వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ( క్రీడలు)
భగ్వాని దేవి
ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో 94 ఏండ్ల స్ప్రింటర్ భగ్వాని దేవి డాగర్ స్వర్ణ పతకం సాధించింది. 100 మీ. పరుగు ఆమె 24.74 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. అంతేకాకుండా రెండు కాంస్య పతకాలు గెలిచింది.
81 ఏండ్ల ఎంజే జాకబ్ 200, 80 మీటర్ల హార్డిల్స్‌లో కాంస్య పతకాలు సాధించాడు. ఈయన గతంలో కేరళలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఈ పోటీలు ఫిన్లాండ్లోని తంపెరేలో జూన్ 29 నుంచి జూలై 10 వరకు నిర్వహించారు.
ఎలెనా రిబకినా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కజకిస్థాన్ క్రీడాకారిణి ఎలెనా రిబకినా గెలుచుకుంది. జూలై 9న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ట్యునీషియా క్రీడాకారిణి ఓన్స్ జబీఉర్ను ఓడించింది.
జొకోవిచ్
సెర్బియా టెన్నిస్ ఆటగాడు వాక్ జొకోవిచ్ వింబుల్డన్-2022 టైటిల్‌ను గెలుచుకున్నాడు. జూలై 10న లండన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్‌ను ఓడించాడు. జొకోవిచ్ 2018 నుంచి వరుసగా ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిళ్లు గెలిచిన జాబితాలో జొకోవిచ్ నాలుగోవాడు. అంతకుముందు ఈ ఘనతను రోజర్ ఫెదరర్, పీట్ సంప్రాస్, బ్జోర్న్ బోర్గ్ సాధించారు. జకోవిచ్‌కు ఇది 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్.అత్యధిక వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకుంది రోజర్ ఫెదరర్ (8), మహిళల్లో మార్టినా నవ్రతిలోనా (9).
చార్లెస్ లెక్లెర్క్
ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్‌ను ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్లెర్క్ గెలిచాడు. జూలై 10న ఆస్ట్రియాలోని స్పీల్బర్గ్లో జరిగిన రేసులో మొదటి స్థానంలో లెక్లెర్క్ నిలువగా.. రెండో స్థానంలో రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్, మూడో స్థానంలో మెర్సిడెజ్ రేసర్ లూయిస్ హామిల్టన్ నిలిచారు.
– బ్రిటిష్ గ్రాండ్ప్రిక్స్ను కార్లోస్ సైన్జ్ జూనియర్ (ఫెరారీ), కెనడియన్ గ్రాండ్ప్రిక్స్ను, అజర్బైజాన్ గ్రాండ్ప్రిక్స్ను మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) గెలిచారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?