ఫ్యాబ్రికేటెడ్ ఆర్సీసీ షెడ్లు
మీకు తెలుసా ?
# రాష్ట్రంలో పారిశ్రామిక వాడల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం సకల సౌకర్యాల (ప్లగ్ ఆండ్ ప్లే) తో ఫ్యాబ్రికేటెడ్ ఆర్సీసీ షెడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణియించింది. పారిశ్రామిక వేత్తలు నేరుగా తమ యంత్ర సామగ్రితో వచ్చి ఇక్కడ పరిశ్రమలను ప్రారంభించేందుకు వీలు కల్పించనుంది. ఈ విధానంలో సర్కారు నిర్మాణాలు చేపట్టడం ఇదే మొదటిసారి. తొలుత హైదరాబాద్ శివార్లలోని దండు మల్కా పూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో 75 ఎకరాల్లో దాదాపు 500 షెడ్లను నిర్మించనున్నారు. దశల వారీగా ఇతర కొత్త పారిశ్రామిక వాడలకూ విస్తరించనున్నారు.
# తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) నిర్వహిస్తున్న దండుమల్కాపూర్లోని పార్కులో ఇప్పటికే 500లకు పైగా పరిశ్రమలకు అనుమతి లిచ్చారు. వాటిలో కొన్ని ప్రారంభ మయ్యాయి. పార్కుల్లో స్థలాలకు డిమాండ్ ఉండటంతో అక్కడే తొలుత షెడ్లను నిర్మించ నున్నారు. ఫ్యాబ్రికేటెడ్ ఫ్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్తోపాటు రీఇన్ పోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్సీసీ) షెడ్లను నిర్మిస్తారు. ఒక్కో షెడ్ నాలుగు మీటర్ల ఎత్తు ఉంటుంది. దానికి విద్యుత్, టెలికాం, నీరు, మురుగునీటి పారుదల వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తం 10.60 లక్షల చ.అ నిర్మాణ స్థలాన్ని షెడ్లుగా అభివృద్ధి చేస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?