Current Affairs | గాంధీ శాంతి బహుమతి ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరు?
1. నోబెల్ బహుమతులకు సంబంధించి సరైన వాక్యం కానిదేది?
A) ఇప్పటి వరకు ఏడుగురు తండ్రీ కొడుకులు వివిధ రంగాల్లో పొందారు.
B) ఇప్పటి వరకు ఆరుగురు భార్యాభర్తలు వివిధ రంగాల్లో పొందారు.
C) ఇప్పటి వరకు అన్నదమ్మలు నోబెల్ బహుమతులు పొందలేదు.
D) ఇప్పటి వరకు ఒకేఒక్కసారి తండ్రీ, కూతురు వివిధ రంగాల్లో పొందారు.
2. నోబెల్ బహుమతిని ఎన్ని రంగాల్లో ఇస్తారు?
A) 6 B) 5 C) 7 D) 8
3. నోబెల్ బహుమతిని ఒకటి కంటే ఎక్కువసార్లు కింది వారిలో ఎవరు పొందారు?
A) జాన్ బర్డీన్, ఫ్రెడరిక్ సాంగర్
B) వీనస్ పౌలంగ్, రెడ్ క్రాస్
C) రెడ్ క్రాస్, ఐక్యరాజ్యసమతి శరణార్థుల హై కమిషనర్ D) పైవన్నీ
4. నోబెల్ బహుమతులు ప్రకటించినప్పుడు అరెస్టయి జైలులో లేనివారెవరు?
A) ఆంగ్ సాన్ సూకీ
B) ఎరిక్ అక్సెల్ కార్లెల్డ్
C) అలెస్ బియాలియాట్సీ
D) లీ జాయాబో
5. 1. ఇప్పటి వరకు ఇద్దరికీ చనిపోయిన తర్వాత నోబెల్ బహుమతులు ప్రకటించారు?
2.ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే నోబెల్ బహుమతులు తిరస్కరించారు.
పై వాక్యాల్లో సరైనది/కానివి
A) 1 సరైనది 2 సరికాదు
B) 1, 2 సరైనవి
C) 1 సరికాదు D) 1, 2 సరికాదు
6. నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం
ఏ నగరం/నగరాల్లో జరుగుతుంది?
A) స్టాక్ హోం B) ఓస్లో
C) స్టాక్ హోం, బార్సిలోనా
D) స్టాక్ హోం, ఓస్లో
7. నోబెల్ బహుమతుల ప్రదానం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A) 1901 B) 1900
C) 1895 D) 1902
8. నోబెల్ బహుమతులు ప్రదానోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన జరుగుతుంది. దీనికి కారణం?
A) ఆల్ఫ్రెడ్ చెర్నాడ్ నోబెల్ జన్మదినం
B) ఆల్ఫ్రెడ్ చెర్నాడ్ నోబెల్ డైనమైట్ కనుగొన్న రోజు
C) ఆల్ఫ్రెడ్ చెర్నాడ్ నోబెల్ చనిపోయిన రోజు
D) ప్రపంచ మానవహక్కుల దినోత్సవం
9. నోబెల్ బహుమతి గ్రహీతలు బహుమతి ప్రదానోత్సవం రోజున ఏం పొందుతారు?
A) నోబెల్ బహుమతి డిప్లోమా
B) నోబెల్ బహుమతి పతకం
C) నోబెల్ బహుమతి నగదు బహుమతిని నిర్ధారిస్తూ డాక్యుమెంట్
D) పైవన్నీ
10. కింది వాటిలో సరైంది?
a) 2022 వరకు 615 నోబెల్ బహుమతులు ప్రదానం చేశారు
b) 2022 వరకు 989 మంది నోబెల్ బహుమతులు పొందారు
c) మొత్తం గ్రహీతలలో 35 సంస్థలు ఉన్నాయి.
d) సంస్థలకు నోబెల్ బహుమతుల్లో శాంతి బహుమతి మాత్రమే ఇస్తారు
A) a, b, c, d B) a, b, d
C) b, c, d D) a, c, d
11. నోబెల్ బహుమతిని అతి పెద్ద, అతి చిన్న వయస్సుల్లో పొందినవారు?
A) ఆర్థర్ ఆష్కిన్ & మలాలా యూసఫ్ జాయ్
B) పీటన్ రాస్ & మలాలా యూసఫ్ జాయ్
C) జాన్ బి. గుడెనఫ్ & మలాలా యూసఫ్ జాయ్
D) లియోనిడ్ హ్యూర్విజ్ & మలాలా యూసఫ్ జాయ్
13. కింది వాక్యాలను గమనించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
A) ఇప్పటి వరకు 60 మంది మహిళలు 61 నోబెల్ బహుమతులు పొందారు
B) నోబెల్ బహుమతి పొందిన తొలి, రెండుసార్లు పొందిన ఏకైక మహిళ మేరీక్యూరీ
C) ఇప్పటి వరకు 49 సార్లు నోబెల్ బహుమతులను ఇవ్వలేదు
D) నోబెల్ బహుమతిని అత్యధిక సార్లు రెడ్‌క్రాస్ సంస్థ 4 సార్లు పొందింది.
14. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ వ్యక్తి?
A) రవీంద్రనాథ్ ఠాగూర్
B) సర్. సి.వి. రామన్
C) మదర్ థెరిసా
D) ఆచార్య వినోబా భావే
15. రామన్ మెగసెసె అవార్డును ఏ దేశం ఇస్తుంది?
A) ఫిన్లాండ్ B) ఫిలిప్పీన్
C) జపాన్ D) వియత్నాం
16. రామన్ మెగసెసె అవార్డు పొందిన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్లు ఎవరు?
A) టి.ఎన్. శేషన్, బి.బి. టాండన్
B) ఎన్. గోపాలస్వామి, జె.ఎమ్. లింగ్డో
C) టి.ఎన్. శేషన్, జె.ఎమ్ లింగ్డో
D) బి.బి. టాండన్, ఎన్. గోపాలస్వామి
17. భారతదేశంలో అత్యున్నత క్రీడారంగ పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడానికి క్రీడాకారుని ఎన్నేళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారు?
A) 1 సంవత్సరం B) 2 సంవత్సరాలు
C) 4 సంవత్సరాలు D) 5 సంవత్సరాలు
18. 2022లో నోబెల్ బహుమతుల్లో “ ఏ స్వాంటె పాబో” ఏ రంగ బహుమతి పొందారు?
A) శాంతి B) రసాయన శాస్త్రం
C) సాహిత్యం D) వైద్యశాస్త్రం
19. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి సరైన వాక్యం?
a) ఇది భారత సినిమా రంగ అత్యున్నత పురస్కారం
b) దీని 2020 గ్రహీత ఆశా పరేఖ్
c) ఇప్పటి వరకు 52 మంది గ్రహీతలు కాగా, అందులో ఏడుగురు మహిళలు న్నారు.
d) 2019 గ్రహీత రజనీకాంత్
A) a, b, c, d B) a, b, c
C) b, c, d D) a, c, d
20. 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డ్ పొందిన సినిమా?
A) ఉప్పెన B) కలర్ ఫొటో
C) నాట్యం D) పుష్ప
21. ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరిలో నామినేట్ అయిన ఏకైక తెలుగు సినిమా?
A) సాగరసంగమం B) శంకరాభరణం
C) స్వాతిముత్యం D) ఆపద్బాంధవుడు
22. 2022 అంతర్జాతీయ బుకర్ బహుమతి పొందిన తొలి భారతీయ రచయిత?
A) సల్మన్ రష్డీ B) అరుంధతీరాయ్
C) అరవింద్ అడిగా D) గీతాంజల్ శ్రీ
23. 2023 సంసద్ అవార్డుల గ్రహీతలు?
A) ముగ్గురు లోక్‌సభ సభ్యులు+ఐదుగురు రాజ్యసభ సభ్యులు+ 2 స్టాండింగ్ కమిటీలు + ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు
B) ఐదుగురు లోక్‌సభ సభ్యులు+8మంది రాజ్యసభ సభ్యులు+ 2 స్టాండింగ్ కమిటీలు + ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు
C) ఆరుగురు లోక్‌సభ సభ్యులు+8మంది రాజ్యసభ సభ్యులు+ 2 స్టాండింగ్ కమిటీలు + ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు
D) 8 మంది లోక్‌సభ సభ్యులు + ఆరుగురు రాజ్యసభ సభ్యులు + రెండు స్టాండింగ్ కమిటీలు+ ఒక మాజీ
పార్లమెంట్ సభ్యుడు
24. లారెన్ ప్రపంచ క్రీడా అవార్డులు – 2023 లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ పొందినవారు?
A) క్రిస్టియానో రొనాల్టో
B) లియోనల్ మెస్సీ
C) నొవాక్ జుకోవిచ్
D) కార్లోస్ అల్కరాజ్
25. గాంధీ శాంతి బహుమతి 2021 గ్రహీత?
A) షేక్ ముజుబుర్ రెహ్మాన్
B) ఖబూస్ బిన్ సయీద్ అల్ నయీమ్
C) గీతాప్రెస్ D) ఎకాల్ అభియాన్ ట్రస్ట్
26. గాంధీ శాంతి బహుమతి ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరు?
A) భారత రాష్ట్రపతి B) ఉపరాష్ట్రపతి
C) లోక్‌సభ స్పీకర్ D) ప్రధానమంత్రి
27. “ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చెయిన్ ది ఎల్లో స్టార్” అవార్డును సురినామ్ దేశ అత్యున్నత పురస్కారం అంటారు. దీన్ని పొందినవారు?
A) జగదీష్ ధన్‌ఖడ్ B) ఓంబిర్లా
C) నరేంద్రమోదీ D) ద్రౌపది ముర్ము
28. భారతదేశ అత్యున్నత పౌరసేవా పురస్కారం భారతరత్న గ్రహీతకు ఏ రంగు రిబ్బన్‌తో అలంకరిస్తారు?
A) తెలుపు B) గులాబీ
C) నీలం D) నారింజ
29. కిందివాటిలో సరికాని వాక్యం?
A) ఇప్పటి వరకు ఏడుగురు రాష్ట్రపతులు భారతరత్న పొందారు
B) ఇప్పటి వరకు ఐదుగురు మహిళలు భారతరత్న పొందారు
C) ఇప్పటి వరకు 48 మంది భారతరత్న పొందారు
D) ఇప్పటి వరకు ఏడుగురు ప్రధానులు భారతరత్న పొందారు
30. భారతరత్న పొందిన తొలి మహిళ?
A) అరుణా అసఫ్ అలీ
B) మదర్ థెరిసా
C) ఇందిరాగాంధీ
D) M.S. సుబ్బులక్ష్మి
31. భారతరత్న గ్రహీతకు లభించని గౌరవం?
A) దేశవ్యాప్తంగా ఉచిత ప్రయాణం
B) నగదు బహుమతి
C) Z కేటగిరి భద్రత D) పింఛన్
32. భారతరత్నను రద్దు చేసిన సంవత్సరం?
A) 1980 B) 1978
C) 1976 D) 1977
33. తెలుగు రాష్ర్టాల్లో పుట్టి భారతరత్న పొందిన ఏకైక వ్యక్తి?
A) వి.వి గిరి B) నీలం సంజీవరెడ్డి
C)) జాకీర్ హుస్సేన్
D) మొరార్జీ దేశాయ్
34. మరణించిన తర్వాత భారతరత్న పొందిన తొలి వ్యక్తి?
A) రాజీవ్‌గాంధీ
B) లాల్ బహదూర్ శాస్త్రి
C) కె. కామరాజ్
D) ఆచార్య వినోబా భావే
35. భారతరత్న ఎప్పుడు ప్రారంభించారు?
A) 1954 B) 1955
C) 1950 D) 1953
36. పద్మ అవార్డులను ఒక సంవత్సరంలో ఎంత మందికి మించి ఇవ్వకూడదు?
A) 120 మందికి
B) చనిపోయిన వారు, విదేశీయులు, ప్రవాస భారతీయులకు ప్రకటించినవి కాకుండా 120 మందికి
C) చనిపోయినవారు, విదేశీయులు, ప్రవాస భారతీయులకు ప్రకటించిన వాటితో కలిపి 120 మందికి
D) ఎంతమందికైనా ఇవ్వవచ్చు.
37. పద్మ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్?
A) ప్రధానమంత్రి
B) హోంశాఖ కార్యదర్శి
C) ఆర్థిక శాఖ కార్యదర్శి
D) కేబినెట్ కార్యదర్శి
38. 2023 పద్మ అవార్డులు ఎంత మందికి ప్రదానం చేశారు?
A) 104 B) 105
C) 106 D) 108
39. ముదురు ఆకుపచ్చ రిబ్బన్లో రెండు నారింజ రంగు గీతలు కలిగి ఉన్న రిబ్బన్‌తో అలంకరించే అవార్డ్ ఏది?
A) మహావీర్‌చక్ర B) శౌర్యచక్ర
C) వీర్ చక్ర D) కీర్తి చక్ర
40. సరస్వతి సమ్మాన్ అవార్డ్ గురించి సరైంది?
a) 2022 సంవత్సరానికి శివశంకరికి ప్రకటించారు
b) శివశంకరి తెలుగు రచయిత
c) శివశంకరి రాసిన
సూర్యవంశం పుస్తకానికి ఇచ్చారు
d) దీని నగదు బహుమతి రూ.10 లక్షలు, కె.కె. బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది.
A) a, b, c B) a, c
C) b, c D) a, b, c, d
41. 2023లో లూయీస్ A. కాఫరెల్లీ కింది అవార్డ్ పొందారు?
A) ఏబెల్ బహుమతి
B) ప్రిట్జికర్ బహుమతి
C) గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్
D) ఫీల్డ్ మెడల్
42. ప్రకటించి, ప్రదానం చేసిన ఆస్కార్ అవార్డుల్లో “ఉత్తమ ఒరిజినల్ సాంగ్” కేటగిరీలో తొలిసారిగా భారతదేశా నికి చెందిన పాట “నాటు-నాటు” కి అవార్డు వచ్చింది. అయితే ఈ పాట ఏ సినిమాలోనిది?
A) రణం, రుధిరం, రౌద్రం
B) రుధిరం, రణం, రౌద్రం
C) రౌద్రం, రణం, రుధిరం
D) రుధిరం, రౌద్రం, రణం
43. 2023 ఆస్కార్ అవార్డుల్లో “ఉత్తమ డాక్యు మెంటరీ ఫీచర్ షార్ట్ సబ్జెక్ట్” కేటగిరీలో భారతీయ సినిమా” ది ఎలిఫెంట్ విస్పరర్స్” కు తొలిసారిగా అవార్డు వచ్చింది. అయితే అది ఏ భాషా సినిమా?
A) మళయాళం B) కన్నడం
C) కొంకణి D) తమిళం
44. ఆస్కార్ అవార్డుల ప్రదానం ఎప్పుడు ప్రారంభించారు?
A) 1927 B) 1929
C) 1930 D) 1928
45. 2023 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమచిత్రం ఏది?
A) ది వేల్
B) ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
C) ఆల్క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
D) యాన్ ఐరిష్ గుడ్ బై
12. కింది వాటిని జత పచచండి?
a) ప్రిట్జికర్ బహుమతి i) ఆర్కిటెక్చర్ నోబెల్ బహుమతి
b) ఏబెల్ బహుమతి ii) పర్యావరణ నోబెల్ బహుమతి
c) రైట్ లైవ్లీ హుడ్ అవార్డ్ iii) ఆహార, వ్యవసాయ రంగ నోబెల్ బహుమతి
d) రామన్ మెగసెసె అవార్డ్ iv) ఆసియా నోబెల్ బహుమతి
e) ప్రపంచ ఆహార బహుమతి v) గణిత శాస్త్ర నోబెల్ బహుమతి
vi) ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతి
A) a-i b-v c-vi d-iv e-iii B) a-i b-ii c-iii d-iv e-v
C) a-i b-vi c-v d-ive-iii D) a-i b-v c-vi d-iv e-iii
సమాధానాలు
1-C 2-A 3-D 4-B
5-B 6-D 7-A 8-C
9-D 10-B 11-C 12-A
13-D 14-A 15-B 16-C
17-C 18-D 19-A 20-B
21-C 22-D 23-A 24-B
25-C 26-D 27-D 28-A
29-A 30-C 31-B 32-D
33-C 34-B 35-A 36-B
37-D 38-C 39-D 40-B
41-A 42-C 43-D 44-B
45-B
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?