తెలియని విషయాలు తెలుసుకోవడం అంటే..?

దీనిని ప్రతిపాదించింది- జీన్ పియాజే (1896-1980, స్విట్జర్లాండ్)
1) ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్
2) ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్
3) ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్
4) ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్
5) సిక్స్ సైకాలజికల్ స్టడీస్
జెనీవా యూనివర్సిటీలో శిశు మనస్తత్వ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు.
22 ఏండ్లకే పీహెచ్డీ పట్టా పొందారు.
ఫ్రాన్స్‌లోని బినే మానసిక ప్రయోగశాలలో పిల్లల ప్రజ్ఞ వెనుక దాగి ఉన్న అంశాలపై పరిశోధన చేశారు పియాజే.
తన పిల్లల మీద పరిశోధనలు చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
సుమారు 25 గ్రంథాలు రాశారు.
ముఖ్యాంశాలు
పిల్లల్లో ప్రజ్ఞాస్థాయి ఎంత ఉందో తెలుసుకోడానికి బినే పరిశోధనలు చేస్తే, అది ఎలా ఏర్పడుతుందో తెలుసుకోడానికి పియాజే పరిశోధనలు చేశారు.
తెలియని విషయాలు తెలుసుకోవడమే- జ్ఞానం
వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే సంజ్ఞానం (స్మృతి, ఆలోచన, వివేచన, ప్రత్యక్షం, అభ్యసనం మొదలైన వాటితో కూడుకున్న ప్రవర్తనయే సంజ్ఞానం).
ప్రజ్ఞలో వికాసం జరగడమే సంజ్ఞానాత్మక వికాసం (ఇది మానసిక వికాసానికి చెందింది)
శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుకూలంగా తనను తాను ఎలా మలచుకుంటాడో, అలాగే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని (వస్తువు/సంఘటనలు) ఎలా అర్థం చేసుకుంటాడో అనే దానికి ఇచ్చిన వివరణలే ‘సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం).
వ్యక్తి తన పరిసరాలతో ప్రభావవంతంగా సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ- పియాజే
ఈయన బహుమతులు, పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుందనే వాదాన్ని వ్యతిరేకించారు.
ప్రతి శిశువు తన జీవనాన్ని సంజ్ఞానాత్మ కతతో మొదలుపెట్టడు, స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించు కుంటారు. అందుకే ఇది నిర్మాణాత్మక ఉపగమం.
ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే కింది పదాల అర్థాన్ని తెలుసుకోవాలి.
ఈ సిద్ధాంతంలో అతి ముఖ్యమైన అంశం- స్కిమాటా
స్కిమాటా (స్థూల ప్రణాళిక)
పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు, పెద్దలు ఉపయోగించుకొనే వారి మనస్సులోని సంజ్ఞానాత్మక నిర్మితులు/ ప్రవర్తనా నమూనాలే స్కిమాటాలు.
స్కిమాటాలకు ఉదాహరణలు: శిశువు చనుపాలను తాగడం, చూడటం, తన్నడం, పట్టుకోవడం, కొట్టడం, పెదవులకు తాకిన వస్తువులను పీల్చడం మొదలైనవి.
ప్రతి శిశువు పుట్టుకతోనే కొన్ని స్కిమాటాలను పొంది ఉంటారు. శిశువు తన పరిసరాలతో ప్రతిచర్యలు జరపడం వల్ల ఈ స్కిమాటాల్లో మార్పు వస్తుంది. కాబట్టి వయస్సు పెరిగే కొద్ది స్కిమాటాలు మారుతాయి.
ఈ స్కిమాటాలు మొదట ఇంద్రియ చాలక నమూనా (పీల్చడం, పట్టుకోవడం లాంటి)లో ఉంటాయి. వయస్సు పెరిగేకొద్ది ప్రచాలకాలు (ఆపరేషన్స్) (సంజ్ఞానం, స్మృతి, ఆలోచన, మూల్యాంకనం)గా పిలిచే మానసిక చర్యలతో కూడిన స్కిమాటాలు ఏర్పడుతాయి.
వివరణ: శిశువులో సంజ్ఞానాత్మక వికాసం: స్కిమాటాల్లో మార్పు
స్కిమాటాల్లో మార్పు:
1) అనుకూలత,
2) వ్యవస్థీకరణ
అనుకూలత:
ఎ) సాంశీకరణం,
బి) అనుగుణ్యం
నోట్: శిశువులో సంజ్ఞా నాత్మక వికాసం జరగాలంటే స్కిమాటాల్లో మార్పు రావాలి. స్కిమాటాల్లో మార్పు రావాలంటే అనుకూలత, వ్యవస్థీకరణం జరగాలి.
అనుకూలత (Adaptation)
పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్య వల్ల ఏర్పడే స్కిమాటాలతో కూడినదే అనుకూలత. దీనిలో 2 ప్రక్రియలు ఉంటాయి. అవి..
ఎ) సాంశీకరణం (Assimilation),
బి) అనుగుణ్యం (Accomodation)
సాంశీకరణం/సంశ్లేషణం/స్వాయత్తీ కరణం / అంతర్లీనమవడం
శిశువు పాత అనుభవాలు (స్కిమాటా)తో కొత్త అనుభవాలు (స్కిమాటా)ను పోల్చు కోవడమే సాంశీకరణం. ఉదా: కుక్కను చూసిన అనుభవం గల బాలుడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్లు ఉన్నందున కుక్క అని పిలవడం.
అనుగుణ్యం/సానుకూలత/సమన్వయపర్చడం
పరిసరాలతో శిశువు సర్దుబాటు చేసు కోవడమే అనుగుణ్యం. గాడిదను చూసి కుక్క అని అనుకున్న పిల్లవాడు, దాని ఆకారం, రంగు, పరిమాణం, ధ్వని వంటి వాటిలోని భేదాలను గుర్తించి కుక్క గాడిద రెండూ వేర్వేరు జంతువులని భావించడం.
నోట్: ఎ) శిశువు మొదట పరిసరాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేయడం- సాంశీకరణం
బి) పరిసరాలకు అనుగుణంగా తానే మార్పు చెందడం- అనుగుణ్యం
సి) సాంశీకరణం, అనుగుణ్యంగా మారడమే సమతుల్యత
డి) అనుగుణ్యంగా మారలేక పోవడమే అసమతుల్యత
ఇ)సాంశీకరణం, అనుగుణ్యంల మధ్య ఘర్షణ లేకుండా చేసే స్థితే సమతా స్థితి.
వ్యవస్థీకరణం
శిశువు కొత్త స్కిమాటాలను రూపొందించు కున్న తర్వాత వాటిని ఇతర స్కిమాటాలతో జతచేసి, తిరిగి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించు కోవడమే వ్యవస్థీకరణం. ఉదా: పుట్టినప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించే శిశువు వయసు పెరిగేకొద్ది అన్ని జ్ఞానేంద్రి యాలను కలిపి ఉపయోగిస్తాడు.
నోట్: పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం దశల క్రమంపై ఆధారపడుతుంది. కానీ వయస్సుపై ఆధారపడదు.
ఇది పిల్లలందరిలో జరిగే ప్రక్రియే అయినప్ప టికీ వారిలో వైయక్తిక భేదాలుంటాయి.
శిశువులో సంజ్ఞానాత్మక వికాసం 16 సంవత్సరాలకు పూర్తవుతుంది.
సంవేదన, ప్రత్యక్షం, భావనల ద్వారానే సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది.
సంజ్ఞానాత్మక వికాసం శిశువులో 4 దశల్లో జరుగుతుందని వివరించారు. అవి..
1) జ్ఞానేంద్రియ/ఇంద్రియ/సంవేదన చాలక దశ (Sensory Motor Stage)
ఈ దశ కాలం 0-2 సంవత్సరాలు
శిశువుకు భాష తెలియకపోవడం వల్ల పరిసరాలతో ఇంద్రియచాలక (చూడటం, నవ్వడం, కాళ్లు, చేతులు కదిలించడం) పరస్పర చర్యలకే పరిమితం అవుతాడు.
శిశువు ప్రతిక్రియా జీవి (Reflexive Organism) నుంచి పర్యాలోచక జీవి (Refletive Organism)గా మారతాడు.
1-4 నెలల కాలంలో (ప్రాథమిక వృత్తాకార స్పందన)
1) తనకు ఆనందాన్ని తృప్తిని కలిగించే పనిని మళ్లీ మళ్లీ చేస్తాడు. ఉదా: శిశువు తన నోటిలో వేళ్లు పెట్టుకొని చీకడం.
2) శిశువులో ఊహించే సామర్థ్యం ప్రారంభమవుతుంది. ఉదా: తల్లి తనను దగ్గరకు తీసుకోగానే పాలు ఇస్తుందని భావిస్తాడు.
4-8 నెలల కాలంలో (ద్వితీయ వృత్తాకార స్పందన)
శిశువు దృష్టి తన సొంత శరీరం నుంచి వస్తువులపైకి మారుతుంది. ఉదా: శబ్దం చేసే ఏదైనా వస్తువును అది శబ్దాలను చేసేటట్లు ఊపడం చేస్తాడు. తద్వారా ఊపే చలనాలను నేర్చుకుంటాడు.
8-12 నెలల కాలంలో (ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం)
1) శిశువు ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా, లక్ష్యం దిశగా సాగుతుంది.
2) తన ఎదుట లేని వస్తువు, శాశ్వతంగా ఎక్కడో ఒకచోట ఉంటుందనే ‘వస్తుస్థిరత్వ భావన’ను పొందుతాడు. ఉదా: ఎ) తల్లి కనిపించకపోతే వెదకడం
బి) దుప్పటికింద దాచిన బొమ్మను వెదకడం
సి) టాటా చెప్పడం ద్వారా ఇతరుల (తల్లి) ప్రవర్తనను అనుకరిస్తారు
12-18 నెలల కాలంలో (తృతీయ వృత్తాకార స్పందన)
1) శిశువు వస్తువుల లక్షణాలను తెలుసు కోవడానికి యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు.
2) రకరకాల వస్తువులను పడేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలను గమనించి ఒక ఆటలా ఆనందిస్తాడు.
18-24 నెలల కాలంలో (స్కిమాల అంతరంగీకరణ)
పద్ధతిని ఉపయోగించి ‘పరిశీలించగలిగే కృత్యాల’ నుంచి ఆలోచన ద్వారా సమస్యా పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు. ఉదా: అందని వస్తువులను అందుకోడానికి, రకరకాల వస్తువులను ఉపయోగిస్తాడు (స్టూలు, కర్ర లాంటివి).
ఈ దశకు గల మరొక పేరు ప్రాక్-భాషా దశ.
10 నెలల వయస్సులో అహం కేంద్రీకృత భావన ఏర్పడుతుంది.
2) పూర్వ/ప్రాక్ ప్రచాలక దశ (Pre-Operational Stage)
ఈ దశ కాలం 2-7 సంవత్సరాలు.
అసాధారణ మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు.
శిశువు భాషను ఉపయోగించడం నేర్చుకొని, చాలకాలకు బదులుగా ప్రచాలకాలు ఉపయోగిస్తాడు.
శిశువు ఆలోచన చేయడానికి భాషను ఒక సాధారణంగా ఉపయోగించు కుంటాడు.
పియాజే ఈ దశను 2 అంతర దశలుగా విభజించారు. అవి..
1) పూర్వ భావనాత్మక దశ
2) అంతర్బుద్ధి దశ
పూర్వ/ప్రాక్ భావనాత్మక దశ
(Pre-Conseptual Stage)
ఈ దశ 2-4 సంవత్సరాల వరకు ఉంటుంది.
భాషా వికాసం చాలా వేగంగా జరుగు తుంది. దీనివల్ల శిశువులో సమస్యా పరిష్కార సామర్థ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. కానీ కొన్ని తప్పులు చేస్తాడు. అవి..
1) సర్వాత్మ వాదం
2) అహంకేంద్ర వాదం
3) ప్రతిభాసాత్మక ఆలోచన
సర్వాత్మవాదం/జంతువాదం (Animism)
శిశువు జీవంలేని వాటికి జీవాన్ని (ప్రాణం) ఆపాదించడమే సర్వాత్మ వాదం. ఉదా: శిశువు తన బొమ్మకు కూడా ప్రాణం ఉన్నట్లుగా దాంతో మాట్లాడుతూ దానికి అవసరాలు ఊహించుకొని తీర్చే ప్రయత్నం చేస్తాడు.
ఊహాత్మక క్రీడలు (Make believe play) ఆడతాడు. ఉదా: తోటి పిల్లలతో కలిసి ఆటలు ఆడేటప్పుడు నమ్మకం/అపనమ్మకంను ప్రదర్శిస్తారు.
తమ సమక్షంలో ఉన్నవాటి గురించి, లేనివాటి గురించి మాట్లాడతారు. ఉదా: ఎప్పుడూ చూడని పులులు, సింహాలు, దెయ్యాలు మొదలైన వాటి గురించి మాట్లాడతారు.
అహంకేంద్ర వాదం (Ego Critcism)
ఈ ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకృతమై ఉందని శిశువు అనుకోవడమే అహంకేంద్ర వాదం. ఉదా: తను నడుస్తుంటే తనతో పాటే సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడని అనుకోవడం.
ప్రతిభాసాత్మక ఆలోచన
ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆటలాడటం. ఉదా: చెక్కముక్కను, గుర్రం/సికిల్గా భావించి ఆడటం.
2) అంతర్బుద్ధి దశ (Intuitive Stage)
ఈ దశ 4-7 సంవత్సరాల వరకు ఉంటుంది.
సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు.
ఈ దశలోని పరిమితులు
1) పదిలపరచుకొనే భావనా లోపం
2) అవిపర్యయాత్మక భావనా లోపం
3) ఏకమితి
పదిలపరచుకొనే భావనాలోపం (Conserv ation)
వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉంటాయనే భావాన్ని శిశువు పొంది ఉండకపోవడమే కన్జర్వేషన్. ఉదా: రెండు సమాన పరిమాణం గల బంకమట్టి ముద్దల్లో ఒకదానిని సాగదీసి చూపిస్తే సాగదీసినది పెద్దదని శిశువు భావించడం.
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు