ఏ శైలిలో కాచిగూడ రైల్వేస్టేషన్ నిర్మించారు?
షోడశ మహాజనపదాల కాలంనాటి అంగదేశ రాజధాని – చంప
-అబుల్హసన్ తానీషా సైన్యం మొఘల్ సైన్యాన్ని ఎన్ని నెలలు ఎదిరించి పోరాడింది – ఎనిమిది
-వేములవాడ చాళుక్య రాజైన మూడో అరికేసరి వివాహమాడిన రాష్ట్రకూట మూడో ఇంద్రుడి కుమార్తెల పేర్లు – రేవకనిర్మాడి, లోకాంబిక
-ప్రాచీన కాలంలోనే తెలంగాణలో పత్తిని పండించినట్లు తెలిపే ఆధార గ్రంథం
– హాలుని గాథాసప్తశతి
-మహ్మద్ కులీకుతుబ్షా ఏకైక కుమార్తె హయత్ భక్షీ బేగానికి మరోపేరు మా సాహెబా బేగం. ఆమె పేరు మీదుగా మాసబ్ ట్యాంకును నిర్మించారు.
-వీరశైవ విజృంభనతో పటాన్చెరువు వద్ద ఐదు జైన బసదులను నాశనం చేసిన వారు
– దేవర దాసయ్య
-కాకతీయుల కాలంలో పాకాల చెరువును నిర్మించిన సామంత రాజు – జగదల ముమ్మడి
-గద్వాల కోటను సోమనాద్రి అనే పెద్ద సోమ భూపాలుడు ఎప్పుడు నిర్మించాడు
– 1698-1704
-గద్వాల సంస్థాన చరిత్ర రాసిందెవరు – పెద్దమందడి వెంకటకృష్ణ కవి
-తెలంగాణలోని జటప్రోలు సంస్థాన స్థాపకుడు- పిల్లలమర్రి బేతాళరెడ్డి
-1936లో నిర్మించిన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట తాలుకాలోని కల్లెడగడి ఏడెకరాల విస్తీర్ణంలో ఉంది. దీని యజమాని
– ఎర్రబెల్లి వీర రాఘవరావు
-సాలార్జంగ్ 1855లో ఇంగ్లిష్ను ఒక నిర్బంధ సబ్జెక్టుగా ప్రవేశపెడుతూ స్థాపించిన పాఠశాల – దారుల్-ఉల్-ఉలూమ్
-కాచిగూడ రైల్వేస్టేషన్ భవనం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో(1916) నిర్మితమైంది. ఇది ఏ శైలిలో ఉంది
– గోథిక్ శైలి
-నాంపల్లి రైల్వేస్టేషన్కు ఆ పేరేలా వచ్చింది
– నామ్ (తడితడిగా ఉన్న భూభాగం ఉర్దూలో) ప్రాంతంలో కట్టడం వల్ల ఆ పేరొచ్చింది.
-నిజాం ఉల్ ముల్క్ గొప్ప కవి. ఆయన ఏ కలం పేరుతో కవితలు రాశాడు – షాకీర్ (సంతృప్తుడు)
-1947 ఆగస్టు 7ను భారత ప్రభుత్వం జాయిన్ ఇండియా డే గా ప్రకటించింది.
-భోజపురం పేరుతో కొత్త పట్టణాన్ని నిర్మించిన పరమారవంశ రాజు – భోజరాజు
-అజీవిక మతాన్ని ప్రచారం చేసింది – మక్కలి గోశాలి
-కాళిదాసు రాసిన రఘువంశంలో 30 మంది సూర్యవంశ రాజుల గురించి ఉంది.
-గుప్తులకాలం నాటి దశావతార దేవాలయం ఎక్కడ ఉంది. – దేవగఢ్
-జునాగఢ్ శిలాశాసనం సంస్కృతంలో రాసిన తొలి శాసనం
-చరిత్రలో తొలి శకరాజు – మోయెస్
-గ్రీకుభాషలో బెసిలియస్ బెసిలియాన్ అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అంటారు.
-న్యూమిస్ మాటిక్స్ అనే పదం గ్రీకు భాషలోని నోమిస్మా నుంచి వచ్చింది.
-కేఎం శ్రీమాలి ది ఏజ్ ఆఫ్ ఐరన్ అండ్ ది రిలీజియస్ రెవల్యూషన్ రాశాడు.
-తెలంగాణలో చిత్ర గుప్తాలయం ఎక్కడ ఉంది – హైదరాబాద్లోని కందికల్ గేట్ (ఓల్డ్ సిటీ)
-భారతదేశపు చిలుక అని తనకు తానే చెప్పుకున్న ప్రముఖ పర్షియా కవి? – అమీర్ఖుస్రో
-ప్రముఖ చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయన్బీ రాసిన గ్రంథం – స్టడీ ఆఫ్ హిస్టరీ (చరిత్ర అధ్యయనం)
-నేను చరిత్రలో విగ్రహ ధ్వంసకుడిగానే ఉండాలి. కానీ విగ్రహాన్ని అమ్ముకొనేవాడిగా కాదని అన్నది – గజినీ మహ్మద్
-రెండో పులకేశి ఐహోల్ శాసనం ప్రకారం మౌల అంటే వంశపారంపర్య దళం అని అర్థం.
-గహద్వాల వంశ రాజుల్లో ముఖ్యుడు – జయచంద్రుడు
-ద్రావిడ దేశంలోని ఆళ్వారుల ప్రసక్తి ఉన్న పురాణం ఏది – భాగవత పురాణం
-భక్తి ఉద్యమ కాలంలో శివవిశిష్టాద్వైత విధానాన్ని ప్రవచించింది – శ్రీకంఠ
-గ్లింప్సెస్ ఆఫ్ మెడికల్ ఇండియన్ కల్చర్ రాసింది- యూసఫ్హుస్సేన్
-బుద్ధుడు తన మారుతల్లి కొడుకైన నందుడిని బౌద్ధమతంలోకి ఎలా చేర్పించాడో వివరించే గ్రంథం – సౌందర్యానందం
-రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణాన్ని నిర్మించిన చౌహాన్ వంశరాజు – అజయరాజు
-ప్రేమతో మానవుడు భగవంతుడిలో లీనం కావడమే సూఫీ మత ముఖ్య సిద్ధాంతం
-సిక్కుమత స్థాపకుడు నానక్ జన్మించిన తల్వండీ గ్రామం ఏ నది ఒడ్డున ఉంది – రావి
-నేమినాథ పురాణమనే జైనగ్రంథాన్ని రచించింది – నేమిచంద్రుడు
-మొదటి విజయనగర రాజుల కుల గురువు – శైవమత క్రియాశక్తి పండితుడు
-భూసంస్కరణల చట్టాన్ని అమల్లోకి తెచ్చిన హైదరాబాద్ రాష్ట్ర సీఎం – బూర్గుల రామకృష్ణారావు
-రక్షిత కౌలుదారుల శాసనం కూడా బూర్గుల రామకృష్ణారావు చేశారు.
-నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో హైదరాబాద్ ముఖ్యమంత్రి
– బూర్గుల రామకృష్ణారావు
-1954 నాటికి తెలంగాణలో ఒక్క వరంగల్లోనే ఇంటర్మీడియట్ కళాశాల ఉండేది.
-శంకరాచార్యుల సౌందర్యలహరిని కనకధారస్తవాన్నితెలుగులోకి అనువదించిన వారు
– బూర్గుల రామకృష్ణారావు
-ఆంగ్లకవి థామస్ గ్రే ఎలజీని పద్య ప్రక్రియలో మృత సంస్కృతిగా ఆంధ్రీకరించారు.
-షాజహాన్ ఆస్థాన కవి జగన్నాథ పండితరాయలు రాసిన లహరీ పంచకాన్ని పండితరాజ పంచామృతంగా అనువదించారు.
– సాగర గీతాలు, దున్నారా నా తండ్రి, మృణాళిని నాటికలను బూర్గుల రాశారు.
-బూర్గులకు సంబంధించిన ర్యాండమ్ రిఫ్లెక్షన్స్ కల్చరల్ థిసీస్ ఆఫ్ ఇండియా, ది ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ తదితర ప్రసంగాలు అచ్చయ్యాయి.
-కాళిదాసు మేఘసందేశం లాగానే హంససందేశం రాసిన కవి – వేదాంత దేశికుడు
-రుమిందై శాసనాన్ని వేయించినవారు- అశోకుడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు