Current Affairs – Groups Special | జాతీయం
తులిప్ గార్డెన్
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్ పూలతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా రికార్డు సాధించింది. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గార్డెన్ ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఫ్లోరి కల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా ఆగస్టు 20న గుర్తింపు పత్రాన్ని అందజేశారు.
ఏఐ స్కూల్
కేరళలో ఏర్పాటు చేసిన మొదటి ఏఐ స్కూల్‌ను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 22న ప్రారంభించారు. ఈ స్కూల్‌ను తిరువనంతపురంలోని శాంతిగిరి విద్యాభవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏఐ స్కూల్ 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. మల్టీ టీచర్ రివిజన్ సపోర్ట్, మల్టీలెవల్ అసెస్మెంట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, సైకోమెట్రిక్ కౌన్సెలింగ్, కెరీర్ మ్యాపింగ్, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్, మెమరీ టెక్నిక్స్, కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్, ఇటర్వ్యూ-గ్రూప్ డిస్కషన్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్, ఇంగ్లిష్ ప్రావీణ్యం ఏఐ స్కూల్లో నేర్పుతారు.
భారత్ ఎన్‌క్యాప్
‘భారత్ ఎన్‌క్యాప్’ను కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు 22న ప్రారంభించారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ తరహాలో దేశీయ కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించేందుకు భారత్ ఎన్‌క్యాప్‌ను రూపొందించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించడంతో పాటు వినియోగదార్లకు సురక్షితమైన కార్లను అందించాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. దీనిలో ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్ (కారు ముందు), సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ (కారు కుడి లేదా ఎడమ వైపు), సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టులుంటాయి. ఈ విధానం పరీక్షించుకునేందుకు దేశీయ కార్ల తయారీ సంస్థలు 30కి పైగా కార్లను అందించాయి. ఇది పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభమైన తర్వాత పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రికల్ వెహికిల్స్లకు కూడా భద్రతా పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వనున్నారు. భారత్ ఎన్క్యాప్లో కార్లను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్) 197 ప్రకారం పరీక్షిస్తారు.
తేజస్
దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నుంచి అస్త్ర క్షిపణిని గోవా తీరంలో ఆగస్టు 23న విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఇది సాగింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. అస్త్ర గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. పైలట్ కంటికి కనిపించని పరిధి (బీవీఆర్- బియాండ్ విజువల్ రేంజ్)లోని లక్ష్య ఛేదనకు రూపొందించింది.
చంద్రయాన్-3
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న విజయవంతంగా అడుగుపెట్టింది. సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. రోవర్ ర్యాంప్ నుంచి దిగగానే ప్రజ్ఞాన్ వెనుక చక్రాలపై ఉన్న భారత జాతీయ చిహ్నం (మూడు సింహాల లోగో), ఇస్రో ముద్రలను చందమామపై అద్దింది. చంద్రుడిపై గాలి లేదు కాబట్టి ఈ ముద్రలు ఎన్నేళ్లయినా అలాగే ఉండిపోతాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమ నౌకను దింపిన తొలి దేశం భారత్. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశం భారత్. అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ గతంలో ఈ ఘతన సాధించాయి. చంద్రయాన్-3 ప్రయాణించిన రోజులు 41. విక్రమ్, ప్రజ్ఞాన్ 14 రోజుల పాటు కీలక పరిశోధనలు చేయనున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?