనుగడ, జీవావరణ మనుగడ ప్రశ్నార్థకం
వలసలు
-స్వచ్ఛందంగా, విద్య/ఉద్యోగం కోసం వలసలు, ప్రాజెక్టుల పేరుతో బలవంతపు వలసలు స్థానభ్రంశం
అవుతుంది.
-విద్యా, ఆరోగ్యం, సర్దుబాటు సమస్యలు
-సాంఘిక, సాంస్కృతిక విచ్ఛిత్తి
-అశాంతి, తిరుగుబాట్లు
భూ సేకరణ సమస్యలు
-SEZs, EPZs, అణు విద్యుత్ కేంద్రాలు
-నిరాశ్రయులు, స్థానిక హింస, వేర్పాటు
-దోరణులు-గిరిజన సమస్యలు.
-అంకితభావం చాలా అవసరం.
-ఇప్పటికి 800 మిలియన్లు
-ప్రతి ఏటా 15 మిలియన్లు- స్థానభ్రంశం/నిరాశ్రయులు
-భవిష్యత్ తరాలపై రుణాత్మకభారం
నిర్వాసితులు-పునరావాసం
-1951 నుంచి నిర్వాసితుల్లో 75 శాతం మందికి ఇప్పటికి సరైన పునరావాసం లేదు.
-ఇందులో 40 శాతం గిరిజనులు
ప్రాంతీయ అసమానతలు
-గతిశీలక పురోభివృద్ధిలో మూడు కోణాలు
-ఆర్థికాభివృద్ధి (ఈడీ), మానవాభివృద్ధి (హెచ్డీ), సామాజికాభివృద్ధి(ఎస్డీ)
-ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఉంటాయి. విడదీయరాని అవినాభావ సంబంధం.
-ఆర్థికాభివృద్ధిలో.. జీడీపీ, పీసీఐ రంగాలు, ప్రభుత్వ విధానాలు.
-మానవాభివృద్ధిలో.. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం.
-సామాజికాభివృద్ధిలో.. కులం, మతం, తెగ, జాతి, లింగం, కుటుంబ ఆచారాలు, బాల్యవివాహాలు,
బాలకార్మికుల వలస, పట్టణీకరణ.
-ఎస్డీ-ఈడీని నిర్ణయిస్తే- తిరిగి ఈడీ- హెచ్డీని నిర్ణయిస్తుంది.
-ఈడీ ఎంత సాధించినా… ఎస్డీలో హెచ్డీలో వెనుకబడకూడదు. గతిశీలక పురోభివృద్ధిని దెబ్బతిస్తాయి.
-సాపేక్షంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం లేదా రాష్ట్రం ఒకవైపు-వెనుకబడిన ప్రాంతం/ రాష్ట్రం మరొకవైపు సహజీవనం చేయడం- ప్రాంతీయ అసమానతలు
-అన్ని ప్రాంతాలు సమతూకంలో లేదా సమాన నిష్పత్తిలో ముందుకువెళ్లకపోవడం.
ప్రాంతీయ అసమానతలు-కారణాలు
-బ్రిటిష్‌వారు-వలసవాదం-భూస్వామ్య విధానాలు
-భౌగోళిక వైవిధ్యం- హరిత విప్లవం- వివక్ష- కేంద్రీకృత ప్రణాళికలు- సహజ వనరులు- అవస్థాపనా- పరిశ్రమల కేంద్రీకరణ- పథకాలు
నివారణ చర్యలు
-ప్రాథమిక వసతులు- భూగరిష్ట పరిమితి చట్టాలు
-పంటల మార్పిడి- పెద్దరైతులపై పన్నులు- ప్రణాళిక వికేంద్రీకరణ- సామాజిక భద్రత- చిన్న+ వ్యవసాయాదారిత పరిశ్రమలు- సక్రమ వనరుల పంపిణీ- సమీక్షలు
సామాజిక అసమానతలు
-గతిశీలక పురోభివృద్ధిలో అతి ముఖ్యమైన అవరోదమిది.
-వీటిని దాటుకొని వెళ్లలేకనే భారతదేశం చతికిలబడుతోంది.
కులం
-పరిమితసమూహం- నియమిత సంబంధాలు
-మొదట వృత్తులు- తర్వాత వర్ణ వ్యవస్థ. రుగ్వేదం- పురుషసూక్తం- చతుర్వర్ణాలు.
-ఆరోహణ- అవరోహన- అగ్రవర్ణాల దోపిడీ
-ఈ మధ్య అగ్రవర్ణాల అనుకరణ
మతం
-ఆధ్యాత్మిక ఆలోచనలకు సాంఘిక నిర్మితి, మతం, అలౌకిక అంశాలు- అంతుచిక్కని రహస్యాలు. అంతరార్థం దైవారాదనలోని వైవిధ్యం వల్ల మతం పుట్టింది. మతం- మతమౌఢ్యం, మతం-మానత్వం లేదా నైతిక క్రమశిక్షణ కోసం, రాజకీయాల కోసం లేదా అధికార కోసం వాడుకోవడం హింస + ఘర్షణలు- మతమౌఢ్యంలో భారతీయ చరిత్ర – మూడు దశలు : బెంగాల్ విభజన నుంచి దేశ విభజన వరకు,గాంధీజీ హత్య నుంచి- బంగ్లా ఆవిర్భావం వరకు, షాబానో మనోవర్తి నుంచి బాబ్రీ వరకు.
-కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాలు, ముంబై- పార్లమెంటుపై దాడు లు, హైజాక్ లాంటివి దేశ పురోగతికి అడ్డంకులు.
తెగలు-వివక్ష
-నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం – లిపి లేకున్నా, ఒకే భాష – గిరిపుత్రులు
-రాయ్‌బర్మన్ 1971 అంచనా- 427 తెగలు
-2011 జనాభా లెక్కలు- 573 తెగలు
-త్వరగా మార్పును ఆశించరు.
-రాజ్యాంగం – హక్కులు – వసతులు
-వలసలు- గమనశీలత తెలియక కష్టాలు
-గిరిజనేతరుల ఆగడాలు- విధ్వంసాలు
-వారి భూములు ఆక్రమణ- దాడులు
-హేళన-స్థానభ్రంశం- అధికారుల నిర్లిప్తత
-అమలు చేయకపోతే- తిరుగుబాటు
లింగ వివక్షత
-49 శాతం – 40 కోట్ల ఓటర్లు
-ఆకాశంలో సగం-అవకాశాల్లో అగాధం
-రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వివక్ష కొనసాగుతుంది.
-భారత్‌లో లింగ వివక్ష నివేదిక పరంగా చూస్తే 101/ 187(2013), 114/ 142 (2014)
-చట్ట సభల్లో చూస్తే 15వ లోక్‌సభలో 58/ 543 (11శాతం), 16వ లోక్‌సభలో 66/ 543 (13 శాతం)
స్త్రీల అంతస్తు
-వేద కాలంలో హోదా, గౌరవం రెండు లేవు.
-ఇస్లాం ప్రభావం – పరదా పద్ధతిబ్రిటిష్ వారి ప్రభావం – విద్య/ చట్టాలు
-సతి/ దేవదాసి/ బాల్య వివాహాల నిషేధం
-థాంప్సన్, రాయిటర్ సర్వే ప్రకారం మహిళలకు ఎంతమాత్రం సురక్షితంకాని దేశాలు
-ఆఫ్ఘనిస్థాన్/ కాంగో/ పాకిస్థాన్ / భారత్/ సోమాలియా
భారత్ పరిస్థితి
-ప్రతి ఏడాది 5000 కిడ్నాప్‌లు
-8000 వరకట్న చావులు
-15000 అత్యాచారాలు
-గత మూడు దశాబ్దాల్లో తల్లికడుపులోనే కడతేర్చిన ఆడబిడ్డల సంఖ్య 1 కోటి 20 లక్షలు, మాతృమరణాలు ప్రతిలక్షకు 178, ప్రతి లక్షకు 18 ఏండ్లలో పెండ్లిలు 45 శాతం, గృహహింస – 52 శాతం
ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం..
శిశు మరణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమ్మాయిలు 32/ 1000, అబ్బాయిలు 37/ 1000. ఇక భారత్‌లో 45/ 1000 బాలికలు, 43/ 1000 బాలురు.
సగటు ఆయుర్ధాయం
-ప్రపంచం -స్త్రీలు – 73 ఏండ్లు పురుషులు – 69 ఏండ్లు
-భారత్ – స్త్రీలు – 68 ఏండ్లు పురుషులు – 65 ఏండ్లు
-నిరుద్యోగిత/ వ్యవసాయంపై ఆధారం/ నిరక్షరాస్యత/ డ్రాపౌట్స్/ బాలకార్మికులు మొదలైనవి అన్నింటిలో బాలికలే టాప్.
-ప్రభుత్వం మొదటి మెట్టు నుంచి ఆఖరి మెట్టుకు అభివృద్ధి ప్రక్రియను చేపట్టాలి. అప్పుడే దేశం ఆర్థికాభివృద్ధి సాధించగలదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?