Current Affairs – TSPSC Group 4 Special | 2023 ఏప్రిల్‌లో ఏర్పాటైన టీవీ సోమనాథన్ కమిటీ ఉద్దేశం?
1. కేంద్ర జలశక్తి శాఖ 2023 ఏప్రిల్‌లో విడుదల చేసిన దేశంలో మొదటి వాటర్ బాడీల నివేదికను బట్టి అత్యధిక వాటర్‌బాడీలు కలిగిన రాష్ర్టాలను వరుసక్రమంలో అమర్చండి.
1. ఉత్తర ప్రదేశ్ 2. ఆంధ్రప్రదేశ్
3. అసోం 4. పశ్చిమబెంగాల్
5. ఒడిశా
ఎ) 1, 4, 2, 5, 3
బి) 4, 1, 2, 3, 5
సి) 1, 2, 4, 5, 3
డి) 4, 1, 2, 5, 3
2. మెదడు, వెన్నుపాములోని ప్రాణాంతక కణితులను గుర్తించడానికి మెషిన్ లెర్నింగ్ ఆధారిత గణన సాధనం ‘జీబీఎం డ్రైవర్’ను అభివృద్ధి చేసింది?
ఎ) ఐఐటీ, బాంబే
బి) ఐఐటీ, కాన్పూర్
సి) ఐఐటీ, మద్రాస్
డి) ఐఐటీ, ఢిల్లీ
3. 2023 మార్చి 2న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి సరైన వాక్యం?
1. ఈ తీర్పును ‘అనూప్ బరన్వాల్ v/s యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇచ్చింది
2. ఈ తీర్పును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది
3. ఈ ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ‘డీ వై చంద్రచూడ్’ నేతృత్వంలో ఏర్పడింది
ఎ) 1, 3 బి) 1, 2, 3
సి) 1, 2 డి) 3
4. ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కూటమి నాటో గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. నాటో అనేది వాషింగ్టన్ ట్రీటీ ద్వారా ఏర్పాటయ్యింది
2. నాటోలో 2023 ఏప్రిల్ 4న ‘ఫిన్లాండ్’ కొత్తగా సభ్యత్వం పొందింది
3. నాటోలో ప్రస్తుతం 31 సభ్యదేశాలు ఉన్నాయి
4. నాటో అనేది యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు సభ్యత్వం గల కూటమి
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3
సి) 2, 3, 4 డి) 1, 2, 3, 4
5. 2023 మే నెల మొదటి వారం వరకు గల డేటా ప్రకారం, వివిధ రకాల సంస్థలు/నివేదికల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం వృద్ధి రేటు అంచనాలను జతపరచండి.
1. ఆసియా అభివృద్ధి బ్యాంక్
ఎ. 6-6.8 శాతం
2. భారత ఆర్థిక సర్వే : 2022-23 బి. 6.3 శాతం
3. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సి. 6.1 – 6.7 శాతం
4. ప్రపంచ బ్యాంక్ డి. 6.4 శాతం
5. భారతీయ రిజర్వ్ బ్యాంక్
ఇ. 6.5 శాతం ఎఫ్. 5.9 శాతం
ఎ) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-ఎఫ్
బి) 1-డి, 2-ఎ, 3-ఎఫ్, 4-బి, 5-ఇ
సి) 1-ఇ, 2-ఎ, 3-సి, 4-ఎఫ్, 5-డి
డి) 1-ఇ, 2-ఎ, 3-ఎఫ్, 4-డి, 5-బి
6. 2023 ఏప్రిల్ 20న 123 సరిహద్దు గ్రామాల సమస్య పరిష్కారానికి న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరెణ్ రిజిజుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ర్టాలు?
ఎ) అసోం, నాగాలాండ్
బి) నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్
సి) అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర
డి) అసోం, అరుణాచల్‌ప్రదేశ్
7. 2023 ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేద్కర్ జీవితంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సంయుక్తంగా ‘భారత్ గౌరవ్’ రైలు ప్రారంభించారు. ఈ రైలు ఏ మార్గాల్లో ప్రయాణిస్తుంది?
ఎ) న్యూఢిల్లీ – నాగ్‌పూర్ – మౌ – సాంచి – సారనాథ్ – గయ – రాజ్‌గిర్
బి) న్యూఢిల్లీ – మౌ- నాగ్‌పూర్ – సాంచి – సారనాథ్ – గయ – రాజ్‌గిర్ – నలంద
సి) న్యూఢిల్లీ – నాగ్‌పూర్ – మౌ – సారనాథ్ – సాంచి – గయ – రాజ్‌గిర్ – నలంద
డి) న్యూఢిల్లీ – మౌ – నాగ్‌పూర్ – సారనాథ్ – గయ – రాజ్‌గిర్ – మౌ
8. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ) జీ20 12వ వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తల సమావేశం వారణాసిలో జరిగింది
బి) ఇది భారత్ అధ్యక్షతన జరిగిన 101వ సమావేశం
సి) ఈ 12వ సమావేశంలో తృణధాన్యాలపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనకు భారత్ ‘మహర్షి’ కార్యక్రమం ప్రతిపాదించింది
డి) ఐక్యరాజ్య సమితి 2023ను ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’ గా ప్రకటించింది
9. 2023 మార్చి 18న భారత్ ప్రధాని నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంయుక్తంగా ‘IBFP’ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. IBFP అంటే?
ఎ) India – Bangladesh Fuel Pipeline
బి) India – Bangladesh Friendship Project
సి) India – Bangladesh Fuel Project
డి) India – Bangladesh Friendship Pipeline
10. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. ఈ సీజన్లో మొత్తం అత్యధికంగా 12 సెంచరీలు నమోదవ్వగా, వాటిని 9 మంది బ్యాటర్లు చేశారు
2. ఈ సీజన్లో ఒకే ఒక హ్యాట్రిక్ వికెట్ల ప్రదర్శన నమోదైంది
3. ఈ సీజన్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసింది శుభ్‌మన్ గిల్
4. ఈ సీజన్లో అత్యధిక సెంచరీలు చేసింది విరాట్ కోహ్లీ
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
11. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1. జీ20 2వ మౌలిక సదుపాయాల కార్యవర్గ సమావేశం విశాఖపట్నంలో జరిగింది
2. జీ20 2వ డిజిటల్ ఎకానమీ కార్యవర్గం సమావేశం హైదరాబాద్‌లో జరిగింది
3. జీ20 3వ ఆరోగ్య కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది
4. జీ20 వ్యవసాయశాఖ మంత్రుల ‘ప్రపంచ వ్యవసాయ సదస్సు’ హైదరాబాద్‌లో జరుగనుంది
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
12. సముద్ర శక్తి విన్యాసాలు -2023 గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఎ) ఇవి 4వ విన్యాసాలు
బి) ఇవి భారతదేశం, ఇండోనేషియాల మధ్య జరిగాయి
సి) ఇవి అరేబియా సముద్ర తీరంలో జరిగాయి
డి) ఇవి నావికా దళ విన్యాసాలు
13. 2023 మే 28న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన నూతన పార్లమెంట్ భవనం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. దీని గోడల నిర్మాణానికి VNext ఫైబర్ సిమెంట్ బోర్డ్స్ ఉపయోగించారు. వీటిని హైదరాబాద్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ అందించింది
2. నూతన పార్లమెంట్ డిజైన్‌ను రూపొందించింది బిమల్ హస్ముఖ్ పటేల్
3. నూతన పార్లమెంట్లో ఉంచిన కుడ్య చిత్రాలు ‘అఖండ భారత్’ను తెలియజేస్తాయి
4. నూతన పార్లమెంట్లో ఉంచిన కుడ్య చిత్రాలు ‘అశోకుని సామ్రాజ్యం’ను తెలియజేస్తాయి
5. నూతన పార్లమెంట్ కుడ్య చిత్రాలను నేపాల్, పాకిస్థాన్ వ్యతిరేకించాయి
ఎ) 1, 2, 3 బి) 2, 4, 5
సి) 1, 3, 4, 5 డి) 1, 2, 3, 4
14. ఏ ప్రాంతంలో స్థాపించిన 5జీ నెట్వర్క్ సైట్‌తో 2 లక్షలు పూర్తి అయ్యాయి?
ఎ) గంగోత్రి బి) అయోధ్య
సి) వారణాసి డి) కాన్పూర్
15. కింది వాటిలో సరైన వాక్యమేది?
1. 2022లో భారత్‌ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 6.19 మిలియన్లు
2. 2021లో భారత్‌ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 1.52 మిలియన్లు
3. 2022లో భారత్‌లో తీర్థయాత్ర ప్రాంతాలను సందర్శించిన స్వదేశీ పర్యాటకుల సంఖ్య 1.433 మిలియన్లు
4. PRASHAD పథకాన్ని 2014-15 లో ప్రారంభించారు
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 3
16. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ కమిటీ ఆన్ కన్జ్యూమర్ పాలసీ ప్లీనరీ గురించి సరైనది గుర్తించండి.
1. 44వ ప్లీనరీ
2. ఇది మే 23 నుంచి 26 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది
3. దీన్ని పీయూష్ గోయల్ ప్రారంభించారు
ఎ) (1), (2) సరైనవి, (3) కాదు
బి) (1) సరైనది (2), (3) కాదు
సి) (1), (2), (3) సరైనవి
డి) (1), (3) సరైనవి
17. వివిధ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డులు పొందిన వాటిని జతపరచండి.
1. ఆస్కార్ అవార్డ్స్ -2023 ఎ. Everywhere Everything All at Once
2. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ – 2023 బి. The Fabelmans
3. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ – 2023 సి. GanguBhai Kathiawadi
4. ఐఫా అవార్డ్స్ – 2023 డి. Drishyam 2
5. జాతీయ చలనచిత్ర అవార్డులు – 2020 ఇ. Soorarai Pottru ఎఫ్. Tanhaji – The unsung Warrior
ఎ) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఎఫ్, 5-ఇ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఎఫ్, 5-డి
సి) 1-ఎ, 2-ఎఫ్, 3-ఇ, 4-డి, 5-సి
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
18. 2023 జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ కంపెనీ ‘హిండెన్ బర్గ్’ భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై చేసిన ప్రధాన ఆరోపణ/ఆరోపణలను గుర్తించండి.
ఎ) స్టాక్ మార్కెట్ తారుమారు, అకౌంటింగ్ మోసాలు
బి) అకౌంటింగ్ మోసాలు
సి) స్టాక్ మార్కెట్ తారుమారు
డి) అకౌంటింగ్ మోసాలు, బ్యాంక్ లోన్లు ఎగవేత
19. భారతీయ రిజర్వ్‌బ్యాంక్ వార్షిక నివేదిక 2022-23 ప్రకారం కింది వాటిలో సరికాని వాక్యం?
ఎ) 2022-23లో రూ.20 , రూ.500 నోట్లలో నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య తగ్గింది
బి) 2022-23 నివేదిక ప్రకారం కరెన్సీ నోట్లలో 22.1 శాతం నోట్లు చిరిగిన నోట్లు
సి) 2022-23 నివేదిక ప్రకారం దేశ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు తగ్గింది
డి) 2022-23లో క్యూఆర్ కోడ్‌తో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్‌ను ఉపయోగించి నాణేలను పొందే మిషన్లను దేశవ్యాప్తంగా 12 నగరాల్లో 19 చోట్ల ఏర్పాటు చేశారు
20. 2023 మే 29న విజయవంతంగా ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ప్రయోగం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. దీని ద్వారా NVS-01 అనే ఉపగ్రహం పంపించారు
2. ఈ NVS-01 ఉపగ్రహం అనేది నావిగేషన్ ఉపగ్రహం
3. ఈ NVS-01 ఉపగ్రహం రెండవ తరంలో రెండవ ఉపగ్రహం
4. ఈ NVS-01 బరువు 2322 కిలోలు
ఎ) పైవన్నీ బి) 1, 2
సి) 1, 2, 3 డి) 1, 3, 4
21. బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం జరిగిన తేదీ?
ఎ) 2023 మే 5 బి) 2023 మే 6
సి) 2023 మే 7 డి) 2023 మే 4
22. 2023 ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ గురించి సరైనది గుర్తించండి.
1. ఇది లండన్‌లోని ది ఓవల్‌లో జరిగింది
2. ఇది రెండో సీజన్ ఫైనల్
3. దీన్ని ఆస్ట్రేలియా ఫైనల్లో ఇంగ్లండ్‌ని 209 పరుగుల తేడాతో ఓడించి గెలిచింది
4. దీని మొదటి సీజన్ 2021లో జరిగాయి. న్యూజిలాండ్, భారత్‌ని ఓడించి గెలిచింది
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1,2, 4 డి) పైవన్నీ
23. 2023 ఏప్రిల్‌లో కేంద్రం ఏర్పాటు చేసిన టీవీ సోమనాథన్ కమిటీ ఉద్దేశం?
ఎ) ‘మిషన్ కర్మయోగి’ని అమలు చేయడంపై విధివిధానాల రూపకల్పన
బి) అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై అధ్యయనం
సి) సుడాన్ అంతర్యుద్ధంలో భారతీయుల తరలింపుపై విధివిధానాలపై రూపకల్పన
డి) కేంద్రం నూతన పెన్షన్ విధానంపై అధ్యయనం
24. ఫిజి దేశానికి చెందిన అత్యున్నత పౌర సేవా పురస్కారమైన ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి’ని 2023 మేలో ఎవరికి, ఎందుకు ఇచ్చారు?
ఎ) ద్రౌపది ముర్ము, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి కావడం వల్ల
బి) నరేంద్ర మోదీ, ప్రపంచ నాయకత్వం కోసం
సి) జగదీప్ ధన్‌ఖడ్, ఫిజి భారత్‌ల మధ్య సంబంధాల కోసం కృషి వల్ల
డి) వెంకయ్య నాయుడు, ఫిజీ & భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాల కృషి వల్ల
25. 2023 క్వాడ్ సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ) మెల్బోర్న్, ఆస్ట్రేలియా
బి) న్యూఢిల్లీ, భారతదేశం
సి) వాషింగ్టన్, ఆమెరికా
డి) హిరోషిమా, జపాన్
ANS ;-
1.డి 2.సి 3.సి 4.బి
5.బి 6.డి 7.బి 8.బి
9.డి 10.ఎ 11.సి 12.సి
13.డి 14.ఎ 15.బి 16.సి
17.డి 18.ఎ 19.ఎ 20.బి
21.బి 22.సి 23.డి 24.బి
25.డి
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?