Cell | జీవకణం
పోటీ పరీక్షల ప్రత్యేకం
ఈ ప్రపంచంలోని ప్రతి జీవి దేహం కణాలతో నిర్మితమై ఉంటుంది. కొన్ని జీవులు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఏకకణ జీవులు అంటారు. ప్రొటోజోవన్లు, కొన్ని రకాల మొక్కలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏకకణ జీవులు మినహా మిగతావన్నీ బకణ జీవులు. ఇవి అనేక కణాల సమూహంగా ఏర్పడిన జీవులు. బకణ జీవుల్లో కణ పరిమాణం జీవినిబట్టి, జీవిలోని భాగాలనుబట్టి వేర్వేరుగా ఉంటుంది. అయితే జీవుల పరిమాణం మాత్రం కణ పరిమాణం మీద కాకుండా కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అంటే చిన్న జీవుల్లో కణాల సంఖ్య తక్కువగా, భారీ జీవుల్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జీవుల దేహ నిర్మాణంలో, జీవక్రియల్లో ఎంతో కీలక పాత్ర పోషించే కణం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..
కణాంగాలు
– వృక్షాలు, జంతువుల్లోని ప్రతి కణంలో వివిధ రకాల విధుల నిర్వహణ కోసం వివిధ కణాంగాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి కణ త్వచం, కేంద్రకం, కణ ద్రవ్యం.
– కణ త్వచం: కణంలోని కణద్రవ్యానికి, ఇతర కణాంగాలకు రక్షణ కల్పిస్తుంది.
– కేంద్రకం: వృక్ష, జంతు కణాలన్నింటిలో కేంద్రకం ఉంటుంది. అయితే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాల కణాల్లో ఈ కేంద్రకం ఉండదు. అందుకే వీటిని కేంద్రకపూర్వ జీవులు అంటారు. కేంద్రకం ఉన్న జీవులను నిజకేంద్రక జీవులు అంటారు. జీవి జీవక్రియల్లో కేంద్రకం కీలకపాత్ర పోషిస్తుంది.
-కణద్రవ్యం: ఇది కూడా వృక్ష, జంతు కణాల్లో ఉంటుంది. కణద్రవ్యంలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని రెండు రకాలు ఉంటుంది. గరుకు అంతర్జీవ ద్రవ్య జాలంలో రైబోజోమ్లు ఉంటాయి.
– కణ కవచం: వృక్ష కణాల్లో కణ త్వచం పైన ఆవరించి ఉంటుంది. ఇది సెల్యులోజ్ నిర్మితమైనది.
– పైన పేర్కొన్న ప్రధాన కణాంగాలతో పాటు జీవ కణాల్లో గాల్జీ సంక్లిష్టాలు, మైటోకాండ్రియా, రైబోజోమ్లు, లైసోజోమ్లు, రిక్తికలు, సెంట్రియోల్స్ అనే కణాంగాలు ఉంటాయి.
– కణకవచం, హరిత రేణువు, రిక్తికలు వృక్ష కణాల్లో ఉంటాయి. జంతు కణాల్లో ఉండవు. అదేవిధంగా సెంట్రియోల్స్ జంతుకణాల్లో ఉంటాయి. వృక్ష కణాల్లో ఉండవు.
కణం అంటే..?
– జీవిలోని ఒక నిర్మాణాత్మకమైన, క్రియాత్మకమైన ప్రమాణాన్ని కణం అంటారు. జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి. ప్రతి కణంలో వివిధ రకాల జీవక్రియలు జరుగుతాయి. కణాన్ని రాబర్ట్ క్ అనే శాస్త్రవేత్త 1665లో కనుగొన్నాడు. ఆయన సూక్ష్మదర్శిని సాయంతో బెరడు కణజాలాన్ని పరిశీలించి, దానిలో తేనెపట్టులో ఉన్నట్లుగా గదులు ఉన్నాయని గుర్తించాడు. ఆ గదులనే కణాలుగా పేర్కొన్నాడు.
-ఆంటోనివాన్ లీవెన్ హాక్ అనే శాస్త్రవేత్త ఏకకణయుత (ఒకే కణం కలిగిన) స్వేచ్ఛా సూక్ష్మజీవులను కనిపెట్టాడు. అంటే అమీబా, యూగ్లినా, పారామీషియం మొదలైన ప్రొటోజోవన్లు, కొన్ని రకాల శైవలాలను లీవెన్ హాక్ గుర్తించాడు. ఆ తర్వాత రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త 1831లో జీవి కణంలో కేంద్రకం ఉంటుందని కనుగొన్నాడు. రుడాల్ఫ్ విర్షా అనే శాస్త్రవేత్త 1855లో కణ అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
-మథియాస్ ష్లెడెన్, థియోడర్ ష్వాన్ అనే శాస్త్రవేత్తలు కణంపై మరిన్ని పరిశోధనలు చేసి 1838లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి. ప్రతి కణం వాటి ముందున్న కణాల నుంచి ఏర్పడుతుంది. అదేవిధంగా జీవుల్లో జీవక్రియలన్నీ కణాల్లోనే జరుగుతాయి. అందుకోసం ప్రతి కణంలో కణాంగాలు ఉంటాయి.
కణాలు-ప్రత్యేకతలు
-జీవుల్ల్లో కణాలు అన్ని ఒకే పరిమాణంలో కాకుండా వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటాయి.
– అతిచిన్న కణం
– మైకోప్లాస్మా (బ్యాక్టీరియా)
-అతిపెద్ద కణం
– ఆస్ట్రిచ్ అండ కణం
-అతి పొడవైన కణం
– నాడీ కణం
– మానవుల్లో అతిపెద్ద కణం
– అండ కణం
– మానవుల్లో అతిచిన్న కణం
– శుక్ర కణం
– వృక్షాల్లో అతిపెద్ద కణం
– సైకస్ అండ కణం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?