Current Affairs May 31 | వార్తల్లో వ్యక్తులు
వార్తల్లో వ్యక్తులు
పాసంగ్ దావా
పాసంగ్ దావా అనే షెర్పా (పర్వతారోహకుల గైడ్) 27వ సారి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి కామి రీటా పేరు మీద ఉన్న రికార్డును సమం చేశారు. 46 ఏండ్ల పాసంగ్ ఎవరెస్ట్ శిఖరాన్ని 27వ సారి అధిరోహించారని ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మే 22న వెల్లడించారు. ఈయన మొదటిసారి 1998లో ఎవరెస్టును అధిరోహించారు. మే 14న 26వ సారి ఎవరెస్టును ఎక్కారు.
సమీర్ పాండే
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్రమట్ట నగరానికి భారత సంతతికి చెందిన సమీర్ పాండే మేయర్‌గా మే 22న ఎన్నికయ్యారు. 2022లో పర్రమట్ట డిప్యూటీ మేయర్‌గా వ్యవహరించారు. 2017లో తొలిసారిగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
జశ్వంత్ సింగ్
మధ్య ఇంగ్లండ్‌లోని కోవెంట్రీ నగరానికి మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జశ్వంత్ సింగ్ బిర్డి మే 22న ఎన్నికయ్యారు. దీంతో ఆ నగరానికి మేయర్‌గా ఎన్నికైన మొదటి సిక్కు వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పంజాబ్‌లో జన్మించిన ఆయన కుటుంబం 60 ఏండ్ల క్రితం ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. 16 ఏండ్ల నుంచి స్థానిక కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ పదవిని ఏడాది పాటు నిర్వహిస్తారు.
జార్జి గాస్పోడినోవ్
బల్గేరియా రచయిత జార్జి గాస్పోడినోవ్, అనువాదకురాలు ఏంజెలా రోడెల్ (అమెరికా)కు సంయుక్తంగా ఈ ఏడాది బుకర్ ప్రైజ్ మే 23న లభించింది. జార్జి రచించిన ‘టైమ్ షెల్టర్’ నవల బుకర్ ప్రైజ్‌కు ఎంపిక కాగా, ఈ నవలను ఇంగ్లిష్‌లోకి ఏంజెలా రోడెల్ అనువదించారు. దీంతో ఇద్దరికి కలిపి ఈ ప్రైజ్‌ను అందజేశారు. బల్గేరియాలో ప్రచురించిన నవలకు బుకర్ ప్రైజ్ రావడం ఇదే ప్రథమం. 62 వేల డాలర్ల ప్రైజ్‌మనీని ఇద్దరికి పంచుతారు.
హర్ష్ జైన్
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కొత్త చైర్‌పర్సన్‌గా హర్ష్ జైన్ మే 25న ఎంపికయ్యారు. ఈయన ఈ పదవిలో రెండేండ్లు ఉంటారు. ఈయన డ్రీమ్11 సహ వ్యవస్థాపకుడు. ఐఏఎంఏఐ వైస్ చైర్‌పర్సన్‌గా రాజేశ్ మాగో ఎంపికయ్యారు. ఈయన మేక్ మే ట్రిప్ సహవ్యవస్థాపకుడు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్,
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?