Current Affairs July | ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం?
1. యూఎన్వో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన భారతదేశ స్టార్టప్ ఏది?
1) ఎతిక్ట్ 2) పోరెంట్
3) షైన్మాక్ 4) ఫార్మర్స్ ఫ్రెష్ జోన్
2. రైతులకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరితో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) గరుడ ఏరోస్పేస్ 2) అమెజాన్ కిసాన్
3) భారతీయ రైల్వే 4) ఇస్రో
3. ఇటీవల పంచకుల, చండీగఢ్‌లలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద వెల్నెస్ సెంటర్లను ఎవరు ప్రారంభించారు?
1) ఎం.మాండవీయ 2) మోదీ
3) అమిత్ షా 4) పి.గోయల్
4. మహిళలకు ఉచిత బస్సు పథకం ‘శక్తి’ ఏ రాష్ర్టానికి చెందినది?
1) అసోం 2) కర్ణాటక
3) మహారాష్ట్ర 4) గోవా
5. అశోక చక్ర అవార్డు అందుకున్న తొలి కేరళీయుడు ఎవరు?
1) హవల్దార్ ఆల్బీడి క్రూజ్
2) విశాంక్ నవాల్
3) సిద్ధార్థ మహంతి
4) సుభాష్ కేశల్
6. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమృత్ జల్ క్రాంతి ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ యాక్షన్ ప్లాన్ 2023-25ని ప్రారంభించింది?
1) హర్యానా 2) అసోం
3) కేరళ 4) గోవా
7. దేశంలో రోడ్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
1) పంజాబ్ 2) ఒడిశా
3) హర్యానా 4) అసోం
8. ‘సాగర్ సమృద్ధి’ ఆన్లైన్ డ్రెడ్జింగ్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఎవరు ప్రారంభించారు?
1) పి.గోయల్ 2) ఎస్.సోనోవాల్
3) రాజ్‌నాథ్ సింగ్ 4) అమిత్ షా
9. గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రోతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ ఏది?
1) టాటా పవర్ 2) టాటా ELXSI
3) RIL 4) ONGC
10. IQ ఎయిర్ ప్రకారం ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో దేశంలో ఎన్ని ఉన్నాయి?
1) 71 2) 65 3) 45 4) 32
11. హార్వర్డ్ యూనివర్సిటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్‌గా ఏ భారతీయ అమెరికన్ నియమితులయ్యారు?
1) గీత్ సేథి 2) రీతూ కల్రా
3) నేహ టాండన్ 4) గీతా గోపినాథ్
12. ‘I AM ADYAR, ADYAR IS ME’ అనే ప్రచారాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది?
1) కెనరా బ్యాంకు 2) ఫెడరల్ బ్యాంకు
3) ఐసీఐసీఐ 4) YES BANK
13. ఇండియా, ఫ్రాన్స్, యూఏఈ మొదటి మారిటైమ్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించాయి?
1) బంగాళాఖాతం
2) ఏడెన్ గల్ఫ్
3) అరేబియా సముద్రం
4) ఒమన్ గల్ఫ్
14. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?
1) రోహిత్ శర్మ 2) పుజారా
3) విరాట్ కోహ్లీ 4) కె.ఎల్. రాహుల్
15. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ పతకాల జాబితాలో భారత్ స్థానం ఎంత?
1) 1 2) 2 3) 3 4) 4
16. వరల్డ్ అక్రెడిటేషన్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 8 2) జూన్ 9
3) జూన్ 7 4) జూన్ 10
17. దేశంలో ఆహార ప్రమాణాల భద్రత సూచీలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
1) కేరళ 2) బీహార్
3) హర్యానా 4) అసోం
18. దేశంలో ఆహార ప్రమాణాల భద్రత సూచీలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు ఏయే స్థానాల్లో నిలిచాయి?
1) 14, 17 2) 14, 16
3) 17, 14 4) 17, 15
19. అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) శాంతను గుప్తా 2) శశిథరూర్
3) కె.ఎం.త్రివేది 4) జుంపాలహరి
20. దేశంలో పర్యావరణ అభివృద్ధి పనితీరులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
1) తెలంగాణ 2) కేరళ
3) మహారాష్ట్ర 4) గోవా
సమాధానాలు
1. 4 2. 2 3. 1 4. 2
5. 1 6. 1 7. 1 8. 2
9. 2 10. 2 11. 2 12. 2
13. 4 14. 3 15. 1 16. 2
17. 1 18. 1 19. 1 20. 1
1. WHO ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రజారోగ్యం, ఆర్థిక పొదుపుపై ఏ భారతదేశ కార్యక్రమాన్ని ప్రశంసించింది?
1) PMJDY 2) హర్‌ఘర్‌జల్
3) లైఫ్ 4) మిషన్ వాత్సల్య
2. దేశంలో అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ప్రకటించింది?
1) 3 2) 4 3) 2 4) 5
3. భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన మణిపూర్‌లో శాంతి కమిటీని ఏర్పాటు చేసింది?
1) అనసూయ యుకే 2) అమిత్ షా
3) రాజ్‌నాథ్ సింగ్ 4) పి.గోయల్
4. జాతీయ స్థాయి ఈట్‌రైట్ చాలెంజ్ ఫేజ్-2లో ఏ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది?
1) కోయంబత్తూర్ 2) విశాఖపట్నం
3) కొచ్చి 4) థానే
5. శిక్షణ, అభ్యాసం పరస్పర మార్పిడి కోసం ఏ బార్ కౌన్సిల్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) బార్ కౌన్సిల్ ఆఫ్ జపాన్
2) బార్ కౌన్సిల్ ఆఫ్ సింగపూర్
3) బార్ కౌన్సిల్ ఆఫ్ శ్రీలంక
4) బార్ కౌన్సిల్ ఆఫ్ ఇంగ్లండ్
6. ‘మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్’ నివేదిక ప్రకారం ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరం ఏది?
1) బెంగళూరు 2) చెన్నై
3) ముంబై 4) లక్నో
7. అంతర్గత భద్రత, ఆర్థిక నేరాలు, చట్ట అమలు కార్పొరేట్ మోసాలు సహకారం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుంది?
1) అంబేద్కర్ 2) ఉస్మానియా
3) ఆంధ్ర 4) రాష్ట్రీయ రక్షా
8. ఏ ఐఐటీ ఇంక్యుబేటెడ్ స్పేస్ స్టార్టప్ ప్రపంచంలోని మొదటి బహుళ సెన్సర్ భూ పరిశీలన ఉపగ్రహం ‘దృష్ట’ను ప్రారంభించింది?
1) ఢిల్లీ 2) మద్రాస్
3) కాన్పూర్ 4) హైదరాబాద్
9. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏనుగుల కదలికలపై పర్యవేక్షణకు ఎలిఫెంట్ ట్రాకింగ్ అండ్ అలర్ట్ యాప్‌ను ప్రారంభించింది?
1) కేరళ 2) ఛత్తీస్‌గఢ్
3) ఒడిశా 4) తమిళనాడు
10. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి ‘ఎయిర్జల్ది’ అనే సంస్థ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) గూగుల్ 2) మైక్రోసాఫ్ట్
3) మెటా 4) ఎయిర్టెల్
11. పారిస్ డైమండ్ లీగ్ 2023లో పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన ఏ అథ్లెట్ మూడో స్థానంలో నిలిచాడు?
1) వివేక్ చంద్ర 2) కల్యాణ్ దాస్
3) మురళీ శంకర్ 4) అరుణ్ కుమార్
12. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్న పోలాండ్ క్రీడాకారిణి ఎవరు?
1) రికామొతిష్ 2) హరామాక్
3) ఇగా స్వియాటెక్ 4) అలీనా
13. భారత్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మిస్ వరల్డ్ టైటిల్ సాధించారు?
1) 6 2) 5 3) 7 4) 4
14. ఇటీవల అమెరికా ఏ దేశంతో అట్లాంటిక్ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టింది?
1) ఇండియా 2) యూకే
3) జపాన్ 4) చైనా
15. ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం?
1) కేరళ 2) గోవా
3) కర్ణాటక 4) బీహార్
16. దేశంలో ఆహార భద్రతా ప్రమాణాల సూచీలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం?
1) సిక్కిం 2) ఉత్తరప్రదేశ్
3) బీహార్ 4) అసోం
17. చిన్న రాష్ట్రాల్లో ఆహార భద్రతా ప్రమాణాల సూచీలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) గోవా 2) సిక్కిం
3) త్రిపుర 4) మిజోరం
18. దేశంలో మొత్తం ఎన్ని అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి?
1) 1414 2) 1514
3) 1614 4) 1714
19. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది?
1) హాంకాంగ్ 2) సింగపూర్
3) పారిస్ 4) జ్యూరిచ్
20. దేశంలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరం ఏది?
1) బెంగళూరు 2) న్యూఢిల్లీ
3) వారణాసి 4) హైదరాబాద్
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 1
5. 4 6. 3 7. 4 8. 2
9. 2 10. 2 11. 3 12. 3
13. 1 14. 2 15. 1 16. 2
17. 1 18. 2 19. 1 20. 2
1. యునెస్కోలో పునఃప్రవేశానికి సిద్ధమైన దేశం?
1) అమెరికా 2) యూకే
3) జపాన్ 4) చైనా
2. ఇటీవల మరణించిన సిల్వియో బెర్లుస్కోని ఏ దేశ మాజీ ప్రధానమంత్రి?
1) జపాన్ 2) ఇటలీ
3) కెనడా 4) జర్మనీ
3. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అణ్వాయుధాలను భారీగా పెంచుకున్న దేశం ఏది?
1) ఇండియా 2) అమెరికా
3) చైనా 4) రష్యా
4. 2023 స్కాష్ ప్రపంచకప్‌ను భారత్‌లోని ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది?
1) ముంబై 2) చెన్నై
3) కోల్‌కతా 4) బెంగళూరు
5. 2023 ఫిఫా అండర్-20 ప్రపంచకప్ విజేతగా ఉరుగ్వే నిలిచింది. అయితే రన్నర్ ఎవరు?
1) ఇటలీ 2) స్పెయిన్
3) జపాన్ 4) అమెరికా
6. వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు?
1) సెరెనా విలియమ్స్
2) ఇగా స్వియాటెక్
3) సునీతా విలియమ్స్
4) నవోమి వొసాకా
7. భారత్ ఏ దేశంతో చమురేతర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది?
1) యూఏఈ 2) ఇరాన్
3) ఇరాక్ 4) అమెరికా
8. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక బొగ్గు నిక్షేపాలు కలిగిన దేశాల్లో భారత్ ర్యాంకు ఎంత?
1) 2 2) 3 3) 4 4) 5
9. ఖనిజాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) ఒడిశా 2) జార్ఖండ్
3) కర్ణాటక 4) రాజస్థాన్
10. కేంద్ర గనుల శాఖ మంత్రి నివేదిక ప్రకారం ఖనిజాల ఉత్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల వాటా ఎంత శాతం?
1) 2% 2) 5%
3) 10% 4) 15%
11. నాగాడ్ మొబైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది, ఈ కంపెనీ ఏ దేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ?
1) నేపాల్ 2) బంగ్లాదేశ్
3) శ్రీలంక 4) భూటాన్
12. 2023 మే నెలకు మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు?
1) ైస్టెన్ వురుక్ 2) చమరి ఆటపట్టు
3) హర్షిత మాధవి 4) డి.పుత్తవాంగ్
13. 2023 మే నెలకు పురుషుల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు?
1) ఆర్.జడేజా
2) హ్యరీ టెక్టర్
3) డేవిడ్ మిల్లర్
4) కె.విలియమ్సన్
14. 2023 మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ ఏ దేశంపై గెలుపొందింది?
1) దక్షిణ కొరియా 2) పాకిస్థాన్
3) నేపాల్ 4) యూఏఈ
15. జగనన్న విద్యా కానుక కార్యక్రమం మొత్తం లబ్ధిదారులు ఎంత మంది?
1) 43,10,165
2) 42,10,165
3) 41,10,165 4) 44,10,165
సమాధానాలు
1. 1 2. 2 3. 3 4. 2
5. 1 6. 2 7. 1 8. 3
9. 1 10. 1 11. 2 12. 4
13. 2 14. 1 15. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?