Computer linguistics | కంప్యూటర్ భాషాపదాలు
ఇంట్రానెట్ (Intranet):
ఒక సంస్థలో లభించే అంతర్గత ప్రయివేట్ నెట్‌వర్క్‌ను ఇంట్రానెట్ అంటారు. దీనివల్ల కార్పోరేట్ సంస్థల్లోని ఉద్యోగులందరికి కూడా సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఎక్స్ట్రానెట్ (Extranet):
వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని భద్రంగా ఒకచోటు నుంచి మరో చోటుకు సరఫరా చేయడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఉపయోగించే ఒక ప్రయివేట్ నెట్‌వర్క్‌నే ఎక్స్ట్రానెట్ అంటారు.
డొమైన్ నేమ్ (Domain Name):
డొమైన్ నేమ్ అంటే యూజర్ సమూహానికి కేటాయించిన నెట్వర్క్ వనరుల సమూహం.
ఉదా: google.com, youtube.com
బ్లాగ్ (Blog):
బ్లాగ్ అనేది ఒక వెబ్సైట్ ఇది ఒక వ్యక్తి అభిప్రాయాలనుగాని, అతని అనుభవాలనుగాని తెలుపుతూ ఇతర సైట్లతో లింక్‌లను కలిగి ఉంటుంది.
సెర్చ్ ఇంజిన్ (Search Engine):
కొన్ని నిర్దిష్టమైన టాపిక్లపై అవసరమైన సమాచారాన్ని వెతికిపెట్టే సర్వీస్‌నే సెర్చ్ ఇంజిన్ అంటారు.
చాటింగ్ (Chating):
చాటింగ్ అనేది ఒక టెక్ట్స్ ఆధారిత లేదా మల్టీమీడియా ఆధారిత సంభాషణ. ఇది ఇంటర్నెట్ ద్వారా కలుపబడిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది యూజర్ల మధ్యలో జరుగుతుంది.
ఈ-మెయిల్:
ఈ మెయిల్ అనేది సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఒక ఎలక్ట్రానిక్ పద్ధతి. ఈ-మెయిల్ పితామహుడు రే టామ్ లిన్సన్
ఈ-లెర్నింగ్ (E-Learning):
యూజర్లు కొత్త విషయాలను నేర్చుకునే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామే ఈ-లెర్నింగ్.
ఈ-బ్యాంకింగ్ (E-BANKING):
సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో జరిగే బ్యాంకింగ్ కార్యకలాపాలను కంప్యూటర్, ఇంటర్నెట్ ద్వారా చేసే విధానాన్ని ఈ-బ్యాంకింగ్ అంటారు. దీన్నే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ అని కూడా అంటారు.
ఈ-షాపింగ్ (E-SHOPPING):
సంప్రదాయ పద్ధతిలో ఒక దుకాణానికి వెళ్లి సరుకులను లేదా సేవలను లేదా సేవలను కొనుగోలు చేయడం. దానికి భిన్నంగా ఇంటర్నెట్ సదుపాయంతో కంప్యూటర్ ద్వారా మనం సరుకులను, సేవలను కొనుగోలు లేదా అమ్మినప్పుడు దానిని ఈ-షాపింగ్ అంటారు.
ఈ-రిజర్వేషన్ (E-RESERVATION):
బస్‌లు, రైల్వేలు, విమానాలు, హోటల్ రూంలు, సినిమా టికెట్లు, టూరిస్ట్ ప్యాకేజీల వంటి వాటిని ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా కంప్యూటర్‌తో మనం ఇంటి నుంచే రిజర్వేషన్ చేసుకున్నప్పుడు దానిని ఈ-రిజర్వేషన్ అంటారు
ఈ-కామర్స్ (E-COMMERCE):
వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకొని వ్యాపారలావాదేవీలను నిర్వహించడం కోసం టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడాన్నే ఈ-కామర్స్ అంటారు. సెండర్, రిసీవర్ మధ్యలో ఎలక్ట్రానిక్ సమాచార రవాణానే ఎలక్ట్రానిక్ డాటా ఇంటర్చేంజ్ (ఈడీఐ) అంటారు.
ఎం-కామర్స్ (M-COMMERCE):
మొబైల్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మకం లాంటి కార్యకలాపాలను చేసినప్పుడు దానిని ఎం-కామర్స్ అంటారు. ఈ మొబైల్ కామర్స్‌ను 1997లో కెవిస్ డెఫి ప్రారంభించాడు.
కంప్యూటర్ వైరస్ (Comp.Virus):
వైరస్ అంటే వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్. ఈ కంప్యూటర్ వైరస్ ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు వేగంగా వ్యాప్తి చెందుతూ కంప్యూటర్ పనితీరులో జోక్యం చేసుకొనే ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రాం. ఇవి కంప్యూటర్ పనితనాన్ని దెబ్బతీస్తాయి.
యాంటీ వైరస్ (Antivirus):
కంప్యూటర్లోకి ప్రవేశించిన వైరస్‌లను వెతికి, వాటిని తొలగించి, మళ్లీ రాకుండా నిరోధించే ప్రోగ్రామ్‌నే యాంటీ వైరస్ అంటారు. ఇది కంప్యూటర్‌కు హాని చేసే వైరస్‌లను తొలగిస్తుంది.
మాల్ వేర్ (Malware):
మాల్ వేర్ అంటే మెలీషియన్ సాఫ్ట్వేర్ అంటే దురుద్దేశం కలిగిన ఒక సాప్ట్వేర్. ఇవి మన కంప్యూటర్లలోకి ప్రవేశించి మన రహస్యమైన సమాచారాన్ని సేకరించడం, బ్యాంక్ పాస్వర్డ్లు, అకౌంట్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లాంటి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి వేరే వారికి అందజేస్తాయి.
ఫైర్‌వాల్ (Fire wall):
ఒక ప్రోగ్రామ్ లేదా సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కంప్యూటర్ నెట్వర్క్ సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?