Hotel Management Enormous possibilities | ఆతిథ్యంలో… అపార అవకాశాలు
ఎన్సీహెచ్ఎం జేఈఈ -2022
అవకాశాలు పుష్కలంగా ఉండే కెరీర్లో ఆతిథ్య రంగం ఒకటి. ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్‌గా మారుతున్న నేపథ్యంలో ఆతిథ్యానికి డిమాండ్ పెరుగుతుంది. ఏటేటా ఈ రంగంలో అవకాశాల సంఖ్య పుష్కలంగా హెచ్చుతున్నది. ఆతిథ్య రంగానికి సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష ఎన్సీహెచ్ఎం-జేఈఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) ప్రకటనను ఎన్టీఏ విడుదల చేసింది.
ఈ ఎంట్రన్స్ వివరాలు సంక్షిప్తంగా….
అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్ ఉత్తీర్ణులైనవారు, ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు
‘బీఎస్సీ-హాస్పిటాలిటీ అండ్
హోటల్ అడ్మినిస్టేషన్’(బీఎస్సీ-హెచ్హెచ్ఏ)
– ఇది మూడేండ్ల కోర్సు.
NCHMCT
– జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్సీహెచ్ఎం-జేఈఈ ద్వారా.
– నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (NCHMCT) ఈ సంస్థను 1982లో ప్రారంభించారు. ఎన్సీహెచ్ఎం కేంద్ర టూరిజం శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ సంస్థ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్, శిక్షణకు సంబంధించిన అకడమిక్ అంశాలను పర్యవేక్షిస్తుంది. దీని పరిధిలో 21 కేంద్ర ప్రభుత్వ సంస్థలు- ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం)లు, 27 రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, 1 పీఎస్‌యూ, 29 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.
– ఈ సంస్థ 11 రకాల అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది. వాటిలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీడిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి.
-జాతీయస్థాయిలో నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మొత్తం 74 హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఐదు, ఏపీలో ఒకటి చొప్పున మొత్తం ఆరు ప్రభుత్వ/ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి. పలు పైవేటు సంస్థలు కూడా ఎన్సీహెచ్ఎం జేఈఈ స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
పరీక్ష విధానం
-ఎన్సీహెచ్ఎం జేఈఈ ఎంట్రన్స్‌లో మొత్తం ఐదు సెక్షన్ల నుంచి 200 ప్రశ్నలు ఇస్తారు.
– ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడుగంటలు.
– న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్, జీకే, కరెంట్ అఫైర్స్ సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున ఇస్తారు. వీటితోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 60, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి.
– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
– ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 3
కంవ్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ:
మే 28 (ఉదయం 10 నుంచి 1 గంట వరకు)
పూర్తి వివరాల కోసం
వెబ్సైట్: https://nchmjee.nta.nic.in
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?