Group-2, Paper-2 Social Structure | గ్రూప్-2, పేపర్-2 సామాజిక నిర్మితి
1. కింది వాటిలో భారతీయ సామాజిక నిర్మాణానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
ఎ. మేమంతా భారతీయులం అనే సామాజిక, మానసిక భావనే భారతదేశ సమాజంలో ఏకత్వానికి ప్రధాన కారణం
బి. భారతీయ సమాజంలో సంప్రదాయ ఉమ్మడి కుటుంబాల స్థానంలో ఆధార కేంద్రక కుటుంబాలు అధికంగా ఆవిర్భవిస్తున్నాయి
సి. భారతీయ సమాజంలో సంప్రదాయ ఉమ్మడి కుటుంబాల స్థానంలో స్వతంత్ర కేంద్రక కుటుంబాలు ఆవిర్భవిస్తున్నాయి
డి. భారతదేశ సమాజంలో గ్రామీణ సమాజంతో పట్టణ సమాజాన్ని పోలిస్తే పట్టణాల్లో అల్ప సామాజిక గతిశీలత, ప్రజల మధ్య అంతర వ్యక్తిగత సంబంధాలు ప్రాథమికంగా, అనియతంగా ఉన్నాయి
1) ఎ, బి 2) ఎ, సి 3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
2. భారతదేశ సమాజంలో జాజ్‌మానీ వ్యవస్థకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
ఎ. స్వయంసమృద్ధి చెందిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థగా భావించవచ్చు
బి. సేవలు అందించే వారిని కామిన్ అని పిలుస్తారు
సి. సేవలు పొందేవారిని ప్రజ అని పిలుస్తారు
డి. వివిధ గ్రామాల మధ్య గల వస్తుపరమైన వినిమయ విధానం
1) పైవన్నీ 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి
3. హిందూ సామాజిక నిర్మాణానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. తమము 1. పంచమహాయజ్ఞాల్లో ఒకటి
బి. అర్థం 2. త్రిగుణాలకు సంబంధించింది
సి. సన్యాసం 3. వర్ణాశ్రమాల్లో ఒకటి
డి. ఆతిథ్యం 4. పురుషార్థాలకు సంబంధించినది
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-1, సి-4, డి-3
4. కింది వాటిని జతపర్చండి.
ఎ. History of caste in india
1. Kannan
బి. Inter caste and inter community marriages in india 2. Ketkar
సి. Aspects of caste in india
3. Leach.E
డి. Origin and growth of caste in india
4. N.K. Dattu
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
5. కిందివాటిలో కులం వికార్యం గుర్తించండి.
ఎ. సంప్రదాయ వృత్తుల సంరక్షణ కల్పిస్తుంది
బి. క్రమశ్రేణి విభజన చేసింది
సి. సమాజంలో శ్రమ విభజనను కలిగించింది
డి. వృత్తిపరమైన సమతౌల్యాన్ని ఏర్పర్చింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) బి 4) సి
6. కులం ఆవిర్భావానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. తెగలు సమీకృతం చెంది కులాలు ఏర్పడ్డాయి
1. నెస్‌ఫీల్డ్
బి. తెగలు వృత్తి సంఘాలు, కులాలుగా ఏర్పడ్డాయి 2. అబ్బెడ్యు బెయిస్
సి. సమాజంపై ఆధిపత్యం కోసం కొంతమంది ఏర్పర్చిందే కులం 3. డెంజిల్ ఇబ్బెస్టన్
డి. వృత్తులు నిమ్న, ఉన్నత వృత్తులుగా పరిగణించబడి తద్వారా కులాలు ఏర్పడ్డాయి 4. శరత్చంద్రరాయ్
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
7. కిందివాటిలో కుటుంబ లక్షణం కానిది?
ఎ. అపరిమిత పరిమాణం బి. పరిమిత పరిమాణం సి. ప్రాథమిక సామాజిక సంస్థ
డి. నియత సమూహం
1) ఎ, డి 2) ఎ, బి, సి 3) ఎ, సి, డి 4) బి, సి, డి
8. కుటుంబానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. ఉమ్మడి కుటుంబాలు అన్య కుటుంబాలుగా మారుతున్నాయి 1. ప్రకార్యాత్మకమైన మార్పు
బి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో మార్పులు సంభవిస్తున్నాయి
2. నిర్మాణాత్మకమైన మార్పు
సి. కుటుంబం సామాజీకరణను నిర్మిస్తుంది.
3. గౌణ విధి
డి. కుటుంబం విద్యను, వినోదాన్ని అందిస్తుంది.
4. ప్రాథమిక విధి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
9. ఐపీ దేశాయ్ ప్రకారం ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబ లక్షణాన్ని గుర్తించండి?
1) ఆస్తి, అధికారం ఉమ్మడిగా ఉంటూ కేవలం నివాసం మాత్రం వేరువేరుగా ఉంటుంది
2) కేవలం ఒకే అధికారం కింద ఉండే రెండు అన్య కుటుంబాలే ప్రకార్యగణనీయ ఉమ్మడి కుటుంబంగా పేర్కొంటాం
3) రెండు తరాలు ఆస్తి, అధికారంతో పాటు ఒకే నివాసంలో ఉన్నట్లయితే ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అంటారు
4) పైవన్నీ సరైనవే
10. కింది వాటిలో వివాహం అనే సామాజిక సంస్థ సరైన పరిణామక్రమాన్ని గుర్తించండి?
1) బృందవివాహం-> స్వైరత్వం-> బహువివాహం-> ఏకవివాహం
2) స్వైరత్వం-> బహువివాహం-> బృందవివాహం-> ఏకవివాహం
3) స్వైరత్వం-> బృందవివాహం-> బహువివాహం->ఏకవివాహం
4) ఏకవివాహం-> బహువివాహం-> బృందవివాహం-> స్వైరత్వం
11. వివాహం అనే సామాజిక సంస్థకు సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. వివాహరూపం 1. భార్యభగినీ న్యాయం
బి. వివాహ నియమం 2. ఏకవివాహం
సి. వివాహ క్రతువు 3. జన్మజన్మల సంబంధం
డి. వివాహ ఆదర్శం 4. పాణిగ్రహ సంకల్పం
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-2, సి-1, డి-3
12. ఏ సంవత్సరంలో వివాహ వయస్సును సవరించి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలుగా చట్టబద్ధంగా నిర్ధారించారు?
1) 1955 2) 1978 3) 1987 4) 1986
13. బంధుత్వ స్థానంలో Z అనే ఆంగ్ల అక్షరం ఎవరిని సూచిస్తుంది?
1) Spouse 2) son-in-law
3) Sister 4) Grandfather
14. బంధుత్వ ఆచరణలకు సంబంధించి కిందివాటిని జతపర్చండి
ఎ. పరిహాస సంబంధాలు
1. గౌరవం, విధేయతలను చూపుతుంది
బి. వైదొలగు నడవడి
2. దాంపత్య సంబంధాలను పటిష్టం చేస్తుంది
సి. కుహనా ప్రసూతి
3. నూతన వధువు ఇబ్బందులను తొలగిస్తుంది
డి. మన్నన 4. సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-4
15. బంధుత్వ పరిభాషకు సంబంధించిన కింది వాటిని జతపర్చండి
ఎ. మా నాన్న 1. అన్వయపదం
బి. తల్లి 2. ప్రాథమిక పదం
సి. తాత 3. వర్గీకృతపదం
డి. నాయనమ్మ 4. వివరణాత్మకపదం
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-3, సి-1, డి-2
16. మతం పరిణామ క్రమానికి సంబంధించి కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.
ఎ. ఆత్మ ఆరాధన బి. పితృదేవతారాధన
సి. బహుదేవతారాధన డి. ఏకదేవతారాధన
1) ఎ-బి-సి-డి 2) బి-ఎ-డి-సి
3) సి-బి-ఎ-డి 4) డి-ఎ-సి-బి
17. వేద సాహిత్యానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి.
ఎ. వేదాంగం 1. శౌత
బి. తత్వ సిద్ధాంతం 2. వైశేషిత
సి. ధర్మసూత్రం 3. నిరుక్త
డి. అరణ్యకం 4. మునుల జీవన విధానం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-2, డి-3
18. కింద ఇచ్చిన మతాలు, వారి లింగనిష్పత్తిని జతపర్చండి.
ఎ. హిందువుల 1. 939
బి. మహ్మదీయులు 2. 951
సి. క్రైస్తవులు 3. 1023
డి. సిక్కులు 4. 903
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
19. గిరిజనులను బ్యాక్వర్డ్ హిందూస్ అని సంబోధించిందిఎవరు?
1) ఘర్యే 2) టక్కర్బాప
3) వెన్నెలకంటి రాఘవయ్య 4) సైమన్ కమిషన్
20. 2001 జనాభా లెక్కల నుంచి 2011 జనాభా లెక్కల వరకు గిరిజనుల్లో ఎంతశాతం అక్షరాస్యత వృద్ధి కనిపించింది?
1) 10.9 శాతం 2) 11.9 శాతం
3) 12.9 శాతం 4) 13.9 శాతం
21. గిరిజనులకు సంబంధించిన కింది వ్యాఖ్యల్లో సరైనవాటిని గుర్తించండి.
ఎ. భారతదేశంలో గిరిజన జనాభా శాతం కంటే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా శాతం అధికంగా ఉంది.
బి. జాతీయస్థాయిలో గిరిజన అక్షరాస్యత కంటే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అక్షరాస్యత అధికంగా ఉంది.
సి. భారతదేశంలో గిరిజన జనాభా శాతం కంటే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా శాతం అల్పంగా ఉంది.
డి. జాతీయస్థాయిలో గిరిజన అక్షరాస్యత కంటే తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత అల్పంగా ఉంది.
1) ఎ, బి 2) సి, డి 3) ఎ, డి 4) బి, సి
22. స్త్రీ, పురుషులకు ఆయా సమాజాలు ఆపాదించే పాత్రలను ఏమంటారు?
1) లింగం 2) ఆచారాలు
3) నియమాలు 4) సంప్రదాయాలు
23. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను పోల్చినప్పుడు మహిళల అక్షరాస్యతలో గల భేదం ఎంత?
1) 20 శాతం 2) 13 శాతం
3) 17.5 శాతం 4) 21.18 శాతం
24. Global Gender gap indexని ఎవరు రూపొందిస్తారు?
1) UNDP 2) World Bank
3) World Economic Forum
4) Un women
25. The Indian middle Class their growth in modern times గ్రంథకర్త ఎవరు?
1) స్టీవెన్సన్ 2) పవన్ కె.వర్మ
3) ఐరావతి కార్వే 4) వీవీ మిశ్రా
26. కిందివాటిలో మధ్య తరగతులు అనే భావనకు సంబంధించని అంశం?
ఎ. వారసత్వం బి. విశ్వవ్యాప్తం
సి. సాధించిన అంతస్తు
డి. సంప్రదాయ విలువలు, శాస్త్రీయ దృక్పథాల కలబోత
1) ఎ, సి 2) బి, డి 3) ఎ 4) డి
27. భారతదేశానికి సంబంధించి మధ్య తరగతులు అనే భావనను మొదటగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినవారెవరు?
1) అరవింద్‌ఘోష్ 2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) బాలగంగాధర్ తిలక్ 4) దాదాబాయి నౌరోజీ
28. దసరా ఉత్సవాలను ఆడంబరంగా జరిపే రంగలీల మైదానం తెలంగాణలోని ఏ నగరంలో ఉంది?
1) హైదరాబాద్ 2) నిజమాబాద్
3) రామగుండం 4) వరంగల్
29. దండారీ గుంపులు అనేవి ఏ నృత్యానికి సంబంధించినవి?
1) కుర్పు నృత్యం 2) థింసా నృత్యం
3) గుస్సాడీ నృత్యం 4) సాథిర్ నృత్యం
30. తెలంగాణ రాష్ట్ర చేప అయిన కొరమీను లేదా కొర్రమట్ట శాస్త్రీయ నామం?
1) చన్నా శ్రియోటా 2) హిల్సా హిల్సా
3) చన్నాడియో 4) పెరికోపోమోస్
31. అమర్త్యసేన్ ప్రకారం కిందివారిలో పూర్తిస్థాయి సామాజిక మినహాయింపునకు గురైనవారు?
1) శరణార్థులు
2) సామాజికంగా వెనుకబడినవారు
3) ఆర్థికంగా వెనుకబడినవారు
4) మూడో లింగంవారు
32. సామాజిక అసమానతల ప్రధాన రూపమే సామాజిక స్తరీకరణ అని అభిప్రాయపడిందెవరు?
1) రూసో 2) అమర్త్యసేన్
3) ఘర్యే 4) హర్లంబాస్
33. డీనోటిఫైడ్ తెగలు అంటే ఎవరు?
1) ఇంతకు పూర్వం నేర స్వభావాన్ని కలిగిఉన్నవారు
2) గిరిజన తెగల జాబితా నుంచి తొలగించబడినవారు
3) సూడో ట్రైబలిజమ్ను పాటించేవారు
4) రాష్ట్ర చట్టాల ద్వారా గిరిజన హోదాను పొందినవారు
34. ప్రాబల్య కులం అనే భావనను ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చిందెవరు?
1) ప్రొ. లక్ష్మన్న
2) ప్రొ. ఎంఎన్ శ్రీనివాస్
3) ఐరావతి కార్వే 4) ఏఆర్ దేశాయ్
35. కులతత్వాన్ని నిర్మూలించడానికి ఆర్థిక, సాంస్కృతిక సమానత్వ సాధన అవసరమని అభిప్రాయపడిందెవరు?
1) ఐరావతి కార్వే 2) సుశీల్ చంద్ర
3) ఫణిక్కర్ 4) ప్రభు
36. చాతుర్వర్ణ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల కాఠిన్యం వల్ల కులతత్వం ఏర్పడిందని అభిప్రాయపడింది?
1) ఎంఎన్ శ్రీనివాస్ 2) ఏఆర్ దేశాయ్
3) అంబేద్కర్ 4) సుశీల్‌చంద్ర
37. ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే గ్రంథ రచయిత ఎవరు?
1) బిపిన్ చంద్ర 2) టీకే ఊమెన్
3) రాయ్ అహుజా 4) దీఎస్ కొఠారి
38. టీకే ఊమెన్ అభిప్రాయంలో దేశంలో మతతత్వం ఎన్ని రూపాల్లో ఉంది?
1) 5 2) 3 3) 4 4) 6
39. కింది మత ఘర్షణలు, ఆయా సంఘటనలపై వేసిన కమిషన్లను జతపర్చండి.
ఎ. మహారాష్ట్ర మత అల్లర్లు 1. మదన్ కమిషన్
బి. అయోధ్య సంఘటన 2. లిబరహన్ కమిషన్
సి. ముంబై అల్లర్లు 3. శ్రీకృష్ణ కమిషన్
డి. గోద్రా అల్లర్లు 4. నానావతి కమిషన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-3
40. National Inegration councilని ఎప్పుడు
స్థాపించారు?
1) 1972 2) 1962 3) 1982 4) 1992
41. ప్రాంతీయ తత్వానికి సంబంధించిన కింది అంశాలను
జతపర్చండి.
ఎ. ఆజాద్ కశ్మీర్ 1. రాష్ర్టాంతర ప్రాంతీయవాదం
బి. నదీజలాల వివాదాలు
2. అంతరాష్ట్ర ప్రాంతీయవాదం
సి. రాష్ర్టాంతర్గత వలసలు
3. అంతరాష్ట్ర ప్రాంతీయవాదం
డి. ఉత్తరాది రాష్ర్టాలు, దక్షణాది రాష్ర్టాలు అనే భావనలు
4. వేర్పాటువాదం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-2
42. స్టేట్మెంట్ 1: ప్రాంతీయ వనరులు ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడక ఇతర ప్రాంతాలకు తరలినప్పుడు ప్రాంతీయ వాదాలు ఉద్భవిస్తాయి.
స్టేట్మెంట్ 2: అంతర్గత వలస పెత్తనాలను అరికట్టేవిధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు ప్రాంతీయవాదుల జోరును తగ్గించవచ్చు.
1) స్టేట్మెంట్ 1, 2 సరైనవే, కానీ రెండో వ్యాఖ్య మొదటి వ్యాఖ్యకు సరైన కొనసాగింపు కాదు
2) స్టేట్మెంట్ 1, 2 కూడా సరైనవే కానీ రెండింటికి మధ్య ఎలాంటి సంబంధం లేదు
3) స్టేట్మెంట్ 1, 2 కూడా సరైనవే, రెండో వ్యాఖ్య మొదటి వ్యాఖ్యకు కొనసాగింపుగా భావించవచ్చు
4) స్టేట్మెంట్ 1 సరైనది కాని స్టేట్మెంట్ 2 సరికాదు
43. ఈశాన్య రాష్ర్టాల్లో అశాంతికి ప్రధాన కారణం?
1) రాజధానికి దూరంగా ఉండటం
2) సీమాంతర ఉగ్రవాదం
3) జాతిపరమైన ప్రాంతీయతత్వం
4) జాతుల మధ్య సంఘర్షణ
44. ఏ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసరేటు అధికంగా ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) అసోం
3) తమిళనాడు 4) బీహార్
45. Internal complaints committeeని మహిళలకు సంబంధించిన ఏ సామాజిక శాసనంలో భాగంగా రూపొందించారు?
1) Domestic violence (protection) Act-2005
2) POCSO Act-2012
3) Sexual Harassment of women at workplace (prevention) Act-2013
4) The Indecent Representation of women Act – 1986
46. లింగనిర్ధారణ పరీక్షల నిషేధచట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1996, జనవరి 1 2) 1994, డిసెంబర్ 1
3) 1995, జనవరి 3 4) 1994, జనవరి 1
47. లైంగికదాడికి గురైనవారి విషయాలు, ఫొటోలను బహిర్గతం చేయడం నేరమని తెలుపుతున్న ఐపీసీ నిబంధన?
1) 218 (ఎ) 2) 228 (ఎ)
3) 325 (ఎ) 4) 376 (ఎ)
48. వ్యభిచారం కోసమే అక్రమరవాణా అధికంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది?
1) బీహార్ 2) ఉత్తరప్రదేశ్
3) పశ్చిమబెంగాల్ 4) తమిళనాడు
49. మనుషుల అక్రమ రవాణాను సమగ్రంగా నిర్వచించిన ఐపీసీ నిబంధన?
1) 366 2) 317 3) 370 4) 372
50. కింది వాటిలో మనుషుల అక్రమ రవాణా నివారణకు ఉద్దేశించిన పథకాన్ని గుర్తించండి?
1) ప్రజ్వల 2) సబల 3) ఉజ్వల 4) సాక్ష్యం
51. బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ. ప్రపంచంలో అధికంగా బాలకార్మికులున్న దేశం భారతదేశం
బి. అతి తక్కువ బాలకార్మికులున్న రాష్ట్రం సిక్కిం
సి. అతి ఎక్కువ బాలకార్మికులున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ డి. అతి ఎక్కువ బాలకార్మికులున్న రాష్ట్రం మహారాష్ట్ర
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, డి 4) ఎ, సి, డి
52. బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి కింది వాటిని కాలక్రమంగా అమర్చిండి.
ఎ. బాలల హక్కుల ఒడంబడిక
బి. బాలలహక్కుల తీర్మానం
సి. బాలలహక్కులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
డి. జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు
1) బి, ఎ, డి, సి 2) ఎ, బి, సి, డి
3) సి, బి, ఎ, డి 4) డి, సి, బి, ఎ
53. బాలకార్మికులు అనే పదం పరిధిని ఎప్పుడు చట్టబద్ధంగా పెంచారు?
1) 1986 2) 1988 3) 2016 4) 2006
54. ప్రస్తుతం దేశంలో వృద్ధాప్య ఆధార రేటు ఎంత ఉంది?
1) 122 2) 132 3) 142 4) 152
55. వృద్ధులపై హింస అనే అంశంపై అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
1) నవంబర్ 25 2) అక్టోబర్ 2
3) డిసెంబర్ 1 4) జూన్ 15
56. వృద్ధులు, తల్లిదండ్రులు తమ వారసులు లేదా మేజర్ అయిన తమ పిల్లల నుంచి సంరక్షణను, మనోవర్తిని పొందడానికి హక్కుగా ఎప్పటి నుంచి కలిగిఉన్నారు?
1) 1996 2) 2006 3) 1997 4) 2007
57. NOAPSని రాజ్యాంగంలోని ఏ అధికరణం ఆధారంగా
అందిస్తున్నారు?
1) 41 2) 42 3) 43 4) 44
58. దేశంలో డిసేబిలిటీకి సంబంధించి కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి?
ఎ. షెడ్యూల్డ్ కులాలలో డిసేబిలిటీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది
బి. షెడ్యూల్డ్ కులాలలో డిసేబిలిటీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది
సి. షెడ్యూల్డ్ తెగలలో డిసేబిలిటీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది
డి. షెడ్యూల్డ్ తెగలలో డిసేబిలిటీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది
1) ఎ, డి 2) ఎ, సి 3) బి, డి 4) బి, సి
59. డిసేబిలిటీకి సంబంధించిన సంస్థలను కాలక్రమంలో
గుర్తించండి?
1) UNCRPD-> UN Year of Disabled-> UNDRD-> NIOH
2) UNDRD-> NIOH-> UN Year of Disabled
3) NIOH-> UNCRPD-> UNDRD-> UN Year of Disabled
4) UN Year of Disabled-> UNDRD-> UNCRPD-> NIOH
60. ప్రత్యేక సామర్థ్యం గలవారు ఆటంకాలు లేని పర్యావరణం కలిగిఉండటం హక్కుగా ఎప్పటి నుంచి కల్పించారు?
1) 1995 2) 1994 3) 1996 4) 1997
61. కింది వాటిలో వికలాంగులకు ఆర్థిక స్వావలంభనను కలిగించడమే ఉద్దేశంగా రూపొందించిన పథకం?
1) అరునియ్ 2) గరుండ
3) సమర్థ్ 4) ఉదయం ప్రభ
62. రుణగ్రస్తత అనే తల్లికి జన్మించిన శిశువే వెట్టిచాకిరి అని
తెలిపిందెవరు?
1) శంకరన్ కమిటీ 2) ఎస్సీ కమిషన్
3) అగ్రికల్చర్ కమిషన్ 4) బీఆర్ అంబేద్కర్
63. తెలంగాణలో వెట్టిచాకిరి సమస్యపై ప్రత్యేకంగా
నిర్వహించిన మొదటి బహిరంగ సభ ఎక్కడ జరిగింది?
1) భువనగిరి 2) పరకాల
3) సూర్యాపేట 4) దేవరకొండ
64. Reducing vulnerability to Bandage in India అనే పథకం ఎవరి సహాయంతో అమలుచేస్తున్నారు?
1) UNICEF 2) UNESCO
3) ILO 4) UNHRC
65. సిడి తంతును పాటించే దోమ జాతర రాష్ట్రంలోని ఏ జిల్లాలో జరుగుతుంది?
1) మహబూబ్‌నగర్ 2) రంగారెడ్డి
3) నల్లగొండ 4) కరీంనగర్
66. జోగిని వ్యవస్థపై Devine Prositution అనే గ్రంథాన్ని రాసిందెవరు?
1) Fuller 2) హేమలతా లవణం
3) నాగేంద్ర కుమార్‌సింగ్ 4) ఆశామూర్తి
67. జమిడికలు అనే పరికరాలను ఎవరు ఉపయోగిస్తారు?
1) మాతంగులు 2) జోగిణులు
3) పోతరాజు 4) దేవదాసీలు
68. జోగిని, దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు తల్లిగా ఎవరిని భావిస్తారు?
1) కుముద్‌బెన్ జోషి 2) కల్పనాకన్నాభిరాన్
3) గ్రేసీ నిర్మల 4) హేమలతా లవణం
69. రాజ్యాంగంలో ఏ అధికరణం జోగిని, దేవదాసి వ్యవస్థలను నిషేధించింది?
1) 14 2) 39 3) 23 4) 15
70. రాష్ట్రంలో ఎన్ని నివాస ప్రాంతాలు/గ్రామాలు ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి?
1) 1074 2) 974 3) 1274 4) 1174
71. దేశంలో ఫ్లోరైడ్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) బీహార్ 3) అసోం 4) రాజస్థాన్
72. రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో జలసాధన సమితి పేరుతో ఉద్యమం నిర్వహించింది ఎవరు?
1) దుశ్చర్ల సత్యనారాయణ 2) గద్దర్
3) చకిలం నాగేశ్వర్ 4) కంచుకట్ల సుభాశ్
73. బాలలపై నేరాల రేటు అధికంగా ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్ 4) బీహార్
74. బాలలకు సంబంధించిన సమస్యలు, ఆయా సమస్య తీవ్రత అధికంగా ఉన్న రాష్ర్టాలను సరిగా జతపర్చండి.
ఎ. గర్భస్థ శిశుహత్యలు 1. మధ్యప్రదేశ్
బి. బాల్య వివాహ కేసులు 2. తమిళనాడు
సి. బాలికల అక్రమరవాణా 3. పశ్చిమబెంగాల్
డి. బాలికలపై లైంగిక వేదింపులు 4. ఉత్తరప్రదేశ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
75. రాష్ట్రంలో సీఎస్ఆర్ అధికంగా ఉన్న జిల్లా?
1) నిజామాబాద్ 2) కరీంనగర్
3) హైదరాబాద్ 4) ఖమ్మం
76. తెలంగాణలో అత్యధికంగా ఏ జిల్లా నుంచి గల్ఫ్ వలసలు ఉన్నాయి? (1)
1) కరీంనగర్ 2) నిజామాబాద్
3) వరంగల్ 4) నల్లగొండ
77. వలసలకు సంబంధించి PULL కారకాలు ఎక్కడ ఉంటాయి?
1) గ్రామాలు 2) ఓడరేవు ప్రాంతాలు
3) పట్టణాలు 4) పైవన్నీ
78. అంతర్రాష్ట్ర వలసకార్మికుల చట్టాన్ని తీసుకువచ్చిన
సంవత్సరం?
1) 1969 2) 1979 3) 1989 4) 1999
79. బాలకార్మికుల విషయంలో జాతీయస్థాయిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది?
1) రెండు 2) మూడు 3) నాలుగు 4) పది
80. NCLP ప్రాజెక్టుని తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో అమలు
చేస్తున్నారు?
1) తొమ్మిది 2) ఏడు 3) ఆరు 4) మూడు
81. మహిళా రైతులు అధికంగా ఏ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు?
1) మహారాష్ట్ర 2) బీహార్
3) తెలంగాణ 4) మధ్యప్రదేశ్
82. దేశవ్యాప్తంగా అధికంగా రైతుల ఆత్మహత్యలు ఎక్కడ
ఎక్కువగా జరుగుతున్నాయి?
1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్
3) బీహార్ 4) ఉత్తరప్రదేశ్
83. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం?
1) రుణగ్రస్తత 2) తక్కువ దిగుబడులు
3) రుణ సదుపాయాలు లేకపోవడం
4) అవస్థాపన సౌకర్యాల లేమి
84. కింది వాటిలో రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్‌ని
గుర్తించండి.
1) స్వామినాథన్ 2) జయతీఘోష్
3) కోనేరు రంగారావు 4) రఘునాథరావు
85. ఒత్తిడిలో ఉన్న రైతులకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్?
1) 1093 2) 108 3) 109 4) 104
86. వెట్టి చాకిరి నిషేధ ఆర్డినెన్స్‌ని ఎప్పుడు తీసుకువచ్చారు?
1) 1975, అక్టోబర్ 24 2) 1976, అక్టోబర్ 24
3) 1975, అక్టోబర్ 14 4) 1976, అక్టోబర్ 14
87. ఆది ద్రావిడ సంఘ స్థాపకుడు?
1) భాగ్యరెడ్డి వర్మ 2) అరిగే రామస్వామి
3) బీఎస్ వెంకట్రావ్ 4) ఎంఎస్ ఆదయ్య
88. దేశంలో మొదటి మహిళా యూనివర్సిటీని
స్థాపించిన వారు?
1) డీకే కార్వే 2) ఐరావతి కార్వే
3) జంషెడ్జీ టాటా 4) సరోజినీనాయుడు
89. National Early Childhood care and Education Policyని ఎప్పుడు రూపొందించారు? (3)
1) 2011 2) 2012 3) 2013 4) 2014
90. మహిళ, శిశు సంక్షేమానికి సంబంధించిన కింది సంస్థలను, అవి స్థాపించిన సంవత్సరాల ఆధారంగా కాలక్రమంలో అమర్చండి
ఎ. CSWB బి. NIPCCO
సి. RMK డి. CARA
1) A-B-C-D 2) D-C-B-A
3) B-A-D-C 4) C-A-D-B
91. National Credit Fund For Womenని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1990 2) 1991 3) 1992 4) 1993
92. National Perspective Plan For Womenని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1988 2) 1987 3) 1986 4) 1985
93. మినీ అంగన్వాడీ సెంటర్‌ను ఎంతమంది జనభా ఉన్న దగ్గర ప్రారంభిస్తారు?
1) 250-400 2) 150-400
3) 100-250 4) 150-250
94. డిజిటల్ జెండర్ అట్లాస్ పథకాన్ని ఎవరి సహాయంతో
ప్రారంభించారు?
1) ILO 2) UNICEF
3) UNESCO 4) CSWB
95. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని ఎన్ని జిల్లాల్లో
అమలుచేస్తున్నారు?
1) 75 2) 200 3) 100 4) 125
96. మైనార్టీ సైబర్ గ్రామ్ పథకాన్ని ఏ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు?
1) జమ్ముకశ్మీర్ 2) రాజస్థాన్
3) గుజరాత్ 4) అసోం
97. National Minorities Development and Finance Corporation (NMDFC)ని ఏ కమిటీ సూచనలమేరకు ఏర్పాటు చేశారు?
1) గోపాల్‌సింగ్ 2) రామ్‌మాధవ్
3) గెహ్లాట్ 4) సలీందురానీ
98. జాతీయ భాషాపరమైన మైనార్టీల జాతీయ కమిషనర్ ఎవరు?
1) అక్తరుల్ వాసీ 2) నసీం అహ్మద్
3) రూబుల్సింగ్ 4) రూపాల్ కన్నర్
99. జాతీయ గిరిజన విధానాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 2002 2) 2003
3) 2004 4) 2006
100. Special Multypurpose Tribal Blocks (SMPTB)ని ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు?
1) రెండో పంచవర్ష ప్రణాళిక
2) ఐదో పంచవర్ష ప్రణాళిక
3) పదో పంచవర్ష ప్రణాళిక
4) ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక
101. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కూడా క్రీమీలేయర్ విధానం ఉండాలని సూచించినవారు?
1) ఎస్కే థార్ 2) ఎస్కే చాంగ్
3) దేబర్ కమిటీ 4) వీరేందర్ చౌహాన్
102. Scheeme of Multy Sectoral Develop-ment Programme ఎవరి సంక్షేమం కోసం ఉద్దేశించింది?
1) మహిళలు 2) గిరిజనులు
3) యువతులు 4) మైనార్టీలు
103. కాకాసాహెబ్ కాలేల్కర్ కమిషన్ ప్రకారం అత్యంత
వెనుకబడిన కులాల సంఖ్య?
1) 867 2) 2399 3) 3473 4) 4373
104. కింది ఏ కేసుల్లో సుప్రీంకోర్టు 50 శాతంకంటే ఎక్కువ
రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది?
ఎ. ఎంఆర్ బాలాజీ Vs కర్ణాటక
బి. దేవదాసన్ Vs తమిళనాడు
సి. ఎంఆర్ బాలాజీ Vs తమిళనాడు
డి. దేవదాసన్ Vs కర్ణాటక
1) ఎ, సి 2) బి, సి 3) ఎ, బి 4) సి, డి
105. Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Actని ఎప్పుడు రూపొందించారు?
1) 1989 2) 1993
3) 2003 4) 2013
106. Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) నిబంధనలను ఏ ఏడాదిలో రూపొందించారు?
1) 1989 2) 1990
3) 1993 4) 1995
107. కింది వాటిలో సిబ్బంది, వారికి సంబంధించిన పథకాలను సరిగా జతపర్చండి.
ఎ. ASHA 1. NRHM
బి. USHA 2. NUHM
సి. AWW 3. ICDS
డి. ANM 4. PHCs
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-1, సి-2, డి-3
108. కింది గ్రామీనాభివృద్ధి సంస్థలు, అవి స్థాపించిన
సంవత్సరాలను సరిగా జతపర్చండి.
ఎ. NIRD 1. 1965
బి. NRRDA 2. 2002
సి. NRLPS 3. 2013
డి. CAPART 4. 1986
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-4, సి-1, డి-4
109. Startup village Entreprenurship Programme for Youth (SVEP) పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? (1)
1) 2014 2) 2016 3) 2015 4) 2013
110. కింది అభివృద్ధి పథకాలను, వాటికి సంబంధించిన
అంశాలను సరిగా జతపర్చండి.
ఎ. SPMRM 1. Cluster of smart villagesని వృద్ధి చేయడం
బి. NSAP 2. సామాజిక సహాయత,
సామాజిక భద్రత
సి. నిలోఖేరి 3. శరణార్థుల సంక్షేమం
డి. FAME INDIA
4. పర్యావరణ హితమైన వాహనాలు
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-1, సి-2, డి-3
111. కర్మాగారాల చట్టాన్ని ఏ సంవత్సరంలో
రూపొందించారు?
1) 1938 2) 1948 3) 1958 4) 1978
112. తరుణ్ పథకం కింద ఎంత రుణం మంజూరు చేస్తారు?
1) రూ. 5 లక్షల నుంచి 10 లక్షలు
2) రూ. 50 వేల నుంచి 5 లక్షలు
3) రూ. 10 లక్షల నుంచి 20 లక్షలు
4) ఒక కోటి వరకు
113. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే
కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? (1)
1) 2014, అక్టోబర్ 16
2) 2014, అక్టోబర్ 18
3) 2015, అక్టోబర్ 16
4) 2015, అక్టోబర్ 18
114. Educate, Agitate, Organize అనే నినాదం
ఇచ్చినవారు?
1) జ్యోతీబా ఫూలే 2) బీఆర్ అందేద్కర్
3) మహాత్మాగాంధీ 4) భాగ్యరెడ్డి వర్మ
115. స్టేట్ అండ్ మైనారిటీస్ గ్రంథ రచయిత?
1) జవహర్లాల్ నెహ్రూ
2) మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
3) బీఆర్ అంబేద్కర్
4) ఫజల్ అలీ
116. Andhra Pradesh civil Liberties Committee (APCLC)ను ఎవరు స్థాపించారు?
1) కాళోజీ నారాయణరావు
2) కన్నాభిరన్
3) శ్రీరంగ శ్రీనివాసరావు
4) బుర్రా రాములు
117. Self Employed Womens Association అనే సంస్థను ఏ రాష్ట్రంలో స్థాపించారు?
1) హర్యానా 2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్ 4) మహారాష్ట్ర
118. ఖలిస్థాన్ ఉద్యమ నాయకుడు ఎవరు? (1)
1) తారాసింగ్ 2) హర్బజన్‌సింగ్
3) గోవింద్‌సింగ్ 4) శరణ్‌దీప్‌సింగ్
119. ప్రత్యేక కాంతాపూర్ ఉద్యమం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) ఛత్తీస్‌గఢ్ 4) పశ్చిమబెంగాల్
120. అరుధతీరాయ్ రచించిన The Greate Common Good గ్రంథం కిందివాటిలో ఏ అంశానికి సంబంధించింది?
1) పర్యావరణం 2) మహిళల హక్కులు
3) బాలల హక్కులు 4) కార్మికుల హక్కులు
121. SNDP విధానాన్ని ప్రవేశపెట్టినవారు?
1) పెరియార్ రామస్వామి నాయర్
2) నారాయణ గురు
3) విరేశలింగం పంతులు
4) బాబా ఆమ్టే
122. రాష్ట్రంలో గిరిజనుల సమస్యల అధ్యయనం కోసం ఎవరు హైమన్ డార్ఫ్‌ని ఆహ్వానించారు?
1) ఆరో నిజాం 2) ఏడో నిజాం
3) ఐదో నిజాం 4) సాలార్జంగ్-1
123. తెలంగాణలోని ఏ జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు?
1) ఖమ్మం 2) కరీంనగర్
3) నల్లగొండ 4) మహబూబ్‌నగర్
124. చండీప్రసాద్ భట్ కింది వాటిలో దేనికి సంబంధించిన ఉద్యమనాయకుడు?
1) అప్పికో 2) చిప్కో 3) బిష్ణోయ్ 4) సైలెంట్ జాలీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?