Current Affairs May 17 | అంతర్జాతీయం
విక్టరీ డే
విక్టరీ డేని మే 9న రష్యా నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ఈ డేని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సైనిక కవాతు చేపడతారు. రష్యన్ నాయకులు రెడ్స్కేర్లోని వ్లాదిమిర్ లెనిన్ సమాధి వద్ద నిలబడి నివాళులర్పిస్తారు.
ముగ్గురి డీఎన్ఏలతో శిశువు
తమ దేశ చరిత్రలో తొలిసారిగా ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏను పంచుకుంటూ శిశువు జన్మించేలా చేసినట్లు బ్రిటన్ సైంటిస్టులు మే 10న వెల్లడించారు. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించి, ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో 99.8 శాతం డీఎన్ఏ తల్లిదండ్రులదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. దీనికి ‘మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్మెంట్ (ఎండీటీ)’గా నామకరణం చేశారు. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలాన్ని ఉపయోగించి ఐవీఎఫ్ పిండాలను సృష్టిస్తారు. తద్వారా పిల్లలకు తల్లుల ద్వారా వ్యాధులు సోకుండా నిరోధిస్తారు.
సౌదీ ఈ-వీసా
పాస్పోర్టులపై సంప్రదాయ వీసా స్టిక్కర్ల స్థానంలో కొత్త ఈ-వీసా విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఈజిప్ట్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం మే 11న వెల్లడించింది. మొదటి దశలో ఈ విధానాన్ని ఏడు దేశాలు.. భారతదేశం, యూఏఈ, జోర్డాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో అమలు చేయడానికి నిర్ణయించింది. సౌదీ అరేబియా తన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి ఈ-వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?