Equal number of seats in Rajya Sabha | రాజ్యసభలో సమాన సంఖ్యలో స్థానాలున్న రాష్ట్రాలు?
ఇండియన్ పాలిటీ
1. కింది వాటిలో సరైనది ఏది?
ప్రతిపాదన (A): ఒకవిధమైన ప్రశాంత వాతావరణం లో చట్టాన్ని పునఃపరిశీలించే అవకాశం కల్పించడం కోసం ఎగువసభలు ఉంటాయి
కారణం (R): ఎగువ సభవల్ల అనవసరమైన కాలయాపన ఉంటుంది
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
2. కింది వాటిలో సరైనది ఏది?
ప్రతిపాదన (A): సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటుంది
కారణం (R): భారత్ రాష్ట్రాల యూనియన్
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
3. కింది వాటిలో సరైనది ఏది?
ప్రతిపాదన (A): గ్రేట్ బ్రిటన్ భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ఇచ్చింది
కారణం (R): రెండో ప్రపంచ యుద్ధం తరువాత గ్రేట్ బ్రిటన్ బలహీన పడింది
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
4. అంతర్ రాష్ట్ర మండలి అధ్యక్షుడు ఎవరు?
1) కేంద్ర హోంమంత్రి 2) ప్రధానమంత్రి
3) నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు 4) ఎవరూకాదు
5. 1947, ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుంచి భారత్కు అధికార బదలాయింపునకు ప్రధాన కారణం?
1) క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2) అట్లీ డిక్లరేషన్
3) సైమన్ కమిషన్ ప్లాన్ 4) మౌంట్ బాటన్ ప్లాన్
6. భారత్ ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులతో ప్రభుత్వం ఉంటుంది. ఈ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే?
1) పౌరులు ఎన్నికల్లో పోటీచేయాలి
2) పౌరులు కచ్చితంగా పన్నులు చెల్లించాలి
3) ప్రతి ఒక్కరూ సమాజంలో మంచి పౌరులుగా
జీవించాలి 4) ఏదీకాదు
7. పార్లమెంట్ సభ్యుడు కాకపోయినప్పటికీ పార్లమెంట్ ఉభయసభల సమావేశాల్లో ఎందులోనైనా ఓటు హక్కు లేకుండా చర్చల్లో పాల్గొనే అధికారం ఎవరికి ఉంటుంది?
1) ఉపరాష్ట్రపతి
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) అటార్నీ జనరల్
8. కిందివాటిని జతపర్చండి.
ఎ) ఓటర్లరీత్యా దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం 1) లక్షదీవులు
బి) వైశాల్యం రీత్యా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం
2) లఢక్
సి) ఓటర్ల రీత్యా అతిచిన్న లోక్సభ నియోజకవర్గం
3) దక్షిణ ముంబై
డి) వైశాల్యం రీత్యా అతిచిన్న లోక్సభ నియోజకవర్గం
4) మల్కాజ్గిరీ
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
9. కింది ఉపరాష్ట్రపతుల్లో రెండుసార్లు పదవీ బాధ్యతలు నిర్వహించిన వారు?
ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్
బి) జాకీర్ హుస్సేన్ సి) గోపాల స్వరూప్ పాఠక్
డి) హమీద్ అన్సారీ ఇ) శంకర్ దయాల్ శర్మ
1) ఎ, సి 2) డి, ఇ 3) ఎ, డి 4) ఎ, బి
10. కిందివారిలో ఉపవూపధానులు ఎవరు?
ఎ) ఇందిరాగాంధీ బి) మొరార్జీ దేశాయ్
సి) బాబు జగ్జీవన్ రామ్ డి) వీపీ సింగ్
ఇ) చరణ్ సింగ్ ఎఫ్) చంద్రశేఖర్
1) బి, సి, ఇ 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) డి, ఇ, ఎఫ్
11. కిందివాటిని జతపర్చండి.
ఎ) ఎస్వీ కృష్ణమూర్తి రావు 1) లోక్సభ మొదటి స్పీకర్
బి) జీవీ మౌలాంకర్
2) లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్
సి) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్
డి) అనంత శయనం అయ్యంగార్
4) రాజ్యసభ మొదటి చైర్మన్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
12. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) రాజ్యసభ స్థానాలకు రిజర్వేషన్ వర్తిస్తుంది
బి) లోక్సభ స్థానాలకు రిజర్వేషన్ వర్తిస్తుంది
సి) రాజ్యసభ స్థానాలకు రిజర్వేషన్ వర్తించదు
డి) లోక్సభ స్థానాలకు రిజర్వేషన్ వర్తించదు
1) ఎ, బి 2) సి, డి 3) ఎ, డి 4) బి, సి
13. కింది వాటిలో సరైనది ఏది?
ప్రతిపాదన (A): ప్రకరణ 103 స్వేచ్ఛావాణిజ్యం గురించి పేర్కొంటుంది
కారణం (R): దేశంలో వాణిజ్యంపై పన్నులు విధించవచ్చు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
14. కింది వాటిలో సరైనది ఏది?
ప్రతిపాదన (A): యూపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ
కారణం (R): రాజ్యంగంలో 15వ భాగంలో దీని గురించి పేర్కొన్నారు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
15. రాజ్యాంగం కుల వ్యవస్థను గుర్తించకపోవడానికి కారణం?
1) భారతదేశం లౌకిక రాజ్యం
2) ఇది అసమానతలకు దారితీస్తుంది కాబట్టి
రాజ్యాంగానికి వ్యతిరేకం
3) అస్పక్షుశ్యతకు దారితీస్తుంది 4) పైవన్నీ
16. కిందివారిలో ఎవరికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే హక్కు ఉంది. కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో లేదు?
1) ఉభయసభల్లో దేనిలోనూ సభ్యులుకాని మంత్రులు
2) రాష్ట్ర ఎగువ సభలకు ఎన్నికైన సభ్యులు
3) పార్లమెంట్లోని నామినేటెడ్ సభ్యులు
4) రాజ్యసభ సభ్యులు
17. ‘ఆర్థిక న్యాయం’ రాజ్యాంగ లక్ష్యాల్లో ఒకటిగా ఎక్కడ పేర్కొనబడింది?
1) పీఠిక, ప్రాథమిక హక్కులు
2) పీఠిక, ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు
4) పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు
18. లోక్సభను ఎవరు రద్దు చేస్తారు?
1) ప్రధాన మంత్రి
2) ప్రధాని సిఫారసు మేరకు రాష్ట్రపతి
3) లోక్సభ స్పీకర్
4) రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు
19. కింది వాటిలో రాజ్యాంగంలో పేర్కొనని అంశం?
1) ఉపవూపధానమంత్రి 2) ఉపముఖ్యమంత్రి
3) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు 4) పైవన్నీ
20. రాజ్యసభలో సమాన సంఖ్యలో స్థానాలున్న రాష్ట్రాలు?
ఎ) అసోం బి) పంజాబ్
సి) తెలంగాణ డి) జార్ఖండ్ ఇ) ఆంధ్రవూపదేశ్
1) ఎ, సి 2) సి, డి, ఇ
3) ఎ, బి, సి 4) బి, సి, ఇ
21. కిందివాటిని జతపర్చండి.
ఎ) గెర్రీ మాండరింగ్ 1) సభ్యులు ప్రతిపక్షం
నుంచి అధికార పార్టీకి మారడం
బి) కార్పెట్ క్రాసింగ్ 2) అధికార పార్టీకి చెందిన
సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడం
సి) ఫ్లోర్ క్రాసింగ్ 3) నియోజకవర్గాల
పునర్వ్యవస్థీకరణ
డి) ఫిలిబస్టరింగ్ 4) సభాసమయాన్ని
వృథాచేస్తూ ఉద్దేశపూర్వకంగా
దీర్ఘకాలిక ఉపన్యాసం చేయడం
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
22. 14 లోక్సభ స్థానాలున్న రాష్ట్రాలు?
ఎ) కర్ణాటక బి) ఒడిశా
సి) అసోం డి) జార్ఖండ్ ఇ) కేరళ
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి, ఇ 4) సి, డి
23. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ) లీ కమిటీ సూచన మేరకు 1921లో సాధారణ
బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరుచేశారు
బి) అక్వర్త్ కమిటీ సూచన మేరకు 1921లో సాధా
రణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరుచేశారు
సి) వార్షిక ఆర్థిక నివేదిక (బడ్జెట్)గురించి ప్రకరణ
112 పేర్కొంటుంది
డి) వార్షిక ఆర్థిక నివేదిక గురించి ప్రకరణ 110
పేర్కొంటుంది
ఇ) ప్రతి ఏడాది బడ్జెట్ ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31న ముగుస్తుంది
ఎఫ్) దేశంలో రెండు రకాల బడ్జెట్లు ఉన్నాయి
1) బి, డి, ఇ, ఎఫ్
2) బి, సి, ఇ, ఎఫ్
3) ఎ, డి, ఇ, ఎఫ్
4) డి, ఇ, ఎఫ్
24. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) స్పీకర్ వ్యవస్థను బ్రిటన్ నుం చి గ్రహించారు
బి) లోక్సభలో సీనియర్ సభ్యుడిని రాష్ట్రపతి ప్రొటెం
స్పీకర్గా నియమిస్తారు
సి) ప్రొటెం స్పీకర్ అనే భావాన్ని ఫ్రాన్స్ నుంచి
గ్రహించారు
డి) మొదటి లోక్సభ ప్రొటెం స్పీకర్ జీవీ మౌలాంకర్
1) ఎ, బి, సి 2) బి, సి
3) బి, సి, డి 4) పైవన్నీ
25. కిందివాటిలో సరైనది ఏది?
ప్రతిపాదన (A): రాజ్యాంగ మౌళిక స్వరూపాన్ని సవరించడానికి వీలులేదు
కారణం (R): ప్రకరణ 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని తెలుపుతుంది
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
26. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): అనుక్షిగహ సిద్ధాంతం సివిల్ సర్వీసు ఉద్యోగులకు వర్తిస్తుంది
కారణం (R): అనుక్షిగహ సిద్ధాంతాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
27. అంబాసిడర్, హైకమిషనర్ వంటి దౌత్య సంబంధ విధులను నిర్వహించి రాష్ట్రపతి అయినవారు?
1) రాధాకృష్ణన్, కేఆర్ నారాయణన్
2) రాధాకృష్ణన్, వీవీ గిరి
3) జాకీర్ హుస్సేన్, వీవీ గిరి
4) రాజేంద్ర ప్రసాద్, కేఆర్ నారాయణన్
28. సుప్రీంకోర్టు సలహా పరిధికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఏ అంశాన్ని అయినా సల
హాకు పంపితే తప్పనిసరిగా తమ అభివూపాయాన్ని
తెలపాలి
బి) సుప్రీంకోర్టుకు పంపిన అంశంపై కోర్టు చర్చించి
సలహా ఇస్తుంది
సి) సుప్రీంకోర్టు సలహా పరిధిలోని అంశాలపై వెలిబు
చ్చిన అభివూపాయాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా
పాటించాల్సిన అవసరం లేదు
డి) సుప్రీంకోర్టు సలహాకు ఒకసారి ఒక అంశం కంటే
ఎక్కువ పంపకూడదు
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి 4) బి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?