Hold on to the language as it is spoken | మాట్లాడితేనే భాషపై పట్టు !
గ్రామర్ నేర్చుకొని ఒక భాషను నేర్చుకోగలం. కానీ ఆ భాషలో మాట్లాడాలంటే ఈ పద్ధతిలో నేర్చుకోవటం సత్ఫలితాలు ఇవ్వదు చెప్పటం ముగించి అందరివైపు సాలోచనగా చూశాడు నందు సార్. అంటే ఒక భాషలో మాట్లాడటానికి గ్రామర్ అవసరం లేదా? గ్రామర్ లేకుండానే మీరు ఇంగ్లిష్ మాట్లాడటం నేర్పిస్తారా? శ్రావణి అడిగింది. చాలామంచి ప్రశ్న. గ్రామర్ లేకుండా ఏ భాష లేదు. గ్రామర్ అవసరమే. గ్రామర్ అంటే ఏమిటి? కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు. ఉదాహరణకు రోడ్డుపై వెళ్తున్నపుడు ఎడమవైపే నడవాలి. రూల్స్ పాటించకుంటే ఏమవుతుంది? ప్రమాదాలు జరుగుతాయి. ఈ విధంగా భావాల్ని పంచుకోవడానికి పుట్టిన భాషకి కూడా కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు అవసరం. లేని పక్షాన గందరగోళం ఏర్పడుతుంది. ఈ పద్ధతులనే మనం వ్యాకరణం లేదా గ్రామర్ అనవచ్చు. కాసేపాగి తిరిగి చెప్పడం ప్రారంభించాడు. మాట్లాడే భాష ముందు పుట్టిందా, గ్రామర్ రూల్స్ ముందు పుట్టాయా? అడిగాడు. విద్యార్థులు రకరకాల సమాధానాలు చెప్పారు. క్లాస్రూంలో సంభాషణం సులభంగా అర్థమయ్యేలా ఆంగ్లంలో సాగిపోతుంది.
ఆయన అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి ఇంప్రెషన్ కొట్టెయ్యాలని శ్రావణి కూడా పోటీ పడి సమాధానాలు చెబుతున్నది. చిన్నచిన్న వాక్యాలతో ఆంగ్లంలో ఆకట్టుకునేలా చెబుతున్నది. తనలో కలుగుతున్న ఈ మార్పుని కూడా పసిగట్టలేకపోతుంది. మీరంతా చాలా ఉత్సాహంగా సమాధానాలు ఇస్తున్నారు. సంతోషమే కానీ సరైన సమాధానం కోసం నేనింకా ఎదురుచూస్తున్నాను నాటకీయంగా ప్రటించాడు. నందు సార్. నో! మీవన్నీ తప్పుడు సమాధానాలు అని చెప్పకుండా పాజిటివ్గా మాట్లాడే ధోరణే ఆయనకు అంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టిందేమో! సరే మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. అభిషేక్ బచ్చన్ శ్రీమతి పేరేమిటి? అసంబద్ధంగా అతడేసిన ఈ ప్రశ్నకు అవాక్కయ్యారు. ఐశ్వర్యారాయ్ అని చెప్పారు. చైన్నె ఎక్స్ప్రెస్ హీరోయిన్ ఎవరు? దీపికా పదుకొనె.. అని తిరిగి చెప్పారంతా. గుడ్ మీకందరికి మంచి జనరల్ నాలెడ్జ్ ఉందని తెలిసిపోతుంది. వారిద్దరి మాతృభాష ఏంటి? భాషల ప్రత్యేకత ఏంటి? ఎవరూ చెప్పలేకపోయారు.
శ్రావణి మాత్రం ఐశ్వర్యారాయ్ మాతృభాష తుళు, దీపికాది కొంకణి. ఈ రెండు భాషల ప్రత్యేకత లిపి లేకపోవడం. క్లాసంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఎస్ శ్రావణి తుళు, కొంకణి, లంబాడా భాషలతో పాటు కొన్ని భాషలకు లిపి లేదు. అంటే? ఆయా భాషలకు గ్రామర్ కూడా ఉండదు. ఇప్పుడా భాషలకు గ్రామర్ లేదనా అర్థం? గ్రామర్ ఉంది. అంతర్లీనంగా వారి సంభాషణల్లో. నిర్దిష్టమైన పద్ధతి లేకుంటే ఈ భాషలు నిలబడేవి కావు కదా! గ్రామర్ లేని భాష ఉండదు. గ్రామర్ లేకుండా ఒక భాషని నేర్చుకోవడం అసాధ్యం. కానీ మన విద్యావిధానంలో గ్రామర్ నేర్పిస్తున్న పద్ధతి కారణంగా గ్రామర్ అంటే భయం ఏర్పడటమేకాక, ఆంగ్లంలో మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి గ్రామర్ నేర్చుకొని ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకుంటాను అని ఎవరైనా అనుకుంటే సరైన పద్ధతి కాదు అని చెప్తాను.
మాట్లాడటం సాధన చేస్తూ గ్రామర్పైన కూడా పట్టు సాధించాలి. మాతృభాషను ఇలాగే నేర్చుకున్నాం. ఒక లిపి లేని భాష తుళు. ఈ భాష నేర్చుకుంటే చక్కగా ఆ భాషలో మాట్లాడవచ్చు. కానీ భాషను నేర్పించే గ్రామర్ బుక్స్ లేవు. మరెలా నేర్చుకుంటారు తుళు భాష. ఆ!.. అదేం కష్టం కాదు సర్! మాట్లాడే ప్రయత్నం చేస్తే అదే వస్తుంది సమాధానం ఇచ్చారు. ఇంగ్లిష్ నేర్చుకోవడానికి కూడా ఇదే సరైన పద్ధతి. నో పెన్, నో పేపర్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?