ఈ కంపెనీయే ఎందుకు?
-మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారో వివరించండి.
-లాంగ్‌టర్మ్ గోల్స్‌ను తెల్పండి.
ఉదా: ఏ ఉద్యోగి అయినా పేరొందిన కంపెనీలో పనిచేయాలనుకుంటాడు. నేను కూడా కెరీర్ ఉన్నతికి మీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. విద్యార్హతలు, కంపెనీ ఆశించిన స్కిల్స్ నాలో ఉన్నాయి. కంపెనీ ఉన్నతి, నా పర్సనల్ గ్రోత్ కోసం ఈ జాబ్ చేయడానికి ఆసక్తితో ఉన్నాను.
జాబ్ ఎందుకు మారాలనుకుంటున్నారు?
-గతంలో పనిచేసిన సంస్థకు కృతజ్ఞతలు చెప్పాలి.
-గతంలో చేసిన జాబ్ నుంచి మీరేం నేర్చుకున్నారో వివరించాలి.
-జాబ్ ఎందుకు మారాలనుకుంటున్నారో కారణాలను షేర్ చేసుకోండి.
ఉదా: నేను గతంలో పనిచేసిన సంస్థ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కొత్త విషయాలు నేర్చుకున్నందుకు కృతజ్ఞుడై ఉన్నాను. కెరీర్ ఉన్నతికి, పర్సనల్ డెవలప్మెంట్ కోసం మీ సంస్థలో చేరాలనుకుంటున్నాను. పర్సనల్ గ్రోత్, స్కిల్స్, నాలెడ్జ్, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఇక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. సంస్థ ప్రగతికి, నా కెరీర్ ఉన్నతికి ఈ జాబ్ ఓ ప్లాట్‌ఫాంలా భావిస్తున్నా.
మీ బలాలేంటి?
– హార్డ్ వర్కింగ్, నిజాయితీ, ఆశావాద దృక్పథం
-సౌకర్యవంతంగా ఉండటం
– సమాయానుకులంగా నిర్ణయాలు తీసుకోవడం
-సెల్ఫ్ మోటివేటెడ్
ఉదా: ఐయామ్ హానెస్ట్, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హార్డ్‌వర్కింగ్. కెరీర్ ఉన్నతికి ఎల్లప్పుడూ ఆశావాద దక్పథంతో ఉంటాను.
కంపెనీ గురించి మీరేమైనా అడగాలనుకుంటున్నారా…?
-థ్యాంక్స్ చెప్పండి
-శాలరీ స్ట్రక్చర్
-జాబ్ టైమింగ్స్
-జాబ్ లొకేషన్
-ట్రెయినింగ్ పీరియడ్
-ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ గురించి అడగండి.
ఉదా: ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్. జాబ్ టైమింగ్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, జాబ్ లొకేషన్, శాలరీ స్కేల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను.
కెరీర్ గోల్స్
-షార్ట్ టర్మ్ గోల్
-లాంగ్ టర్మ్ గోల్
ఉదా : పేరొందిన సంస్థలో ఉద్యోగం పొందడం నా షార్ట్ గోల్. చేరిన కంపెనీలో గౌరవప్రదమైన హోదాకు చేరుకోవడం నా లాంగ్ టర్మ్ గోల్.
శాలరీ రిక్వైర్మెంట్స్
-మీరు ఫ్రెషర్ అయితే ఎలాంటి శాలరీ రిక్వైర్మెంట్స్ ప్రస్తావించకపోవడం మంచిది.
-ఉద్యోగ అనుభవం ఉన్నట్లయితే ఎక్స్పెక్ట్ శాలరీ గురించి షేర్ చేసుకోవచ్చు.
-కంపెనీ నిబంధనలను బట్టి శాలరీ ప్రపోజల్ తీసుకువస్తే మంచిది.
ఉదా: నేను ఈ ఉద్యోగానికి కొత్త. కాబట్టి శాలరీకి ప్రియారిటీ ఇవ్వడం లేదు. ఇక్కడ పనిచేయడం నా కెరీర్ ఉన్నతికి పెద్ద ప్లాట్‌ఫాం లాంటిది. నాకున్న స్కిల్స్‌తో ఉన్నతంగా రాణించాలనుకుంటున్నాను. కాబట్టి నా స్కిల్స్‌కు తగ్గ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
మీకే ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి
-నాలెడ్జ్, వర్క్ ఎక్స్పీరియన్స్
-ఉద్యోగ సంబంధమైన స్కిల్స్, కెరీర్ గోల్స్
ఉదా: సార్.. ఈ సంస్థకు నేను ఫ్రెషర్ అయినప్పటికీ బాగా హార్డ్‌వర్క్ చేయగలను. సంస్థ ఉన్నతికి కృషి చేయగలను. సాధ్యమైనంతవరకు నాకు అప్పజెప్పిన వర్క్‌ను ఇన్‌టైమ్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. కంపెనీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తాను.
కంపెనీ గురించి మీకేం తెలుసు?
-కంపెనీ గురించి పూర్తిగా స్టడీ చేయండి.
-కంపెనీ ప్రాజెక్టు వర్క్
-అలాగే సంస్థ ఓనర్స్, పార్ట్నర్స్, కంపెనీ కరెంట్ ఇష్యూస్ గురించి తెలుసుకోండి.
ఉదా: దేశంలో పేరొందిన సంస్థల్లో ఇది ఒకటి. ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఈ సంస్థలో జాబ్ చేయడం గ్రేట్‌గా భావిస్తున్నాను. ఉద్యోగుల అవసరాలను గుర్తించడంలో ఈ కంపెనీ ముందుంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. నా ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ కంపెనీ బెస్ట్ ఆప్షన్.