Current Affairs- IPL 2023 Special | ఏటేటా ఐపీఎల్ ఆట.. ఫుల్ క్రేజ్ ఈ ఏట
ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 (IPL)
- ఇది 16వ సీజన్. దీన్ని స్పాన్సర్షిప్ కారణంగా ‘టాటా ఐపీఎల్’ అని పిలుస్తారు.
- టీ-20 పద్ధతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2023 మార్చి 31 నుంచి మే 29 వరకు నిర్వహించింది.
- ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ అరుణ్‌సింగ్ దుమాల్.
- ఈ సీజన్లో పాల్గొన్న జట్ల సంఖ్య-10. ఆడిన మొత్తం మ్యాచ్‌ల సంఖ్య-74.
- ఈ సీజన్లో పాల్గొన్న జట్లను రెండు గ్రూపులుగా (గ్రూప్-ఎ, గ్రూప్-బి) విభజించారు.
- గ్రూప్-ఎ లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి.
- గ్రూప్-బి లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి.
- ఒక్కొక్క జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడింది. ఓ గ్రూప్‌లోని ఒక జట్టు, రెండో గ్రూపులోని ఐదు జట్లతోనూ రెండేసి మ్యాచ్‌లు ఆడింది. అలాగే తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది.
- కరోనా కారణంగా 2020లో ఐపీఎల్ పూర్తిగా యూఏఈలో జరిగింది.
- 2021 సీజన్ సగం మ్యాచ్‌లు భారత్‌లో, సగం మ్యాచ్‌లు యూఏఈలో జరిగాయి.
- 2022లో 15వ సీజన్ ముంబై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో మాత్రమే నిర్వహించారు.
- 2023 సీజన్ మొత్తం 12 వేదికల్లో నిర్వహించారు. ఇందులో 10 జట్లు పేరుతో ఉన్న నగరాలు కాగా, కొత్తగా రెండు నగరాలు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చాయి.
అవి గువాహటి, ధర్మశాల. - గువాహటి నగరం ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ధర్మశాల 10 సంవత్సరాల తర్వాత ఐపీఎల్‌ను నిర్వహించింది.
ఈ సీజన్లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులు - బౌలర్ బంతి వేసేటప్పుడు ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ దురుద్దేశ పూర్వకంగా కదిలితే ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించి బ్యాటింగ్ జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు.
- నిర్ణీత సమయంలోగా ఫీల్డింగ్ జట్టు 20 ఓవర్లు పూర్తి చేయకపోతే (90 నిమిషాలు) 30 గజాల వలయం బయట నలుగురు
ఫీల్డర్లకే అనుమతిస్తారు. - టాస్ వేసిన తర్వాత తుది జట్టును ప్రకటించాలి. దీని వల్ల టాస్ ప్రాధాన్యం తగ్గించవచ్చు. పరిస్థితులకు తగినట్లు జట్టును ఎంచుకోవచ్చు.
- ఈ సీజన్లో వైడ్ బాల్, నోబాల్ లపై అంపైర్లు తీసుకొనే నిర్ణయాన్ని సమీక్ష కోరవచ్చు. ఇది 2023 మహిళల ఐపీఎల్లో తొలిసారి వాడారు.
- మ్యాచ్‌లను రసవత్తరంగా మార్చేందుకు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ప్రతిపాదించారు. మ్యాచ్ కోసం ప్రతీ జట్టు 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్లను ప్రకటించాలి. ఆ నలుగురిలో నుంచే ఒకరిని ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించొచ్చు.
- తుది 11 మందిలో విదేశీ ఆటగాళ్లు నలుగురి కంటే తక్కువ ఉంటే ఇంపాక్ట్ ఆటగాడిగా కచ్చితంగా భారత క్రికెటర్‌నే
ఎంచుకోవాలి. - ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కోసం మ్యాచ్ మధ్యలో వెళ్లిన ప్లేయర్ ఇంకా ఆ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు.
- ఒక ఇన్నింగ్స్ ముగిశాక లేదా ఓవర్ పూర్తయ్యాక లేదా వికెట్ పడ్డాక లేదా ఓ బ్యాటర్ వెళ్లాక ఇంపాక్ట్ ప్లేయర్ మైదానంలోకి రావాలి.
- ఒక బౌలర్ రెండు ఓవర్లు వేసిన తర్వాత అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ వస్తే అతను తన కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు.
- ఇంపాక్ట్ ప్లేయర్ అనేది బిగ్‌బాస్ లీగ్‌లోని ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ వలే ఉంటుంది.
- ఇంపాక్ట్ ప్లేయర్‌ను బీసీసీఐ తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022లో ఉపయోగించింది. దీనిలో ఢిల్లీ జట్టు హృతిక్
- షోకీన్ మణిపూర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దేశంలో తొలిసారిగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.
- 16వ సీజన్ ఐపీఎల్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్-తుషార్ దేశ్‌పాండే
- తుషార్ దేశ్‌పాండే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు. ఇతడు అంబటి రాయుడు స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్చి 31న దిగాడు.
- రెండో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) కేన్ విలియమ్సన్ స్థానంలో ఆడాడు.
- 16వ సీజన్ ఐపీఎల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభోత్సవం నిర్వహించగా ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ ప్రదర్శన ఆకట్టుకోగా తమన్నా, రష్మికా మందన్న డ్యాన్స్‌లతో అలరించారు.
- తొలి మ్యాచ్‌లో చైన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగింది. గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది.
2023 ఐపీఎల్ హైలెట్స్ - ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ వికెట్స్ తీసినది రషీద్ ఖాన్ (గుజరాత్ టైటాన్స్). ఈ హ్యాట్రిక్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై ఏప్రిల్ 9న సాధించాడు. వరుసగా ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీశాడు.
- అతి తక్కువ మ్యాచ్‌లు ఆడి అత్యంత వేగంగా 100 ఐపీఎల్ వికెట్లు తీసిన బౌలర్‌గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు రబాడ నిలిచాడు. ఈ ఘనత 64 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సాధించాడు. గతంలో ఈ రికార్డు లసిత్ మలింగ పేరిట ఉండేది. మలింగ తన 100వ వికెట్‌ను 2013లో తన 70వ మ్యాచ్‌లో తీశాడు.
- మే 11న ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వీ జైస్వాల్ నమోదు చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
- గతంలో ఈ రికార్డు ఇద్దరు బ్యాటర్లు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరు 14 బంతుల్లో వేగవంతమైన అర్ధసెంచరీ నమోదు చేశారు. కేఎల్ రాహుల్ ఈ ఘనతను 2018లో, పాట్ కమిన్స్ 2022లో నమోదు చేశారు.
- మే 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ప్లే ఆఫ్‌కు చేరింది.
- ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టు గుజరాత్ టైటాన్స్ కాగా, రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మూడు, నాలుగు జట్లు లక్నో సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్.
- క్వాలిఫయర్-1 మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగగా గుజరాత్‌ను చెన్నై ఓడించి ఫైనల్‌కు చేరింది. చెన్నై ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి.
- ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి క్వాలిఫయిర్-2కు వెళ్లింది.
- క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మంబయి, గుజరాత్ జట్లు ఆడగా గుజరాత్ ముంబయిని ఓడించి ఫైనల్‌కు చేరింది. గుజరాత్ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి.
- ఐపీఎల్ ఫైనల్ మే 28న అహ్మదాబాద్‌లో ఉండగా వర్షం కారణంగా రద్దయి మరుసటి రోజు అక్కడే నిర్వహించారు.
- ఫైనల్లో చెన్నై, గుజరాత్ జట్లు తలపడగా చెన్నై జట్టు విజేతగా నిలిచింది.
- గుజరాత్ చేసిన 214 పరుగులు ఇప్పటి వరకు ఐపీఎల్ ఫైనల్లో అత్యధికం.
- అత్యధిక పరుగులు చేసినది- శుభ్‌మన్ గిల్ (890) 17 మ్యాచ్‌లు (జీటీ)
- అత్యధిక వికెట్లు తీసినది- మహ్మద్ షమీ (28) 17 మ్యాచ్‌లు (జీటీ)
- ఈ సీజన్లో అత్యధికంగా 12 సెంచరీలు నమోదయ్యాయి. శుభ్‌మన్ గిల్ 3, విరాట్ కోహ్లీ 2 సెంచరీలు చేశారు.
- ఈ సీజన్లో నమోదైన సిక్సర్లు-1124. గతంలో ఈ రికార్డు 2022లో 1062 సిక్సర్లతో ఉండేది.
- మే 22న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ‘గ్రీన్ ఇనీషియేటివ్’ను ప్రకటించింది.
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మే 6న ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి
ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. - రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్ యజువేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు (184) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు డ్వేన్ బ్రావో (183) పేరిట ఉంది.
- బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే బ్యాట్స్‌మెన్ ఒక బంతిని కూడా ఎదుర్కోకుండా సున్నా పరుగులకు రనౌట్ అవడం.
- ఈ సీజన్లో 1000వ సిక్స్ కొట్టిన ఆటగాడు కాన్వే (చెన్నై)
- ఐపీఎల్ విజేత జట్టుకు ప్రదానం చేసే ట్రోఫీపై ‘యత్ర ప్రతిభా అవసర్ ప్రాప్నోతి’ అని సంస్కృతంలో రాసి ఉంటుంది. అంటే ‘Where Talent Meets Opportunity’ అని అర్థం.
- ఈ సీజన్ ఫైనల్ కెప్టెన్ ధోనీకి 250వ మ్యాచ్. కెప్టెన్‌గా 10వ ఫైనల్ మ్యాచ్.
- మే 21న ముంబైతో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ విశ్రాంత్ శర్మ 47 బంతుల్లో 69 పరుగులు చేశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు.
- మే 21న విరాట్ కోహ్లీ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (101) చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏడు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (6) పేరిట ఉంది.
- చెన్నై జట్టు రూ.20 కోట్లు, రన్నరప్ గుజరాత్ రూ.12.5 కోట్లు ప్రైజ్‌మనీ పొందాయి.
- ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – కాన్వే (చెన్నై)
- క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్- ఎంఎస్ ధోనీ
- ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్- అజింక్య రహానే
- అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్- ట్రెంట్ బౌల్ట్ (ఆర్ఆర్)
- అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ – మహ్మద్ షమీ (జీటీ) (193)
- ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన – ఆకాశ్ మధ్వాల్ (ఎంఐ). 3.3 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
- హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ – రషీద్‌ఖాన్ (జీటీ)
- Upstox అత్యధిక విలువైన ఆటగాడు అవార్డు- శుభ్‌మన్ గిల్ (343 పాయింట్లు)
- Paytm ఫెయిర్ ప్లే అవార్డు- గుజరాత్ టైటాన్స్ (173 పాయింట్లు)
- పిచ్, గ్రౌండ్ అవార్డు- వాంఖడే స్టేడియం, ముంబై (50 లక్షలు), ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (50 లక్షలు)
గ్రీన్ ఇనీషియేటివ్
- బీసీసీఐ టాటా గ్రూప్ సంయుక్తంగా దీన్ని అమలు చేయనున్నాయి.
- క్వాలిఫయిర్-1 మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ వచ్చే డాట్‌బాల్‌కు 500 మొక్కలను దేశవ్యాప్తంగా దీనిలో భాగంగా నాటుతారు.
- అందుకోసమే బౌలర్ బంతిని వేసేటప్పుడు ఆ బంతికి బ్యాట్స్‌మెన్ ఎలాంటి పరుగులు తీయకపోతే అక్కడ ఒక చెట్టు బొమ్మ చూపించారు.
- ఫైనల్ ముందు మ్యాచ్ వరకు మొత్తం 1,24,000 మొక్కలు నాటారు.
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Previous article
IIM Recruitment | అమృత్సర్ ఐఐఎంలో ప్రోగ్రామ్ ట్రెయినీ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?