The method to be followed to measure state revenue | రాష్ట్ర ఆదాయాన్ని కొలవడానికి అనుసరించే పద్ధతి?
తెలంగాణ ఆర్థికవ్యవస్థ
1. బడ్జెట్లోని ఆదాయ, వ్యయాలను రెవెన్యూ, మూలధన (క్యాపిటల్) పద్దుల రూపంలో చూపిస్తారు. రెవెన్యూ పద్దు వర్తమాన సంవత్సరంలో పునరావృత (Recurring) అంశాలకు సంబంధించింది అయితే మూలధన (Capital) పద్దు దేనికి సంబంధించింది?
1) ఆధార సంవత్సరానికి 2) అధిక వ్యయానికి
3) స్థాపిత లేదా ఒకేసారి చూపించే అంశాలకు
4) వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉండటానికి
2. ఏడాది కాలానికి సంబంధించిన బడ్జెట్లో ఆదాయం, వ్యయం సమానంగా ఉంటే దాన్ని సమతౌల్య బడ్జెట్ , ఆదాయం వ్యయం కంటే అధికంగా ఉంటే మిగులు బడ్జెట్ అంటారు. మరి లోటు బడ్జెట్ అంటే?
1) వ్యయం కంటే ఆదాయం తక్కువగా ఉంటే
2) వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే
3) వ్యయం, ఆదాయం సమానంగా ఉంటే
4) వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటే
3. రాష్ట్ర ఆదాయాన్ని కొలవడానికి ఉపయోగించే పద్ధతి?
1) ఉత్పత్తి మదింపు పద్ధతి
2) ఉమ్మడి పద్ధతి
3) ఆదాయాల మదింపు పద్ధతి
4) వ్యయాల మదింపు పద్ధతి
4. నిజాం రాజుల కాలంలో తెలంగాణలో తలసరి భూమి శిస్తు ఆదాయం రూ. 3.42 కాగా, ఆంధ్రాలో రూ. 1.82గా ఉంది. 1888 నాటికి నిజాం ఆధీనంలోని తెలంగాణలో ఆదాయం బ్రిటిష్ ఆధీనంలోని ఆంధ్రకంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది?
1) 22 శాతం 2) 44 శాతం 3) 66 శాతం 4) 88 శాతం
5. 1948లో బ్రిటిష్ ఇండియాలో భాషా సూత్రం ఆధారంగా రాష్ర్టాల ఏర్పాటు పరిశీలన కోసం ఎన్కే థార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ?
1) భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు కమిటీ
2) ప్రావిన్సెస్ పునర్విభజన కమిటీ
3) లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ
4) బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ కమిటీ
6. 1945-48 మధ్య మద్రాసు ప్రావిన్స్‌లోని ఆంధ్ర జిల్లాల వార్షిక ఆదాయం రూ. 12.07 కోట్లు కాగా, తలసరి ఆదాయం రూ. 6.46, వార్షిక వ్యయం రూ. 18.58 కోట్లు ఉండగా, లోటు దాదాపు 6.52 కోట్లు. అదే కాలంలో ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో వార్షిక ఆదాయం రూ. 20.86 కోట్లు, జనాభా 1.63 కోట్లు ఉండగా, తలసరి వార్షిక ఆదాయం ఎంత?
1) రూ. 12.80 2) రూ.18.20
3) రూ. 20.80 4) రూ. 22
7. రాష్ర్టాల పునర్విభజన కమిషన్ నివేదిక ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల వార్షిక ఆదాయం రూ. 17 కోట్లు, మొత్తం జనాభా 1.13 కోట్లు. అయితే తలసరి ఆదాయం ఎంత?
1) రూ. 10.53 2) రూ. 12.80
3) రూ. 13.90 4) రూ. 15.04
8. రెవెన్యూ, మూలధన (క్యాపిటల్) పద్దుల కింద ఒక ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన మొత్తానికి, వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తానికి మధ్య ఉన్న తేడాను ఏమంటారు?
1) రెవెన్యూ మిగులు 2) బడ్జెటరీ మిగులు
3) క్యాపిటల్ మిగులు 4) రెవెన్యూ వ్యయం
9. తెలంగాణ మిగులును నిర్ధారించడానికి నియమించిన లలిత్ కుమార్ కమిటీ 1956-1968 మధ్య కాలంలో 12 ఏండ్ల కాలానికి సంబంధించిన ముఖ్య పద్దుల కింద వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1) 1969, జనవరి 2) 1969, ఫిబ్రవరి
3) 1969, మార్చి 4) 1969, ఏప్రిల్
10. లలిత్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రాంత రెవెన్యూ మిగులులో అధిక భాగాన్ని ఆంధ్ర ప్రాంత రెవెన్యూ లోటు సర్దుబాటు చేయడానికి ఉపయోగించారు. మిగులు రూ. 10.44 కోట్లు మూలధన పద్దుకు తరలించారు. అయితే మూలధన పద్దులోని ఎంత భాగం తెలంగాణ వాటాగా ఖర్చు చేయాల్సి ఉంటుంది?
1) 37.5 శాతం 2) 35.3 శాతం
3) 33.3 శాతం 4) 31.3 శాతం
11. లలిత్ కమిటీ అంచనావేసిన రెవెన్యూ పద్దులో తెలంగాణ మిగు లు నుంచి రూ.3.90 కోట్లు తీసేస్తే నికర రెవెన్యూ మిగులు ఎంత?
1) రూ. 10.4 కోట్లు 2) రూ. 44.03 కోట్లు
3) రూ. 60.30 కోట్లు 4) రూ. 60.03 కోట్లు
12. 1968లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాలవారీగా ఆదాయ వ్యయాలను చూపించడం మానివేసింది. అయితే హైదరాబాద్ రాష్ట్రం సీమాంధ్రలో విలీనమయ్యేనాటికి తెలంగాణలో మిగులు నిధులు ఎన్ని ఉన్నాయని తెలంగాణ ప్రాంతీయ కమిటీ పేర్కొంది?
1) రూ. 60.03 కోట్లు 2) రూ. 90.44 కోట్లు
3) రూ. 107.13 కోట్లు 4) రూ. 105.13 కోట్లు
13. ప్రాంతీయ అసమానతల నేపథ్యంలో 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు 20 03-04 నుంచి ప్రాంతాల వారీగా ఆదాయ, వ్యయ సమాచారాన్ని రూపొందించారు. వాటిలో 2003-04 నుంచి 2006-07 వరకు ఉన్న ఆదాయ, వ్యయాల వాటాల్లో సరైనవి గుర్తించండి (హైదరాబాద్ మినహా తెలంగాణ ఆదాయ, వ్యయాలు)?
ఎ. 2003-04 1. 49 శాతం, 49 శాతం
బి. 2004-05 2. 50 శాతం, 48 శాతం
సి. 2005-06 3. 55 శాతం, 44 శాతం
డి. 2006-07 4. 47 శాతం, 48 శాతం
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
14. తెలంగాణ మిగులును అధ్యయనం చేయడానికి జస్టిస్ వీ భార్గవ అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం 1969, ఏప్రిల్ 22న నియమించింది. కమిటీ తన నివేదికను 1970, జూలై 23న సమర్పించింది. అయితే ఆ కమిటీలో సభ్యులు ఎవరు?
ఎ. పన్నాలాల్, జగత్ నారాయణలాల్
బి. ఎంవీ మాధూర్ హరిభూషన్, టీఎస్ కృష్ణస్వామి
సి. జగత్ నారాయణలాల్, టీఎస్ కృష్ణస్వామి
డి. పన్నాలాల్, ఎంవీ మాధూర్
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) బి 4) ఎ
15. తెలంగాణ మిగులును తేల్చడానికి భార్గవ కమిటీ పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏవి?
ఎ. పెద్దమనుషుల ఒప్పందం- 1956
బి. అఖిలపక్ష ఒప్పందం- 1969
సి. తెలంగాణ ప్రాంతీయ కమిటీ
డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాలు, అభిప్రాయాలు
1) ఎ, బి 2) బి, సి, డి 3) బి, ఎ, డి 4) పైవన్నీ
16. 1961లో తెలంగాణ జనాభా 1.46 కోట్లు, ఆంధ్ర జనాభా 2.77 కోట్లు. రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే తలసరి రెవెన్యూ ఆంధ్రలో రూ. 21.63గా ఉండగా, తెలంగాణ రెవెన్యూ ఎంత?
1) రూ. 28.63 2) రూ. 29.36
3) రూ. 30.58 4) రూ. 33.48
జవాబులు
-1-3, 2-1, 3-2, 4-4, 5-3, 6-1, 7-4, 8-2, 9-3, 10-1, 11-4, 12-3, 13-1, 14-3,15-4,16-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?