Current Affairs | సగటు జీవితకాలం 71 ఏళ్లు.. మహిళలకు 74 ఏళ్లు
ఐక్యరాజ్య సమితి జనాభా నివేదిక
- నివేదిక పేరు- 8 Billion Lives, Infinite Possibilities: the case for Rights and Choices
- విడుదల చేసిన తేదీ- 19.04.2023
- విడుదల చేసినవారు- UNFPA (United Nations Population Fund)
- 2023 మధ్య కాలానికి పూర్తిగా భారత్ అగ్రస్థానం పొందుతుంది.
- దీన్నే UNFPAs State of World Population (SOWP) report-2023 అని అంటారు.
- దీని ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
- ఈ నివేదిక ప్రకారం చైనా కంటే భారత్ 29 లక్షల అధిక జనాభా కలిగి ఉండి, ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది.
- 1950లో ఐక్యరాజ్య సమితి జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి.
- ఈ నివేదిక ప్రకారం భారత జనాభా- 142,86,00,000
- ప్రస్తుత చైనా జనాభా- 142,57,00,000
- మూడో స్థానం- అమెరికా (34 కోట్లు)
- 2023 ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి దీన్ని వెలువరించారు.
- భారత జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ లేదా 68% మంది 15 నుంచి 64 సంవత్సరాల వయస్సు
కలిగిన వారి జనాభే ఉంది. - ఈ జనాభాను ‘శ్రామిక జనాభా’ అంటారు.
- 2022లో భారతదేశ జనాభా 1.56% పెరిగింది.
- 2022 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా- 140.66 కోట్లు
- ఈ నివేదిక ప్రకారం భారతదేశ స్త్రీల మొత్తం సంతానోత్పత్తి రేటు (Fertility Rate) 2గా అంచనా వేశారు.
- భారత్‌లో పురుషుల సగటు జీవితకాలం 71 సంవత్సరాలుగా, మహిళల సగటు జీవితకాలం 74 సంవత్సరాలుగా నివేదిక పేర్కొంది.
- భారతదేశంలో 15-24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి జనాభా అత్యధికంగా ఉంది. వీరి జనాభా 254 మిలియన్లు.
- 2050 నాటికి 8 దేశాలు ప్రపంచ జనాభాలో సగం వృద్ధిని కలిగి ఉంటాయని నివేదిక పేర్కొంది. ఆ దేశాలు ఇండియా, కాంగో ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా.
- సుమారు 8.045 బిలియన్ల ప్రపంచ జనాభాలో భారతదేశం, చైనా మూడింట ఒక వంతు (1/3) కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రెండు దేశాల్లో జనాభా పెరుగుదల మందగిస్తుంది. ఇది చైనాలో ఎక్కువగా ఉంది.
- UNFPA ప్రకారం 2080 నాటికి ప్రపంచ జనాభా 10.4 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
- అత్యధిక సంతానోత్పత్తి కలిగిన దేశాలన్నీ ఆఫ్రికా ఖండానికి చెందినవే. అవి..
1. నైగర్ (6.7)
2. చాద్ (6.1)
3. కాంగో (6.1)
4. సోమాలియా (6.1)
5. మాలి (5.8)
అతి తక్కువ సంతానోత్పత్తి కలిగిన దేశాలు
1. హాంకాంగ్ (0.8)
2. దక్షిణ కొరియా (0.9)
3. సింగపూర్ (1.0) - ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో వయస్సుల వారీ జనాభా కింది విధంగా ఉంది.
1. 0-14 సంవత్సరాలు: 25%
2. 15-64 సంవత్సరాలు: 68%
3. 65 సంవత్సరాల కంటే ఎక్కువ: 7% - వినియోగదారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థలో దాని యువ జనాభా దేశ అభివృద్ధిని నడిపించడంలో ప్రధాన కారకంగా ఉంటుంది. దేశ ఆర్థిక వృద్ధికి అపారమైన అవకాశాన్ని అందిస్తుందని UNFPAకు సంబంధించిన భారత ప్రతినిధి ఆండ్రియా వోజ్నర్
ప్రకటించారు. - చైనా జనాభా 2022లో 8,50,000 తగ్గింది. ఇలా 1961 తర్వాత జనాభా తగ్గడం ఇదే తొలిసారి.
- చైనా ఒక బిడ్డ విధానాన్ని రద్దు చేసి ముగ్గురు పిల్లలను కనడానికి అనుమతి ఇచ్చింది. అయినా జననాల సంఖ్య పెరగలేదు. దీనికి కారణం పెరుగుతున్న జీవన వ్యయం, పిల్లల సంరక్షణ, విద్య.
- 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2% పెరుగుతూ వస్తుంది. కానీ అంతకు ముందు 10 సంవత్సరాల్లో ఈ పెరుగుదల 1.7% గా ఉంది.
- ప్రపంచ జనాభా 2022, నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరింది.
- 800 కోట్ల వ బేబీ ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జన్మించింది. ఆ బేబీ పేరు వినీస్ మబాన్సాగ్.
- ఈ నివేదిక ప్రకారం భారత్
- జననాలకు ప్రసూతి మరణాల రేటు-2020 : 103%
- 2004-2020ల మధ్య నైపుణ్యం కలిగిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగిన జననాల శాతం: 81
- 2022లో ప్రతి 1000 మందిలో HIV సోకిన వారి సంఖ్య: 0.1%
- 2006-2022 మధ్య బాల్య వివాహాల శాతం : 23
- 2010-2022ల మధ్య ప్రాథమిక విద్యలో చేరిన వారి శాతం: 97
- 15-19 సంవత్సరాల వయస్సు కలిగిన 1000 మంది కౌమార బాలికల్లో ప్రసవాలు: 11 శాతం
మణిపూర్‌లో హింస
- మైటీ- కుకీ జాతుల మధ్య విభేదాల కారణంగా మణిపూర్‌లో హింస చెలరేగింది.
- మైటీలకు ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ 2023, మే 3న నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది.
- ఈ ప్రదర్శన చురచంద్‌పూర్‌లో జరిగింది.
- కుకీ జాతి వారు పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. మైటీ తెగలవారు దిగువ ప్రాంతాల్లో నివసిస్తారు.
- మైటీ తెగలవారు మణిపూర్ జనాభాలో 53% మంది ఉన్నారు. గిరిజన జాతులైన నాగాలు, కుకీలు 40% మంది ఉంటారు.
- ఈ హింసలో ఇప్పటివరకు సుమారు 100 మంది మరణించారు.
- భారత రాజ్యాంగం ప్రకారం మైటీ ప్రజలు ఎస్టీ హోదా కోసం దీర్ఘకాల డిమాండ్‌తో ఉన్నారు. 2023, ఏప్రిల్‌లో మణిపూర్ హైకోర్టు తీర్పు ప్రకారం నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- మైటీ డిమాండ్‌పై గిరిజన సంఘాలు నిరసన తెలిపాయి.
- All Tribal Student Union of Manipur (ATSUM) అన్ని కొండ జిల్లాల్లో మే 3న సంఘీభావ యాత్రను
చేపట్టాయి. - ప్రస్తుత మణిపూర్ డీజీపీ పి.దౌన్గల్‌ను హోంశాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో సీఆర్పీఎఫ్ ఐజీగా వ్యవహరించిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ సింగ్‌ను నూతన డీజీపీగా నియమించారు.
మణిపూర్ అల్లర్లపై విచారణకు కమిటీ ఏర్పాటు - దీన్ని కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 కింద ఏర్పాటు చేశారు. ఇది త్రిసభ్య కమిషన్
- అధ్యక్షులు- జస్టిస్ అజయ్ లాంబా (గువాహటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి)
- సభ్యులు- హిమాన్షు శేఖర్ దాస్ (రిటైర్డ్ ఐఏఎస్), అలోక ప్రభాకర్ (రిటైర్డ్ ఐఏఎస్)
- హింస చెలరేగడం, వ్యాప్తి చెందడానికి గల కారణాలు, ఇందుకు అధికారులు లేదా వ్యక్తుల వల్ల ఏవైనా తప్పులు జరిగాయా అనే కోణంలో కమిషన్ విచారణ చేస్తుంది.
శాంతి కమిటీ ఏర్పాటు- 2023, జూన్ 10 - మణిపూర్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు శాంతి కమిటీని ఏర్పరిచారు. ఈ కమిటీ అధ్యక్షులు- మణిపూర్ రాష్ట్ర గవర్నర్ (అనసూయ ఉయికే), కమిటీ సభ్యులు- మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, విశ్రాంత ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. మొత్తం 51 మంది సభ్యులు ఉంటారు. (1+50)
- ఈ కమిటీ రాష్ట్రంలో శాంతి పునఃస్థాపన ప్రక్రియను చేపడుతుంది. ఇందుకోసం ఘర్షణ పడుతున్న పార్టీలు/వర్గాల మధ్య శాంతియుత చర్చలు సహా వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది.
- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మే 29 నుంచి జూన్ 1 మధ్య మణిపూర్‌లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
- జూన్ 15న మణిపూర్‌లో నిరసనకారులు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. (కాంగ్బాలో)
- జూన్ 24న న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది.
- ఈ సమావేశానికి ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ హాజరయ్యారు.
- ఈ సమావేశంలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్పీ కోరారు.
- మణిపూర్ అంటే ‘రత్నాలతో నిండిన భూమి’ అని అర్థం.
అరబ్‌లీగ్‌లో తిరిగి సభ్యత్వం పొందిన సిరియా
- అరబ్‌లీగ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు 2023 మే 7న అరబ్‌లీగ్ ప్రధాన కార్యాలయం ఉన్న ఈజిప్టులోని కైరోలో జరిగిన సమావేశం సందర్భంగా సిరియాను తిరిగి సభ్యదేశంగా చేర్చుకోవడానికి ఓటింగ్ ద్వారా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
- సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ 2011, మార్చిలో నిరసనకారుల అణచివేతకు ఆదేశించిన తర్వాత సిరియాను అరబ్‌లీగ్ నుంచి తొలగించారు. ఇది సిరియాను అంతర్యుద్ధంలోకి నెట్టి దాదాపు ఐదు లక్షల మందిని చంపింది. 23 మిలియన్ల మందిని నిరాశ్రయులను చేసింది.
- 2023, మే మొదట్లో జోర్డాన్‌లో ఈజిప్ట్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియాకు చెందిన అగ్ర ప్రాంతీయ దౌత్యవేత్తల సమావేశం తర్వాత, సిరియాను అరబ్లీగ్లోకి తీసుకొచ్చేయాలని నిర్ణయించారు. దీన్నే ‘జోర్డానియన్ ఇనీషియేటివ్’ అంటారు.
- 2023, మే 19న సౌదీ అరేబియాలో అరబ్‌లీగ్ సమావేశం జరిగింది. సిరియా 12 సంవత్సరాల తర్వాత అరబ్‌లీగ్‌లో మళ్లీ సభ్యత్వం పొందింది.
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?