Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
1. ఏ తేదీన వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే నిర్వహిస్తారు? (4)
1) మే 14 2) మే 15
3) మే 16 4) మే 17
వివరణ: ఏటా మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్-సమాచార రోజుగా నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ ఒప్పందంపై మే 17న సంతకం చేశారు. దీని ప్రకారమే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏర్పాటయ్యింది. ఇది జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఈ రోజు ఇతివృత్తం ‘ఎంపవరింగ్ ది లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’. అంటే పేద దేశాల్లో కూడా సమాచార విప్లవం తీసుకురావడం ద్వారా, ఆయా దేశాల్లో సాధికారత సాధించడం అని అర్థం.
2. ఏ దేశంతో భారత్ ఇటీవల ‘50 స్టార్టప్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసింది? (2)
1) నేపాల్ 2) బంగ్లాదేశ్
3) భూటాన్ 4) వియత్నాం
వివరణ: భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ‘50 స్టార్టప్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాయి. తొలి విడతగా బంగ్లాదేశ్ నుంచి 10 అంకుర సంస్థలకు చెందిన ప్రతినిధులు భారత్‌కు వచ్చారు. మే 8 నుంచి 12 వరకు వీరి పర్యటన కొనసాగింది. ఈ-కామర్స్, వైద్యం, రవాణా, మౌలిక సదుపాయాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించిన అంకుర సంస్థల పరస్పర అవగాహనకు ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్ నుంచి కూడా 50 అంకుర సంస్థలు బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నాయి.
3. ఏ దేశంలో 5000 ఏళ్ల నాటి చెట్టును గుర్తించారు? (3)
1) బ్రెజిల్ 2) ఈజిప్ట్ 3) చిలీ 4) కెన్యా
వివరణ: 5000 సంవత్సరాల నాటి వృక్షాన్ని దక్షిణ చిలీలో గుర్తించారు. పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేపట్టారు. స్థానికంగా ఇంకా ఏవైనా చెట్లు ఇంత వయసువి ఉన్నాయా
అని పరిశీలిస్తున్నారు. అలాగే ఈ చెట్టును ఆనుకొని ఉన్న వాతావరణ పరిస్థితులు,
ఆక్సిజన్ శాతాలను కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
4. ఏ రాష్ట్రంలో యాపిల్ పండ్లకు కనీస ఎగుమతి ధరను కేంద్రం ప్రకటించింది? (4)
1) హిమాచల్ ప్రదేశ్ 2) హర్యానా
3) లడఖ్ 4) జమ్ముకశ్మీర్
వివరణ: జమ్ముకశ్మీర్ ప్రాంతంలోని యాపిల్‌కు సంబంధించి కనీస ఎగుమతి ధరను కేంద్రం ప్రకటించింది. స్థానిక రైతులను పరిరక్షించే ఉద్దేశంతో దీన్ని ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే పండ్లకు కనీస ధర ఉంటుంది. అంతకన్నా తక్కువగా తీసుకొనేందుకు వీలుండదు. దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నియమనిబంధనలను రూపొందిస్తుంది. నిబంధనల ప్రకారం రూ.50 కంటే తక్కువ ధరకు యాపిల్‌ను ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో దిగుమతి చేసుకొనేందుకు అనుమతించరు.
5. ఏ రాష్ట్రంలో ‘జల్ రాహత్’ చేపట్టారు? (1)
1) అసోం 2) రాజస్థాన్
3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్
వివరణ: భారత సైన్యానికి చెందిన గజరాజు కార్ప్స్ అనే దళం అసోం రాష్ట్రంలో ‘జల్ రాహత్’ను మే 16న నిర్వహించారు. అసోంలోని మానస్ నదిలో ఇది కొనసాగింది. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వాహక దళాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. వరదల వంటి సహజ విపత్తుల సమయంలో ప్రజలను రక్షించే లక్ష్యంతో చేపట్టిన విన్యాసాలు ఇవి. సమన్వయం, అంకితభావం ఏ విధంగా దళాలు ప్రదర్శిస్తాయో చూపించారు. ఏటా అసోం రాష్ట్రం వరదలకు గురవుతుంటుంది. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నదితో ఆ రాష్ట్రం ముంపునకు గురవుతుంది.
6. ఏ రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు? (3)
1) కేరళ 2) పశ్చిమబెంగాల్
3) రాజస్థాన్ 4) మిజోరం
వివరణ: గిగ్ వర్కర్లకు కూడా సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తూ రాజస్థాన్ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. అసంఘటిత రంగంతో పాటు అనిశ్చితిగా ఉండే ఉద్యోగాల్లో ఉన్న వారిని గిగ్ వర్కర్లు అంటున్నారు. ఉదాహరణకు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ తదితర యాప్ ఆధారిత కొలువుల్లో ఉంటారు. ఉద్యోగ భద్రత అనేది వీరికి ఉండదు. వీరి సంక్షేమం కోసమే ప్రత్యేకించి నిధిని ఏర్పాటు చేశారు. ఈ తరహా వ్యవస్థలు లేక కరోనా కాలంలో ఆయా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఇటీవల ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకంలో భాగంగా ఉండే కూలీలకు సంక్షేమాన్ని అందిస్తూ కేరళ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది.
7. దేశంలో జీఐ ట్యాగ్లు ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏది? (4)
1) ఉత్తరప్రదేశ్ 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) తమిళనాడు
వివరణ: భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులను కలిగి ఉన్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఉత్పత్తులు మొత్తం 55 ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. నిజానికి ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఈ భౌగోళిక గుర్తింపు పొందిన అంశాలు 48 ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో హస్తకళలకు సంబంధించినవి 36 ఉండటం వల్ల ఆ రాష్ర్టాన్ని రెండో స్థానంలో ఉన్నట్లు పరిగణిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా తయారయిన మణిపురి తరకవి, మెహోబా గౌర, సంభల్ హార్న్ క్రాఫ్ట్‌లు ఇటీవల గుర్తింపు పొందాయి.
8. అదితి అశోక్ ఏక్రీడతో ముడిపడి ఉన్నారు? (2)
1) కబడ్డీ 2) గోల్ఫ్
3) టెన్నిస్ 4) జావెలిన్ త్రో
వివరణ: అదితి అశోక్ గోల్ఫ్ క్రీడాకారిణి. కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఆమె గోల్ఫ్ ర్యాంకింగ్‌లో 49వ స్థానంలోకి వెళ్లింది. ఈ క్రీడలో టాప్-50 లోపు ర్యాంకును దక్కించుకున్న భారతదేశానికి చెందిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 1.89 పాయింట్ల స్కోర్ చేయడంతో ఆమె ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 49వ ర్యాంకు పొందింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన నెల్లి కొర్డా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో కొరియాకు చెందిన జిన్ యంగ్ కో నిలిచింది.
9. యూపీఎస్సీ పూర్తి స్థాయి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? (3)
1) రవ్నీత్ కౌర్ 2) రాజీవ్ కుమార్
3) మనోజ్ సోని 4) ఎవరూ కాదు
వివరణ: సివిల్ సర్వీసులతో పాటు పలు కీలక కేంద్ర ఉద్యోగుల ఎంపికలో ముఖ్య పాత్రను పోషించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు మనోజ్ సోని చైర్మన్‌గా నియమితులయ్యారు. గతేడాది ఆయన ఇంటెరిమ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి కొనసాగుతున్నారు. తాజాగా ఆయనను పూర్తి స్థాయి చైర్మన్‌గా రాష్ట్రపతి నియమించారు. 40 సంవత్సరాల వయస్సులోనే ఆయన గుజరాత్‌లోని సయాజీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. అత్యంత పిన్న వయస్సులో భారత్‌లో ఈ బాధ్యతను చేపట్టిన వ్యక్తి ఆయనే. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చైర్‌పర్సన్‌గా రవ్నీత్కౌర్ నియమితులయ్యారు. ఈ ఘనతను సాధించిన తొలి మహిళ ఆమె. 1988లో ఐఏఎస్ సాధించారు. పంజాబ్ కేడర్‌కు చెందిన అధికారి ఆమె.
10. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌కు ఎవరు సారథ్యం వహించనున్నారు? (1)
1) అమి ఈ పోప్ 2) ఇరినా బొకావో
3) గీతా గోపినాథ్ 4) క్రిస్టీన్ లగార్డే
వివరణ: ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌కు అమి ఈ పోప్ సారథ్యం వహించనున్నారు. ఆమె అమెరికాకు చెందిన వ్యక్తి. జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు సారథ్యం వహించనున్న తొలి మహిళ ఆమె. ఐవోఎం అనేది ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంటుంది. ఈ సంస్థను 1951, డిసెంబర్ 6న ఏర్పాటు చేశారు.
11. ఈఎఫ్‌టీఏలో లేని దేశం ఏది? (4)
1) ఐస్లాండ్ 2) స్విట్జర్లాండ్
3) లీచ్టెన్స్టెయిన్ 4) యూకే
వివరణ: ఈఎఫ్టీఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని అర్థం. ఇందులో నాలుగు దేశాలకు సభ్యత్వం ఉంది. అవి ఐస్లాండ్, లీచ్టెన్స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్. యూరోపియన్ యూనియన్‌లో ఈ దేశాలకు సభ్యత్వం లేదు. దీన్ని 1960లో స్టాక్ హోంలో ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ కూటమిలోని దేశాలు భారత్‌తో చర్చలు నిర్వహించాయి. బ్రస్సెల్స్‌లో ఈ చర్చలను జరిపారు. వాణిజ్యం, భాగస్వామ్య ఒప్పందాన్ని ఇరుదేశాల మధ్య తీసుకొచ్చేందుకు ఉద్దేశించింది ఇది.
12. యూటీఎస్ఏహెచ్ అనే పోర్టల్‌ను ప్రారంభించింది ఎవరు? (4)
1) కేంద్ర వాణిజ్య శాఖ 2) ఇస్రో
3) డీఆర్డీవో 4) యూజీసీ
వివరణ: యూటీఎస్ఏహెచ్ పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని పూర్తి రూపం- అండర్‌టేకింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని అర్థం. దేశంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉద్దేశించింది ఇది. విద్యార్థులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయాలకు కూడా ఇది అవసరమైన వనరులను సమకూరుస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్యలో ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తుంది.
13. తల్లి పాలను ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణలోని ఎన్ని ఆస్పత్రులకు గుర్తింపు లభించింది? (3)
1) 17 2) 1 3) 7 4) 15
వివరణ: తల్లి పాలను ప్రోత్సహిస్తున్నందుకు దేశ వ్యాప్తంగా 17 ఆస్పత్రులను గుర్తించగా, అందులో 7 తెలంగాణలో ఉన్నాయి. ఆ జాబితాలో ఆరు ప్రభుత్వ ఆస్పత్రులు కాగా మరొకటి ప్రైవేట్‌ది. మాతా శిశు ఆస్పత్రి- బాన్స్వాడ, మాతాశిశు ఆస్పత్రి- జనగాం, మాతా శిశు ఆస్పత్రి- సూర్యాపేట, ఏరియా ఆస్పత్రి- గజ్వేల్, ఏరియా ఆస్పత్రి- జహీరాబాద్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి- ఖమ్మం, అంకుర ఆస్పత్రి ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్.
14. దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది? (1)
1) హైదరాబాద్ 2) పుణె
3) వరంగల్ 4) కోల్‌కతా
వివరణ: దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం హైదరాబాద్‌లో రానుంది. రూ.350 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. అక్వేరియంలో 180 డిగ్రీల కోణంలో 100 మీటర్ల పొడవు, 3.5 అడుగుల వెడల్పులో వివిధ రకాల టన్నెళ్లు నిర్మిస్తారు. పుణెలో జలాంతర్భాగంలో ఒక పరిశోధన ల్యాబ్‌ను నిర్మించనున్నారు.
15. ఏ రెండు దేశాల మధ్య సముద్ర శక్తి-23 విన్యాసాలు జరిగాయి? (2)
1) భారత్, సింగపూర్ 2) భారత్-ఇండోనేషియా
3) భారత్-మలేషియా 4) భారత్-వియత్నాం
వివరణ: భారత్, ఇండోనేషియా దేశాల మధ్య సముద్ర శక్తి పేరుతో మే 14 నుంచి 19 వరకు సముద్ర శక్తి విన్యాసాలను నిర్వహించారు. ఇది ఇరుదేశాల మధ్య నావికా దళాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించింది. ఇందులో హార్బర్ దశ, సముద్ర దశ అనే రెండు అంశాలున్నాయి. భారత్ తరఫున ఐఎన్ఎస్ కవరట్టి ఇందులో పాల్గొన్నది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?