Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
1. నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులయ్యారు? (3)
1) రాజేష్ నంబియార్ 2) రవ్నీత్కౌర్
3) సింధూ గంగాధరన్
4) మాధబి పురీ బచ్
వివరణ: నాసా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సింధూ గంగాధరన్ నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నాస్కామ్ అనేది సంక్షిప్త రూపం. దీని విస్తరణ రూపం- నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఈ సంస్థను 1988లో ఏర్పాటు చేశారు. రాజేష్ నంబియార్ ఇదే సంస్థకు చైర్మన్‌గా నియమితులయ్యారు. రవ్నీత్ కౌర్ అనే మహిళ ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహిస్తున్నారు. దీనికి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ ఆమె. అలాగే సెబీకి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా మాధబి పురీ బచ్ ఉన్నారు.
2. ఐక్యరాజ్య సమితి సౌత్-సౌత్ కో ఆపరేషన్ డేను ఏ తేదీన నిర్వహిస్తారు? (4)
1) సెప్టెంబర్ 9 2) సెప్టెంబర్ 10
3) సెప్టెంబర్ 11 4) సెప్టెంబర్ 12
వివరణ: ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి
దక్షిణ-దక్షిణ సహకారపు రోజుగా సెప్టెంబర్ 12న నిర్వహిస్తారు. దక్షిణార్ధగోళంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలతో ముడిపడి ఉన్న రోజుగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా పలు దేశాల ఆర్థిక సాయంతో పలు కార్యక్రమాలను చేపట్టారు, అవి 1. సామాజిక న్యాయం కోసం దక్షిణ-దక్షిణ సహకారం. దీనికి బ్రెజిల్ దేశం సాయం చేస్తుంది 2. నైపుణ్యాభివృద్ధికి చైనా దేశం, అలాగే ఉద్యోగాల కల్పనకు ఏషియాన్ దేశాల కూటమి సాయం అందుతుంది.
4. 5+4+2+2 రూపంలో విద్యా విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? (2)
1) త్రిపుర 2) పశ్చిమబెంగాల్
3) కేరళ 4) నాగాలాండ్
వివరణ: పశ్చిమబెంగాల్ రాష్ట్రం తన కొత్త విద్యా విధానాన్ని ప్రకటించింది. 2020లో కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానానికి ఇది కొంచెం భిన్నంగా ఉంది. కేంద్రం గతంలో 5+3+3+4 విధానాన్ని ప్రకటిస్తే, దాని స్థానంలోనే పశ్చిమబెంగాల్ రాష్ట్రం 5+4+2+2 పద్ధతిని ప్రవేశపెట్టింది. అలాగే త్రి భాషా సూత్రాన్ని కూడా కొత్త విధానంలో పశ్చిమ బెంగాల్ చేర్చింది. బంగ్లాను ఒక అంశంగా ఆ రాష్ట్ర విద్యార్థులు అధ్యయనం చేయనున్నారు. హయ్యర్ సెకండరీలో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తారు.
5. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఏ రంగానికి సంబంధించింది? (4)
1) క్రీడలు 2) ఆర్థిక వ్యవస్థ
3) సామాజిక సేవ
4) శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం
వివరణ: శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు, శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసినవాళ్లకు ఇస్తారు. ఈ ఏడాది ఈ అవార్డును 12 మందికి ప్రకటించారు. జీవ శాస్ర్తాలకు సంబంధించి అశ్వనికుమార్, మడ్డిక సుబ్బారెడ్డి, రసాయన శాస్ర్తాలకు సంబంధించి అకట్టు టీ బిజు, దేబబ్రత మైతీ, భూమి, వాతావరణం సముద్ర శాస్ర్తాలకు సంబంధించి విమల్ మిశ్రా, ఇంజినీరింగ్ శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించి దీప్తి రంజన్ సాహో, రజనీశ్ కుమార్ గణితంలో అపూర్వ ఖారే, నీరజ్ కయాల్ మెడికల్ సైన్సెస్‌లో దిప్యమన్ గంగూలీ, భౌతిక శాస్త్రంలో అనింద్య దాస్, బసుదేవ్ దాస్ గుప్తాలకు ఈ అవార్డ్ దక్కింది.
6. 2024లో జీ-20 కూటమి సమావేశాలు ఏ దేశంలో జరుగనున్నాయి? (3)
1) దక్షిణాఫ్రికా 2) ఇండోనేషియా
3) బ్రెజిల్ 4) ఇటలీ
వివరణ: 19వ జీ-20 కూటమి సమావేశాలు 2024లో బ్రెజిల్ దేశంలో జరుగనున్నాయి. ఈ ఏడాది భారత్‌లో వీటిని నిర్వహించారు. బ్రెజిల్ దేశానికి అధికారికంగా భారత్ నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అయితే ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు ఈ కూటమికి భారతే నేతృత్వం వహిస్తుంది.
7. జీ-20 న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉన్న అంశం ఏది? (4)
1) సమ్మిళిత వృద్ధి
2) పర్యావరణాన్ని మెరుగుపరచడం
3) భవిష్యత్తులో వైద్య అత్యవసర పరిస్థితులు వస్తే ఔషధాలతో సిద్ధంగా ఉండటం
4) పైవన్నీ
వివరణ: జీ-20 సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, తదితర అగ్ర దేశాల ప్రభుత్వాధినేతలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ వెలువడింది. సమ్మిళిత వృద్ధి సాధించడం ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని, అలాగే విధ్వంసం దిశగా సాగుతున్న పర్యావరణాన్ని మెరుగుపరుచుకోవాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. వైద్య అత్యవసర సమయాల్లో ఔషధాల సరఫరాను పెంచుకోవాలని కూడా డిక్లరేషన్ పేర్కొంది. సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేయడంతో పాటు ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదం అయినా సరే నిర్మూలించాలని కూడా నిర్ణయించారు.
8. జీ-20లోకి ఏ కూటమిని చేర్చుకోవాలని భారత్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది? (2)
1) సార్క్ 2) ఆఫ్రికన్ యూనియన్
3) బిమ్స్టెక్ 4) ఏషియన్
వివరణ: జీ-20 కూటమిలోకి ఆఫ్రికన్ యూని
యన్ను చేర్చుకోనున్నారు. ఈ మేరకు భారత ప్రతిపాదనకు జీ-20 కూటమిలోని సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఇప్పటికే ఇందులో యూరోపియన్ యూనియన్ ఉంది. ఆఫ్రికన్ యూనియన్‌లో మొత్తం 55 దేశాలకు సభ్యత్వం ఉంది. త్వరలో జీ-20, జీ-21గా మారనున్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా ఈ ఏడాది నిర్వహించిన జీ-20 సమావేశాల్లో ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించారు.
9. ఆఫ్రికాలోని ఏ దేశంలో ఇటీవల తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించింది? (3)
1) తుర్కియే 2) మయన్మార్
3) మొరాకో 4) గబాన్
వివరణ: ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో భూకంపం సంభవించింది. 1000కి పైగా జనం ఇందులో మరణించారు. అట్లాస్ పర్వత శ్రేణిలోని చారిత్రాత్మక నగరం మారకేష్ కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కొంది. ఈ పర్వత శ్రేణిలో ఇదే అత్యంత శక్తిమంతమైన భూకంపంగా భావిస్తున్నారు.
10. కింది ఏ విధానపరమైన రేట్‌ను దశలవారీగా ఎత్తి వేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది? (1)
1) ఇంక్రిమెంట్ సీఆర్ఆర్
2) బ్యాంక్ రేట్
3) చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి
4) పైవేవీ కావు
వివరణ: దశల వారీగా ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను ఎత్తి వేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. సీఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని అర్థం. దీన్నే తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అంటారు. నెట్ డిమాండ్ టైం
లయబిలిటీస్‌లో కొంత మొత్తం ఆర్బీఐకు వెళుతుంది. దీన్నే సీఆర్ఆర్ అంటారు. అయితే అధికంగా ద్రవ్య ప్రవాహం ఉన్నప్పుడు కొంత ఇంక్రిమెంట్ క్యాష్ రిజర్వ్ రేషియోను అమలు చేస్తారు. అంటే బ్యాంకులు ఎక్కువ మొత్తంలో నగదును ఆర్బీఐ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో ద్రవ్య ప్రవాహ కట్టడికి ఈ నిర్ణయం తీసుకుంటారు.
11. కప్డగండా షాలువాలతో సంబంధం ఉన్న రాష్ట్రం ఏది? (2)
1) ఛత్తీస్‌గఢ్ 2) ఒడిశా
3) జార్ఖండ్ 4) బీహార్
వివరణ: కప్డగండా షాలువాలు ఒడిశా రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయి. ఇటీవల వీటికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ రాష్ట్రంలోని రాయగడ జిల్లాల్లో వీటిని పర్టికులర్ వల్నరబుల్ ట్రైగల్ గ్రూప్ తయారు చేస్తుంది. చేతులతో షాలువాలను అల్లడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇదే రాష్ర్టానికి చెందిన కోరాపుట్ కాలాజీర బియ్యానికి కూడా ఇటీవల భౌగోళిక గుర్తింపు దక్కింది.
12. ప్రాజెక్ట్ నమన్ కింది వాటిలో ఎవరికి సంబంధించింది? (3)
1) క్రీడాకారులు 2) చేతివృత్తుల వాళ్లు
3) సైనికులు 4) మత్స్యకారులు
వివరణ: ప్రాజెక్ట్ నమన్ సైనికులకు సంబంధించింది. మాజీ సైనికులకు అవసరమైన సాయం చేస్తుంది. అలాగే అమరులైన జవానుల కుటుంబాలు కూడా ఈ కేంద్రాల సాయాన్ని పొందొచ్చు. దేశంలో ఈ తరహా తొలి కేంద్రాన్ని ఢిల్లీ కంటోన్మెంట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కామన్ సర్వీస్ సెంటర్లో అందే సేవలు కూడా అందుబాటులో ఉంచుతారు. పింఛనుదారుల ఖాతాలను కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు.
13. మాలవీయ మిషన్ దేనికి సంబంధించింది? (1)
1) ఉపాధ్యాయులకు శిక్షణ
2) పాఠశాలల ఆధునికీకరణ
3) శాస్త్ర రంగ పరిశోధన
4) పైవేవీ కావు
వివరణ: ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం మాలవీయ మిషన్‌ను ప్రారంభించింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీన్ని న్యూఢిల్లీలోని కౌశల్ భవన్లో ప్రారంభించారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఇది ఉద్దేశించింది. యూజీసీ భాగస్వామ్యంతో కేంద్రం దీన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి 15 లక్షల మందికి తరగతులు నిర్వహించనున్నారు.
14. భారత దేశంలో తొలి సౌర నగరం ఏది? (4)
1) అహ్మదాబాద్ 2) జైసల్మేర్
3) ఇండోర్ 4) సాంచీ
వివరణ: భారతదేశంలోని తొలి సౌరనగరం మధ్యప్రదేశ్‌లోని సాంచీ. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. దీన్ని దేశంలోనే తొలి సౌరనగరంగా అధికారికంగా సెప్టెంబర్ 6న ప్రారంభించారు. త్వరలో సాంచీని శూన్య ఉద్గారాల నగరంగా కూడా మారుస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ నగరంలో రైల్వేస్టేషన్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధి దీపాలు, పోస్టాఫీసులు ఇలా అన్నింటిలో సౌర విద్యుత్‌నే వినియోగిస్తున్నారు.
3. హెచ్ఏసీజీఏఎం సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించారు? (3)
1) టోక్యో 2) న్యూఢిల్లీ
3) ఇస్తాంబుల్ 4) బీజింగ్
వివరణ: హెచ్ఏసీజీఏఎం అనేది సంక్షిప్త రూపం- దీని విస్తరణ రూపం- హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్‌గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్. ఆసియా ప్రాంతంలో సముద్రాల్లో పైరసీ జరగకుండా దీన్ని ఏర్పాటు చేశారు. జపాన్ చొరవతో ఏర్పాటైన సంస్థ ఇది. ఈ కూటమి 19వ సమావేశం ఇటీవల తుర్కియే దేశంలోని ఇస్తాంబుల్‌లో నిర్వహించారు.
23 సభ్య దేశాలు ఇందులో పాల్గొన్నాయి. సముద్రాల్లో దొంగతనం జరగకుండా, అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని, అలాగే పరస్పరం సహకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు.
15. అమెరికాలోని కెంటకీ నగరం ఏ రోజును సనాతన ధర్మ రోజుగా ప్రకటించింది? (3)
1) జూలై 11 2) జూలై 20 3) సెప్టెంబర్ 3 4) సెప్టెంబర్ 21
వివరణ: అమెరికాలో కెంటకీలోని లూయిస్విల్లే నగర పాలక సంస్థ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. సెప్టెంబర్ 3న సనాతన ధర్మ రోజుగా నిర్వహించుకోనున్నట్లు ప్రకటించింది. బహుళత్వం, శాంతి సహనం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ రోజును ఎంపిక చేసినట్లు నగర మేయర్ క్రెయిగ్ గ్రీన్బర్గ్ పేర్కొన్నారు. ఇదే నగరంలో సెప్టెంబర్ 3న నిర్వహించిన మహాకుంభాభిషేకానికి ఆయన హాజరయ్యారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?